రాగి

వికీపీడియా నుండి
(కాపర్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రాగి
29Cu
హైడ్రోజన్ (diatomic nonmetal)
హీలియం (noble gas)
లిథియం (alkali metal)
బెరీలియం (alkaline earth metal)
బోరాన్ (metalloid)
కార్బన్ (polyatomic nonmetal)
నైట్రోజన్ (diatomic nonmetal)
ఆక్సిజన్ (diatomic nonmetal)
ఫ్లోరిన్ (diatomic nonmetal)
నియాన్ (noble gas)
సోడియం (alkali metal)
మెగ్నీషియం (alkaline earth metal)
అల్యూమినియం (poor metal)
సిలికాన్ (metalloid)
పాస్పరస్ (polyatomic nonmetal)
సల్ఫర్ (polyatomic nonmetal)
క్లోరిన్ (diatomic nonmetal)
ఆర్గాన్ (noble gas)
పొటాషియం (alkali metal)
కాల్షియం (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (poor metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (poor metal)
Tin (poor metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanoid)
Cerium (lanthanoid)
Praseodymium (lanthanoid)
Neodymium (lanthanoid)
Promethium (lanthanoid)
Samarium (lanthanoid)
Europium (lanthanoid)
Gadolinium (lanthanoid)
Terbium (lanthanoid)
Dysprosium (lanthanoid)
Holmium (lanthanoid)
Erbium (lanthanoid)
Thulium (lanthanoid)
Ytterbium (lanthanoid)
Lutetium (lanthanoid)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (poor metal)
Lead (poor metal)
Bismuth (poor metal)
Polonium (poor metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinoid)
Thorium (actinoid)
Protactinium (actinoid)
Uranium (actinoid)
Neptunium (actinoid)
Plutonium (actinoid)
Americium (actinoid)
Curium (actinoid)
Berkelium (actinoid)
Californium (actinoid)
Einsteinium (actinoid)
Fermium (actinoid)
Mendelevium (actinoid)
Nobelium (actinoid)
Lawrencium (actinoid)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (unknown chemical properties)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
-

Cu

Ag
నికెల్రాగిజింక్
ఆవర్తన పట్టిక లో రాగి స్థానం
రూపం
red-orange metallic luster

Native copper (~4 cm in size)
సాధారణ ధర్మములు
మూలకం పేరు, రసాయన సంకేతం, పరమాణు సంఖ్య రాగి, Cu, 29
ఉచ్ఛారణ /ˈkɒpər/ KOP-ər
మూలక వర్గం పరివర్తన లోహం
గ్రూపు, పీరియడ్, బ్లాకు group 11, 4, d
ప్రామాణిక పరమాణు భారం 63.546(3)
ఎలక్ట్రాన్ విన్యాసం [Ar] 3d10 4s1
2, 8, 18, 1
చరిత్ర
నామకరణం after Cyprus, principal mining place in Roman era (Cyprium)
ఆవిష్కరణ Middle Easterns (9000 BC)
భౌతిక ధర్మములు
పదార్థ స్థితి solid
సాంద్రత (near r.t.) 8.96 g·cm−3
ద్రవీభవన స్థానం వద్ద ద్రవరూప సాంద్రత 8.02 g·cm−3
ద్రవీభవన స్థానం 1357.77 K, 1084.62 °C, 1984.32 °F
మరుగు స్థానం 2835 K, 2562 °C, 4643 °F
సంలీనం యొక్క ఉష్ణం 13.26 kJ·mol−1
బాష్పీభవనోష్ణం 300.4 kJ·mol−1
మోలార్ హీట్ కెపాసిటీ 24.440 J·mol−1·K−1
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1509 1661 1850 2089 2404 2834
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు +1, +2, +3, +4
(mildly basic oxide)
ఋణవిద్యుదాత్మకత 1.90 (Pauling scale)
అయనీకరణ శక్మములు
(మరిన్ని)
1st: 745.5 kJ·mol−1
2nd: 1957.9 kJ·mol−1
3rd: 3555 kJ·mol−1
పరమాణు వ్యాసార్థం 128 pm
సమయోజనీయ వ్యాసార్థం 132±4 pm
వాండర్ వాల్ వ్యాసార్థం 140 pm
వివిధ విషయాలు
స్ఫటిక నిర్మాణము face-centered cubic
రాగి has a face-centered cubic crystal structure
అయస్కాంత పదార్థ రకం diamagnetic[1]
విద్యున్నిరోధకత్వం మరియు వాహకత్వం (20 °C) 16.78 nΩ·m
ఉష్ణ వాహకత్వం 401 W·m−1·K−1
ఉష్ణ వ్యాకోచం (25 °C) 16.5 µm·m−1·K−1
ధ్వని వేగం (సన్నని కడ్డీ) (r.t.) (annealed)
3810 m·s−1
యంగ్ గుణకం 110–128 GPa
షీర్ మాడ్యూల్ 48 GPa
బల్క్ మాడ్యూల్స్ 140 GPa
పోయిస్సన్ నిష్పత్తి 0.34
Mohs ధృఢత 3.0
వికెర్స్ దృఢత 369 MPa
బ్రినెల్ దృఢత 35 HB = 874 MPa
సి.ఎ.యస్ రిజిస్ట్రీ సంఖ్య 7440-50-8
అతి స్థిరమైన ఐసోటోపులు
ప్రధానవ్యాసం: రాగి యొక్క ఐసోటోపులు
iso NA అర్థజీవితకాలం DM DE (MeV) DP
63Cu 69.15% Cu, 34 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
64Cu syn 12.700 h ε - 64Ni
β - 64Zn
65Cu 30.85% Cu, 36 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
67Cu syn 61.83 h β - 67Zn
· సూచికలు

