సోమిదేవిపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సోమిదేవిపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
సోమిదేవిపల్లి is located in Andhra Pradesh
సోమిదేవిపల్లి
సోమిదేవిపల్లి
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°27′50″N 78°57′47″E / 15.463773°N 78.963032°E / 15.463773; 78.963032
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం రాచర్ల
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి మూడుగుళ్ళ రామసుబ్బమ్మ
జనాభా (2011)
 - మొత్తం 1,449
 - పురుషుల సంఖ్య 702
 - స్త్రీల సంఖ్య 747
 - గృహాల సంఖ్య 402
పిన్ కోడ్ 523368
ఎస్.టి.డి కోడ్ 08405

సోమిదేవిపల్లి, ప్రకాశం జిల్లా, రాచర్ల మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 368., ఎస్.టి.డి.కోడ్ = 08405.

గ్రామభౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

పందిళ్లపల్లి 4 కి.మీ, మోక్షగుండం 4 కి.మీ, పలకవీడు 8 కి.మీ, గుడిమెట్ట 8 కి.మీ, తురిమెళ్ళ 9 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన బెస్తవారిపేట మండలం, ఉత్తరాన కంభం మండలం, పడమరన గిద్దలూరు మండలం, ఉత్తరాన అర్ధవీడు మండలం.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ గ్రామానికి చెందిన శ్రీ బుడమా వెంకటరెడ్డి, 1965 నుండి 1983 వరకూ, ఈ గ్రామ సర్పంచిగా పనిచేసారు. ఆయన కోడలు శ్రీమతి శ్యామలాదేవి, 1995 నుండి 2001 వరకూ, ఈ గ్రామ సర్పంచిగా పనిచేసారు. [2]
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి మూడుగుళ్ళ రామసుబ్బమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవలయాలు[మార్చు]

శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం[మార్చు]

ఈ ఆలయ నవమ వార్షికోత్సవం సందర్భంగా, 2015, జూన్-2వ తేదీ మంగళవారంనాడు, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. మంగళవారం రాత్రి గ్రామోత్సవం నిర్వహించారు. బుధవారంనాడు ఆలయం వద్ద, భక్తులకు అన్నదానం నిర్వహించారు. [4]

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయ పంచమ వార్షికోత్సవం, 2016, మే-14వ తేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం, స్వామివారి కళ్యాణం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. [5]

గణాంకాలు[మార్చు]

2001వ సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,517.[2] ఇందులో పురుషుల సంఖ్య 753, మహిళల సంఖ్య 764, గ్రామంలో నివాస గృహాలు 355 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 739 హెక్టారులు;జనాభా (2011) - మొత్తం 1,449 - పురుషుల సంఖ్య 702 -స్త్రీల సంఖ్య 747 - గృహాల సంఖ్య 402

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-22;4వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014, జనవరి-11; 5వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2015, జూన్-4; 5వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2016, మే-15; 5వపేజీ.