దివికొండయ్య చౌదరి
కీ.శే. దివి కొండయ్య చౌదరి | |
---|---|
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి | |
In office 16 March 1978 – 16 October 1980 | |
అంతకు ముందు వారు | రేబాల దశరథరామిరెడ్డి |
తరువాత వారు | కోన ప్రభాకరరావు |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1 July 1918 మహదేవపురం, కందుకూరు మండలం, ప్రకాశం జిల్లా |
మరణం | 13 September 1990 |
జాతీయత | భారత దేశం |
దివి కొండయ్య చౌదరి ఆంధ్రప్రదేశ్ కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. ఇతను ఆరవ శాసనసభ (1978-1983) సభాపతిగా 1978 మార్చి 16న ఏకగ్రీవంగా ఎన్నికై 1980 అక్టోబరు16 వరకు ఆ పదవిని నిర్వహించాడు.[1][2]
జననం, విద్య
[మార్చు]ఇతను 1918 జూలై 1న ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మహదేవపురం గ్రామంలో జన్మించాడు. ఇతను కందుకూరులో హైస్కూలు విద్య, మద్రాసు లయోలా కాలేజీ నుండి బి. ఎ., మద్రాసు లా కాలేజీ నుండి బి.ఎల్. పూర్తిచేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కొండయ్య చౌదరి స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతను జిల్లా పంచాయతీ బోర్డు అధ్యక్షునిగా పనిచేశాడు. 1955లో, 1978లో ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. ఇతను 1966 నుండి 1972 వరకు శాసనమండలి సభ్యునిగా ఉన్నాడు.
శాసనసభాపతిగా
[మార్చు]కొండయ్య చౌదరి 1978 మార్చి 16న శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఇతను సభాపతిగా ఉన్న కాలంలో 1978 జూన్ నెలలో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి శాసనసభను ఉద్దేశించి ప్రసంగించారు. శాసనసభలో బిల్లులపై సమగ్రమైన చర్చలు జరగాలని, ఆ చర్చలలో సభ్యులు అర్థవంతమైన సమగ్ర సమాచారంతో చర్చలను సుసంపన్నం చేయాలని పేర్కొంటూ ఇతను ప్రశంసనీయమైన రూలింగులను ఇచ్చాడు.
రాష్ట్ర మంత్రిగా
[మార్చు]టంగుటూరి అంజయ్య మంత్రి వర్గంలో రోడ్లు, రహదారులు, భవనాలు, ప్రజా పనుల శాఖ మంత్రిగా 1980 అక్టోబరు 17 నుండి 1982 ఫిబ్రవరి 24 వరకు పనిచేశాడు.
వృత్తి జీవితం
[మార్చు]కొండయ్య చౌదరి న్యాయవాద వృత్తి చేపట్టి రాణించాడు. సౌమ్యునిగా, స్నేహశీలిగా ఇతనికి సమాజంలో మంచి పేరుండేది.
మరణం
[మార్చు]కొండయ్య చౌదరి 1990 నవంబరు 13న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతుల జాబితా". Archived from the original on 2024-06-23. Retrieved 2019-04-01.
- ↑ "దివి కొండయ్య చౌదరి గురించిన సంక్షిప్త సమాచారం, ఆంధ్రప్రదేశ్ శాసనసభ జాలస్థలం నుండి". Archived from the original on 2018-12-15. Retrieved 2019-04-01.