Jump to content

తంగి సత్యనారాయణ

వికీపీడియా నుండి
Tangi Satyanarayana
తంగి సత్యనారాయణ
తంగి సత్యనారాయణ

తంగి సత్యనారాయణ విగ్రహం


పదవీ కాలం
1983 - 1984
ముందు అగరాల ఈశ్వరరెడ్డి
తరువాత నిశ్శంకరరావు వెంకటరత్నం
నియోజకవర్గం శ్రీకాకుళం

వ్యక్తిగత వివరాలు

జననం 1931 , సెప్టెంబరు 8
శ్రీకాకుళం జిల్లా
మరణం అక్టోబరు 25 , 2009
కిల్లిపాలెం, శ్రీకాకుళం జిల్లా
రాజకీయ పార్టీ తెలుగుదేశం
మతం హిందూ

తంగి సత్యనారాయణ (1931 - 2009) శ్రీకాకుళం జిల్లాకు చెందిన శాసనసభ్యుడు.

శ్రీకాకుళం జిల్లా నుండి ఈయనొక్కడే సభాపతిగా చేశాడు . చాలా మంచి స్వభావము కలవాడు . వెలమ కులములో పుట్టి, న్యాయవాదిగా ఎదిగి రాజకీయాలలో అత్యున్నత పదవి అయిన శాసనసభ సభాపతిగా ఎన్నికయ్యాడు . రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకరు తంగి సత్యనారాయణ (78) : శ్రీకాకుళం రూరల్‌ మండలంలో కిల్లిపాలెంలో 1931 సెప్టెంబరు 8న జన్మించిన సత్యనారాయణకు భార్య ఆదిలక్ష్మి, నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నారు. గార సమితికి ప్రప్రథమ అధ్యక్షునిగా 1959-64లో రాజకీయ జీవితం ప్రారంభించిన అతను 1967-72 మధ్య స్వతంత్ర పార్టీ తరఫున శాసనసభ్యునిగా చేశాడు. 1972లో కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందాడు. తిరిగి 1983 లో రెండోసారి శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏడాదిన్నర పాటు శాసనసభ సభాపతిగా వ్యవహరించాడు. 1984 లో నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నెలరోజుల పాటు రెవెన్యూ శాఖా మంత్రిగా విధులు నిర్వర్తించాడు. తిరిగి 1986 లో తెలుగుదేశం పార్టీలో చేరాడు. మళ్లీ 2008 లో తంగి సత్యనారాయణ కాంగ్రెసులో చేరాడు. రెండుసార్లు బార్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడుగా ఎన్నికైన ఈయన క్రిమినల్‌ లాయర్‌గా జిల్లాలో మంచి ఖ్యాతి నార్జించాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోథులు గౌతు లచ్చన్న, ఎన్‌.జి.రంగాలకు సహచరునిగా రాజకీయాల్లో కొనసాగాడు. ఎ.ఐ.సి.సి. సభ్యుడుగా కాంగ్రెసు పార్టీలో కొనసాగేడు.

తంగి సత్యనారాయణ - శ్రీకాకుళంలోని తన నివాసంలో అక్టోబరు 25, 2009, ఆదివారం ఉదయం కన్నుమూశాడు. అన్నవాహికలో ఏర్పడిన క్యాన్సర్‌తో గత కొంతకాలంగా బాధపడుతున్న అతనుకు హైదరాబాదులో శస్త్రచికిత్సలు కూడా నిర్వహించారు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. BBC News తెలుగు (13 June 2019). "స్పీకర్ల జిల్లా శ్రీకాకుళం: ఆంధ్ర రాష్ట్రం నుంచి నవ్యాంధ్ర వరకు ఎవరెవరంటే..." Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  2. http://legislativebodiesinindia.nic.in/STATISTICAL/AP.htm
  3. 3.0 3.1 "Former speaker Satyanaryana dies". Times of India. 2009-10-26. Retrieved 2009-10-28.

ఇతర లింకులు

[మార్చు]