Jump to content

బెరీలియం

వికీపీడియా నుండి
(Beryllium నుండి దారిమార్పు చెందింది)
బెరీలియం, 00Be
బెరీలియం
Pronunciation/bəˈrɪliəm/ (-RIL-ee-əm)
Appearancewhite-gray metallic
Standard atomic weight Ar°(Be)
బెరీలియం in the periodic table
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
-

Be

Mg
లిథియంబెరీలియంబోరాన్
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 2
Block  s-block
Electron configuration[He] 2s2
Electrons per shell2, 2
Physical properties
Phase at STPsolid
Melting point1560 K ​(1287 °C, ​2349 °F)
Boiling point2741 K ​(2468 °C, ​4474 °F)
Density (near r.t.)1.85 g/cm3
when liquid (at m.p.)1.690 g/cm3
Critical point(extrapolated)
5205 K,  MPa
Heat of fusion12.2 kJ/mol
Heat of vaporization297 kJ/mol
Molar heat capacity16.443 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1462 1608 1791 2023 2327 2742
Atomic properties
Oxidation states0,[3] +1,[4] +2 (an amphoteric oxide)
ElectronegativityPauling scale: 1.57
Ionization energies
Atomic radiusempirical: 112 pm
Covalent radius96±3 pm
Van der Waals radius153 pm
Color lines in a spectral range
Spectral lines of బెరీలియం
Other properties
Natural occurrenceprimordial
Crystal structurehexagonal close-packed (hcp)
Hexagonal close packed crystal structure for బెరీలియం
Speed of sound thin rod12890[5] m/s (at r.t.)
Thermal expansion11.3 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity200 W/(m⋅K)
Electrical resistivity36 n Ω⋅m (at 20 °C)
Magnetic orderingdiamagnetic
Young's modulus287 GPa
Shear modulus132 GPa
Bulk modulus130 GPa
Poisson ratio0.032
Mohs hardness5.5
Vickers hardness1670 MPa
Brinell hardness600 MPa
CAS Number7440-41-7
History
DiscoveryLouis Nicolas Vauquelin (1797)
First isolationFriedrich Wöhler & Antoine Bussy (1828)
Isotopes of బెరీలియం
Template:infobox బెరీలియం isotopes does not exist
 Category: బెరీలియం
| references
బెరీలియం ఖనిజం
మరకతం/పచ్చ
Friedrich Wöhler Stich
Louis Nicolas Vauquelin

మౌలిక సమాచారము

[మార్చు]

బెరిలీయం ఒక రసాయనిక మూలకము.మూలకాల ఆవర్తన పట్టికలో 2 వ సముదాయము, S బ్లాకు, 2 వ పెరియడుకు చెందిన మూలకం.సంకేత అక్షరం Be. ఇది క్షారమృత్తిక లోహాల సమూహానికి చెందిన మూలకం. దీని యొక్క పరమాణు సంఖ్య 4. విశ్వంలో అరుదుగా లభించే మూలకం ఇది[7]. ఇది ద్విసంయోగసామర్థ్యం (Divalent) ఉన్న మూలకం.ఇది ప్రకృతిలో ఇతర మూలకాలఖనిజాలతో కలిసి లభిస్తుంది.ఇది విలువైనరత్నాలు, వైడూర్యం (Beryl) (ఆక్వామరైన్, మరకతం (Emerald) ఒకజాతి నీలం (chrysoberyl) లు బెరీలియాన్ని కలిగియున్నవి.[8]

చరిత్ర

[మార్చు]

, సా.శ.మొదటి శతాబ్ది నాటికి, ఈజిప్టు టోలెమీవంశీయుల పాలన కాలం నాటికి బెరీలియం యొక్క ఖనిజం బెరెల్ (వైడూర్యం) వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది.రోమనుకు చెందిన ప్లిని ది ఎల్డర్ తన “నాచురల్ హిస్టరీ “ అనే విశ్వకోశంలో బెరెల్ (వైడూర్యం), (మరకతం) emerald ఒకటే నంటూ పేర్కొన్నారు.సా.శ.మూడవ శతాబ్దిలో వ్రాసిన “Papyrus Graecus Holmiensis, ”లో కృత్తిమంగా మరకతం/పచ్చడాన్ని, వైడూర్యాన్ని ఎలా తయారు చెయ్యవచ్చునో వ్రాయబడి యున్నది.1828 లో మొదటిగా బెరీలియం అనుపదాన్ని Wöhler ఉపయోగించాడు.

