మోటుపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మోటుపల్లి
రెవిన్యూ గ్రామం
మోటుపల్లి is located in Andhra Pradesh
మోటుపల్లి
మోటుపల్లి
నిర్దేశాంకాలు: 15°42′43″N 80°16′55″E / 15.712°N 80.282°E / 15.712; 80.282Coordinates: 15°42′43″N 80°16′55″E / 15.712°N 80.282°E / 15.712; 80.282 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచినగంజాము మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,602 హె. (3,959 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం3,567
 • సాంద్రత220/కి.మీ2 (580/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523184 Edit this at Wikidata

మోటుపల్లి, ప్రకాశం జిల్లా, చినగంజాము మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 184., ఎస్.ట్.డి.కోడ్ = 08594.

మోటుపల్లి రేవు (Motupalli), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము ప్రకాశం జిల్లాలోని చినగంజాము నుండి 12 కిలోమీటర్ల దూరములో ఉంది.

గ్రామ చరిత్ర[మార్చు]

1298లో ప్రసిద్ధ యాత్రికుడు మార్కోపోలో ఇక్కడే తీరాన్ని చేరాడని భావిస్తారు. చరిత్రకారులకు, పరిశోధకులకు ఈ ప్రదేశము చాలా ముఖ్యమైనది. ప్రాచీన ఓడ రేవైన మోటుపల్లి 1వ శతాబ్దము నుండి అనేక రాజ వంశాల పాలనలో విరాజిల్లినది. పూర్వము బౌద్ధ క్షేత్రమైన మోటుపల్లిలో అనేక బౌద్ధ స్థూపాలు, శిల్పాలు కూడా ఉన్నాయి. మోటుపల్లిలో ఒక ప్రాచీన రామాలయము కూడా ఉంది. కాకతీయ గణపతి దేవుడు తన పాలనాకాలములో కట్టించిన ఏకైక దేవాలయము మోటుపల్లిలో 1249 ప్రాంతంలో కట్టించిన ఆలయమే.[2]

మార్కోపోలో సందర్శనా కాలములో మోటుపల్లిని ఒక తెలివైన రాణి పాలించేదని, ఆమె తన ప్రజలను న్యాయముగా సమానముగా పాలించేదని పేర్కొన్నాడు. ఆమె రాజ్యములోని ప్రజలు బియ్యము, మాంసము, పాలు, పండ్లు, చేపలు తిని జీవించేవారని రాసాడు. ఇతరత్రా చెప్పుకోదగిన విషయాలలో రాజ్యంలోని వజ్రాల ఉత్పాదన గురించి, రాజులకు తగినటువంటి సున్నితమైన వస్త్రాల గురించి, పుష్కలమైన మృగసంపద, భారీ గొర్రెలను గురించిన సంగతులు రాసాడు.[3]

ఈ గ్రామానికి తూర్పుదిశలో అరమైలు విస్తీర్ణంలో బౌద్ధమత స్థల ఆనవాళ్ళు ఉన్నట్లు గుర్తించారు. 200 అడుగుల విస్తీర్ణం, 12 అడుగుల ఎత్తు ఉన్న దీనిని కాసులదిబ్బ అనిపిలుస్తున్నారు. ఇక్కడ నీటిగుంతలకోసం త్రవ్వడంతో ఇత్తడిసామాగ్రి, స్థూపానికి సంబంధించిన కొన్ని ఆధారాలు లభించినవి. ఒకప్పుడు ఇక్కడ మహా వెలుగు వెలిగిన బౌద్ధస్థూపం ఉన్నట్లు, తరువాత కాలగర్భంలో కలిసిపోయి, ఇక్కడ వీరభద్రస్వామి, కోదండరామస్వామి ఆలయాల నిర్మాణం జరిగినట్లు తెలియుచున్నది. [7]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప పట్టణాలు[మార్చు]

వేటపాలెం 11.6 కి.మీ, నాగులుప్పలపాడు 16.8 కి.మీ, చీరాల 19.4 కి.మీ, ఇంకొల్లు 17.3 కి.మీ.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ గ్రామ పంచాయతీ ఏర్పాటయినప్పటినుండి 1963-64 నుండి 1989 వరకూ, 5 విడతలుగా శ్రీ పండ్రాజు వెంకటరామారావు, మొత్తం 25 సంవత్సరాలు, ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. మొదటి ధరావతు రు. 100-00. ఈయనకు పెద్దలు సంపాదించిన 120 ఎకరాలూ, 1989 నాటికి 50 ఎకరాలకు వచ్చింది. అంతా గ్రామానికి ఖర్చు చేశారు. కృష్ణానగరులో పేదలకు ఎసైన్ మెంట్, సీలింగు భూములు 40 ఎకరాలు, అడవీధిపాలెంలో 20 ఎకరాలు, రుద్రమాంబాపురంలో 70 ఎకరాలు, పేదలకు పంపిణీ చేయించారు. ప్రభుత్వ పాఠశాలలు, పేదలకు ఇళ్ళు, రహదర్ల అభివృద్ధి చేశారు. [4]
  2. 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కొండూరి గోవిందు, 22 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం.

శ్రీ కోదండస్వామివారి ఆలయం.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గామ విశేషాలు[మార్చు]

మోటుపల్లి గ్రామ పంచాయతీ యానాదిసంఘంలో, 2015, ఏప్రిల్-30వతేదీనాడు, సింహవాహనంపై ఉన్న, లోహంతో చేసిన కనకదుర్గమ్మ ప్రతిమ బయటపడినది. [6]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,567 - పురుషుల సంఖ్య 1,820 - స్త్రీల సంఖ్య 1,747 - గృహాల సంఖ్య 1,068

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,838.[4] ఇందులో పురుషుల సంఖ్య 1,433, మహిళల సంఖ్య 1,405, గ్రామంలో నివాస గృహాలు 763 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. Precolonial India in Practice: Society, Region, and Identity in Medieval Andhra By Cynthia Talbot పేజీ.131 [1]
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-10-19. Retrieved 2007-10-17.
  4. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[4] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-11; 8వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-25; 8వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2015, మే-2; 15వపేజీ. [7] ఈనాడు ప్రకాశం; 2015, డిసెంబరు-12; 8వపేజీ.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[2]