ఆకవీడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ఆకవీడు
రెవిన్యూ గ్రామం
ఆకవీడు is located in Andhra Pradesh
ఆకవీడు
ఆకవీడు
నిర్దేశాంకాలు: 15°33′43″N 78°56′31″E / 15.562°N 78.942°E / 15.562; 78.942Coordinates: 15°33′43″N 78°56′31″E / 15.562°N 78.942°E / 15.562; 78.942 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంరాచర్ల మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం4,288 హె. (10,596 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం5,744
 • సాంద్రత130/కి.మీ2 (350/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08406 Edit this at Wikidata)
పిన్(PIN)523372 Edit this at Wikidata

అకవీడు, ప్రకాశం జిల్లా, రాచర్ల మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్: 523 372., ఎస్.టి.డి కోడ్ = 08406.

గ్రామ చరిత్ర[మార్చు]

పేరువెనుక చరిత్ర[మార్చు]

పూర్వము పెద్దవీడుకు చెందిన పెద్దినేయ అనే ఒక పశువులకాపరి పెద్దినేపాడు అనే గ్రామాన్ని స్థాపించాడు. అతనికి ఆకెమ్మ అనే సోదరి ఉండేది. ఆమె వేరొక స్థలములో నివాసము ఏర్పరచుకొనగా అక్కడ ఆకెవీడు అను పేరుతో ఒక గ్రామం అభివృద్ధి చెందినదని ఆకవీడు కైఫియతు గ్రామస్థాపన గురించి చెబుతున్నది.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఆరవీటికోట 2 కి మీ, కొత్తూరు 2 కి మీ, చిన్నగానిపల్లి 5 కి.మీ, అక్కపల్లి 6 కి.మీ, బొగోలు 8 కి.మీ, తురిమెళ్ళ 9 కి.మీ, యర్రబాలెం 10 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన అర్ధవీడు మండలం, దక్షణాన గిద్దలూరు మండలం, తూర్పున బెస్తవారిపేట మండలం, తూర్పున కంభం మండలం.

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

  1. ఈ పాఠశాల విద్యార్థులు గత ఆరు సంవత్సరాలుగా బ్యాడ్ మింటన్, సీనియర్, జూనియర్ విభాగాలలో విజేతలుగా నిలుచుచున్నారు. ఇటీవల అల్లీనగర్ లో జరిగిన గిద్దలూరు జోనల్ పోటీలలో సీనియర్, జూనియర్ విభాగాలలో విజయం సాధించి షీల్డ్ సాధించారు. [5]
  2. ఈ పాఠశాలలో ఇటీవల స్వచ్ఛభారత్ పథకం స్ఫూర్తితో, 4 లక్షల రూపాయల వ్యయంతో, హెచ్.పి.సి.సంస్థ నిర్మించిన 2 మరుగుదొడ్లను, 2015, సెప్టెంబరు-12వ తేదీనాడు, పాఠశాలకు అప్పగించారు. [7]
  3. 2017, మార్చిలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షలలో, ఈ పాఠశాల విద్యార్థి ఎస్.రాజేశ్వరరెడ్డి, పదికి పది గ్రేడ్ మార్కులు సాధించాడు. [11]

గ్రంథాలయం[మార్చు]

ఈ గ్రామంలో ఒక శాఖా గ్రంథాలయం ఉంది. ఈ గ్రంథాలయానికి గ్రామస్థులైన శ్రీ సూరా రామకృష్ణారెడ్డి, విద్యుత్తు సౌకర్యం కలుగజేసినారు. [4]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

  1. దొడ్డేటి చెరువు.
  2. తురకవాని చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి సూరా రామలక్ష్మమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గోకర్ణ మహాబలేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో 2015, మార్చి-4వ తేదీ, బుధవారం నాడు, నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ నిర్వహించారు. శంకుప్రతిష్ఠ చేసి నవధాన్యాలు వేసి, భూమిపూజ నిర్వహించారు. శ్రీ పర్చుచూరి నాగేశ్వరరావు దంపతులు, విగ్రహ దాతలు. [6]

