ఈక్వటోరియల్ గ్వినియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Republic of Equatorial Guinea

 • República de Guinea Ecuatorial  (Spanish)
 • République de Guinée équatoriale  (French)
 • República da Guiné Equatorial  (Portuguese)
Flag of Equatorial Guinea
జండా
Coat of arms of Equatorial Guinea
Coat of arms
నినాదం: 
 • "Unidad, Paz, Justicia" (Spanish)
 • "Unity, Peace, Justice"
గీతం: Caminemos pisando las sendas de nuestra inmensa felicidad  (Spanish)
Let us walk stepping the paths of our immense happiness
Location of  ఈక్వటోరియల్ గ్వినియా  (dark blue) – in Africa  (light blue & dark grey) – in the African Union  (light blue)
Location of  ఈక్వటోరియల్ గ్వినియా  (dark blue)

– in Africa  (light blue & dark grey)
– in the African Union  (light blue)

రాజధానిMalabo
3°45′N 8°47′E / 3.750°N 8.783°E / 3.750; 8.783
అతిపెద్ద నగరంBata
అధికార భాషలుSpanish (national language)
French
Portuguese[1][2][3]
గుర్తించిన ప్రాంతీయ భాషలుFang
Bube
Combe
Pidgin English
Annobonese, Igbo[4][5]
జాతులు
(1994[6])
పిలుచువిధం
ప్రభుత్వంUnitary dominant-party presidential republic (de jure) under an authoritarian dictatorship (de facto)[7]
• President
Teodoro Obiang Nguema Mbasogo
Francisco Pascual Obama Asue
Teodoro Nguema Obiang Mangue
శాసనవ్యవస్థParliament
• ఎగువ సభ
Senate
• దిగువ సభ
Chamber of Deputies
Independence
• from Spain
12 October 1968
విస్తీర్ణం
• మొత్తం
28,050 కి.మీ2 (10,830 చ. మై.) (141st)
• నీరు (%)
negligible
జనాభా
• 2016 estimate
1,221,490[8]
• 2015 census
1,222,442[9]
GDP (PPP)2018 estimate
• Total
$28 billion[10]
• Per capita
$32,855[10]
GDP (nominal)2018 estimate
• Total
$12 billion[10]
• Per capita
$13,350[10]
హెచ్‌డిఐ (2017)Increase 0.591[11]
medium · 141th
ద్రవ్యంCentral African CFA franc (XAF)
కాల విభాగంUTC+1 (WAT)
వాహనాలు నడుపు వైపుright
ఫోన్ కోడ్+240
ISO 3166 codeGQ
Internet TLD.gq
 1. Including Equatoguinean Spanish (Español ecuatoguineano).

ఈక్వెటోరియల్ గినియా అధికారికంగా ఈక్వెటోరియల్ గినియా రిపబ్లిక్ మధ్య ఆఫ్రికాలో ఉన్న ఒక దేశం. దేశవైశాల్యం 28,000 చదరపు కిలో మీటర్లు. ముందుగా స్పానిష్ గినియా కాలనీగా ఉండి స్వాతంత్ర్యం తరువాత భూమధ్యరేఖకు సమీపంలో గినియా గల్ఫు మద్య ఉన్నందున ఈక్వెటోరియల్ గినియా అయింది. ఈక్వెటోరియల్ గినియా స్పానిషు అధికారభాషగా కలిగిన ఏకైక సార్వభౌమ ఆఫ్రికన్ దేశంగా గుర్తించబడుతుంది. 2015 నాటికి దేశంలో 12,22,245 మంది ప్రజలు ఉన్నారు.[12]


ఈక్వటోరియల్ గినియాలో రెండు భాగాలు ఉన్నాయి. ఒక ద్వీపభూభాగం, ఒక ప్రధాన భూభాగం ఉంటుంది. ద్వీపభాగంలో గినియా గల్ఫులో ఉన్న బికాకో ద్వీపాలు (గతంలో ఫెర్నాండో పో) గినియాలోని గల్నీ, అన్నాబన్ ద్వీపాలు (భూమధ్యరేఖకు దక్షిణాన దక్షిణాన ఉన్న ఒక చిన్న అగ్నిపర్వత ద్వీపం) ఉన్నాయి. బికోక్ ద్వీపము ఈక్వటోరియల్ గినియా ఉత్తర భాగంలో ఉంది. ఇక్కడ దేశ రాజధాని అయిన మలాబో ఉంది. బయోకో, అన్నాబొన్ల మధ్య సావో టోం, ప్రిన్సిపి ద్వీప దేశం ఉంది. ప్రధాన భూభాగం రియో మున దక్షిణ, తూర్పు సరిహద్దులలో గాబన్ ఉత్తరసరిహద్దులో కామెరూన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఇక్కడ ఈక్వెటోరియల్ గినియా అతిపెద్ద నగరం, దేశం భవిష్యత్తు రాజధాని అయిన ఓయాల నగరాలు ఉన్నాయి. రియో ముని ప్రాంతంలో అనేక చిన్న తీరప్రాంత దీవులు ఉన్నాయి. వీటిలో కరిస్కో, ఎలోబే గ్రాండే, ఎలోబే చికో వంటివి ఉన్నాయి. దేశం ఆఫ్రికన్ యూనియన్, ఫ్రాంకోఫొనీ, ఒపెక్, ఐ.పి.ఎల్.పి. లో సభ్యదేశంగా ఉంది.

