గిద్దలూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గిద్దలూరు
—  మండలం  —
ప్రకాశం జిల్లా పటములో గిద్దలూరు మండలం యొక్క స్థానము
ప్రకాశం జిల్లా పటములో గిద్దలూరు మండలం యొక్క స్థానము
గిద్దలూరు is located in Andhra Pradesh
గిద్దలూరు
ఆంధ్రప్రదేశ్ పటములో గిద్దలూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 15°22′36″N 78°55′34″E / 15.376771°N 78.926039°E / 15.376771; 78.926039
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం
మండల కేంద్రము గిద్దలూరు
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 78,462
 - పురుషులు 40,093
 - స్త్రీలు 38,369
అక్షరాస్యత (2001)
 - మొత్తం 64.09%
 - పురుషులు 79.59%
 - స్త్రీలు 47.98%
పిన్ కోడ్ 523357
గిద్దలూరు
—  రెవిన్యూ గ్రామం  —
గిద్దలూరు పట్టణ విహంగ వీక్షణం
గిద్దలూరు పట్టణ విహంగ వీక్షణం
గిద్దలూరు is located in Andhra Pradesh
గిద్దలూరు
అక్షాంశరేఖాంశాలు: 15°22′36″N 78°55′34″E / 15.376771°N 78.926039°E / 15.376771; 78.926039
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం గిద్దలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 26,977
 - పురుషుల సంఖ్య 13,662
 - స్త్రీల సంఖ్య 13,315
 - గృహాల సంఖ్య 5,979
పిన్ కోడ్ 523 357
ఎస్.టి.డి కోడ్ 08405ఇక్కడ పురాతన పాతాలనాగేశ్వరస్వామి ఆలయం ఉన్నది

గిద్దలూరు ప్రకాశం జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము మరియు అదే పేరుగల మండలము. [1] పిన్ కోడ్: 523 357., ఎస్.టి.డి.కోడ్ = 08405.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

గిద్దలూరు చరిత్రకు కేంద్రబిందువైన పురాతన పాతాళ నాగేశ్వరస్వామి ఆలయం. ఇది సగిలేరు ఒడ్డున ఉన్నది.

గిద్దలూరు యొక్క పూర్వ నామము సిద్ధలూరు. సిద్ధలూరు సమీపములోని నాగేశ్వరాలయము దగ్గర ఒక స్థలమును నందన చక్రవర్తి శ్రీవత్స గోత్రజుడు, నందనవారిక వంశానికి చెందిన కుంచాల శివప్పకు అగ్రహారముగా ఇచ్చాడు. కానీ తరువాత ఈ గ్రామము.[2] పాడుబడటము వలన, శివప్ప వంశీయుడైన రామచంద్ర నందవరము నకు తరలివెళ్లి, అక్కడి నుండే సిద్ధలూరి యొక్క వ్రిత్తిని అనుభవించాడు.

శక యుగములో తొండమారయగుళ్ల స్థాపన జరిగిన తరువాత, కుంచెల రామచంద్ర తొండమారయగుళ్ల నాయకుని నుండి కొత్తగా స్థాపించిన సిద్ధలూరిని అగ్రహారముగా పొంది నందవరము నుండి ఇరవై - ముప్పై బ్రాహ్మణ కుటుంబములు మరియు బారబలావతుల తో (12 మంది గ్రామ సేవకులు) సహా సిద్ధలూరికి తిరిగి వచ్చాడు. అయితే, తొండమారయగుళ్ల నాయకుని మరణానంతరము ఆ ప్రదేశము నిర్జనమైంది. ఆ కాలములో సిద్ధలూరి ప్రాభవము పెరిగి గ్రిద్ధలూరని కొత్త పేరు సంతరించుకొన్నది. కొంత కాలము తర్వాత గ్రిద్దలూరు అగ్రహారీకుడూ, కుంచాల రామచంద్రుని వంశజుడూ అయిన కుంచెల వెంకటాద్రయ్య గ్రామము చుట్టూ అనేక కుగ్రామములు స్థాపన చేయించి గిద్దలూరిని మెరుగు పరచెను. అనతి కాలములోనే ఆ కుగ్రామములు కంచిపల్లె, చట్టిరెడ్డిపల్లె మరియు అక్కలరెడ్డిపల్లె మౌజే లుగా (స్వంతంత్ర గ్రామములు లేదా ఒక మాదిరి పట్టణములు) ఎదిగినవి. దీనితో గిద్దలూరు కస్బా (ప్రధాన కేంద్రము) అయినది.

