ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా
Appearance
(షెడ్యూల్డు కులం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
షెడ్యూల్డు కులాలు అనగా (ఎస్సీల్లో) చేర్చడానికి రాజ్యాంగం ప్రకారం ఉండవలసిన అర్హత - ‘సాంప్రదాయ అంటరానితనం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా అత్యంత సాంఘిక, ఆర్థిక వెనుకబాటుతనానికి గురికావడం. ప్రసుతం ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాలో 61 కులాలున్నాయి: ఒక్కోకులానికి సంప్రదాయకంగా ఒక్కో వృత్తి ఉంది. ఎస్సీలను బీసీల మాదిరిగానే 4 భాగాలుగా ఎ, బి, సి, డి గ్రూపులుగా విభజిస్తూ 1997 జూన్‌లో ప్రభుత్వ ఉత్తర్వులు నెం. 68, 69లను విడుదలయ్యాయి. మాల మహానాడు సుప్రీం కోర్టులో సవాలు చేయగా, 2004 నవంబరు 5న వర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారంలేదనీ, ఈ చర్య పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదంతోనే సాధ్యమనీ ప్రకటిస్తూ జి.ఒ.ను రద్దు చేసింది.
- ఆది ఆంధ్ర
- ఆది ద్రవిడ
- అనాముక
- అరెమాల
- అరుంధతీయ - తోలుపని
- అరవమాల
- బారికి - గ్రామ కాపరి, బోయీ
- బావురి - బుట్టలతయారీ
- బేడజంగం, బుడగ జంగం
- బైండ్ల - మాదిగల పౌరోహిత్యం, మైసమ్మ మారెమ్మలను మేల్కొల్పటం
- బ్యాగరి, బ్యాగర - కాటికాపరి, నేతపని
- చాచాతి - పండ్లు పూలు అమ్మటం, పాకీపని
- చలవాది - గ్రామకాపరి, డోలువాయించటం
- చమర్, మోచి ముచ్చి, చమర్ రవిదాస్, చమర్ రోహిదాస్ - తోలుపని
- చంభర్ - తోలుపని
- ఛండాల
- డక్కలి, డొక్కలవారు - మాదిగల వంశవృక్షాలు కథాగానం చేయటం, తోలుపని
- దండాసి - గ్రామకాపరి
- ధోర్ - తోలుపని
- దోమ్, దొంబర, పైడి, పానో - నేతపని, సంగీతం, డోలు, గూలకాపరి పని
- ఎల్లమ్మవారు, యెల్లమ్మవాండ్లు
- దూసి, హడ్డి, రెల్లి, చాచండి - పండ్లు పూలు అమ్మటం, పాకీపని
- గొడగాలి, గొడగుల - బుట్టలతయారీ
- గొడారి - తోలుపని
- గోసంగి -పశుసంరక్షణ, వ్యవసాయం, రాజులవద్ద యుద్ద సైనికులు, ప్రస్తుతం గ్రామ సుంకరి
- హొలయ - నేతపని
- హొలేయదాసరి - పౌరోహిత్యం
- జగ్గలి - తోలుపని
- జాంభవులు - తోలుపని
- కొలుపులవాండ్లు, పంబడ, పంబండ, పంబల - సోదె చెప్పటం, నాట్యం, మేళం, ఎల్లమ్మ, ముత్యాలమ్మలను మేల్కొల్పటం
- మదాసికురువ, మదారికురువ - గొర్రెలకాపరులు
- మాదిగ
- మాదిగదాసు, మాదిగమస్తు
- మహర్ - నేతపని
- మాల - ముతక వస్త్రాలు నేతపని, గ్రామకాపరి, వ్యవసాయకూలి,
- మాలదాసరి
- మాలదాసు - పౌరోహిత్యం
- మాలహన్నాయి - దిమ్మర్రులు
- మాలజంగం - పౌరోహిత్యం
- మాలమస్తి - దొమ్మరి విద్య
- మాలసాలె, నేతకాని -నేతపని /ముతక వస్త్రాలు , నీరటి, సుంకరి
- మాలసన్యాసి - భిక్షాటన
- మాంగ్ - పాములు పట్టటం, డోలువాయించటం
- మాంగ్ గరోడి - గేదెలకుక్షౌరం చేయటం, చాపలు తయారీ
- మన్నె - వ్యవసాయకూలి
- మష్తి - ముతక వస్త్రాలు మరియు వ్యవసాయ కూలీలు
- మాతంగి - పాటలుపాడుతూ బిక్షాటన
- మెహ్తార్ - పాకీపని
- మిత్తుల అయ్యవారు - మాల పురోహితులు
- ముండల - నేతపని
- పాకి, మోటి, తోటి
- (ఈ నంబరుగల కులం 2002 లో తొలగించబడింది)
- పామిడి - నేతపని
- పంచమ, పెరయ
- రెల్లి - పండ్లు పూలు అమ్మటం, పాకీపని
- సమగర - తోలుపని
- సంబాస్ - బొందలు తవ్వటం, రండోలువాయించటం
- సప్ర - పండ్లు పూలు అమ్మటం, పాకీపని
- సిందోళ్ళు, చిందోళ్ళు - నాటకాలు, నాట్యం
- యాతాట
- వల్లువన్