1990 ల మధ్యకాలం నుండి ఈక్వాటోరియల్ గినియా సబ్ సహారన్ ఆఫ్రికాలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులలో ఒకటిగా మారింది. ఇది ఆఫ్రికాలోని సంపన్న దేశంగా ఉంది. [13] దాని స్థూల దేశీయ ఉత్పత్తి (జి.డి.పి) తలసరి కొనుగోలు (పి.పి.పి) ప్రపంచంలో 43 వ స్థానంలో ఉంది.[14] సంపద పంపిణీ చాలా అసమానంగా ఉంటుంది. కొంతమంది చమురు సంపద నుండి ప్రయోజనం పొందారు. 2016 ఐఖ్యరాజ్య సమితి మానవ అభివృద్ధి సూచికలో దేశం 135 వ స్థానంలో ఉంది.[11] ఐక్యరాజ్య సమితి నివేదిక ఆధారంగా జనాభాలో సగం కంటే తక్కువ మందికి త్రాగునీరు అందుబాటులో ఉంటుందని, ఐదు సంవత్సరాల లోపు వయస్సులో 20% పిల్లలు చనిపోతున్నారని భావిస్తున్నారు.

సార్వభౌమదేశ నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రపంచంలోని అతి భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘన రికార్డులలో ఒకటిగా పేర్కొనబడింది. ఫ్రీడమ్ హౌస్ రాజకీయ, పౌర హక్కుల వార్షిక సర్వేలో స్థిరంగా హీనమైన స్థానం సంపాదించింది.[15] రిపోర్టర్సు వితౌట్ బోర్టర్సు ఆధారంగా అధ్యక్షుడు తెడోరో ఒబియాంగ్ నగ్మామా మబాసోగోను " ప్రిడేటర్ ఆఫ్ ప్రెస్ " గా వర్ణించింది.[16] మానవ అక్రమ రవాణా ఒక ముఖ్యమైన సమస్యగా ఉంది. 2012 లో యు.ఎస్. ట్రాఫికింగ్ పర్సన్స్ రిపోర్టులో ఈక్వాటోరియల్ గినియా "స్త్రీలు, పిల్లలను నిర్బంధిత కార్మికులుగా, లైంగిక అక్రమ రవాణాకు బలవంతం చేయడానికి గమ్యస్థానం." ఒక నివేదికగా అందించింది. ఈ నివేదిక ఈక్వెటోరియల్ ప్రభుత్వాన్ని "కనీస ప్రమాణాలను పూర్తిగా పాటించదు. అలా చేయటానికి గణనీయమైన ప్రయత్నాలు చేయలేదు." తెలియజేసిందు.[17]

చరిత్ర

[మార్చు]

పిగ్మీలు ఒకప్పుడు బహుశా ఈక్వాటోరియల్ గినియా అని పిలువబడే ప్రాంతంలో నివసించినప్పటికీ, నేడు దక్షిణ రియో మునిలో మాత్రమే ఏకాంత ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తారు. నైరుతి నైజీరియా, వాయువ్య కామెరూన్ (గ్రాస్ఫీల్డ్స్) ప్రాంతాలకు దాదాపుగా క్రీ.పూ. 4,000 లో ఈ ప్రాంతానికి బంటు వలస ప్రజలు చేరుకున్నారు.[18] వారు ఈక్వేటోరియల్ గినియాలో సుమారు క్రీ.పూ. 2,500 లో స్థిరపడ్డారు.[19][20] బయోకో ద్వీపంలో క్రీ.పూ. 1480 లో మొట్టమొదటి స్థిరనివసాలు ఏర్పరచుకున్నారు.[21] అన్గోబన్ జనాభా మొట్టమొదట అంగోలాకు స్థానికులుగా ఉన్నారు. అంగోబనులను పోర్చుగీసు వారు సావో టోమ్ ద్వీపం ద్వారా ఇక్కడకు ప్రవేశపెట్టారు.

మొదటి యురేపియన్ ఒప్పందం (1472)

[మార్చు]

పోర్చుగీసు అన్వేషకుడు ఫెర్నాండో పో భారతదేశానికి ఒక మార్గాన్ని వెతుకుతూ 1472 లో బయోకో ద్వీపాన్ని కనుగొన్న మొట్టమొదటి యూరోపియనుగా పేరుపొందాడు. అతను దీనిని ఫోర్సాసా ("అందమైన") గా పిలిచాడు. కానీ తరువాత శీఘ్రగతిలో ఈ దీవి యూరోపియన్ అన్వేషకుడి పేరుతో పిలువబడింది. ఫెర్నాండో పో, అన్నోబోన్ 1474 లో దీనిని పోర్చుగల్ వలసగా మార్చారు.


1778 లో పోర్చుగలు రాణి మొదటి మరియా, స్పెయినుకు చెందిన కింగ్ మూడవ చార్లెసు ఎల్ పార్డో ఒప్పందం మీద సంతకం చేశారు. ఇది బయోకోను ఆనుకొని ఉన్న లఘు ద్వీపాలను స్పెయినుకు అందించి నైజరు, ఓగౌ నదుల మధ్య ప్రాంతంలో బియాఫ్రా బైటుకు వాణిజ్య హక్కులను అందించింది. స్పెయిను బ్రిటీషు వ్యాపారుల నియంత్రణలో ఉండే బానిసలను పొందేందుకు ప్రయత్నించింది. 1778 - 1810 మధ్య ఈక్వెటోరియల్ గినియా భూభాగం రియో డి లా ప్లాటా వైస్రాయల్టీ ద్వారా నిర్వహించబడింది.

