పిడతల రంగారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిడతల రంగారెడ్డి
పిడతల రంగారెడ్డి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి
In office
21 March 1972 – 25 September 1974
అంతకు ముందు వారుకె.వి.వేమారెడ్డి
తరువాత వారుఆర్.దశరథరామిరెడ్డి
నియోజకవర్గంగిద్దలూరు శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం10 September 1917
గిద్దలూరు, ప్రకాశం జిల్లా
మరణం1 July 1991
జాతీయతభారత దేశం

పిడతల రంగారెడ్డి (నవంబర్ 10, 1917 - జూలై 1, 1991), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు, మాజీ శాసనమండలి అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండు సభలకు (శాసనసభ, శాసనమండలి) కి అధ్యక్షుడిగా పనిచేసిన ఏకైక వ్యక్తి. గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. గిద్దలూరు శాసనసభ నియోజవర్గం ఏర్పడకముందు 1952లో తొలిసారిగా కంభం శాసనసభ నియోజవర్గం నుండి గెలిచి శాసనసభ సభ్యుడయ్యాడు. ఈయన స్వగ్రామం రాచర్ల మండలంలోని అనుమలవీడు గ్రామం.

ప్రకాశం జిల్లా, రాచర్ల మండలం అనుమలవీడు గ్రామానికి చెందిన పిడతల వెంగళరెడ్డి, పిచ్చమ్మలకు 1917, నవంబర్ 9న రంగారెడ్డి జన్మించాడు. 1937లో కొత్తపట్నంలో కాంగ్రేసు పార్టీ సోషలిష్టు విభాగం నేతృత్వంలో జరిగిన రాజకీయ పాఠశాలలో శిక్షణ పొందాడు.[1] 1939లో గిద్దలూరులో వ్యక్తిగత సత్యాగ్రహంలో పాల్గొని ఐదు వందల రూపాయల జరిమానా చెల్లించడంతో పాటు ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాడు.[2] 1940 కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి. 1941లో కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 3 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. 1948లో మద్రాసు రాష్ట్ర శాసనసభ్యునిగా ఎన్నికైనాడు. 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు కంభం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. [3]1952-1955, 1955-1962 లో శాసనసభ సభ్యులు. విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత పిడతల రంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ యొక్క తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1952-1959 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు. 1960లో సంజీవయ్య మంత్రివర్గంలో సమాచార, ప్రణాళికా శాఖామాత్యులుగా పనిచేశాడు. ఒకప్పటి పాత్రికేయుడిగా, ప్రతిరోజూ ఒక ప్రెస్‌నోట్‌తో పాత్రికేయులకు బాగా పని కల్పించేవాడు. భాషావేత్త అయిన రంగారెడ్డి ఇంగ్లీషు, తమిళం, తెలుగు, హిందీ, ఉర్దూలలో అనర్గళంగా మాట్లాడేవాడు.[4] 1966 కర్నూలు జిల్లా స్థానిక సంస్థల తరుపున ఎకగ్రీవంగా యం.యల్.సి. 1968-1972వరకు శాసనమండలి అధ్యక్షులు. 1972-1974 వరకు శాసన సభ స్పీకరు, శాసన సభ అధ్యక్షులు. 1974-1978 రాష్ట్ర ఆర్థికశాఖామంత్రి.

1970వ దశకపు చివర్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రేసు మూడు వర్గాలుగా చీలిపోయినప్పుడు, ఇందిరా గాంధీకి ససేమిరా మద్దతును ఇవ్వకూడదని నిశ్చయించుకొని పిడతల రంగారెడ్డి తన వర్గంతో అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న జనతా పార్టీలో చేరాడు.[5][6] 1978లో గిద్దలూరు నియోజకవర్గం నుండే జనతా పార్టీ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికయ్యాడు. 1983లో తెలుగుదేశం ప్రభంజనంలో శాసనసభకు పోటీచేసి ఓడిపోయాడు. 1985 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆయనకు మద్దతునిస్తూ గిద్దలూరు శాసనసభా నియోజకవర్గంలో అభ్యర్థిని నిలబెట్టలేదు. ఆ ఎన్నికలలో గెలిచిన రంగారెడ్డి, ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి, తను మరణించే దాకా తెలుగుదేశంలోనే కొనసాగాడు.

1978-1983, 1985-1989 వరకు శాసనసభ సభ్యులు. రంగారెడ్డి 1991, జూలై 1న గిద్దలూరులో పరమపదించారు.

మూలాలు

[మార్చు]
  1. I.V., Chalapathi Rao (2000). Veteran Freedom Fighter, Eminent Jorunalist Madduri Annnapurnaiah. Hyderabad: A.V.K Chaitanya. p. 26. Retrieved 20 February 2015.
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2016-03-05. Retrieved 2015-02-20.
  3. "మద్రాసు శాసనసభ సమీక్ష - 1952-57" (PDF). తమిళనాడు శాసనసభ. p. 82. Archived (PDF) from the original on 2020-10-15. Retrieved 2021-11-03.
  4. Enlite, Volume 3. Light Publications. 1968. p. 8. Retrieved 20 February 2015.
  5. R. J., Rajendra Prasad (2004). Emergence of Telugu Desam: And an Overview of Political Movements in Andhra. Andhra Pradesh (India): Master Minds. p. 127. Retrieved 26 December 2014.
  6. Nadendla, Bhaskar Rao (2008). Walking with Destiny. p. 44. Retrieved 20 February 2015.