హరిహర దేవరాయల కాలములో రామచంద్రరాజు ఈ ప్రాంతములను జాగీర్దారుగా పరిపాలించుటకు వచ్చి ఈ గ్రామములను వెంకటాద్రి నుండి వశము చేసుకొన్నాడు. కానీ ఆ తర్వాత కాలములో వెంకటాద్రి నుండి ఆ వంశములో మూడవ తరానికి చెందిన రామచంద్ర, హరిహర రాయలచే పునస్థాపించబడి తన గ్రామాలను తిరిగి పొందెను. ఆయన కరణముగా కూడా నియమించబడెను. ఈ విధముగా ముస్లింలు రాక వరకు రామచంద్రరాజు వంశజులు గిద్దలూరు కస్బాను మరియు దాని గ్రామాలను పరిపాలించారు. రాయల పాలన ముగింపుతో గిద్దలూరు ముస్లింల ఆక్రమణకు గురై, ఆ తరువాత కాలములో దత్తమండలాలను నిజాము బ్రిటీషువారికి దత్తము చేసినప్పుడు కడప జిల్లాలో భాగముగా ఉన్న గిద్దలూరు బ్రిటిషు పాలనలోకి వచ్చింది. కర్నూలు జిల్లా యేర్పడిన తర్వాత కర్నూలు జిల్లాలోను భాగమై, 1971లో ఒంగోలు జిల్లా ఏర్పాటు చేసినప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలో కలపబడినది.

పురావాస్తు చరిత్ర[మార్చు]

1930వ దశకములో కామ్మియెడ్, బర్కెట్ట్ అను ఇద్దరు పురావస్తు శాస్త్రజ్ఞులు గిద్దలూరు పరిసరాల్లో పాత రాతియుగము (అప్పర్ పేలియోలిథిక్) నాటి మానవుడు నివసించిన ఆధారాలు కనుగొన్నారు.[3] ఇక్కడ మధ్య రాతియుగము నాటి చిన్న రాతి పనిముట్ల పరిశ్రమలు బయల్పడ్డాయి.[4] ఈ చిన్న పనుముట్లు క్వార్ట్‌జ్ చేయబడినవి.[5]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

బ్రిటీష్‌ వాళ్ళు మనదేశంలో అధికారం చెలాయిస్తున్న రోజులవి! ఒక్కొక్క ప్రాంతాన్ని తమ కంపెనీ పరిపాలనకిందకి తెచ్చుకుంటున్న తెల్లవాళ్ళు... ఆయా ప్రాంతాలను తమకు అనుకూలమైన పేర్లతో పిలిచేవారు. ఒకప్పుడు కరువు కాటకాలతో ఆకలి చావులకు ఆలవాలంగా మారిన ఈ ప్రాంతంలో గెద్దలు ఎక్కువగా తిరిగేవట! దాంతో ఈ ప్రాంతాన్ని ‘గెద్దలూరు’గా బ్రిటీష్‌వారు వ్యవహరించేవారు. బ్రిటీష్‌ వారికాలంలోనే కొలతల విధానం అమలులోకి వచ్చింది. ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా ‘గిద్ద’తో కొలవడం ప్రారంభమయ్యిందట! దాంతో ‘గెద్దలూరు’ కాస్తా ‘గిద్దలూరు’గా మారిపోయింది[ఆధారం కోరబడింది]

గ్రామ భౌగోళికం[మార్చు]

సగిలేరు నది (స్వర్ణబాహు నది) గిద్దలూరికి దక్షిణాన ప్రవహిస్తున్నది.