1827 నుండి 1843 వరకు యునైటెడ్ కింగ్డమ్ బయోకో కేంద్రంగా బానిస వాణిజ్యాన్ని నియంత్రించడానికి [22] 1843 లో స్పెయినుతో ఒప్పందం కుదుర్చుకుని తమ స్థావరాలను సియెర్ర లియోనీకి మార్చుకున్నారు. 1844 లో స్పానిషు సార్వభౌమత్వాన్ని పునరుద్ధరించడంతో ఈ ప్రాంతం "టెర్రిటోరియోస్ ఎస్సోలోల్స్ డెల్ గోల్ఫో డి గినియా."అయింది. స్పెయిన్ ఒప్పందంలో ఉన్న బయాఫ్రా బైట్లో పెద్ద ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు స్పెయిన్ విస్మరించింది. స్పెయినుకు అధికారం ఉన్న ప్రాంతాలను స్వీధీనం చేసుకోవడానికి ఫ్రెంచి వేగంగా స్పందించింది.1900 లో ప్యారిసు ఒప్పందం ఆధారంగా ఉబాంగి నదీ ప్రవాహితప్రాంతం అయిన 300,000 కిలోమీటర్ల దూరంలో కేవలం 26,000 చ.కి.మీ ప్రాంతాన్ని స్పెయినుకు వదిలివేసింది. [23]

ఫెర్నాండో పో తోటలను ఎక్కువగా నల్లజాతికి చెందిన క్రియోలు ప్రముఖులు నిర్వహించారు. తర్వాత దీనిని ఫెర్నాండినోస్ అని పిలిచేవారు. 19 వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటీషు వారు ఈ ద్వీపాన్ని కొంతకాలం ఆక్రమించుకున్నారు. 2,000 మంది సియెర్రా లెయోనియన్లు ఈ ప్రాంతంలో స్థిరపడి అక్కడ బానిసలను విడుదల చేశారు. బ్రిటిషు వారు వెళ్ళిన తరువాత పశ్చిమ ఆఫ్రికా, వెస్టు ఇండీస్ల నుండి పరిమితమైన వలసలు కొనసాగాయి. క్యూబా, ఫిలిప్పైన్, స్పెయినుకు చెందిన ప్రజలు రాజకీయ కారణంగా లేదా ఇతర నేరాల కారణంగా బహిష్కరించబడిన వారు, అలాగే కొన్ని సహాయక బృందాలకు చెందిన వివిధ వర్ణాల ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు.

పొరుగున ఉన్న పోర్చుగీసు ద్వీపాలకు చెందిన వలసప్రజలు, తప్పించుకున్న బానిసలు, భావి రైతులు ఇక్కడకు చేరారు. ఫెర్నాండెనిసులో స్పానిషు మాట్లాడే కాథలిక్కులలో పదింట తొమ్మిదిమంది ప్రొటెస్టెంట్లు మొట్టమొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా ఆంగ్ల భాష మాట్లాడారు. సియెర్ర లియోనియన్లు తోటల రైతులుగా చక్కగా స్థిరపడ్డారు. ఐవరీ విడ్వార్డ్ తీరంలో కార్మిక నియామకం కొనసాగింది. సులభంగా కార్మిక సరఫరాను ఏర్పరచడానికి వీలుగా వారు కుటుంబం ఇతర అనుసంధానాలను అక్కడే ఉంచారు.

ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభ సంవత్సరాల్లో స్పానిషు నుండి నూతన తరం వలస వచ్చారు. 1904-1905 లో జారీ చేయబడిన భూమి నిబంధనలు స్పెయిను దేశస్థులకు అనుకూలంగా ఉన్నాయి. తరువాత పెద్ద రైతులు చాలామంది స్పెయిన్ నుండి వచ్చారు. 1914 నాటి లైబీరియన్ కార్మిక ఒప్పందం సంపన్నులకు మార్గం సుగమం చేసింది. లిబెరియా నుండి రియో ముని వరకు కార్మిక సరఫరాలో మార్పు ప్రయోజనాన్ని అధికరించింది. 1940 లో కోకో ఉత్పత్తిలో సుమారుగా 20% ఆఫ్రికాకు చెందిన భూమి నుండి వచ్చింది. దాదాపుగా ఇది మొత్తం ఫెర్నాండోయిన్సు ఆధీనంలో ఉంది.

Corisco, 1910

1930. ఆర్థిక అభివృద్ధికి కార్మికుల దీర్ఘకాలిక కొరత అతి పెద్ద అవరోధంగా ఉంది. ద్వీపం అంతర్భాగంలోకి మద్యపాన వ్యసనం, సుఖవ్యాధి వ్యాధి, మశూచి, నిద్రలేమి ఉన్నందున బయోకోలోని స్వదేశీ బుబీ ప్రజలు తోటలలో పని చేయడానికి నిరాకరించారు. వారి స్వంత చిన్న కోకో పొలాలలో పని చేయడం వారికి గణనీయమైన స్థాయిలో స్వయంప్రతిపత్తి ఇచ్చింది.

19 వ శతాబ్దం చివరి నాటికి కాలీలోని ప్రభావవంతమైన స్పానిషు క్లారెటీయన్ మిషనరీలు రైతుల నిర్బంధం నుండి బుబి ప్రజలను రక్షించారు. చివరకు వారు బుబీ ప్రజలతో చిన్న మిషన్ థారాక్రియాలలో ఏర్పాటు చేశారు. 1898 - 1910 లలో తోటలలో పని చేయడానికి కార్మికులను నిర్బంధం చేస్తున్నందుకు వ్యతిరేంగా రెండు చిన్న తిరుగుబాట్లు తరువాత కాథలిక్ ప్రవేశం అధికరించింది. 1917 లో బుబీ నిరాయుధులయుధులై పూర్తిగా మిషనరీల మీద ఆధారపడి ఉన్నారు.[23]

1926 - 1959 మధ్య బయోకో, రియో ముని స్పానిషు గినియా కాలనీగా సమైఖ్యం చేయబడ్డాయి. ఆర్థిక వ్యవస్థ పెద్ద కాకో, కాఫీ తోటల పెంపకం, కలప రాయితీల మీద ఆధారపడింది. తోటలలో పనిచేయడానికి ఉద్యోగులు అధికంగా లైబీరియా, నైజీరియా, కామెరూన్ల నుండి వలస వచ్చిన ఒప్పంద కార్మికులు నియమించబడ్డారు.[24] 1914 - 1930 ల మధ్య కార్మికులకు ఎదురైన బెదిరింపు కారణంగా 10,000 మంది లైబేరియన్లు ఫెర్నాండో పోకి వెళ్ళారు. 1930 లో ఇది పూర్తిగా నిలిపివేయబడింది.

