నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జె.పి. చెరువు సమీపంలో నెమలిగుండం జలపాతం

ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జల్లివానిపుల్లలచెరువుకు పడమటి దిక్కున అరు కిలోమీటర్ల దూరంలో వున్న నల్లమల అటవి ప్రాంతంలో నెమిలిగుండల్ల రంగనాయకస్వామి దేవాలయం ఉంది.

గుండ్లకమ్మ గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద ఆవిర్బవించి నల్లమల్ల గిరులలో సుడులు తిరిగి ఉత్తర దిక్కున రెండు కొండలు మధ్య జాలు వారి నెమిలిగుండంలొకి చేరుతుంది.

క్షేత్ర ప్రాముఖ్యత[మార్చు]

నెమలిగుండం జలపాతం సమీపంలో రంగనాధస్వామి ఆలయం గోపురం

నల్లమల్ల అటవి ప్రాంతంలో మయూర మహర్షి ఆశ్రమాన్ని ఎర్పరుచుకొని మహావిష్ణువును ప్రసన్నం చేసుకొడానికి తపస్సు చేస్తూ తదేక దీక్షతొ తన ముక్కుపుటమతో ఒక గుండమును తవ్వి మట్టీని బయటకు తీయడంతొ మరుసటి సూర్యోదయానికి గుండం జలయంగా మారిందని ప్రతీతి. నెమలి ముఖ ఆకారంతో వున్న మహర్షిచే నిర్మితమెనందున నెమిలిగుండం అనే పేరు సార్థకమైనది. దీని చేంతనే మహా విష్ణువు రంగనాయకస్వామిగా వెలయడంతో నెమెలిగుండ్ల రంగనాయకస్వామి క్షేత్రంగా వాసికెక్కింది.

రంగనాయకస్వామి చరిత్ర[మార్చు]

నెమలిగుండాల రంగనాధస్వామి ఆలయంలో కొలువైయున్న స్వామి

నల్లమల్ల కొండలలో ఇసుకగుండమనెచోట చెంచు జాతికి చెందిన భయన్న, బయ్యక్క దంపతులుండేవారు. వారి ఏకైక కుమార్తె పేరు రంగ. పెళ్ళిడు కొచ్చిన రంగ తన కులాచారాన్ని దిక్కరించి, కులపెద్దలతో విభేదించి మహావిష్ణువును పెళ్ళడాలనీ తలంపుతో చెంచుగూడెం వదలి నెమిలిగుండం చేరుకొని తపమాచరిస్తున్న మయార మహర్షికి తన మనోగతాన్ని వెల్లడి చేసింది. మనో భీష్ట సిద్దికోసం మహర్షితో కలసి తపమాచరించిది. ఎట్టకేలకు వారి తపస్సుకు చలించిన విష్ణువు ప్రసంన్నుడై రంగను భార్యగా స్వీవకరించెను. మయార మహర్షి కొరిక మేరకు నెమలిగుండం ప్రక్కనే పడమటి కొండపైన స్వయంభుగా వెలసి భక్తుల పాలిట ఆరాధ్యదైవంగా వేలాధి కుటుంభాల ఇలవెలుపుగా పూజలందుకుంటున్నాడు. భులోకం చేరిన విష్ణువును వెతుక్కుంటు వైకుంఠం నుంచి వచ్చిన లక్ష్మిదేవి రంగసమేతుడైన స్వామిపై కనుక వహంచపూజలు చేయడం ఆనవాయతి. ఈ ప్రదేశాన్ని లక్ష్మణ వనంగా పిలుస్త్తారు. ఏ క్షేత్రంలో కనిపించని ఆరుదయిన పవిత్రత గొప్పదనం నెమిలిగుండ్ల రంగనాయక స్వామికి ఉంది. అంటు, ముట్టులు వున్నవారు ఆలయం వద్దకు వస్తే తేనెటీగలు దాడి చేస్తాయి. గత కొన్ని సంవంత్సరాలుగా ప్రతి ఎటా చైత్ర మాసంలో బహుళ పాడ్యమి, విదియ, తదిమలో మూడు రోజుల పాటు ఉపవాసాలు నిర్వహిస్తారు.