పద ఉత్పత్తి

[మార్చు]

బెరీలియం యొక్క మూలం చాలా భాషలలో కనిపిస్తుంది. లాటిన్ పదం: Beryllus;[9] ఫ్రెంచ్ పదం: Béry[9], గ్రీకు పదం:berullos, βήρυλλος (a 'beryl') [9] ప్రాకృతపదం : veruliya (वॆरुलिय‌) ; పాళి పదం: veḷuriya (वेलुरिय), veḷiru (भेलिरु) viḷar (भिलर्) అనగా పాలి పోయిన అని అర్థం .

ఆవిష్కరణ

[మార్చు]

Friedrich Wöhler, Antoine Bussy లు విడివిడిగా 1828 లో మెటాలిక్ పొటాషియంను బెరీలియం క్లోరైడుతొ చర్యజరుపుట వలన బెరీలియాన్ని వేరుచేయ్య గలిగారు[10][11] .

BeCl2 + 2K → 2KCl + Be

Paul Lebeau అనునతడు 1898లో బెరీలియం ఫ్లోరైడ్, సోడియం ఫ్లోరైడ్‌ల మిశ్రమాన్ని నేరుగా విద్యుద్విశ్లేషణచేసి శుద్ధమైన (99.5 -99 .8 %) బెరీలియాన్ని సృష్టించగలిగాడు .

లభ్యత

[మార్చు]

సూర్యునిలో దీనియొక్క గాఢత 0.1 ppb (అనగా బిలియనులో 0.1 వంతు). భూ పటలంలో 2-6 ppm వరకు ఉంది. దీని ఉనికి నీటిలో కన్న భూమి మీదనే అధికం. సముద్రజలంలో ఇది ట్రిలియనులో 0.2 వంతు ఉంది. భూ వాతావరణంలో కుడా బెరీలియం యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి. సముద్ర నీటిలో కన్న, సెలయేర్ల నీటిలో బెరీలియం లభ్యత ఎక్కువ. బెరీలియాన్ని దాదాపు వందకు పైగా ఇతర ఖనిజాలలో గుర్తించడం జరిగింది. సాధారణంగా తగిన పరిమాణంలో బెరీలియం కలిగిన ఖనిజాలు బెట్రాండైట్ (Be4Si2O7 (OH) 2), బెరెల్ ( Al2Be3Si6O18, క్రిసో బెరెల్ (Al2BeO4), పెనకైట్ (Be2SiO4).

బెరీలియం లభించు ప్రదేశాలు

[మార్చు]

బెరీలియం యొక్క ముఖ్యమైన ఖనిజాలు బెరెల్, బెట్రాం టైట్‌లు అర్జెంటినా, బ్రెజిల్, ఇండియా , మడగాస్కర్, రష్యా ,, సంయుక్త రాష్ట్రాలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బెరీలియం నిల్వలు 400,000 టన్నులు.

ఉత్పత్తి

[మార్చు]

ముడి ఖనిజంనుండి బెరీలియాన్ని వేరు చెయ్యడం చాలా క్లిష్టమైన ప్రక్రియ, ఆక్సిజనుతో ఇది రాసాయనికాకర్షణము కలిగి యున్నది.అందుచే అధిక ఉష్ణోగ్రత వద్ద అతివేగంగా ఆక్సిజనుతో చర్య జరుపు లక్షణము కలిగి యుండటము,, బెరీలియంయొక్క ఆక్సైడ్‌పూతను తొలగించినప్పుడు నీటిని క్షయికరించేగుణం కలిగి ఉండటమే ఇందుకు కారణం. అందుచే కేవలం ప్రస్తుతం మూడు దేశాలు సంయుక్త రాష్ట్రాలు, చైనా, కజకస్తాన్లు మాత్రమే బెరీలియాన్ని పారిశ్రామికస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాయి.[12]

భౌతిక ధర్మాలు

[మార్చు]

