జల్లివానిపుల్లలచెరువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 15°29′02″N 78°54′04″E / 15.484°N 78.901°E / 15.484; 78.901Coordinates: 15°29′02″N 78°54′04″E / 15.484°N 78.901°E / 15.484; 78.901
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంరాచర్ల మండలం
విస్తీర్ణం
 • మొత్తం13.65 కి.మీ2 (5.27 చ. మై)
జనాభా వివరాలు
(2011)[1]
 • మొత్తం2,392
 • సాంద్రత180/కి.మీ2 (450/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి965
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 08405 Edit this on Wikidata )
పిన్(PIN)523368 Edit this on Wikidata


జల్లివారి పుల్లలచెరువు లేదా జె.పి.చెరువు, ప్రకాశం జిల్లా, రాచర్ల మండలానికి చెందిన గ్రామం. [2] పిన్ కోడ్ నం. 523 368., ఎస్.టి.డి.కోడ్ = 08405.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన గిద్దలూరు మండలం, తూర్పున బెస్తవారిపేట మండలం, తూర్పున కంభం మండలం, దక్షణాన కొమరోలు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

ఆదర్శ ప్రాధమిక పాఠశాల[మార్చు]

శాఖా గ్రంథాలయం[మార్చు]

ఈ గ్రంథాల ప్రథమ వార్షికోత్సవం, 2016,మే-20న నిర్వహించారు. [8]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

అంబ చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కె.ఓబులేశు, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

ఈ గ్రామ సమీపంలోని నల్లమల అటవి ప్రాంతంలో నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం గ్రామానికి 8 కి.మీ. దూరంలో ఉంది.


అంకాలమ్మ ఆలయo[మార్చు]

  1. ఈ గ్రామ సమీపంలోని అంకాలమ్మ ఆలయ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2014, జూన్-6, శుక్రవారం ఉదయం మొదలైనవి. ఉదయం విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సాయంత్రం హోమం, జలాధివాసం, కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం నాడు, అంకాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాకార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉదయం కుంకుమబండ్లు కట్టినారు. తరువాత హోమం, యంత్రప్రతిష్ఠ, బింబప్రతిష్ఠ నిర్వహించారు. శుక్ర, శని, ఆదివారం, ఈ మూడురోజులూ భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసారు. [2]&[3]
  2. ఈ ఆలయంలో 2015, మే-28వ తేదీ గురువారంనాడు, అమ్మవారికి వార్షిక పూజలు నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో పంచామృతాభిషేకాలతోపాటు, పలు కార్యక్రమాలు నిర్వహించెదరు. [5]

శ్రీ ఈశ్వరీదేవి ఆలయం[మార్చు]

గ్రామంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో 2017, ఫిబ్రవరి-9వతేదీ గురువారం ఉదయం శ్రీ మహాగణపతి, ఈశ్వరీదేవి, నాగేంద్రస్వామి వారల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, వేదపండితుల ఆధ్వర్యంలో, వైభవంగా నిర్వహించారు. ఉదయం యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, శిఖర, కలశ ప్రతిష్ఠ, హోమం నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసినారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. రాత్రికి గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బల ప్రదర్శనను నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు. [9]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

శ్రీ పత్తి ఓబులయ్య:- ఈ గ్రామానికి చెందిన ఈయన, కర్నూలు లలితకళాసమితి అధ్యక్షులుగా పనిచేయుచూ నాలుగు దశాబ్దాలుగా నాటకరంగానికి విశేష కృషిచేసారు. వీరి చేసిన సేవలకు గుర్తింపుగా, 2016, ఏప్రిల్-8 దుర్ముఖినామ ఉగాది పర్వదినాన, రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పురస్కారానికి ఎంపికచేసింది. వీరు ఈ పురస్కారాన్ని, ఉగాదిరోజున ముఖ్యమంత్రి చేతులమీదుగా విజయవాడలో అందుకుంటారు. [7]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,392 - పురుషుల సంఖ్య 1,217 - స్త్రీల సంఖ్య 1,175 - గృహాల సంఖ్య 679

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,333.[3] ఇందులో పురుషుల సంఖ్య 1,162, మహిళల సంఖ్య 1,171, గ్రామంలో నివాస గృహాలు 558 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,365 హెక్టారులు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ జిల్లాల జనగణన హ్యాండ్‌బుక్.
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-7; 5వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-9; 4వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2014, జూలై-27; 4వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015, మే-28; 4వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2015, ఆగస్టు-20; 5వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2016, ఏప్రిల్-8; 8వపేజీ. [8] ఈనాడు ప్రకాశం; 2016, మే-21; 4వపేజీ. [9] ఈనాడు ప్రకాశం; 2017, ఫిబ్రవరి-10; 5వపేజీ.