పెదగంజాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పెదగంజాం
రెవిన్యూ గ్రామం
పెదగంజాం is located in Andhra Pradesh
పెదగంజాం
పెదగంజాం
నిర్దేశాంకాలు: 15°38′34″N 80°13′57″E / 15.642811°N 80.232425°E / 15.642811; 80.232425Coordinates: 15°38′34″N 80°13′57″E / 15.642811°N 80.232425°E / 15.642811; 80.232425 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంచినగంజాము మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం945 హె. (2,335 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం7,972
 • సాంద్రత840/కి.మీ2 (2,200/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523186 Edit this at Wikidata

పెదగంజాం, ప్రకాశం జిల్లా, చినగంజాము మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 186., ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామ చరిత్ర[మార్చు]

ఇది పురాతన కాలంలో ఒక బౌద్ధ భిక్షువుల ప్రధాన నివాసం. 1871లో అప్పటి జిల్లా కలెక్టర్ బాస్ వెల్ ఇక్కడ బౌద్ధస్థూపాలు ఉన్నట్లు గుర్తించారు. తర్వాత వచ్చిన ఆంగ్లేయ అధికారి అలెగ్జాండర్ రియల్, ఇక్కడ ఉన్న పాటిదిబ్బలపై 1888 లో త్రవ్వకాలు జరపడంతో, ఇక్కడ హీనాయాన బొద్ధమతానికి చెందిన అనేక స్థూపాల ఆనవాళ్ళు, శిల్పాలు దొరికినవి. క్రీ.శ.రెండవ శతాబ్దంలో యఙశ్రీ శాతకర్ణి వేయించిన సంస్కృత శాసనాలు గూడా ఇక్కడ లభ్యమైనవి. [5]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఈ గ్రామాన్ని ఒకప్పుడు గంగాపురం, గంధపురం అని పిలిచేవారు.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

చినగంజాం 5.2 కి.మీ, కనపర్తి 6.8 కి.మీ, తిమ్మసముద్రం 7.2 కి.మీ, రాపర్ల 7.9 కి.మీ, కడవకుదురు 8.9 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

ఒంగోలు 40కి.మీ., చినగంజాం 5.2 కి.మీ, నాగులుప్పలపాడు 14.4 కి.మీ, వేటపాలెం 16.8 కి.మీ, ఇంకొల్లు 21.4 కి.మీ.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కె.కాటాక్షమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [4]

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

పల్లెపాలెంలోని మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామములోని వైద్య సౌకర్యాలు[మార్చు]

గ్రామములోని త్రాగునీటి సౌకర్యాలు[మార్చు]

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

పెదగంజాం గ్రామంలోని ముఖ్యమైన పంటలు వరి, వేరుశనగ, జీడి మామిడి, పుచ్చకాయలు, ఉప్పు లాంటి పంటలు మాపెదగంజాం గ్రామంలో పండుతాయి.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

పెదగంజాం గ్రామంలో ఎక్కువుగా వ్యవసాయ కూలీలు ఉన్నారు అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ భావ నారాయణ స్వామి దేవాలయం[మార్చు]

పెదగంజాంలో ప్రసిద్ధమయినది భావ నారాయణ స్వామి దేవాలయం. ఈ ఆలయ ముఖ మండపం వద్ద నున్న శాసనం ఆధారంగా ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో నిర్మించినట్లు తెలియుచున్నది. అనంతరం శ్రీ కృష్ణదేవరాయల కాలంలో అభివృద్ధి జరిగింది. ఈ ఆలయం రైల్వే స్టేషన్ నుండి 4 కి.మీ. బస్ స్టాండ్ నుండి 6 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ దేవాలయంలో, 2014, మార్చి-8 శనివారం నాడు, స్వామివారి మూల విరాట్టును సూర్యకిరణాలు తాకినవి. సూర్యోదయం సమయంలో, స్వామివారి పాదాల నుండి మోకాళ్ళ వరకూ తాకినవి. ఈ కమనీయ సన్నివేశాన్ని తిలకించి భక్తులు పరవశించారు. ముఖ మంటపానికి సుమారు 100 అడుగుల దూరంలో ఉండే స్వామిని, సూర్యకిరణాలు నేరుగా తాకటం, ఒక గొప్ప అద్భుతమని గ్రామస్థులు తెలిపారు. ఆలయ నిర్మాణం, వాస్తు, ఖగోళ, శిల్పశాస్త్రాల శైలి ఆధారంగా, ప్రతి సంవత్సరం మార్చి, అక్టోబరు నెలలలో, మొదటి రెండు వారాలలో, రెండు సార్లుగా ఉత్తరాయణం, దక్షిణాయన కాలాలలో ఈ విధంగా జరుగుచున్నది. పెదగంజాం సమీప గ్రామ, పట్టణాల భక్తులే గాకుండా, వివిధ ప్రాంతాల భక్తులు ముందుగానే వచ్చి, వేకువ ఝాము నుండి వేచి యుండి, ఈ అపురూప దృశ్యాన్ని తిలకించి తరించారు. మబ్బులు పట్టకుండా ఉంటే, మరో 5 రోజులు సూర్యకిరణాలు స్వామిని తాకుతాయని వేద పండితులు చెబుతున్నారు. [3]

గ్రామ విశేషాలు[మార్చు]

గూడూరు అఖిల[మార్చు]

ఈమె రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారిణి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 7,972 - పురుషుల సంఖ్య 4,056 - స్త్రీల సంఖ్య 3,916 - గృహాల సంఖ్య 2,198;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7,433.[2] ఇందులో పురుషుల సంఖ్య 3,778, మహిళల సంఖ్య 3,655, గ్రామంలో నివాస గృహాలు 1,783 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 945 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]:

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

[3] ఈనాడు ప్రకాశం; 2014,మార్చి-9;8వపేజీ. [4] ఈనాడు ప్రకాశం; 2014,డిసెంబరు-20;2వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2015,డిసెంబరు-12;8వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=పెదగంజాం&oldid=3050633" నుండి వెలికితీశారు