రాగి (Copper) ఒక రసాయనిక మూలకము. రాగిని తామ్రం అనికూడా పిలుస్తారు. దీని అణు సంఖ్య 29. సంకేత అక్షరం Cu (లాటిన్లో రాగిని Cuprum అంటారు. ఇది ఒక లోహం. సాగకొట్టిన సన్నని తీగెలుగా సాగుతుంది. అలాగే పలుచని రేకులుగా సాగుతుంది. రాగి మంచి ఉష్ణవాహకం మరియు విద్యుత్తు వాహకం కూడా. కల్తీ లేని స్వచ్ఛమైన రాగి మృదువుగా ఉండి సులభంగా సాగే గుణం ప్రదర్సించును. రాగి ఎరుపునారింజ రంగుల మిశ్రమ రంగును కలిగి ఉండును. మానవుడు మొదటగా ఉత్పత్తిచేసి, ఉపయోగించిన లోహం రాగి[2].రాగిని ఉష్ణ మరియు విద్యుత్తు వాహకాల తయారిలోవిరివిగా వినియోగిస్తారు. అంతే కాదు గృహ వంటపాత్రలను తయారు చేయుటకు, మరియు గృహ ఉపకరములను చేయుట యందును వాడెదరు. రాగియొక్క మిశ్రమ లోహాలను ఉపయోగించి అనేక వస్తు వులను తయారు చేయుదురు. క్రీ.పూ.8000 వేల సంవత్సరాల నాటికే రాగి నుండి నాణెములను, ఆభరణము తయారు చెయ్యడం మానవునికి తెలుసు. క్రీ.పూ 5500 సంవత్సరాల సమయంలో మానవుడు రాతియుగంలో వాడే రాతి పనుముట్లకు బదులుగా రాగితోను దాని యొక్క మిశ్రమ లోహాలతోను ఆయుధాలను, పనిముట్లను తయారుచేసి వాడటము ప్రారంభించటం వలన నాటిమానవుని నాగరీకతలో మార్పులు చోటు చేసుకున్నవి[3]

రాగిని, రాగియొక్క మిశ్రమ లోహాలను కొన్ని వేల ఏండ్లుగా రోమనుల కాలంలో ఉపయోగించినట్లు ఆధారాలున్నాయి. మొదట్లో ఈ లోహం యొక్క ముడి ఖనిజాన్ని సైప్రస్ ప్రాంత పు గనులనుండి త్రవ్వి తీయడం వలన ఈ లోహాన్ని మొదట సిప్రియం (сyprium ) అని పిలిచేవారు. అనగా సైప్రసులో లభించు లోహం అని అర్థం. ఆ పేరే కాలక్రమేనా కుప్రసుగా మారింది[4]. రాగి యొక్క లవణములు నీలి లేదా ఆకుపచ్చ రంగును కలిగియుండి, రంగులుగా ఉపయోగించే వారని తెలియ వచ్చుచున్నది .

