ఎడవల్లి (రాచర్ల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎడవల్లి
—  రెవిన్యూ గ్రామం  —
ఎడవల్లి is located in Andhra Pradesh
ఎడవల్లి
ఎడవల్లి
అక్షాంశరేఖాంశాలు: 15°27′50″N 78°57′47″E / 15.463773°N 78.963032°E / 15.463773; 78.963032
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం రాచర్ల
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి షేక్ మహబూబ్ బీ
జనాభా (2011)
 - మొత్తం 3,620
 - పురుషుల సంఖ్య 1,788
 - స్త్రీల సంఖ్య 1,832
 - గృహాల సంఖ్య 986
పిన్ కోడ్ 523356
ఎస్.టి.డి కోడ్ 08405

ఎడవల్లి (యడవల్లి), ప్రకాశం జిల్లా, రాచర్ల మండలానికి చెందిన గ్రామము.[1].పిన్ కోడ్ నం. 523356. ., ఎస్.టి.డి.కోడ్ = 08405.

గ్రామo పేరువెనుక చరిత్ర[మార్చు]

ఈ వూరును వ్యవహరికంగా 'యడవల్లి' అని కూడా పిలుస్తారు.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఎడవల్లి గిద్దలూరు మండల కేంద్రానికి 6 కి.మీ.దూరంలో వున్న గ్రామం.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన గిద్దలూరు మండలం, తూర్పున బెస్తవారిపేట మండలం, తూర్పున కంభం మండలం, దక్షణాన కొమరోలు మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

యడవల్లి రెవెన్యూ పరిధిలో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషనును ఇకనుండి, "యడవల్లి" రైల్వేస్టేషనుగా పిలుస్తారు. ఈ మేరకు రైల్వేబోర్డు నుండి ఉత్తర్వులు వెలువడినవి.[2]

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్):- ఇక్కడ ప్రతి సంవత్సరం, 10వ తరగతి మరియు ఇంటర్ మీడియేట్ లలో ప్రవేశాలు నిర్వహించి విద్యార్థులను చేర్చుకుంటారు.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

ప్రాథమిక అరోగ్య ఉప కేంద్రం.

గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామానికి ఇరువైపుల రెండు చెరువులు ఉన్నాయి. వాటిని పెద్దచెరువు, చిన్నచెరువు అని పిలుస్తారు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి షేక్ మహబూబ్ బీ, సర్పంచిగా ఎన్నికైనారు.[3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

  1. శ్రీ ఉమామహేశ్వరస్వామివారి ఆలయం.
  2. శ్రీ రామాలయం.
  3. శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయం:- ఈ ఆలయం, గ్రామానికి సమీపంలోని గుట్టమీద ఉంది.
  4. ఈ గ్రామములో పోలేరమ్మ, బొడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా, 2015,మే నెల,8వతేదీ శుక్రవారంనాడు గణపతిపూజ, కలశస్థాపన, హోమాలు, 9వతేదీ శనివారంనాడు గ్రామోత్సవం నిర్వహించి, 10వ తేదీ ఆదివారం నాడు, విగ్రహప్రతిష్ఠ నిర్వహించెదరు. ఈ మూడు రోజులూ పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసెదరు. ఈ సందర్భంగా 10వ తేదీనాడు, గ్రామంలో ఎడ్ల బలప్రదర్శన నిర్వహించి గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసెదరు. [5]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

వ్యవసాయం[మార్చు]

వర్షాలు సకాలంలో కురిసి, చెరువులు నిండితే వరి పండిస్తారు. మిగతా సమయంలో మెట్ట పంటలు జొన్న, సజ్జలు, రాగులు, కందులు వంటివి పండిస్తారు. అలాగే మిరప, టమోటా, వంటి కాయగూరలను నూతులు, లేదా బోరుబావుల ద్వారా సాగు చేస్తారు. నాలుగు సంవత్సరాల తరువాత ఎడవల్లి చిన్న చెరువుకు పూర్తి స్థాయిలో నీరు చేరడంతో, అలుగు పారుతోంది (2013లో)[4].

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,620 - పురుషుల సంఖ్య 1,788 - స్త్రీల సంఖ్య 1,832 - గృహాల సంఖ్య 986

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,586.[5] ఇందులో పురుషుల సంఖ్య 1,879, మహిళల సంఖ్య 1,707, గ్రామంలో నివాస గృహాలు 882 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1773 హెక్టారులు

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఈనాడు,ప్రకాశం, డిసెంబరు-23,2013;4వ పేజీ
  3. ఈనాడు ప్రకాశం; 2013,ఆగష్టు-3; 4వ పేజీ
  4. ఈనాడు ప్రకాశం, 27 అక్టోబరు 2013, 5వ పేజీ.
  5. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[5] ఈనాడు ప్రకాశం; 2015,మే-8; 5వపేజీ.