లైబీరియన్ కార్మికులు అందుబాటులో లేనందున, ఫెర్నాండో పో రైతులు రియో మునికి వచ్చారు. 1920 లలో ఫాంగ్ ప్రజలను ఓడించటానికి పోరాటాలు అధికం అయ్యాయి. లైబీరియా నియామకం నిలిపివేయవలసిన సమయం ఆసన్నమైంది. 1926 నాటికి ఎన్‌క్లేవ్ అంతటా కాలనీల రక్షక దళాలు నియమించబడ్డాయి. 1929 నాటికి 'శాంతియుతం చేయబడుతున్నాయి.[25]

1930 లో రియో మునిలో అధికారిక గణాంకాల ఆధారంగా 1,00,000 కంటే అధికమైన ప్రజలు ఉన్నారు. ఇక్కడి నుండి కెమెరాన్, గబాన్ ల సరిహద్దుల్లోకి తప్పించుకోవడం చాలా సులభం. అంతేకాక కలప కంపెనీలకు అధిక సంఖ్యలో కార్మికులు అవసరమయ్యారు. కాఫీ సాగు విస్తరించడం పన్నుల చెల్లింపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అందించింది. ఫెర్నాండో పోవ్ కార్మిక కొరతతో బాధపడుతూనే ఉన్నారు. కెమెరానులో ఫ్రెంచి కొంతకాలం మాత్రమే నియామకాన్ని అనుమతించింది. నైజీరియాలోని కాలాబారు నుండి కానోలులోని ఇగ్బోకు కార్మికుల అక్రమ రవాణాకు ప్రధాన వనరుగా మారింది. కార్మికుల కొరతకు ఈ తీర్మానంతో ఫెర్నాండు పో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆఫ్రికా వ్యవసాయ ఉత్పాదక ప్రాంతాలలో ఒకటిగా మారింది. [23]

1959 వరకు యుద్ధానంతర రాజకీయ వలసలలో మూడు విభిన్న దశలు ఉన్నాయి: 1959 వరకు పోర్చుగీస్ సామ్రాజ్యం విధానాన్ని అనుసరించి 'వలస' నుండి 'ప్రాంతీయత' కు అధికరించినప్పుడు 1960 - 1968 మధ్యకాలంలో మాడ్రిడ్ ఈ ప్రాంతానికి పాక్షిక డీకాలనైజేషన్ కొరకు ప్రయత్నించి ఈ ప్రాంతాన్ని స్పానిషు కాలనిలో భాగం అయింది. పోర్చుగీసు, ఫ్రాన్సు విధానాలను అనుసరిస్తున్న కారణంగా ప్రజలు 'స్థానికులు', స్థానికేతరులు, అతి స్వల్పంగా అల్పసంఖ్యాక ప్రజలు (శ్వేతజాతీయులతో కలిపి)గా విభజించబడ్డారు.[26]

ఈ 'ప్రాదేశిక' దశ జాతీయవాదం ప్రారంభమైనప్పటికీ కైడిలులో ఆశ్రయం పొందిన చిన్న సమూహాల లోని ప్రజలు కామెరూన్, గబాన్ ల మూలాలు ఉన్నాయి. వారు రెండు విభాగాలను ఏర్పరుచుకున్నారు: మోవిమియానో నాసియోనల్ డే లిబెరసియోన్ డి లా గినియా (మోనలిగ్), ఐడియా పాపులర్ డి గినియా ఇక్యూటేరియలు.

స్వాతంత్రం (1968)

[మార్చు]

1968 అక్టోబరు 12 న ఈక్వటోరియల్ గినియా స్వతంత్రం ఆమోదించబడిన తరువాత ఈ ప్రాంతం ఈక్వెటోరియల్ గినియా రిపబ్లిక్కుగా మారింది. ఫ్రాన్సిస్కో మాసిస్ గ్యుమా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.[27]1969 క్రిస్మస్ ఈవులో మాసియస్ గ్యుమా నియామకాన్ని ఎదిరిస్తూ తిరుగుబాటులో పాల్గొన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న 150 మది మరణశిక్షకు గురైయ్యారు.[28]

1970 జూలైలో మాసియస్ గ్యూమా ఏక పార్టీ ప్రభుత్వాన్ని సృష్టించి 1972 లో తనను తాను అధ్యక్షుడిగా చేసుకున్నాడు. అతను స్పెయిన్, పశ్చిమ దేశాలతో సంబంధాలను రద్దు చేసుకున్నాడు. "నియో-వలసవాదాన్ని"గా భావించిన మార్క్సిజం విధానాలతో ఈక్వెటోరియల్ గినియా సోషలిస్టు దేశాలతో (ముఖ్యంగా చైనా, క్యూబా, రష్యా లతో) ప్రత్యేక సంబంధాలను కొనసాగించింది. మాసిస్ గ్యూమా సోవియట్ యూనియనుతో వాణిజ్య ఒప్పందం, షిప్పింగు ఒప్పందాల మీద సంతకం చేసింది. సోవియెట్లు కూడా ఈక్వేటోరియల్ గినియాకు రుణాలు మంజూరు చేసారు.[29]