రాగి నీటితో రసాయనిక చర్య జరుపకున్నను, గాలోలోని ఆమ్లజని (ఆక్సిజను) తో నెమ్మదిగా చర్య జరపడం వలన ఏర్పడిన కాపర్ సల్పైడ్, లోహం ఉపరితలం పైన, బ్రౌను-నలుపు రంగులో పూత వలె ఏర్పడును. ఈ పూత లోహం యొక్క ఉపరితలానికి రక్షణ పూత వలె పనిచేయును .అందువలన లోహాన్ని గాలిలోని ఆక్సిజనుతో చర్య జరిపి మరింతగా క్షయికరణ చెందకుండా రక్షణ ఒసగును. రాగి దాదాపుగా 10 వేల ఏండ్ల నుండి వాడుకలో ఉన్నట్లుగా తెలుస్తున్నప్పటికీ, క్రి. శ.19 వ శతాబ్ది నుండి అధిక పరిమాణంలో ఉత్పత్తి చెయ్యడం మొదలైనది. ప్రసుత్తం ఉన్న రాగి నిల్వలలో 50% రాగిని కేవలం గత 25 సంవత్సరాలలో గనుల నుండి వెలికి తియ్యడం జరిగింది. అనగా ఈ మధ్య కాలంలో రాగి వాడకం ఎంతగా పెరిగినది తెలియుచున్నది.

రాగియొక్క భౌతిక గుణగణాలు[మార్చు]

ఆవర్తన పట్టికలో రాగి 11 సమూహము (గ్రూప్ ) నకు చెందిన మూలకం. వెండి మరియు బంగారు లోహాలు కూడా 11 గ్రూప్ నకు చెందిన మూలకములు. అందువలన ఈ మూడు మూలకములు కొన్ని ఉమ్మడి లక్షణాలు ప్రదర్శించును. ఆ మూడు మూలకములు మంచి విద్యుత్తు మరియు ఉష్ణ వాహకంలు. అంతేకాదు వీటిని అతిపలుచని సన్నని తీగెలు, రేకులుగా అతిసులభంగా మార్చవచ్చును. ఈ మూడు మూలకాల పరమాణు నిర్మాణంలో D-ఆర్బిటాల్ (వలయం) పూర్తిగా ఎలక్ట్రానికులను కలిగి, దాని వెలుపల S ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కలిగి ఉండునును. రాగికున్న మృదుత్వతత్వము ఈ మూలకం యొక్క ఉత్తమ విద్యుత్తు మరియు ఉష్ణ వాహకతత్వము నకు కారణం. స్వచ్ఛ మైన రాగి మూలకం యొక్క విద్యుత్తు వాహక గుణ విలువ (59.6×106 S/m). రాగి 29 ఐసోటోపులను కలిగి యున్నది. అందులో 63CU మరియు 65CU ఐసోటోపులు స్థిరమైనవి.

63CU అను ఐసోటోపు సహాజంగా లభించు రాగి ఖనిజములో 69% వరకు ఉండు ను. రాగి యొక్క పైన చెప్పిన రెండు ఐసోటోపులు మినహాయించి మిగిలిన రాగి యొక్క ఐసోటోపులు అణుధార్మిక గుణమును ప్రదర్శించును.

