మడగాస్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రిపబ్లిక్ ఆఫ్ మడగాస్కర్
రిపోబ్లికా'ని మడగాసికారా
République de Madagascar
Flag of మడగాస్కర్ మడగాస్కర్ యొక్క చిహ్నం
నినాదం
Tanindrazana, Fahafahana, Fandrosoana  (Malagasy)
Patrie, liberté, progrès  (French)
"Fatherland, Liberty, Progress"
జాతీయగీతం
en:Ry Tanindrazanay malala ô!
Oh, Our Beloved Fatherland

మడగాస్కర్ యొక్క స్థానం
రాజధానిAntananarivo
18°55′S 47°31′E / 18.917°S 47.517°E / -18.917; 47.517
Largest city Antananarivo
అధికార భాషలు Malagasy, French, ఆంగ్లభాష1
ప్రజానామము Malagasy[1]
ప్రభుత్వం Unitary state government
 -  President Hery Rajaonarimampianina
 -  Prime Minister Jean Ravelonarivo
స్వాతంత్ర్యము ఫ్రాన్స్ నుండి 
 -  Date 26 జూన్ 1960 
 -  జలాలు (%) 0.13%
జనాభా
 -  జూలై 2008 అంచనా 20,042,551[2] (55వది)
 -  1993 జన గణన 12,238,914 
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $19.279 billion[3] 
 -  తలసరి $979[3] 
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $7.711 billion[3] 
 -  తలసరి $391[3] 
Gini? (2001) 47.5 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) Increase 0.533 (medium) (143వది)
కరెన్సీ Malagasy ariary (MGA)
కాలాంశం EAT (UTC+3)
 -  వేసవి (DST) not observed (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .mg
కాలింగ్ కోడ్ +261
1Official languages since 27 April 2007.

మడగాస్కర్ లేదా రిపబ్లిక్ ఆఫ్ మడగాస్కర్ (ఆంగ్లం : Madagascar, లేదా Republic of Madagascar (పాతపేరు : మలగాసీ రిపబ్లిక్), హిందూ మహాసముద్రంలో గల ఒక ద్వీప దేశం, ఆఫ్రికా ఖండపు ఆగ్నేయ తీరంలో గలదు. ప్రపంచంలో గల జంతుజాలాలలో 5% జంతుజాలాలు ఈ దేశంలోనే గలవు. ప్రాచీన హిందువులు తూర్పున మలే ద్వీపకల్పం మొదలుకొని జావా, సుమత్రా దీవుల నుంచి పశ్చిమంలో మడగాస్కర్ ద్వీపం వరకు తమ వ్యాపారవాణిజ్యాలు విస్తరించారు[4].

నైసర్గిక స్వరూపము[మార్చు]

 • వైశాల్యం : 5,87,041 చదరపు కిలోమీటర్లు
 • జనాభా : 2,37,52,887 (అంచనా)
 • రాజధాని : అంటనానారివో
 • కరెన్సీ : మలగాసీ అరియారీ
 • ప్రభుత్వం : యూనిటరీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్
 • భాషలు : అధికార భాష-మలగాసీ, ఫ్రెంచ్ భాషలు
 • మతం : క్రైస్తవులు-40 శాతం, ముస్లిములు 7 శాతం, షెడ్యూల్డ్ తెగలు 50 శాతం.
 • వాతావరణం : సాధారణంగా చల్లగా ఉంటుంది. జులైలో 9 నుండి 20 డిగ్రీలు , డిసెంబర్‌లో 16 నుండి 27 డిగ్రీలు ఉంటుంది.
 • పంటలు : వరి, కస్సావా, మామిడి, బంగాళదుంపలు, అరటి, చెరకు, మొక్క జొన్న, కాఫీ, మిరియాలు.
 • పరిశ్రమలు : వస్త్ర, సముద్ర ఉత్పత్తులు, పొగాకు, చక్కెర, ప్లాస్టిక్, ఫార్మా, తోలు వస్తువుల పరిశ్రమలు మొదలైనవి.
 • సరిహద్దులు : నలువైపులా హిందూమహాసముద్రం ఉంది. ఆఫ్రికా ఖండానికి సమీపంలో ఉంది.
 • స్వాతంత్య్రం : 26 జనవరి, 1960

చరిత్ర[మార్చు]

హిందూమహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం మడగాస్కర్. తూర్పు ఆఫ్రికాకు 400 కిలోమీటర్లు దూరంలో ఉన్నా కూడా ఈ మడగాస్కర్ దీవి దేశం 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండోనేషియా దేశపు సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ దీవిలో పూర్వం ఆసియా దేశస్థులే వలసవెళ్లి ఉండడం వల్ల ఇప్పటికీ అక్కడ ఆసియా ప్రజల ఛాయలే ఉన్నాయి. దీవిలో మొత్తం 18 రకాల తెగల ప్రజలు ఉన్నారు. తెగలు వేరున్నా అందరూ మాట్లాడేది మలగాసీ భాషనే. ఈ దీవి వైశాల్యంలో ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. క్రీ.శ. 1500లో పోర్చుగీసువారు ఈ దీవిని మొదట కనుగొన్నారు. 18వ శతాబ్దం ఆరంభం నుండి ఫ్రెంచి రాజులు దీనిని పరిపాలించారు. ఈ దీవిలో ప్రాణుల ఉనికి 150 మిలియన్ సంవత్సరాల క్రితం నుండే ఉండేదని శాస్రవేత్తలు పరిశోధించారు.

