చోలవీడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


చోలవీడు
రెవిన్యూ గ్రామం
చోలవీడు is located in Andhra Pradesh
చోలవీడు
చోలవీడు
నిర్దేశాంకాలు: 15°31′26″N 78°56′38″E / 15.524°N 78.944°E / 15.524; 78.944Coordinates: 15°31′26″N 78°56′38″E / 15.524°N 78.944°E / 15.524; 78.944 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, మార్కాపురం రెవిన్యూ డివిజన్
మండలంరాచర్ల మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,219 హె. (3,012 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం3,143
 • సాంద్రత260/కి.మీ2 (670/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08406 Edit this at Wikidata)
పిన్(PIN)523372 Edit this at Wikidata

చోళ్ళవీడు, ప్రకాశం జిల్లా, రాచర్ల మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్: 523372., ఎస్.టి.డి.కోడ్ = 08406.

గ్రామ భౌగోళికం[మార్చు]

ఈ గ్రామం ప్రక్కగా గుండ్లకమ్మ నది ప్రవహించుచున్నది.

సమీప గ్రామాలు[మార్చు]

బొగోలు 5 కి.మీ, అక్కపల్లి 6 కి.మీ, తురిమెళ్ళ 8 కి.మీ, చినగానిపల్లి 2 కి.మీ, యర్రబాలెం 8 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

తూర్పున బెస్తవారిపేట మండలం, ఉత్తరాన అర్ధవీడు మండలం, తూర్పున కంభం మండలం, దక్షణాన గిద్దలూరు మండలం.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

రంగయ్యనాయుడు చెరువు:- ఈ చెరువు క్రింద చోళ్ళవీడు, చినగానిపల్లె గ్రామాల రైతులకు చెందిన 100 ఎకరాల మాగాణి భూమి సాగు అగుచున్నది.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ ముత్యాల మధుసూదనరావు సర్పంచిగా ఎన్నికైనారు. [6]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

శ్రీ రామాలయం[మార్చు]

కార్తీక పౌర్ణమి నాడు ఈ ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం నిర్వహించెదరు, విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించెదరు. ఈ కార్యక్రమం చర్చింటేటందుకు 2014, అక్టోబరు-27న ఈ గ్రామానికి పుష్పగిరి పీఠాధిపతి విద్యానృసింహభారతిస్వామి రానున్నారు. [4]

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి 16 రోజులైన సందర్భంగా, 2015, మార్చి-16వ తేదీ సోమవారం నాడు, ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి, అమ్మవారికి సహస్రనామార్చన నిర్వహించారు. [5]

శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి స్వామివారి ఉత్సవాలు (మే నెలలో) రెండు రోజులు అత్యంత వైభవంగా నిర్వహించెదరు. ముందురోజు సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించెదరు. హనుమజ్జయంతి నాడు ఉదయం స్వామివారికి అభిషేకం, ఆకుపూజ నిర్వహించెదరు. మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]

శ్రీ వేమయ్యస్వామివారి ఆలయం[మార్చు]

గ్రామంలోని ఈ ఆలయంలో స్వామివారి వార్షిక ఆరాధనోత్సవాలు, ప్రతి సంవత్సరం, మే నెలలో వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా గ్రామంలో కోడెల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలిచిన కోడెల యజమానులకు బహుమతులు అందజేసెదరు. [7]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,143 - పురుషుల సంఖ్య 1,636 - స్త్రీల సంఖ్య 1,507 - గృహాల సంఖ్య 850

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,236.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,620, మహిళల సంఖ్య 1,616, గ్రామంలో నివాస గృహాలు 765 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,219 హెక్టారులు

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2013, ఆగస్టు-2; 5వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014, మే-22; 5వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2014, అక్టోబరు-27; 4వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015, మార్చి-17; 6వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2016, జనవరి-5; 5వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2017, మే-19; 5వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=చోలవీడు&oldid=3119180" నుండి వెలికితీశారు