షిప్పింగు ఒప్పందం, పైలట్ చేపల పెంపక ప్రాజెక్టు కోసం సోవియట్ అనుమతితో లూబాలో ఒక నావికా స్థావరం స్థాపించబడింది. దీనికి బదులుగా రష్యా ఈక్వటోరియల్ గినియాకు చేపలను సరఫరా చేసింది. చైనా, క్యూబా ఈక్వెటోరియల్ గినియాకు ఆర్థిక, సైనిక, సాంకేతిక సహాయం వంటి వివిధ రూపాలలో సహాయం అందించాయి. రష్యా తరఫున అంబాలా యుద్ధంలో లూబా స్థావరం, తరువాత మాలాబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు లకు చేరుకోవడానికి అనుమతి ఇవ్వడం ద్వారా ప్రయోజనం పొందింది.[29]

1974 లో వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ 1968 నుండి కొనసాగుతున్న హింసాత్మక పాలనలో ప్రజలు పెద్దసంఖ్యలో హతమార్చబడ్డారని ధృవీకరించింది. మొత్తం జనాభాలో నాలుగింట ఒకవంతు విదేశాలకు పారిపోయాడని వారు చెప్పారు. 'జైళ్లు నిండిపోయాయి ' ఒక విస్తారమైన కాన్సంట్రేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేసారు'. 3,00,000 ప్రజలలో సుమారు 80,000 మంది మృతి చెందారు.[30][31] బుబి ప్రజలకు వ్యతిరేకంగా సామూహిక హత్యాకాండ ఆరోపించడమే కాకుండా మాసియస్ గ్యుమా వేలమంది అనుమానిత ప్రత్యర్థులను మరణశిక్ష అమలుచేయమని ఆదేశించాడు. చర్చిలను మూసివేశారు ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది, నైపుణులు, విదేశీయులు దేశం వదిలి పారిపోయారు.[32]

1979 ఆగస్టు 3 న మాసియస్ గ్యుమా మేనల్లుడు తేడొరో ఒబింగ్గ్ తన మామను ఒక రక్తపాత తిరుగుబాటు ఆక్రమణలో తొలగించాడు. గ్యుమాను స్వాధీనం చేసుకోవడానికి రెండు వారాల పౌర యుద్ధం జరిగింది. తరువాత వెంటనే ఆయన ఉరితీయబడ్డాడు.[33]

1995 లో అమెరికాలోని మొబిల్ ఈక్వేటరు గినియాలో చమురు సంస్థ చమురు నిలువలను కనుగొంది. తదనుగుణంగా దేశం వేగవంతమైన ఆర్ధిక అభివృద్ధిని అనుభవించింది. అయితే దేశానికి లభిం ఇన చమురు సంపద ఆదాయాలు ప్రజలకు చేరుకోలేకపోయాయి. ఐక్యరాజ్యసమితి మానవ అభివృద్ధి సూచికలో దేశం దిగువ స్థాయిలో ఉంది. 5 సంవత్సరాల లోపు పిల్లలు 20% మంది పిల్లలు చనిపోతున్నారు. జనాభాలో 50% కంటే ఎక్కువ మంది ప్రజలకు తాగునీరు అందుబాటులో లేదు. [34]అధ్యక్షుడు టయోడొరో ఒబింగ్గ్ దేశంలోని చమురు సంపదను తనను తాను మెరుగుపర్చడానికి ఉపయోగించినట్లు,[35] అతని సహచరులను విస్తృతంగా అనుమానించారు. 2006 లో ఫోర్బ్సు వ్యక్తిగత సంపద $ 600 మిలియన్లు ఉన్నట్లు అంచనా వేసింది.[36]2011 లో ఓయాల అనే కొత్త రాజధాని చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.[37][38][39][40] 2017 లో సియుడాడ్ డె లా పాజ్ ("శాంతి నగరం") గా మార్చారు.

2016 నాటికి ఒబియాంగ్ ఆఫ్రికా దీర్ఘకాలం పనిచేసే నియంతగా గుర్తించబడ్డాడు.[41]

భౌగోళికం

[మార్చు]

ఈక్వెటోరియల్ గినియా సెంట్రల్ ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఉంది. దేశం ప్రధాన భూభాగం రియో ముని ఉత్తర సరిహద్దులో కామెరూన్, తూర్పు, దక్షిణ సరిహద్దులలో గబాన్, ఐదు చిన్న ద్వీపాలు (బయోకో, కరిస్కో, అన్నాబొన్, ఎలోబే చీకో (స్మాల్ ఎలోబి), ఎలోబే గ్రాండే (గ్రేట్ ఎలోబే) ఉన్నాయి. బయోకో ద్వీపంలో రాజధాని నగరం మాలబో ఉంది. ఇది కామెరూన్ తీరంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనోబోన్ ద్వీపం గబాన్ లోని కేప్ లోపెజ్ పశ్చిమ-నైరుతి దిశగా సుమారు 350 కిలోమీటర్ల (220 మైళ్ళు) దూరంలో ఉంది. కరిస్కో, రెండు ఎల్బోయ్ ద్వీపాలు రియో ముని, గబాన్ సరిహద్దులోని కరిస్కో బేలో ఉన్నాయి.


ఈక్వటోరియల్ గినియా 4 ° ఉత్తర, 2 ° దక్షిణ అక్షాంశంలో, 5 ° నుండి 12 ° తూర్పు రేఖాంశంలో ఉంటుంది. పేరుకు తగినట్లు ఈ భూభాగం భూమధ్యరేఖాప్రాంతంలో ఉండక ఇది ఉత్తర అర్ధగోళంలో ఉంది. భూమధ్యరేఖకు 155 కి.మీ (96 మై) దక్షిణాన ఉన్న ఇన్సోలర్ అన్నోబన్ ప్రావిన్సు మినహా.