అనేక రకాల ఖనిజాలు ఈ దీవిలో లభ్యమవుతున్నప్పటికీ ప్రపంచంలోని బీదదేశాల జాబితాలో మడగాస్కర్ పేరు ముందు వరుసలోనే ఉంటుంది. జనాభాలో 80 శాతం మంది ప్రజలు కేవలం జీవనం కొనసాగడానికే వ్యవసాయం చేస్తున్నారు. వరిధాన్యం ఈ దీవిలో అధికంగా పండుతుంది. 1960లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మలగాసీ ప్రభుత్వం ఏర్పడింది.

పరిపాలనా పద్దతులు[మార్చు]

మడగాస్కర్ దీవి పరిపాలన సౌలభ్యం కోసం ఆరు ప్రాంతాలుగా విభజింపబడింది. ఈ ఆరు ప్రాంతాలు తిరిగి 22 రీజియన్‌లుగా విభజింపబడి ఉన్నాయి. ఈ రీజియన్‌లను ఫరిత్ర అంటారు. అంట్‌సిరనానా, అంటనానారివో, మహజంగ, టోమాసినా, ఫియానారంట్‌సోవా, టోలియారాలు ఆరు ప్రాంతాలు. దేశంలో మొత్తం 119 జిల్లాలు ఉన్నాయి. మడగాస్కర్ దేశంలో పదినగరాలు ఎక్కువ జనాభాను కలిగి ఉన్నాయి. అవి - అంటనానారికో, టోమాసిన, అంట్‌సిరాబే, ఫియానారంట్‌సోవా, మహజంగ, టోలియారా, అంట్‌సిరనానా, అంటానిఫోట్సీ, అంబోవోంబే, అంపరఫరవోలా.

సంస్కృతి[మార్చు]

మడగాస్కర్ దేశంలో అనేక మానవ తెగలు ఉన్నాయి. ముఖ్యంగా మెరినా, బెట్సి మిసరాకా, బెట్సిలియో, సిమిహేతి, సకలావ, అంటాయసక, అంటన్‌డ్రాయ్ మొదలైన తెగలున్నాయి. జనాభాలో సగభాగం పురాతన సంస్కృతిని అనుసరిస్తున్నారు. వీరంతా క్రైస్తవ మతావలంబకులు. ప్రజలు ఇస్లాం మతాన్ని కూడా ఆచరిస్తున్నారు.భారతీయులు కూడా మడగాస్కర్‌లో ఉన్నారు. వీరు హిందీ, గుజరాతీ భాషలు మాట్లాడతారు. గ్రామాలలో గుడిసెలలాంటి ఇళ్లు నిర్మించుకుంటారు. స్త్రీలు, పురుషులు దాదాపు సమాన భావనతో జీవిస్తారు. పురుషులు కుటుంబాన్ని పోషించేందుకు కావలసిన వనరులను సేకరిస్తారు. వ్యవసాయం స్త్రీలు, పురుషులు కలిసిచేస్తారు. ప్రభుత్వం విద్యాలయాలను నెలకొల్పింది. క్రిస్టియన్ మిషినరీలు విద్యావ్యాప్తిని కొనసాగిస్తున్నాయి.

దర్శనీయ ప్రదేశాలు[మార్చు]

సింగీ రోగ్[మార్చు]

సింగీ రోగ్ ఎర్రమట్టి రెడ్ లాటరైట్‌తో సహజసిద్ధంగా ఏర్పడి పైకి లేచిన ముళ్లమాదిరిగా కనబడతాయి. ఈ ప్రాంతం అంకరానా పట్టణానికి దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతం భారీవర్షాల కారణంగా మట్టి కోసుకుపోయి, కోపులు కోపులుగా తయారై ఒక వినూత్న డిజైనుగా మారిపోయింది. వేలాది ఏళ్ళ క్రితం ఏర్పడిన ఈ వింత ఆకారాలు ఇప్పుడు కఠినమైన రాతి శిలలుగా మారిపోయాయి. క్రమంగా ఇసుక వీటిమీద చేరిపోయి ఎరుపు రంగుకు చేరుకొని ఇప్పుడవి సహజసిద్ధ నిర్మాణాలుగా మారిపోయాయి. ఇక్కడే చిన్న చిన్న నీటి కొలనులు ఉన్నాయి. సందర్శకులకు ఈ ప్రాంతం ఒక భూమి మీది స్వర్గం మాదిరిగా అనిపిస్తుంది.

