రేబాల దశరథరామిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కీ.శే.
రేబాల దశరథరామిరెడ్డి
రేబాల దశరథరామిరెడ్డి చిత్రము
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి
In office
అంతకు ముందు వారుపిడతల రంగారెడ్డి
తరువాత వారుదివికొండయ్య చౌదరి
నియోజకవర్గంఅల్లూరు శాసనసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం
కావలి, నెల్లూరు జిల్లా
మరణం
జాతీయతభారత దేశం

రేబాల దశరథరామి రెడ్డి ఆంధ్రప్రదేశ్ అయిదవ శాసనసభ (1972-1978) సభాపతిగా 1975వ సంవత్సరం జనవరి 28వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికై 1978వ సంవత్సరము మార్చి 14వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగాడు. ఇతని శాసనసభాపతి పదవీ కాలంలో 1976-77 సంవత్సరంలో మొదటి సారిగా అనుసూచిత వర్ణముల సంక్షేమ కమిటి, అనుసూచిత జాతుల సంక్షేమ కమిటి, వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటి, లైబ్రరీ కమిటీలను ఏర్పాటు చేశారు.

తొలి రోజులు[మార్చు]

ఇతను 1907వ సంవత్సరము నవంబరు 30వ తేదీన నెల్లూరు జిల్లా కావలిలో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. డిగ్రీని, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి ఎల్.ఎల్.బి. డిగ్రీని పొంది కొంత కాలం పాటు అడ్వకేటుగా ప్రాక్టీసు చేశాడు. 1947-1951 సంవత్సరాల మధ్య కాలంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశాడు. 1940వ సంవత్సరంలో సత్యాగ్రహంలో పాల్గొన్నందుకుగాను జైలు శిక్ష అనుభవించాడు.

రాజకీయ జీవితం[మార్చు]

దశరథరామి రెడ్డి అనేక పదవులను నిర్వహించాడు. రాష్ట్ర రోడ్డు రవాణా అథారిటీలో అనధికార సభ్యునిగా అయిదు సంవత్సరాలు పనిచేశాడు. ఆల్ ఇండియా కో-ఆపరేటివ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కమిటీ ఉపాధ్యక్షులుగా, మద్రాసు స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులుగా, డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులుగా, ఆంధ్ర స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులుగా, కోస్టల్ ఆంధ్ర ప్లానింగ్ అండ్ డెవలప్యెంట్ కమిటీ అధ్యక్షులుగా పనిచేశాడు. శ్రీ దశరథరామి రెడ్డి 1960 సంవత్సరములో (ఉప ఎన్నిక) మొదటిసారిగా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రెండవ శాసనసభకు ఎన్నికయ్యాడు. తిరిగి 1962వ సంవత్సరము మూడవ శాసనసభకు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం నుండి, 1972వ సంవత్సరము ఐదవ శాసనసభకు అల్లూరు నియోజకవర్గం నుండి ఎన్నికైనాడు. ఇతను 1967-1970 సంవత్సరాల మధ్య కాలంలో కావలి నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యునిగా ఉన్నాడు.[1]

సభాపతిగా[మార్చు]

స్పీకరుగా శ్రీ దశరథరామి రెడ్డి సమర్ధవంతంగా పనిచేశాడు. సభాసమక్షంలో పత్రాలను ఉంచేవారు ఆ పత్రాలను ఏ నిబంధన క్రింద, నియమావళి క్రింద, ఉపనియమావళి క్రింద ఉంచుతున్నారో ధృవీకరించవలసి ఉంటుందని దశరథరామ రెడ్డి 1975, ఫిబ్రవరి 22వ తేదీన ఇచ్చిన రూలింగులో స్పష్టం చేశాడు.

మరణం[మార్చు]

రేబాల దశరథరామి రెడ్డి 2005వ సంవత్సరం జూన్ 9వ తేదీన మరణించాడు.

మూలాలు[మార్చు]