కె.వి.వేమారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కీ.శే.
కె.వి. వేమారెడ్డి
కె.వి. వేమారెడ్డి చిత్రం శాసనసభ రికార్డుల నుండి సేకరించినది
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి
In office
25 November 1971 – 19 March 1972
అంతకు ముందు వారుబి. వి. సుబ్బారెడ్డి
తరువాత వారుపిడతల రంగారెడ్డి
నియోజకవర్గంకదిరి శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
మరణం2 December 1971
జాతీయతభారత దేశం

కె.వి.వేమారెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 1971-1972లో నాలుగవ శాసనసభాపతిగా పనిచేశాడు. ఇతను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఇతను 1955లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున అనంతపురం జిల్లా కదిరి శాసనసభా నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికైనాడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

ఇతను చిత్తూరు జిల్లా మదనపల్లిలోని థియోసాఫికల్ కళాశాలలో విద్యాభ్యాసం చేసాడు. మద్రాసు న్యాయ కళాశాల నుండి ఎల్.ఎల్.బి. పట్టా పొందాక న్యాయవాద వృత్తిని స్వీకరించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చాలా కాలం పనిచేసాడు. అనంతపురం జిల్లా పరిషత్ చెయిర్‌మన్‌గా పనిచేసాడు. ఆపై రాయలసీమ డెవలప్‌మెంట్ బోర్డ్ అధ్యక్షునిగా, సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షునిగా, డిస్ట్రిక్ట్ బోర్డ్ అధ్యక్షునిగా పనిచేసాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఇతను 1952వ సంవత్సరంలో అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం నుండి ఉమ్మడి మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1955లో రెండవ శాసనసభకు, 1967లో నాలుగవ శాసనసభకు కదిరి నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1967-68, 1968-69 సంవత్సరాలలో అనుగత చట్ట నిర్మాణ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసాడు. 1970-71, 1971-72 సంవత్సరాలలో అంచనాల కమిటీ అధ్యక్షునిగా పనిచేసాడు.

శాసనసభాపతిగా

[మార్చు]

1971 డిసెంబరు 2వ తేదీన ఇతను ఇచ్చిన రూలింగ్ ప్రకారం దురుద్దేశ్యంతో, శాసనసభ ప్రతిష్ఠను దిగజార్చాలనే లక్ష్యంతో ఎవరైనా వ్యవహరించినట్లైతే అది సభా ఉల్లంఘన కిందకు వస్తుంది.[1]

మూలాలు

[మార్చు]