అనుమలవీడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


అనుమలవీడు
రెవిన్యూ గ్రామం
అనుమలవీడు is located in Andhra Pradesh
అనుమలవీడు
అనుమలవీడు
నిర్దేశాంకాలు: 15°27′29″N 78°59′42″E / 15.458°N 78.995°E / 15.458; 78.995Coordinates: 15°27′29″N 78°59′42″E / 15.458°N 78.995°E / 15.458; 78.995 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, మార్కాపురం రెవిన్యూ డివిజన్
మండలంరాచర్ల మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,395 హె. (3,447 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం3,084
 • సాంద్రత220/కి.మీ2 (570/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08405 Edit this at Wikidata)
పిన్(PIN)523368 Edit this at Wikidata

అనుమలవీడు, ప్రకాశం జిల్లా, రాచర్ల మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 523 368. ఎస్.టి.డి.కోడ్ = 08405.[1]

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. ప్రత్యేక ప్రాథమిక పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం., మాతాశిశు వైద్యశాల.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గంగమ్మ చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ పి.కిరణ్‌కుమార్ సర్పంచ్‌గా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవం వైభవంగా నిర్వహించెదరు. ఉదయం అభిషేకం, ఆకుపూజలు నిర్వహించెదరు. [2]

శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయ మూడవ వార్షికోత్సవం సందర్భంగా 2014, జూన్-19, గురువారం నాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య, స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్టును ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేసారు. [3]

శ్రీ భృగుమల్లేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ పోలేరమ్మతల్లి ఆలయం[మార్చు]

నూతనంగా నిర్మించిన ఈ అలయంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2017, జూన్-8వతేదీ గురువారంనాడు ప్రారంభమైనవి. గురువారం ఉదయం మహాగణపతిపూజ, యాగశాల ప్రవేశం చేసి గణపతి హోమం, యంత్రాలకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం అఖండదీపస్థాపన చేసారు.విగ్రహాలకు, యంత్రాలకు జలాధివాసం నిర్వహించారు. 9వతేదీ శుక్రవారం ఉదయం యంత్రాలకు అభిషేకం, వాస్తు, నవగ్రహ హోమాలు, గణపతిపూజ నిర్వహించారు. సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించారు. 10వతేదీ శనివారం ఉదయం, విగ్రహాల మేలుకొలుపు, యంత్రాలకు, విగ్రహాలకు అభిషేకం నిర్వహించారు. అనంతరం 11-42 కి యంత్ర ప్రతిష్ఠ అనంతరం శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ, శీతల యంత్రప్రతిష్ఠ, నాభిశీల ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని అలంకరించి ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహాపూర్ణాహుతి నిర్వహించి భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసినారు. శుక్రవారం, శనివారం, రెండురోజులూ భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [4]

గ్రామ ప్రముఖులు[మార్చు]

పిడతల రంగారెడ్డి ఈ గ్రామంలో జన్మించారు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,084 - పురుషుల సంఖ్య 1,559 - స్త్రీల సంఖ్య 1,125 - గృహాల సంఖ్య 823

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

  • మండలాలు కుటుంబాలు, జనసంఖ్య, స్త్రీ పురుషుల సంఖ్య వివరాలు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2014, మే-23; 4వపేజీ. [3] ఈనాడు ప్రకాశo; 2014, జూన్-20; 4వపేజీ. [4] ఈనాడు ప్రకాశo; 2017, జూన్-9,10&11; 5వపేజీ. [5] ఈనాడు ప్రకాశo; 2017, జులై-11; 5వపేజీ.