సంతరావూరు
సంతరావూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°48′18″N 80°15′31″E / 15.804918°N 80.258616°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | చినగంజాము |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,920 |
- పురుషుల సంఖ్య | 1,896 |
- స్త్రీల సంఖ్య | 2,024 |
- గృహాల సంఖ్య | 1,090 |
పిన్ కోడ్ | 523185 |
ఎస్.టి.డి కోడ్ |
సంతరావూరు, ప్రకాశం జిల్లా, చినగంజాము మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523185., ఎస్.టి.డి.కోడ్ = 08594.
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
ఒకప్పుడు ఊరి పేరు రావూరు మాత్రమే. అయితే ఊరి చివరన ఉన్న "బకింగ్ హాం" కాలువలో ఇతర ప్రాంతాల నుంచి వారానికి ఒక రోజు సరుకులు వచ్చేవి. అల వచ్చే సరుకులను విక్రయించేవారు.అలా వారానికి ఒక రోజు సంత జరిగేది.. కాలక్రమేణా రావూరు సంతరావూరు అయ్యింది.
సమీప గ్రామాలు[మార్చు]
- కడవకుదురు 3.4 కి.మీ
- పందిల్లపల్లి 3.6 కి.మీ
- గొనసపూడి 4 కి.మీ
- పుల్లరిపాలెం 6.3 కి.మీ
- వేటపాలెం 6.6 కి.మీ.
సమీప మండలాలు[మార్చు]
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాల
గ్రామంలో రవాణా సౌకర్యాలు[మార్చు]
అన్ని సమీప పట్టణాలకు, గ్రామాలకు బస్సు సౌకర్యం ఉంది.
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
బ్యాంకులు[మార్చు]
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శ్రీ కనకనాగ వరపమ్మ అమ్మవారి ఆలయం[మార్చు]
ఈ ఆలయం వేటపాలెం మండలంలోని రావూరిపేట గ్రామంలో ఉంది. అమ్మవారికి సంతరావూరు పుట్టినిల్లు, రావూరిపేట మెట్టినిల్లు. అమ్మవారి శిడిమానోత్సవం ప్రతి సంవత్సరం, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమికి, ఒక వారం రోజులు నిర్వహించెదరు. సంతరావూరులో ఐదురోజులు, రావూరిపేట గ్రామంలోని ఆలయంలో, మూడు రోజులు నిర్వహించుచున్నారు. ఈ ఏడాది, 2014, జూన్-12 గురువారం నాడు ఈ ఉత్సవాలు నిర్వహించుచున్నారు. ఈ క్రతువు తిలకించేటందుకు, స్థానికులే గాక, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుండి గూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు. రైలులో వచ్చేవారు, ఒంగోలు స్టేషనులో దిగి, అక్కడనుండి ఆటోలలో ఆలయానికి చేరుకోవచ్చు. బస్సులో వచ్చేవారు, రామన్నపేటలో దిగి, ఆలయానికి చేరుకోవచ్చు. [2]
రామలింగేశ్వర ఆలయం[మార్చు]
శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర ఆలయంలో గంటకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ గంట ఒక సారి కొడితే 108 సార్లు మ్రోగుతుంది. ఇలా కేవలం కాశీ లోనూ, సంతరావూరు లోని శివాలయంలో మాత్రమే జరుగుతుంది. కాశీలో గంట తయారుచేసిన వ్యక్తే సంతరావూరు గుడి లోని గంట కూడా తయారు చేసారు. ఈ ఆలయాన్ని చోళ రాజు నిర్మించారు. ఈ ఆలయంలో రెండు నందులు ఉండటం మరో ప్రత్యేకత. [2]
ఇతర ప్రార్ధనా స్థలాలు[మార్చు]
- చర్చి
- వెంకటేశ్వర స్వామి పాదుకలు
- కన్యకాపరమేశ్వరి ఆలయం
- వీరభద్ర స్వామి ఆలయం
- పోతురాజు, అమ్మవారి ఆలయం
గ్రామజనాబా[మార్చు]
2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3920 .ఇందులో పురుషుల సంఖ్య 1,896, మహిళల సంఖ్య 2,024
- 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు 343 (మొత్తం జనాభాలో 8.75% )
- స్త్రీ-పురుష నిష్పత్తి 1068. ఇది ఆంధ్రపదేశ్ రాష్ట్ర నిష్పత్తి (993) కన్నా ఎక్కువ.
- 70.11% అక్షరాస్యతతో ఆంధ్రప్రదేశ్ సగటు కన్నా ఎక్కువ ఉంది.
- పురుషుల అక్షరాస్యతా శాతం :78.55 %
- స్త్రీలు అక్షరాస్యతా శాతం : 62.21%
- సంతరావూరు గ్రామంలో ఎస్సీలు 46.73%, ఎస్టీలు 3.55% ఉన్నారు.
గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]
- తోటకూర వెంకటనారాయణ, ప్రిన్సిపాల్, చుండి రంగనాయకులు కళాశాల, చిలకలూరిపేట.
వీరు వ్రాసిన గ్రంథాలు:- 1.పితృదేవోభవ (2005),2.గుర్తుకొస్తున్నాయి (2006),3.స్మైలీ (2008),4.స్వాతంత్ర్యంకోసం (2009)
గణాంకాలు[మార్చు]
2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3920 .[3] ఇందులో పురుషుల సంఖ్య 1,896, మహిళల సంఖ్య 2,024, గ్రామంలో నివాస గృహాలు 1,078 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,136 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-06. Retrieved 2015-07-30.
- ↑ http://www.census2011.co.in/data/village/591024-santharavuru-andhra-pradesh.html
వెలుపలి లంకెలు[మార్చు]
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]
[2] ఈనాడు ప్రకాశం; 2014, జూన్-7, 16వ పేజీ.