వాతావరణం

[మార్చు]

ఈక్వటోరియల్ గినియాలో తడి,పొడి సీజన్లతో ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. జూన్ నుండి ఆగస్టు వరకు రియో మునిలో పొడి, బయోకోలో తడి వాతావరణం ఉంటుంది. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇందుకు వ్యతిరేక వాతావరణం ఉంటుంది. మధ్యలో క్రమంగా మార్పు ఉంటుంది. అన్నొబనులో వర్షం లేదా పొగమంచు రోజువారీ సంభవిస్తుంది. ఇక్కడ ఒక మేఘరహిత దినం నమోదు కాలేదు. దక్షిణ మోకా పీఠభూమి సాధారణ అధిక ఉష్ణోగ్రతలలో 21 ° సెంటీ గ్రేడు (70 ° ఫారెన్ హీటు) ఉన్నప్పటికీ, మలోబోలో, బయోకోలో ఉష్ణోగ్రత 16 ° సెంటీ గ్రేడు(61 ° ఫారెన్ హీటు) నుండి 33 ° సెంటీ గ్రేడు(91 ° ఫారెన్ హీటు) వరకు ఉంటుంది. రియో మునిలో, సగటు ఉష్ణోగ్రత సుమారు 27 ° సెంటీ గ్రేడు (81 ° ఫారెన్ హీటు) ఉంటుంది. వార్షిక వర్షపాతం మాలబోలో 1,930 మి.మీ (76 అం), ఉరేకా, బయోకోలో 10,920 మి.మీ(430 అం) వరకు ఉంటుంది. కానీ రియో ముని కొంతవరకు పొడిగా ఉంటుంది.[42]

పర్యావరణం

[మార్చు]

ఈక్వెటోరియల్ గినియా అనేక పర్యావరణ ప్రాంతాలు ఉంటాయి. రియో ముని ప్రాంతం అట్లాంటిక్ ఈక్వెటోరియల్ తీరప్రాంత పర్యావరణ ప్రాంతంలో ఉంది. ఇది తీరంలోని సెంట్రల్ ఆఫ్రికన్ వర్షారణ్యాల ఖండికలు మినహా, మిగిలిన ప్రాంతం ముని నది ఉద్యానవనంలో ఉంది. క్రాస్- సంగా- బైకో తీర అడవుల పర్యావరణం బయోకో, ఆఫ్రికన్ ప్రధాన భూభాగం, కామెరూన్, నైజీరియా సమీప భాగాలు, మౌంట్ కామెరూన్ కప్పేస్తుంది.

సావో టోమ్, ప్రిన్సిపి, అనోబన్ తేమతో కూడిన అడవుల పర్యావరణ ప్రాంతాలు అనోబన్, సావో టోమే, ప్రిన్సిపి వంటి అన్ని ప్రాంతాలలో ఉంటుంది.

నిర్వహణా విభాగాలు

[మార్చు]

ఈక్వటోరియల్ గినియా 8 ప్రొవింసులుగా విభజించబడింది.[43][44] 2017 లో దేశం భవిష్యత్ రాజధాని ఓయాల వద్ద దాని ప్రధాన కార్యాలయంతో సరికొత్తగా జిబ్లొహొ ప్రొవింసు సృష్టించబడింది.[45][46]

మిగిలిన ఏడు రాష్ట్రాలు క్రింది విధంగా ఉన్నాయి (రాజధానులు కుండలీకరణంలో కనిపిస్తాయి):[43]

 • అన్నాబొన్ (శాన్ ఆంటోనియో డి పాల్)
 • బయోకో నోర్టే (మలాబో)
 • బయోకో సుర్ (లూబా)
 • సెంట్రో సుర్ (ఎవినాయాంగ్)
 • కియె-నెంటం (ఇబీబిన్)
 • లిటోరాల్ (బాటా)
 • వేల్-న్జాస్ (మొంగోమో)

ఈ ప్రొవింసులు అదనంగా జిల్లాలుగా విభజించబడ్డాయి. [47]

ఆర్ధికం

[మార్చు]
A proportional representation of Equatorial Guinea's exports.

స్వాతంత్రానికి ముందు ఈక్వటోరియల్ గినియా కోకో, కాఫీ, కలపను అధికంగా వలస పాలనా దేశం అయిన స్పెయినుతో జర్మనీ, యు.కె. కూడా ఎగుమతి చేసింది. 1985 జనవరి 1 న ఫ్రాంక్ జోన్లో మొట్టమొదటి నాన్ ఫ్రాంకోఫొన్ ఆఫ్రికన్ సభ్యదేశం అయింది. సి.ఎఫ్.ఎ. ఫ్రాంకును దేశకరెన్సీగా స్వీకరించారు. జాతీయ కరెన్సీ, ఇక్వీల్, గతంలో స్పానిష్ పెసెట్టాతో ముడిపడి ఉంది.[48]


1996 లో బృహత్తర చమురు నిక్షేపాల ఆవిష్కరణ తరువాత దోపిడీ జరిగినప్పటికీ ప్రభుత్వం ఆదాయంలో నాటకీయ పెరుగుదలకు సంభవించింది. 2004 నాటికి[49] ఈక్వాటోరియల్ గినియా ఉప-సహారా ఆఫ్రికాలో మూడవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉంది. దాని చమురు ఉత్పత్తి రోజుకు 3,60,000 బారెల్స్ (57,000 క్యూబిక్ మీ) నుండి రెండు సంవత్సరాల క్రితం నుండి 2,20,000 క్యూబిక్.మీ కు అధికరించింది

అటవీ, వ్యవసాయం, చేపలు పట్టడం కూడా జి.డి.పి. ప్రధాన భాగాలుగా ఉన్నాయి. సబ్సిస్టెన్స్ వ్యవసాయం ప్రధానంగా ఉంటుంది. వరుస క్రూరమైన ప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్షీణత వ్యవసాయ అభివృద్ధిని తగ్గించింది.

