చింతకాయల అయ్యన్న పాత్రుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చింతకాయల అయ్యన్న పాత్రుడు

పదవీ కాలము
1996-98
ముందు కొణతాల రామకృష్ణ
తరువాత గుడివాడ గురునాధరావు
నియోజకవర్గము అనకాపల్లి

పదవీ కాలము
1983-89
నియోజకవర్గం నర్సీపట్నం

ఆంధ్ర ప్రదేశ్ సాంకేతికశాఖామత్యుడు
పదవీ కాలము
1984-86

పదవీ కాలము
1994-96
నియోజకవర్గం నర్సీపట్నం

పదవీ కాలము
2014- ప్రస్తుతం
నియోజకవర్గం నర్సీపట్నం

వ్యక్తిగత వివరాలు

జననం (1957-09-04)4 సెప్టెంబరు
నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి పద్మావతి
సంతానము 2 కుమారులు
నివాసము విశాఖపట్నం
మతం హిందూ మతం
వెబ్‌సైటు [1]

చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన రాజకీయనాయకుడు.

బాల్యము[మార్చు]

చింతకాయల అయ్యన్న పాత్రుడు 4/9/ 1957 సంవత్సరంలో, విశాఖ జిల్లాలోని నర్శిపట్నంలో జన్మించాడు. ఇతడి తండ్రి వరహలు దొర.

విద్య[మార్చు]

ఇతదు కాకి నాడలోని పి.ఆర్ కళాశాలలో బి.ఎ. పట్టా పొందాడు.

కుటుంబము[మార్చు]

ఇతడు జూన్ నెల 1 వ తారీకున 1983 న పద్మావతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు.

చిరునామ[మార్చు]

శాశ్వతచిరునామ: ఎక్సెల్చియర్స్ అపార్ట్ మెంట్స్, లైన్ క్లబ్ ఎదురుగా, రాం నగర్, విశాఖ పట్నం. 530 002 దూరవాణి: [0891]567979

రాజకీయ ప్రస్తానం[మార్చు]

అయ్యన్న పాత్రుడు 1983-1989, 1994-1996 మధ్య కాలంలో తెలుగు దేశం పార్టీ తరాపున నర్సీపట్నం నుంచి ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభ్యులుగా ఎన్నికయ్యాడు. 1984-1986 లో సాంకేతిక విద్యా మంత్రిగా ఉన్న సమయంలో అయ్యన్న స్థానికంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటుకు కృషిచేశారు. దీంతో పాటు ప్రభుత్వ సాంకేతిక శిక్షణ సంస్థ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు.[1] 1994-96 లో రహదారులు, భవనాల శాఖా మంత్రిగా పనిచేశాడు. అప్పట్లో నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామాల పరిధిలోని వందల కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్డును ఆర్‌అండ్‌బీకి బదలాయించి, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. 1996 లో 11వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం తరుపున అనకాపల్లి లోఖ్ సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తరువాత అయ్యన్నను అటవీశాఖ మంత్రి పదవి వరించింది. ఆ సమయంలో నియోజకవర్గంలోని పెడిమికొండ నర్సరీ, ఆరిలోవ జౌషధ మొక్కల పెంపకానికి ప్రత్యేక నిధులు కేటాయించారు. 2004 ఎన్నికల్లో అయ్యన్న ఎమ్మెల్యేగా విజ యం సాధించినా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఖాళీగానే ఉండిపోయారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముత్యాలపాప చేతిలో అయ్యన్న ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికలలో శాసనసభ్యునిగా విజయం సాధించి మంత్రివర్గంలో నియమించబడ్డారు.[1]

అభిరుచులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 http://www.sakshi.com/news/andhra-pradesh/be-the-retirement-of-another-round-of-137943