ఉక్కు వంటి బూడిద రంగుకలిగిన, గట్టియైన, గది ఉష్ణోగ్రత వద్ద పెళుసుగా ఉండు లోహం బెరీలియం.అణువు ఆరు భుజాలా సౌష్టవం కలిగి ఉండును.లోహము యొక్క కఠినత్వము, యంగ్స్ మోడులుస్ 287.ఈ మూలకం యొక్క ద్రవీభవన స్థానం ఎక్కువే .ద్రవీభవన స్థానం 1287C. బెరీలియాన్ని అల్యూమినియం, ఇనుము, రాగి, నికెల్ ] వంటి వాటికి కలిపి నప్పుడు ఏర్పడిన మిశ్రమ ధాతువుల భౌతిక ధర్మాలు పైన తన ప్రభావం చూపిస్తుంది. బెరీలియం-రాగి యొక్క మిశ్రమ ధాతువు దృఢముగా, కఠినంగా ఉంటుంది.ఈ మిశ్రమ లోహాన్ని బలంగా ఉక్కు ఉపరితలం మీద కొట్టినను నిప్పు రవ్వలు వెలువడవు.కావున నెరుసు అభేద్యమైన (spark proof) పరికారాలను చేయుటకు వాడెదరు. తక్కువ సాంద్రత, మంచి ఉష్ణ వాహక తత్త్వం,, ఉష్ణ స్థిరత్వం కలిగి యుండటచే, బెరీలియాన్ని విమాన భాగాలను, క్షిపణులలో,, అంతరిక్ష నౌకలలో ఉపయోగిస్తారు. బెరీలియం యొక్క తక్కువ సాంద్రత, పరమాణు ద్రవ్యరాశి వలన, ఇది ఎక్సు కిరణాలకు కాంతిభేదకం/పారదర్శకం. అనగా ఎక్సు కిరణాలను బెరీలియం లోహం గుండా ప్రసరింపచేసినప్పుడు, లోహం కిరణాలను అడ్డుకొనదు. కావున దీనిని ఎక్సుకిరణాల పరికరాలలో, పార్టికిల్ ఫిజిక్సు ఎక్స్‌పెరిమెంట్స్ పరికరాలలో వినియోగం సాధారణం.[11]

భౌతిక ధర్మాల పట్టిక [13]

భౌతిక లక్షణం విలువ మితి
భౌతిక స్థితి ఘనస్థితి
రంగు బూడిద రంగు
సాంద్రత 1.86గ్రాం/సెం.మీ3
పరమాణు సంఖ్య 4
పరమాణు ద్రవ్యరాశి 9.01218 గ్రాం.మోల్−1
ఎలక్ట్రో వెగవిటి 1.5పౌల్స్
ద్రవీభవనస్థానం 1280 °C
మరుగు స్థానం 2970 °C
ఎలక్ట్రానిక్ గదులు 1s2 2s2 or [ He ] 2s2
మొదటి దశ అయనీకరణ శక్తి 899.2కిలో జౌల్.మోల్−1

ఐసొటోపులు(isotopes)

[మార్చు]

బేరిలియం చాలా ఐసోటోపులను కలిగి ఉన్నప్పటికి9Be మాత్రమే ఎక్కువ స్థిరత్వమున్న ఐసోటోపు.10Beఐసోటోపు, విశ్వకిరణాలు వాతావరణంలోని ఆక్సిజన్, మరు నైట్రోజన్ లమీద పడి వికిరణం చెందటం వలన ఏర్పడును.10Beఐసోటోపు భూమియొక్క నేల పైపొరలలో నిక్షిప్తమై యుండును. దీనియొక్క అర్ధజీవితకాలం చాలా ఎక్కువ, అందువలన చాలా కాలం తరువాత 10B గా రూపాంతరం పొందును.అందువల10Be ఐసోటోపు నేలను, సౌర కార్యశీలతను లెక్కింఛూతకు/పరీక్షించుటకు ఉపయోగపడును., సౌరసంబంధిత కార్యశీలత 10Be యొక్క ఉత్పత్తికి విలోమానుపాతంగా సంబంధం కలిగియున్నది.10Be కాకుండగా ఇతర13Be ఐసోటోపులు తక్కువ అర్ధజీవితాన్ని కలిగిఉన్నాయి[14]

