Jump to content

పంబల వారు

వికీపీడియా నుండి
(పంబల నుండి దారిమార్పు చెందింది)

పంబల ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా ఏ గ్రూపు లోని 21వ కులము.

పొమ్మల జోడు. వాయిద్య పరికరము/దామలచెరువు గ్రామం సమీపాన మొరవపల్లిలో తీసిన చిత్రము
ఒక గ్రామ దేవత పూజకు సంబంధించిన ఊరేగింపులో పొమ్మలు వాయిస్తున్న దృశ్యము.చిత్తూరు జిల్లా..... మొగరాలలో తీసిన చిత్రము
సర్కారు ఆంధ్ర ప్రాంతంలో ఒకప్పుడు విరివిగా జరిగే దేవతల కొలువుల్లోనూ, జాతర్ల లోనూ పంబల వారి కథలు ఎక్కువగా జరుగుతూ వుండేవి. ఈ నాటికీ గ్రామ దేవతలను కొలిచే ప్రతి చోటా ఈ కథలు జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ కథలు కనుమరుగు ఔతున్నాయి. ప్రస్తుతము చిత్తూరు జిల్లాలో గ్రామ దేవతల పూజలలో ఈ వాయిద్యాన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇంటి వారు పూజకు ఇంటినుండి బయలు దేరి నప్పటినుండి దేవాలయము వరకు ముందు పంబల వారు పంబల వాయిస్తూ ముందు నడవాల్సిందే. (మొగరాల గ్రామంలో తీసిన చిత్రము చూడుము) ఈ వాయిద్యము వీరావేశాన్ని రేకెత్తిస్తుంది. ఈ సందర్భంగా కొందరికి పూనకం రావడం కూడా జరుగుతుంది.

పంబల వారు అయ్యగారి దర్శనానికి చెందిన హరిజనులనీ, వీరి వాయిద్యం పంబ జోడనీ, వీరు ఎక్కువగా అంకమ్మ కథలను పాదుతారనీ, వీరు కొలిచే అంకమ్మకు, మురాసపు అంకమ్మ అని పేరనీ వంతలు పంబ జోడును వాయిస్తూ శ్రుతి కి తిత్తి ఊదుతూ వుంటే కథకుడు రాజ కుమారునిలా వేషాన్ని ధరించి కుడి చేతితో పెద్ద కత్తినీ, ఏడమ చేతితో అమజాల అనే చిన్న కత్తిని పట్టుకుని వీరా వేశంతో చిందులు తొక్కుతూ కథను పాడుతారనీ, డా: తంగిరాల వెంకట సుబ్బారావు గారు జానపద కళోత్సవాల సంచికలో వివరించారు.

పంబల వాయిద్యము జంటగా వుంటాయి. ఇవి తప్పనిసరిగా ఇత్తడి లోహంతో చేసినవై వుంటాయి. వీటిని వాయించడానికి రెండు పుల్లలు అవసరము. వీటి శబ్ధము మధురముగా వుండదు గాని వీరావేశాన్ని రేకెత్తించే విధముగా వుంటుంది. ఈ వాయిద్యము సంగీత కచ్చేరీలలో వాడరు. కేవలము పూజా సమయములలో, కర్మకాండల సమయంలలో మాత్రమే ఉపయోగిస్తారు.

కులచరిత్ర

[మార్చు]

గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు కురవకపోయినా, రోగాలొచ్చినా గ్రామ దేవతలను ప్రసన్నులను చేసుకోవడానికి కొలిచే కొలుపుల్లో ‘పంబల’ కులస్తులు వాయిద్యాలు వాయించేవారు.రాత్రి సమయంలో పంబలవారు వాయిద్యాలను వాయిస్తూ కథలు చెప్పేవారు. పంబలవారు సర్కారు జిల్లాల్లో ఎక్కువగా అంకమ్మ కథలను పాటల రూపంలో వినిపించేవారు. రాగాలుతీస్తూ శ్రావ్యంగా కథలు వినిపించేవారు. వీరు కొలిచే అంకమ్మ దేవతను ‘మరాసపు అంకమ్మ’ అని చెప్పుకుంటారు. ఇందులో ప్రధాన కథకుడు రాజకుమారుని వేషం ధరిస్తాడు.కత్తులతో విన్యాసాలు కూడా చేస్తాడు. కుడి చేతిలో పెద్ద కత్తి, ఎడమచేతిలో అమజాల అనే చిరు కత్తిని పట్టుకుని వీరావేశం ప్రదర్శిస్తాడు.కథను రక్తి కట్టిస్తాడు.ప్రక్కనే ఉన్న వంతలవాళ్లు పంబజోడును వాయిస్తూ, శృతికి తిత్తిని ఊదుతూ సహకరిస్తారు.పంబలవాళ్ల వాయిద్యాలు లేకుండా ఆరోజుల్లో జాతరలు ముగిసేవికావు.ఉత్సవ విగ్రహాల ఊరేగింపుల్లో కూడా వీరు తమ వాయిద్యాలతో పాల్గొని తమ ప్రత్యేకతను చాటుకునేవారు.మాల లకు వీరు పూజారులు. పెద్ద కర్మ తదితర అంత్యక్రియల కార్యక్రమాలలో కూడా వీరే నిర్వహించేవారు. ఆర్థికంగా ఎదుగుదల లేకపోవడం, నమ్ముకున్న కళ దెబ్బతినడం, ఆది నుండి గ్రామాలనే నమ్ముకుని జీవిస్తున్న వీరు బతుకుదెరువు కోసం పట్టణాలకు పలసలుపట్టి ప్లాస్టిక్‌షీట్లతో టెంట్లు వేసుకుని జీవిస్తూ అడ్డాల దగ్గర నిలబడే కూలీలయ్యారు.

సూచికలు

[మార్చు]

మూలాలజాబితా

[మార్చు]
  • తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.

యితర లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పంబల_వారు&oldid=3226403" నుండి వెలికితీశారు