Jump to content

బోధన్ రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
బోధన్ రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లానిజామాబాదు

బోధన్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. నిజామాబాదు జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 6 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం బోధన్ లో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం, బోధన్ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు

[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

పరిపాలన

[మార్చు]

బోధన్ డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం బోధన్ రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 బోధన్ మండలం 40 రెవెన్యూ గ్రామాలు (4 నిర్జన గ్రామాలు)
2 ఎడపల్లి మండలం 12 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
3 రేంజల్ మండలం 10 రెవెన్యూ గ్రామాలు
4 కోటగిరి మండలం 34 రెవెన్యూ గ్రామాలు (7 నిర్జన గ్రామాలు)
5 వర్ని మండలం 14 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
6 రుద్రూర్ మండలం 10 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-04-24.
  3. "Revenue Divisions | Nizamabad District | India". www.nizamabad.telangana.gov.in. Archived from the original on 2022-01-30. Retrieved 2022-04-26.
  4. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2022-04-26.