శ్రీ కనక సురభేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయంజనేయస్వామి, గణపతి, గోపాలకృష్ణ, గోమాత విగ్రహ ప్రతిష్ఠామహోత్సవాలు, 2014, జూన్-19, గురువారం నాడు ప్రారంభమైనవి. ఆ రోజున గణపతి పూజ, దీక్షాహొమం, అఖండ దీపస్థాపన, అభిషేకాలు, జలాధివాసం మొదలగు పూజలు నిర్వహించారు. 20వ తేదీ శుక్రవారం నాడు, విగ్రహాలకు విశేషపూజలు నిర్వహించారు. వేదపండితులు యంత్రాలకు రుద్రాభిషేకం, నవగ్రహ వాస్తుహోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. 21వ తేదీ, శనివారం నాడు, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గణపతి, గోమాతల విగ్రహ ప్రతిష్ఠామహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేదపండితులు మహాస్నపనం, పంచామృతాభిషేకం, యంత్రరాజులకు విశేషపూజలు నిర్వహించి, అనంతరం, విగ్రహ ప్రతిష్ఠ చేసారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసి, అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం చేపట్టినారు. [3]

శ్రీ రంగయ్యస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో వార్షిక జెండా ఉత్సవం 2017, ఫిబ్రవరి-19,20 తేదీలలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. సోమారం ఉదయం గ్రామంలో రథోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారి జెండాకు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం జండా వద్ద ఈ గ్రామవాస్లులేగాక, చుట్టుప్రక్కల గ్రామాలయిన జి.కొత్తపల్లి, అనుములపల్లి మొదలగు గ్రామనుండి నుండి గూడా వచ్చిన భక్తులు జండా వద్ద విశేషపూజలు నిర్వహించారు. ఈ ఉత్స్వాన్ని పురస్కరించ్కుని, దాతల పలుచోట్ల అన్నప్రసాద వితరణ నిర్వహించారు. భజనలు, కోలాటాలు, గుండు పందెం, చిన్నారులకు పరుగుపందెం, బాలికలకు సూదిలో దారం ఎక్కించుట, పరుగు ప్పందెం, కుర్చీలాట మొదలగు పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు. 21వతేదీ మంగళవారం వేకువఝామున గ్రామంలో స్వామివారి జెండా, వేదాల పెట్టె, పీరులతో గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామస్థులు స్వామివారి జెండాకు కాయా కర్పూరం సపర్పించి పూజలు చేసారు. ఈ కార్యక్రమాలలో ఆకవీడు, జి.కొత్త్గపల్లె గ్రామస్థులతోపాటు పలు గ్రామాల భక్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [8]

శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయం గ్రామంలో నైరుతి దిక్కున ఉంది. ఈ ఆలయం శిథిలావస్థకు చేరినది. పూజాధికాలు గూడా సక్రమంగా నిర్వహించుటలేదు. ఈ ఆలయంలోని ఆరదుగులకు పైగా ఎత్తయిన వీరభద్రస్వామివారి విగ్రహాన్ని, 2017, జూన్-8 రాత్రి, కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టినారు. [9]

ఆకవీడు గ్రామంలో కాటమరాజుస్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, గంగా భవాని అమ్మవారి దేవాలయ సంప్రోక్షణ కార్యక్రమం, 2017, జూన్-16వతేదీ శుక్రవారం నుండి 18వతేదీ ఆదివారం వరకు వైభవంగా నిర్వహించారు. 16 న గణపతి పూజ, హోమాలు, మండపారాధన, 17 న గ్రామోత్సవం, 18 న యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, నిర్వహించారు. భక్తులకు 17, 18 తేదీలలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో జిల్లాస్థాయిలో కోడెల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన కోడెల యజమానులకు బహుమతులు అందజేసినారు. [10]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,744 - పురుషుల సంఖ్య 2,917 - స్త్రీల సంఖ్య 2,827 - గృహాల సంఖ్య 1,443

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,547.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,867, మహిళల సంఖ్య 2,680, గ్రామంలో నివాస గృహాలు 1,254 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 4288 హెక్టారులు

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-2; 5వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-19,20,21 & 22. [4] ఈనాడు ప్రకాశం; 2014, ఆగస్టు-6; 6వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2014, నవంబరు-26; 4వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2015, మార్చి-5; 6వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2015, సెప్టెంబరు-13; 4వపేజీ. [8] ఈనాడు ప్రకాశం; 2017, ఫిబ్రవరి-22; 4వపేజీ. [9] ఈనాడు ప్రకాశం; 2017, జూన్-10; 3వపేజీ. [10] ఈనాడు ప్రకాశం; 2017, జూన్-19; 5వపేజీ. [11] ఈనాడు ప్రకాశం; 2017, జూన్-19; 4వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=ఆకవీడు&oldid=2860857" నుండి వెలికితీశారు