బావోబాబ్ చెట్లు[మార్చు]

బావోబాబ్ చెట్లు

మడగాస్కర్ దీవిలో చాలా విచిత్రమైన ప్రకృతి కనబడుతుంది. ఎన్నో అగ్నిపర్వతాలు, రహస్యంగా ప్రవహించే జలపాతాలు ఉన్నాయి. ఒకప్పుడు మొత్తం దీవి అంతా అడవే. బావోబాబ్ చెట్లు ఈ ఒక్కదేశంలోనే కనిపిస్తాయి. వీటిని చూస్తేనే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. వీటి మొదళ్ళు ఎంతో లావుగా ఉండి, మూడు నుండి నాలుగు మీటర్లు పెరిగిన తర్వాత ఒక్కసారిగా ఆ కాండం నాలుగైదు కొమ్మలుగా విడిపోయి ఆగిపోతుంది. ఆ కొమ్మలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. చివర్లలో కొన్ని ఆకులు ఉంటాయి. కాండం ఎంతో నునుపుగా ఉంటుంది. చూస్తుంటే మానవుని చెయ్యి, అయిదు వేళ్ళు విచ్చుకున్నట్లుగా కనిపిస్తుంది.

నోసీ బే మరియు ఇతర దీవులు[మార్చు]

 • మడగాస్కర్ దీవికి ఉత్తర ప్రాంతంలో నోసీ బే ఉంది. ఈ ప్రాంతంలో అనేక చిన్న చిన్న దీవులు ఉన్నాయి. కొన్ని దీవులు కొన్ని అడుగుల వెడల్పే ఉండి చూపరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ నోసీ బేకి సమీపంలోనే నోస్ సకాటియా, నోసీ టకినేలీ, నోసీ కోంబా, రష్యన్స్ బే, నోసీ ఇరంజా, రదను ద్వీపాలు, నోసీ ఫ్రాలీ, మిట్సియో ఆర్చిసెలాగో మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రాంతమంతా స్వర్గధామంగా కనిపిస్తుంది. నోసీ సకాటియాను ఆర్బెడ్ ద్వీపం అంటారు. ఇక్కడ కేవలం 300 జనాభా ఉంది. ఇక్కడే ప్రపంచంలోనే అతి చిన్న ఊసరవెల్లి కనబడుతుంది. ఈ ఊసరవెల్లి కేవలం ఒక సెంటీమీటరు ఉంది. రాక్షస గబ్బిలాలు కూడా ఇక్కడ ఉంటాయి.
 • నోసీ కోంబా ఒక చిన్నద్వీపం. గుండ్రంగా ఉండి ఆకాశంలోంచి చూస్తే సముద్రానికి బొట్టుపెట్టినట్లు కనబడుతుంది. ఈ ద్వీపంలో మనకు ఎగిరే నక్కలు కనిపిస్తాయి. అలాగే రాక్షస గబ్బిలాలు కూడా కనబడతాయి. ఈ ద్వీపంలో అగ్నిపర్వతం ఉంది. లెబార్ జంతువులు ఎక్కువగా సంచరిస్తాయి.
 • రష్యన్ బే కూడా చిన్న ద్వీపం. ఈ ద్వీపంలో సందర్శకులు రెండు మూడు రోజులు ఉండడానికి వీలుగా హోటళ్ళు ఉంటాయి. సందర్శకులు ఈ దీవిలోని ప్రకృతి రమణీయతని పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఇక్కడ తెలుపు రంగులో ఉండే ఇసుక బీచ్‌లు ఉన్నాయి. వివిధ జాతుల పక్షులు, జలచరాలు కనిపిస్తాయి. బవోబాబ్ వృక్షాలు కూడా ఇక్కడే ఉన్నాయి.
 • ఈ ప్రాంతంలో ఇంకా నోసీనింజా, రదమ ఆర్బిపెలాగోలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు ముఖ్య భూభాగంనుండి పడవలో గానీ, హెలికాప్టర్‌లో కాని వెళ్ళవచ్చు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Malagasy" is the correct form in English; Embassy of Madagascar, Washington D.C. "Madagascan" is used only for the island, not its people National Geographic Style Manual
 2. CIA - The World Factbook - Madagascar
 3. 3.0 3.1 3.2 3.3 "Madagascar". International Monetary Fund. Retrieved 2008-10-09.
 4. రామారావు, మారేమండ (1947). భారతీయ నాగరికతా విస్తరణము (1 ed.). సికిందరాబాద్, వరంగల్: వెంకట్రామా అండ్ కో. Retrieved 9 December 2014.

బయటి లింకులు[మార్చు]

Madagascar గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo.svg నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోటు నుండి
Wikisource-logo.svg మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి

ప్రభుత్వము