చందూర్ మండలం (నిజామాబాద్ జిల్లా)
చందూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, చందూర్ స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | చందూర్ (వర్ని) |
గ్రామాలు | 5 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 244 km² (94.2 sq mi) |
జనాభా (2019) | |
- మొత్తం | 10,878 |
- పురుషులు | 5,359 |
- స్త్రీలు | 5,519 |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
చందూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1].[2] 2016 లో చేసిన తొలి పునర్వ్యవస్థీకరణలో కాకుండా ఈ మండలం ఆ తరువాత 2019 మార్చి 7న కొత్తగా ఏర్పడింది.[3] దానికి ముందు ఈ మండలానికి చెందిన చందూర్ గ్రామం ఇదే జిల్లా, నిజామాబాదు రెెవెన్యూ డివిజను లోని, వర్ని మండలం లో ఉండేది.[4] ప్రస్తుతం ఈ మండలం భోధన్ రెవెన్యూ డివిజనులో భాగం.ఈ మండలంలో 5 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇది జిల్లా ప్రధాన కార్యాలయం నిజామాబాదు నుండి పశ్చిమాన 22 కి.మీ.దూరంలో ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు 168 కి.మీ.దూరంలో ఉంది. మండల కేంద్రం చందూర్
గణాంకాలు
[మార్చు]2019 లో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 244 చ.కి.మీ. కాగా, జనాభా 10,878. జనాభాలో పురుషులు 5,359 కాగా, స్త్రీల సంఖ్య 5,519. మండలంలో 2,532 గృహాలున్నాయి.[5]
2019 లో ఏర్పడిన మండలం
[మార్చు]గతంలో చందూర్ గ్రామం ఇదే జిల్లాలోని, నిజామాబాదు రెవెన్యూ డివిజను పరిధిలోని వర్ని మండలంలో ఉండేది. ఆ తరువాత వర్ని మండలంలోని 5 గ్రామాలను విడగొట్టుట ద్వారా 2019 మార్చి 7 కొత్తగా ఈ మండలం ఏర్పడింది.
సమీప మండలాలు
[మార్చు]ఉత్తరం వైపు బోధన్ మండలం, పడమటి వైపు కోటగిరి మండలం, తూర్పు వైపు నిజామాబాద్ సౌత్ మండలం, నిజామాబాద్ నార్త్ మండలం ఉన్నాయి.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 27, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019
- ↑ "Four new mandals formed, total goes up to 589". The New Indian Express. Retrieved 2021-05-20.
- ↑ "Four new mandals formed, total goes up to 589". The New Indian Express. Retrieved 2021-05-20.
- ↑ "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.