బెరీలియం సమ్మేళనాలు

[మార్చు]
బెలీలియం ఆక్సైడ్ (BeO)
బెలీలియం ఆక్సైడ్‌ను పరమాణు సంబంధియ పరిశ్రమలలో, పింగాణి పరిశ్రమలలో ఉపయోగిస్తారు;[15] బెరీలియం హైడ్రోక్సైడ్ (Be (OH) 2[S]: బెరీలియం హైడ్రోక్సైడ్‌ ద్విశ్వభావయుత (Amphoteric) సమ్మేళనం.అనగా ఇది అమ్లాలతో, క్షారాలలో కూదా రసాయనిక చర్యలో పాల్గొనును.సాధారణంగా పదార్థాల హైడ్రోక్సైడులు కేవలం ఆమ్లాలతో రసాయనిక చర్యలో పాల్గొనును.కాని బెరీలియం హైడ్రోక్సైడ్‌ అమ్మ్ల, క్షారాలరెండింటి తోను సమానంగా చర్య చెందును.[7]
  • ఆమ్లంతో చర్యం:

Be (OH) 2[s]+H2SO4[aq] → BeSO4[aq]+2H2O[i]

  • క్షారంతో చర్య:

Be (OH) 2[s]+2NaOH[aq]→Na2Be (OH) 4[aq]

వినియోగం/ఉపయోగాలు

[మార్చు]

బెరిలియానికి రాగి, నికెల్ లోహాలను కలిపి తయారు చేసిన మిశ్రమధాతువులను స్ప్రింగులు, భ్రమకభ్రమణదర్శని (Gyroscope) లను, ఎలక్ట్రికల్ కాంటాక్ట్సులను, స్పాట్ వెల్డింగు విద్యుత్‌వాహక ధ్రువము (electrode) లను నుప్పురవ్వలను పుట్టీంచని/అగ్నికణ అభేద్య పనిముట్టలను తయారుచేయుదురు[16]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Standard Atomic Weights: Beryllium". CIAAW. 2013.
  2. Prohaska, Thomas; Irrgeher, Johanna; Benefield, Jacqueline; et al. (2022-05-04). "Standard atomic weights of the elements 2021 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry (in ఇంగ్లీష్). doi:10.1515/pac-2019-0603. ISSN 1365-3075.
  3. Be(0) has been observed; see "Beryllium(0) Complex Found". Chemistry Europe. 13 June 2016.
  4. "Beryllium: Beryllium(I) Hydride compound data" (PDF). bernath.uwaterloo.ca. Retrieved 2007-12-10.
  5. Haynes, William M., ed. (2011). CRC Handbook of Chemistry and Physics (92nd ed.). Boca Raton, FL: CRC Press. p. 14.48. ISBN 1439855110.
  6. "Beryllium: Beryllium(I) Hydride compound data" (PDF). bernath.uwaterloo.ca. Retrieved 2007-12-10.
  7. 7.0 7.1 "SOME BERYLLIUM CHEMISTRY UNTYPICAL OF GROUP 2". chemguide.co.uk. Retrieved 2015-04-02.
  8. "Beryllium: the essentials". webelements.com. Retrieved 2015-04-02.
  9. 9.0 9.1 9.2 "Etymology of the English word beryllium". myetymology.com. Retrieved 2015-04-02.
  10. "Alkaline earth metals". books.google.co.in. Archived from the original on 2016-03-04. Retrieved 2015-04-02.
  11. 11.0 11.1 "Beryllium Element Facts". chemicool.com. Retrieved 2015-04-02.
  12. "Uses of Beryllium". geology.com. Retrieved 2015-04-02.
  13. "Chemical properties of beryllium". lenntech.com. Retrieved 2015-04-02.
  14. "Chemistry of Beryllium". chemwiki.ucdavis.edu. Archived from the original on 2015-04-24. Retrieved 2015-04-02.
  15. "The Element Beryllium". education.jlab.org. Retrieved 2015-04-02.
  16. "Facts About Beryllium". livescience.com. January 14, 2015. Retrieved 2015-04-02.
"https://te.wikipedia.org/w/index.php?title=బెరీలియం&oldid=4304084" నుండి వెలికితీశారు