2004 జూలై లో యునైటెడ్ స్టేట్స్ సెనేట్ రిగ్స్ బ్యాంక్ అనే ఒక పరిశోధనను ప్రచురించింది. ఇది వాషింగ్టన్ ఆధారిత బ్యాంకు ఇటీవల ఈక్వెటోరియల్ గినియా చమురు ఆదాయాలు ఇటీవల వరకు చెల్లించబడ్డాయి. ఒబాంగ్, అతని కుటుంబం, పాలన సీనియర్ అధికారులు సెనేట్ నివేదిక కనీసం $ 35 మిలియన్లను స్వంతం చేసుకున్నారు. అధ్యక్షుడు తాను ఏ తప్పు చేయలేదని ఖండించారు. 2005 ఫిబ్రవరిలో రిగ్స్ బ్యాంక్ పినాచెత్ బ్యాంకింగు పునర్నిర్మాణంలో $ 9 మిలియన్లు చెల్లించింది. ఈక్వెటోరియల్ గినియాకు సంబంధించి ఎలాంటి పరిమితి విధించబడలేదు.[50]

2000 నుండి 2010 వరకు జి.డి.పి. (స్థూల దేశీయోత్పత్తి) లో ఈక్వెటోరియల్ గినియా 17% సగటు వార్షిక పెరుగుదలను కలిగి ఉంది.[51]

ఈక్వెటోరియల్ గినియా ఆఫ్రికాలోని ఆర్గనైజేషన్ ఫర్ ది హార్మోనిజేషన్ ఆఫ్ బిజినెస్ లా (OHADA) లో సభ్యదేశంగా ఉంది. [52] ఈక్వెటోరియల్ గినియా ఒక ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్ ట్రాన్స్పరెన్సీ ఇనిషియేటివ్ కంప్లైంట్ కంట్రీగా చెల్లుబాటు అయ్యే ప్రయత్నం చేసింది. చమురు ఆదాయాలు, సహజ వనరుల సంపద వివేచనాత్మక ఉపయోగం గురించి పారదర్శకతకు కృషి చేయడం ఇందులో భాగంగా ఉన్నాయి. 2008 ఫిబ్రవరి 22 న అభ్యర్థి హోదాను పొందింది. తరువాత పౌర సమాజంతో, ఇ.ఐ.టి.ఐ. అమలులో ఉన్న సంస్థలతో పనిచేయడం, ఎ.ఐ.టి.ఐ. అమలులో అనుభవం ఉన్న వ్యక్తిని నియమించడం వంటి లక్ష్యాలతో పూర్తి ఖర్చుతో కూడిన పని ప్రణాళిక అమలు కోసం ఒక కాలనిర్ణయ పట్టిక, సామర్థ్య పరిమితుల అంచనా జరిగింది. అయితే ఈక్విటోరియల్ గినియా ఇ.ఐ.టి.ఐ. ధ్రువీకరణను పూర్తి చేయడానికి గడువును పొడిగించడానికి ప్రయత్నించినప్పుడు ఇ.ఐ.టి.ఐ. బోర్డు ఈ పొడిగింపుకు అంగీకరించలేదు.[53]

ప్రపంచ బ్యాంకు ఆధారంగా ఈక్వెటోరియల్ గినియా ఆఫ్రికన్ దేశాలలో అత్యధిక తలసరి జి.ఎన్.ఐ (స్థూల జాతీయ ఆదాయం) కలిగి ఉంది, ఇది పేద దేశాల బురుండి జి.ఎన్.ఐ. తలసరి కంటే 83 రెట్లు అధికం.[54]

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

దేశంలో పెద్ద చమురు పరిశ్రమ కారణంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వాయు రవాణా వాహనాలు మలాబో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. 2014 మేలో ఐరోపా, పశ్చిమ ఆఫ్రికాకు అనేక ప్రత్యక్ష అనుసంధానాలను కలిగి ఉంది. ఈక్వాటోరియల్ గినియా-మలాబో అంతర్జాతీయ విమానాశ్రయం, బటా విమానాశ్రయం, ఆన్నోబోన్ ద్వీపంలో ఉన్న నూతన అన్నొబొన్ విమానాశ్రయంతో కలిపి దేశంలో మొత్తం మూడు విమానాశ్రయాలు ఉన్నాయి. మలాబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మాత్రమే అంతర్జాతీయ విమానాశ్రయంగా ఉంది.

ఈక్వెటోరియల్ గినియాలో నమోదైన ఎయిర్లైన్స్ ఐరోపా సమాఖ్యలో నిషేధించబడిన ఎయిర్ క్యారియర్స్ జాబితాలో కనిపిస్తుంది. దీంతో ఐరోపా సమాఖ్యలో ఆపరేటింగ్ సేవల నుండి వారు నిషేధించబడ్డారు.[55] అయినప్పటికీ రవాణా సరుకు రవాణాదారులు ఐరోపా నగరాల నుంచి రాజధానికి సేవలను అందిస్తారు.

గణాంకాలు

[మార్చు]
Population in Equatorial Guinea[8]
Year Million
1950 0.2
2000 0.6
2016 1.2
Equatorial Guinean children of Bubi descent.

