పందిళ్లపల్లి
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°45′24″N 80°16′59″E / 15.7565424°N 80.2831274°ECoordinates: 15°45′24″N 80°16′59″E / 15.7565424°N 80.2831274°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండలం | వేటపాలెం మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 8.73 కి.మీ2 (3.37 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 7,243 |
• సాంద్రత | 830/కి.మీ2 (2,100/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1021 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( 08594 ![]() |
పిన్(PIN) | 523184 ![]() |
పందిళ్లపల్లి, బాపట్ల జిల్లా, వేటపాలెం మండలానికి చెందిన గ్రామం.[2] పిన్ కోడ్: 523184., ఎస్.ట్.డి.కోడ్ = 08594.
ఈ గ్రామానికి దగ్గరలో మోటుపల్లి అనే ప్రసిద్ధిగాంఛిన చారిత్రక ప్రదేశం ఉంది.
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
ఈ గ్రామానికి ఆ పేరు రావటానికి రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, ఇక్కడ ప్రతి ఇంటి ముందు పందిరి ఉండేది. రెండవది, ఇక్కడ పందిళ్ళమ్మ గుడి ఉండడం.
గ్రామ భౌగోళికం[మార్చు]
- సమీప గ్రామాలు
సంతరావూరు 4 కి.మీ, పుల్లరిపాలెం 6 కి.మీ, కడవకుదురు 7 కి.మీ.
- సమీప మండలాలు
దక్షణాన చినగంజాం మండలం, తూర్పునచీరాల మండలం, పశ్చిమాన ఇంకొల్లు మండలం, ఉత్తరాన కారంచేడు మండలం.
గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఈ పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ కూరపాటి వెంకటరావు 15 సంవత్సరాలుగా భారత్ స్కౌట్స్ & గైడ్స్ లో స్కౌట్ మాస్టరుగా పనిచేసారు. ఈయన కృషిని గుర్తించిన జిల్లా విద్యాశాఖాధికారి, 2016, ఫిబ్రవరి-20న ఒంగోలులో జరిగిన ఒక కార్యక్రమంలో వీరికి సేవాపతకం అందించారు. [4]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
ఈ గ్రామంలో అత్యధికులు చేనేత వర్గం వారు.
గ్రామ ప్రముఖులు[మార్చు]
ఈ గ్రామం చీరాల శాసనసభ్యులు శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారి స్వగ్రామం. రాజకీయ ఓనమాలు దిద్దించి తన ఎదుగుదలకు కారణమైన పందిళ్ళపల్లి గ్రామంలోనే, వీరు నివాసం ఉంటున్నారు. [2]
గ్రామ విశేషాలు[మార్చు]
ఈ గ్రామం శుభ్రంగా ఉంటుంది.
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 7,243 - పురుషుల సంఖ్య 3,583 - స్త్రీల సంఖ్య 3,660 - గృహాల సంఖ్య 2,086
2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,111.[3] ఇందులో పురుషుల సంఖ్య 3,535, మహిళల సంఖ్య 3,576, గ్రామంలో నివాస గృహాలు 1,847 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 873 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
వెలుపలి లింకులు[మార్చు]
[2] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-15; 8వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2014, నవంబరు-26; 7వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2016, ఫిబ్రవరి-21; 15వపేజీ.