సమీప గ్రామాలు[మార్చు]

నరవ 1.9 కి.మీ, కొంగలవీడు 2.2 కి.మీ, తిమ్మాపురం 5.6 కి.మీ, అంబవరం 5.7 కి.మీ, ముండ్లపాడు 6.1 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

గిద్దలూరు 2.8 కి.మీ,రాచెర్ల 11.7 కి.మీ,కొమరోలు 13.2 కి.మీ,బెస్తవారిపేట 28.2 కి.మీ.

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 26,977 - పురుషుల సంఖ్య 13,662 - స్త్రీల సంఖ్య 13,315 - గృహాల సంఖ్య 5,979

పిన్ కోడ్ 523 357

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

గిద్దలూరు గుంటూరు - ద్రోణాచలము రైల్వే లైనుపై ఒక ప్రముఖ రైల్వేస్టేషను.

గ్రామములోని విద్యా సౌకర్యాలు[మార్చు]

శ్రీ వివేకానంద ఉన్నత పాఠ4శాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

బ్యాంక్ ఆఫ్ ఇండియా.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

పరిపాలన(నగర పంచాయతీ)[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గిద్దలూరు నగర పంచాయతీ రేడియో బావి సమీపంలోని శ్రీ అభయాంజనేయస్వామి, శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవస్థానం, నవగ్రహ దేవతల ప్రతిష్ఠా మహోత్సవం 2014, జూన్-12 నుండి 14 వరకు నిర్వహించినారు. 12వ తేదీన గంగమ్మ, గణపతి పూజలు, 13వ తేదీన అభిషేకాలు, మూలమంత్ర జపాలు, గ్రామోత్సవం, 14వ తేదీన ధ్వజస్థంభ, నవగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించినారు. 15వ తేదీ ఆదివారం నాడు, శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించినారు. అభయాంజనేయస్వామి ఆలయ ధ్వజస్థంభ ప్రతిష్ఠ సందర్భంగా, దంపతులు పూజాకార్యక్రమాలలో పాల్గొన్నారు. సాయంత్రం రామ, లక్ష్మణ, సీతాదేవి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకవాహనంపై అలంకరించి, గ్రామోత్సవం నిర్వహించినారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. [5] & [6]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

గిద్దలూరు నగర పంచాయతీ రేడియోబావి కూడలిలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించెదరు. [9]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయం గిద్దలూరు నగర పంచాయతీలోని పాత బద్వేలు రహదారిపై ఉన్నది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి, తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. ఈ ఆలయంలో 2015,మార్చ్-25వ తేదీ బుధవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా అర్చకులు విశేషంగా పూజలు నిర్వహించినారు. అనంతరం విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించినారు. నవరాత్రి వేడుకల సందర్భంగా ఉత్సవ విగ్రహాన్ని నరసింహస్వామిగా అలంకరించినారు. ఈ కార్యక్రమానికి అధికసంఖ్యలో విచ్చేసిన భక్తులకు, తీర్ధప్రసాదాలు వితరణ చేసినారు. [8]

గిద్దలూరు నగర పంచాయతీలోని కొండపేట వీరాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ రమా సత్యనారాయణస్వామివారి ఆలయం[మార్చు]

గిద్దలూరు నగర పంచాయతీ లోని ఆంకాళమ్మ వీధిలో 2015,ఫిబ్రవరి-21వ తేదీ, శనివారం ఉదయం, శ్రీ రమా సత్యనారాయణస్వామివారి విగ్ర ప్రతిష్ఠా కార్యక్రమం వైభవంగా నిర్వహించినారు. అనంతరం నిర్వహించిన శ్రీ సత్యనారాయణస్వామివారి వ్రతంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తదుపరి భక్తులకు అన్నదానం నిర్వహించినారు.[7]

శ్రీ వరసిద్ధివినాయకస్వామివారి ఆలయం[మార్చు]