రాగియొక్క భౌతిక గుణగణాల పట్టిక [5]

స్వభావము విలువ భౌతిక లక్షణము విలువ
గ్రూప్ 11 ద్రవీభవన ఉష్ణోగ్రత0C 1084.620C
పెరియడ్ 4 మరుగు ఉష్ణోగ్రత0C 25600C
బ్లాక్ D సాంద్రత గ్రాం−3 8.96
అణుసంఖ్య 29 రెలెటివ్ అణుభారం 63.546
భౌతిక స్థితి,200C ఘనస్థితి కీ ఐసోటోఫు 63CU

లభ్యత[మార్చు]

భూమి యొక్క పొరలలో రాగి దానియొక్క లవణాల రూపంలో లభ్యం .ముఖ్యంగా కాపర్ సల్పైడ్ రూపంలో లభిస్తున్నది. chalcopyrite మరియు chalcocite అనునవి రాగి యొక్క సల్పైడు రూపాలు. అలాగే azurite మరియు malachite, అనునవి రాగి యొక్క కార్బోనేట్ రూపాలు. రాగియొక్క అక్సైడులు copper (I) oxide మరియు cuprite. అనునవి. భూమి యొక్క మట్టి పొరలలో రాగి 50 ppm గాఢతలో లభించును .1857 లో కేవిన్వా పెనిన్సుల (Keweenaw Peninsula) లోని మిషిగన్ ( Michigan) లో 420 టన్నుల ప్రాథమిక మూలక స్థాయి రాగిని గుర్తించి వెలికి తియ్యడం జరిగింది. రాగిని అత్యధికంగా కాపర్ సల్పైడ్ రూపంలో తెరచియున్న (బయలు) గనులనుండి (open pit mines) త్రవ్వి వెలికి తియ్యడం జరుగుతుంది. రాగి యొక్క ముడి ఖనిజం మెక్సికో, చిలే, ఇండోనేషియా, పెరు, దేశాలలో అత్యధిక ప్రమాణంలో లభ్యం. వర్తమానంలో రాగియొక్క వాడకం గణనీయంగా పెరుగుచున్నది.

ఉత్పత్తి[మార్చు]

ఖనిజంలో రాగి 0 .6%.గనులలో లభించు ముడి ఖనిజం ఇనుమును మలినంగా కలిగిన చాల్కొపైరేట్ (CuFeS2) గా లభించును. తక్కువ పరిమాణంలో chalcocite చాల్కొసిట్ (Cu2S) రూపంలో లభ్యం.

రాగియొక్క మిశ్రమ లోహాలు[మార్చు]

రాగిని మూల లేదా ఆధార లోహాంగా, దానిలో జింకు/యశదము, తగరం, సీసం, వెండి, బంగారం, అల్యూమినియం మరియు నికెలు వంటి లోహాలను వివిధ నిష్పత్తిలో కలిపి రాగి యొక్క మిశ్రమ లోహాలను తయారు చేయుదురు. ఇత్తడి, కంచు, గన్‌మెటల్ అనునవి రాగియొక్క మిశ్రమలోహాలు. మిశ్రధాతువు లేదా మిశ్ర లోహం అనగా ఒక ప్రధాన లోహాంలో ఇంకొకటి లేదా ఒకటి కంటే ఎక్కువ లోహాలను వివిధ ప్రమాణంలో కలిపి సమ్మేళనం చేసి తయారు చేసిన ధాతుసమ్మేళన పదార్థము.

ఇత్తడి[మార్చు]

రాగి మరియు జింకు/యశదం లోహాలను మిశ్రం చేసి బట్టి పెట్టి రెండింటిని ద్రవీకరించి సమ్మేళనము చెయ్యడం వలన ఈ రెండింటి మిశ్రమ ధాతువు ఇత్తడి ఏర్పడుతుంది. ఇత్తడిలో జింకు శాతం 37 నుండి 45 % వరకు ఉంటుంది<[6].ఇత్తడికి కొంచెం దృఢత్వం, మరియు సులభంగా తరణి పట్టునట్టు చేయుటకై సీసాన్ని స్వల్ప ప్రమాణంలో కలుపుతారు. రాగిలో 37 % వరకు జింకును కలిపినప్పుడు ఒకే దశలో చేత/దుక్క విధానంలో చేయుదురు. ఒకేదశలో పోత పోసిన లోహానికి పలకలుగా సాగేగుణం అధికంగా ఉంటుంది. రాగిలో 37 % కన్న ఎక్కువ ప్రమాణంలో జింకును కలిపి తయారు చేయవలసిన దానిని రెండంచల పద్ధతిలోచేయుదురు. రెండంచల విధానంలో ఉత్పత్తి చేసిన ఇత్తడికి దృఢత్వం ఎక్కువ ఉంటుంది, కాని సాగే గుణం తక్కువ. రెండంచల పద్ధతిలో ఇత్తడిని పోత విధానము (cast ing) పద్ధతిలో తయారు చేయుదురు.

