ఇత్తడి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Aఇత్తడి పేపర్ వెయిట్ లేదా ఆటలకు వాడు గుండు మరియు జింక్, కాపర్ యొక్క సాంపిల్స్

ఇత్తడి (Brass) ఒక మిశ్రమ లోహము. దీనిలో ముఖ్యంగా రాగి మరియు జింకు ఉంటాయి. ఇత్తడి లోహమును ముద్దలుగా మార్చి దానినుండి పలుచటి రేకులుగా మార్చి తదుపరి వస్తువుల తయారీ కొరకు ఉపయోగిస్తారు. ఇత్తడి వాడుకలో భారతదేశము మరియు ఆసియా దేశాలు ముందున్నాయి. ఈ దేశాలలో నిత్యము వాడు వస్తువులతో పాటుగా దేవాలయాలలో దీని వినియోగం అధికం

తయారు కాబడి ఉన్న వివిద రకాల ఇత్తడి (ఇస్త్రీ పెట్టెలు, పళ్లెములు, పూజా బల్లలు, అలంకరణ సామగ్రి) వస్తువులు

ఇత్తడి వస్తువుల తయారీ[మార్చు]

వస్తువుల తాయారీ కొరకు ఇత్తడి రేకులను కాల్చి సుత్తులతో మోదుతూ వెదలుచేసుకుంటూ కావలసిన ఆకారానికి మార్చి వాటిని అతికించి ఫాలీష్ చేసి అమ్ముతారు.

 • పెళ్ళి మరియు శుభకార్యక్రమములకు తప్పని సరిగా ఇత్తడి బిందెలు, పళ్ళెము పెట్టడం మన సాంప్రదాయముగా వస్తున్నది.
 • బట్టల చలువచేయుటకు వాడు ఇస్త్రీ పెట్టెలు ఇత్తడి వాడుతారు.
 • ఆస్తి పరుల ఇళ్ళలో అలంకార సామగ్రి, వస్తు సముదాయాలు,
 • పరిశ్రమలలో యంత్ర పరికరాల తయారీ,
రకరకాలైన ఇత్తడి బిందెలు

నిత్యావసర వస్తువులు, తయారీ[మార్చు]

 • ఆహార పాత్రలు, గ్లాసులు, పళ్ళెములు ఇతర వంట పాత్రలు.
 • పూజా పాత్రలు, పూజా సంభంద ఇతర వస్తువులు.
 • దేవుడి ప్రతిమలు, మండపములు


దేవాలయాలలో[మార్చు]

 • చర్చ్ కొరకు తప్పని సరిగా ఉండే బెల్ కొరకు ఇత్తడి వాడుతరు
 • దేవాలయాల ద్వారముల మొదలు శిఖరాల వరకూ ఇత్తడి వినియోగం జరుగుతున్నది.
 • ప్రతి దేవాలయములో ధ్వజస్థంభము ఉండును. వాటికి వాడు ప్రధాన లోహము ఇత్తడి.

ఇతర విశేషాలు[మార్చు]

 • ఇత్తడి వస్తువుల తాయారీలో మన రాష్ట్రములోని అజ్జరం గ్రామం ప్రసిద్ది చెందినది. ఇక్కడ అనేక ఇత్తడి, కంచు, రాగి వస్తువుల తాయారీ పరిశ్రమలు కలవు."http://te.wikipedia.org/w/index.php?title=ఇత్తడి&oldid=1167954" నుండి వెలికితీశారు