గిద్దలూరు నగర పంచాయతీలోని కొంగళవీడు రహదారిలో నెలకొన్న ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠ వేడుకలు, 2015,జూన్-2వ తేదీ మంగళవారం ఉదయం ప్రారంభమైనవి. ఉదయం వేదపండితులు ప్రత్యేకపూజలు చేపట్టినారు. భక్తులు పూజా కార్యక్రమాలలో పాల్గొని, ఉత్సవ విగ్రహాలకు జలాభిషేకం నిర్వహించినారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు వితరణచేసినారు. 3వతేదీ బుధవారం ఉదయం ఆలయప్రాంగణంలో రుద్రాభిషేకం, గణపతి, నవగ్రహ, మూలమంత్రస్థాపన పూజలు నిర్వహించినారు. సాయంత్రం చేదపండితులు, సామూహిక అర్చనలు నిర్వహించినారు. 4వతేదీ గురువారంనాడు అలయంలో ప్రత్యేకపూజలు చేపట్టినారు. ఉదయం వినాయకస్వామివారి విగ్రహాన్ని ఒక ప్రత్యేకవాహనంపై పెట్టి, గ్రామోత్సవం నిర్వహించినారు. 5వ తేదీ శుక్రవారం నాడు, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించినారు. మహాన్యాసపూర్వక అభిషేకాలు, పలు దేవతారాధనలు, మండపారాధన, కలశపూజ, హోమాలు నిర్వహించినారు. 6వ తేదీ శనివారంనాడు, ఈ ఆలయంలో యంత్రప్రతిష్ఠ, శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, శిఖర, ధ్వజస్థంభ ప్రతిష్ఠ, శివపార్వతుల స్పటికలింగ ప్రతిష్ఠా కార్యక్రమాలు, వేదపండితులు నిర్వహించినారు. భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం, శ్రీ సిద్ధి, బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారల శాంతికళ్యాణం వేడుకగా నిర్వహించినారు. [10]&[11]

పురాతన పాతాళ నాగేశ్వరస్వామి ఆలయం[మార్చు]

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయం గిద్దలూరు నగర పంచాయతీలోని రాచర్ల గేటు కూడలిలో ఉన్నది.

శ్రీ కాశినాయన దేవస్థానం[మార్చు]

ఈ ఆలయం గిద్దలూరు నగర పంచాయతీలోని కాశిరెడ్డినగరులో ఉన్నది.

హొసన్న మందిరం[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామంలో జన్మించిన ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 26,977.[6] ఇందులో పురుషుల సంఖ్య 13,662, మహిళల సంఖ్య 13,315, గ్రామంలో నివాస గృహాలు 5,979 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2,094 హెక్టారులు.

గ్రామాలు[మార్చు]

గిద్దలూరు రైల్వే స్టేషను

ఇవి కూడా చూడండి[మార్చు]

గిద్దలూరు చిత్రమాలిక[మార్చు]

</gallery> Revenue office.JPG|100 సం.లకు పైబడిన రెవెన్యూ ఆఫిసు C.S.I church.JPG|కాథలిక్ చర్చి,పురాతనమైనది Kadhar vali swami darga.JPG|ఖాదర్ వలి దర్గా Mukaadvaram.JPG|పాతాళనాగేశ్వరస్వామిగుడి ముఖద్వారం

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

  • A Manual of Kurnool District in the Presidency of Madras - Narahari Gopalakristnamah Chetty Pub. Government press, Madras. 1886.
  • గ్రామగణాంకాలు [3]

[5] ఈనాడు ప్రకాశం; 2014,జూన్-7; 5వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2014,జూన్-16; 4వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2015,ఫిబ్రవరి-22; 5వపేజీ. [8] ఈనాడు ప్రకాశం; 2015,మార్చ్-26; 15వపేజీ. [9] ఈనాడు ప్రకాశం; 2015,మే నెల-13వ తేదీ; 5వపేజీ. [10] ఈనాడు ప్రకాశం; 2015,జూన్-3; 4వపేజీ. [11] ఈనాడు ప్రకాశం; 2015,జూన్-7; 4వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=గిద్దలూరు&oldid=1763191" నుండి వెలికితీశారు