ఇత్తడిని గృహ నిర్మాణ అవసరాలకు వాడెదరు. పాత్రలను పాత్ర భాగాలను తయారు చేయుటకు వాడెదరు. తలుపు గడియలు, ప్లగ్గులు, విద్యుత్ ఉపకరణాలు, తాళాలు, పంపులకు లోపలి భాగాలు, బోల్టులు, నట్టులు, ల్యాంప్ ఫిట్టింగులు, రేడియేటర్ అంతర్భాగాలు చేయుటకు ఉపయోగిస్తారు. సాధారణంగా ఇత్తడిని రెండు రకాలుగా విభజింప/వర్గికరించ వచ్చును[7].

  • అల్పా మిశ్రమ ధాతువు. ఇందులో 37% కన్న తక్కువగా జింకును కలుపుతారు. ఈ రకం మిశ్రమ ధాతువు సాగే గుణం కలిగి ఉండును.
  • బీటా లేదా డుప్లెక్షు మిశ్రమ ధాతువు, ఇందులో జింకు శాతం 37 -45 మధ్యలో కలుపబడి ఉండును. వీటికి దృఢత్వం ఎక్కువ వుంది, రేకుగా సాగు లక్షణం తక్కువగా ఉండును.

రాట్ (దుక్క) పద్ధతిలో చేసిన ఇత్తడిని 3 వర్గాలుగా వర్గించవచ్చును.

  • రాగి-జింకు మిశ్రమం
  • రాగి-జింకు-తగరం మిశ్రమం
  • రాగి-జింకు-సీసం మిశ్రమం

పోత విధానం (casting ) లో ఉత్పత్తి చేసిన ఇత్తడిని స్తూలంగా 4 రకాలుగా వర్గీకరించవచ్చును.

  • రాగి-తగరము-జింకుల మిశ్రమ ధాతువు (ఎరుపు, మధ్యస్త ఎరుపు, పసుపు రంగు ఇత్తడి .
  • మాంగనీసు- కంచుల ధాతువు.ఎక్కువ దృఢంగా ఉండి, పసుపు వర్ణంలో ఉండును
  • రాగి-జింకు –సిలికానులమిశ్రమ లోహం .వీటిని సిలికాన్ ఇత్తడిలేదా కంచు అంటారు.
  • రాగి –బిస్మతుల మిశ్రమ లోహం లేదా రాగి –బిస్మతు-సేలియం ల మిశ్రమ లోహం

రాగిలో జింకులో వివిధ నిష్పత్తిలో కలుపగా ఏర్పడిన ఇత్తడిమిశ్రమ ధాతువుకు వాడుకలో వివిధ పేర్లుకలవు.అలా వివిధ వాడుక పేర్లు ఉన్న కొన్ని ఇత్తడి మిశ్రమ ధాతువులు వాటిలో కలుపబడిన జింకు లేదా ఇతర లోహాల నిష్పత్తి పట్టికను దిగువన ఇవ్వడమైనది[8] .

వాడుకపేరు మిశ్రమ నిష్పత్తి
పసుపురంగు ఇత్తడి 33 %జింకు ఉన్నమిశ్రమ ధాతువు (అమెరికాలో )
తెల్ల ఇత్తడి 50 % మించి జింకు కలుపబడింది.పెళుసుగా వుండును.
రాగి +జింకు+తగరం మరియు రాగి+నికెల్ మిశ్రమ ధాతువును కూడా తెల్ల ఇత్తడి అంటారు
ఎర్ర ఇత్తడి ఇందులో రాగి 8 5 %, తగరం 5 %, సీసం 5 %, మరియు జింకు 5% కలుపబడి ఉండును
నికెల్ ఇత్తడి రాగి 70 %, +జింకు 24 .5 %+5.5%నికెల్, నాణెములతయారిలో వాడెదరు.
TOM BAC ఇత్తడి 15 % జింకు కలుపబడి ఉండును .ఆభరణాల తయారీలో వాడెదరు .
నోర్డిక్ గోల్డ్ రాగి 8 9%, జింకు 5 %, అల్యూమినియం 5%, తగరం 1%, యూరో నాణేల తయారీలో
ఉపయోగిస్తారు.
నావల్ ఇత్తడి ఇందులో 40 % జింకు,1 % తగరం, మిగిలినది రాగి
మాంగనీస్ ఇత్తడి రాగి 70, జింకు 29 % వరకు, మాంగనీస్ 1.3 % వరకు మిశ్రమం చెయ్యబడి ఉండును.
అల్ఫా ఇత్తడి 35 % కన్న తక్కువ నిష్పత్తిలో జింకు కలుపబడి ఉండును.
సాధారణ ఇత్తడి 37 % జింకు కలుపబడి ఉండును, దీనిని రివెట్ ఇత్తడి అనికూడా అంటారు .
గిల్దింగు లోహం 95 % రాగి,5 % జింకు కలిగిన మిశ్రమ ధాతువు
మందు గుండుల వెలుపలి కవచాలు తయారు చేయుదురు.
cartrige ఇత్తడి 30% జింకు కలుపబడి ఉంది.

కంచు[మార్చు]

కంచును రాగి మరియు తగరాన్ని సమ్మేళనము చేసి తయారు చేయుదురు. కంచులో రాగి దాపుగా 88.0%, తగరాన్ని 12.0% వరకు ఉండును[9].అయితే ఈ రెండు లోహాలతో పాటుగా కొద్ది ప్రమాణంలో భాస్వరం, అల్యూమినియం, సిలికాన్, మాంగనీస్, మరియు నికెల్ లోహాలలో ఏదో ఒకలోహాన్ని కుడా మిళితం చేయుదురు.ఈ రకపు మిశ్రమ లోహాలు ఎక్కువ దృఢత్వం కలిగిఉండి, క్షయీకరణను తట్టుకొను క్షయీకరణ నిరోధ గుణం, స్వభావం కలిగి ఉండును. ఈ రకపు మిశ్రమ లోహాలను స్ప్రింగులు, మూస అచ్చులు, బెరింగులు, జోర్నల్ బుషులు, గ్రుహోపకారణాలు చేయుటకు, అలంకరణ వస్తువులు, విగ్రహాలను పోతపోయుటకు వాడెదరు.

  • ఫాస్పరస్ బ్రాంజ్‌ :ఈ మిశ్రమధాతువులో రాగి, తగరములతో పాటు 0.05-0.35% వరకు భాస్వరము కలుపబడి ఉండును.మిశ్రమలోహంలో తగరాన్ని అవసరాన్ని బట్టి 05-11.0% వరకు కలిపెలెదరు[10]

ఉపయోగాలు[మార్చు]

రాగి ఉత్తమ విద్యుత్తు వాహకం కావడం వలన రాగిని ఎక్కువగా విద్యుత్తు పరికరాలలో (మోటర్లు, కూలర్లు, ఫ్రీజ్‌లు, విద్యుత్తు ట్రాన్సుఫారాలు తదితరాలు) తీగెలరూపంలో వాడెదరు.అలాగే విద్యుత్తుప్రవాహ తీగెలనిర్మాణంలో వాడెదరు.అల్యూమినియం తరువాత తీగెల నిర్మాణంలో అధికంగా వాడబడులోహం రాగి.రాగిని భవన నిర్మాణంలో పిడుగు/మెరుపు నిర్మాణ పరికరాన్ని రాగితోనే చేయుదురు.రాగి వాటరుప్రూప్ కనుక భవన నిర్మాణంలో పైకప్పునిర్మణంలో వాడెదరు[11].

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రాగి&oldid=2328788" నుండి వెలికితీశారు