ఈక్వెటోరియల్ గినియా ప్రజలలో బంటు సంతతికి చెందినవారు అధికంగా ఉంటారు.[56] అతిపెద్ద జాతి సమూహం ఫాంగు ప్రధాన భూభాగానికి చెందింది. 20 వ శతాబ్దం నుండి బయోకో ద్వీపానికి గణనీయమైన వలసలు కొనసాగిన తరువాత పూంగు ప్రజలు మునుపటి బుబి నివాసులను సంఖ్యాపరంగా అధిగమించింది. మొత్తం ప్రజలలో ఫాంగు ప్రజలు 80% మంది ఉన్నారు.[57]వీరిలో 67 కంటే అధికమైన వంశాలు ఉన్నాయి. రియో ముని ఉత్తర భాగంలో ఫంగు-నతుము భాషలు వాడుకలో ఉన్నాయి. దక్షిణప్రాంతంలో ఉన్న ప్రజలకు ఫాంగు-ఓకా వాడుకలో ఉంది. రెండు మాండలికాలు వైవిధ్యాలు కలిగి ఉంటాయి. కానీ పరస్పరం అర్థమయ్యేవిగా ఉన్నాయి. ఫాంగు మాండలికాలు పొరుగున ఉన్న కామెరూన్ (బులు) గాబన్ ప్రాంతాలలో కూడా వాడుకలో ఉన్నాయి. ఈ మాండలికాలు ఇప్పటికీ స్పష్టంగా, ప్రత్యేకమైనవిగా ఉంటాయి. మొత్తం జనాభాలో 15% బుబి ప్రజలు బయోకో ద్వీపానికి చెందినవారే. ఫాంగు 'బీచ్' (లోతట్టు) జాతి సమూహాల మధ్య సంప్రదాయ విభజన రేఖగా నైతాంగు గ్రామం (ఫాంగ్ పరిమితి)ఉంది.

టౌవ్ ("ప్లేయొరోస్") (స్పెయిన్ లో బీచ్ పీపుల్) అని పిలవబడే తీర జాతి సమూహాలు: ప్రధాన భూభాగం, చిన్న దీవులలో కాంబె ప్రజలు, బుజెబా ప్రజలు, బాలెంగా ప్రజలు, బెంగా ప్రజలు బికోక్ ద్వీపంలోని క్రియో కమ్యూనిటీ అయిన ఫెర్నాండినో ప్రజలు మొత్తం కలిపి జనాభాలో 5% మంది ఉన్నారు. దేశంలో ఐరోపావాసులు (ఎక్కువగా స్పానిష్ లేదా పోర్చుగీస్ సంతతివారు, కొంతమంది పాక్షిక ఆఫ్రికన్ సంతతికి చెందినవారు) నివసిస్తున్నారు. కానీ చాలామంది జాతీయులు స్వాతంత్ర్యం పొందిన తరువాత దేశం వదిలి స్పెయిన్ వెళ్ళారు.

పొరుగున ఉన్న కామెరూన్, నైజీరియా, గబాన్ నుండి విదేశీయుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ది స్టేట్ లెస్ నేషన్స్ (2002) ఆధారంగా బయోకో ద్వీపవాసులలో 7% ఇగ్బో (ఆగ్నేయ నైజీరియా నుండి ఒక జాతి సమూహం) ఉన్నారు. [58] ఈక్విటోరియల్ గినియా కోకో, కాఫీ తోటలలో పనిచేయడానికి ఆసియా, స్థానిక ఆఫ్రికన్ మొదలైన ఇతర దేశాలకు చెందిన కార్మికులను స్వీకరించింది. ఇతర నల్ల జాతి ఆఫ్రికన్లు లైబీరియా, అంగోలా, మొజాంబిక్ నుండి వచ్చారు. ఆసియా జనాభాలో స్వల్పసంఖ్యలో ఉన్న భారతీయులతో చాలా మంది చైనీయులు ఉన్నాయి.

ఈక్వాటోరియల్ గినియా బ్రిటన్, ఫ్రాన్సు, జర్మనీ నుండి యూరోపియన్ స్థిరనివాసం కోరుకునే వారికి కూడా ఒక గమ్యస్థానంగా ఉంది. దేశంలో ఇజ్రాయిల్, మొరాక్ ప్రజలు కూడా నివసిస్తున్నారు. 1990 నుండి చమురు వెలికితీత మలాబోలో జనాభా రెట్టింపు కావడానికి దోహదపడింది. స్వాతంత్ర్యం తరువాత వేలమంది ఈక్వటోరియన్ ప్రజలు స్పెయినుకు వెళ్ళారు. ఫ్రాన్సిస్కో మాకియా గ్యుమా నియంతృత్వం కారణంగా మరో 1,00,000 ఈక్వటోరియన్ ప్రజలు కామెరూన్, గబాన్, నైజీరియాకు వెళ్లారు. లాటిన్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్, పోర్చుగల్, ఫ్రాన్సులలో కూడా కొంత మంది ఈక్వేటోరియల్ గినియా కమ్యూనిటీలు కనిపిస్తాయి.

భాషలు

[మార్చు]

అనేక సంవత్సరాలుగా స్పానిషు (ఈక్కోటూగినియన్ స్పానిషు మాండలికం) ఫ్రెంచి అధికారిక భాషలుగా ఉన్నాయి.[6] 2010 లో పోర్చుగీసు కూడా అధికారిక భాషగా స్వీకరించబడింది.[59][60] 1844 నుండి స్పానిషు అధికారిక భాషగా ఉంది. ఇది ఇప్పటికీ విద్యాబోధన, పరిపాలన భాషగా ఉంది. 67.6% ఈక్వటోరియల్ గినీయా ప్రజలు (ముఖ్యంగా మలోబో రాజధానిలో నివసిస్తున్న వారు) మాట్లాడగలరు. [61] ఫ్రాంకోఫొనీ దేశంగా గుర్తించాలంటే ఫ్రెంచి మాత్రమే అధికార భాషగా ఉండాలన్న నియమం ఉంది. ఫ్రెంచి భాషను కొన్ని సరిహద్దు పట్టణాలలో మినహా స్థానికంగా మాట్లాడలేరు.

స్థానిక భాషలు "జాతీయ సంస్కృతి" లో(రాజ్యాంగ చట్టం No. 1/1998 జనవరి 21) భాగాలుగా గుర్తించబడ్డాయి. దేశీయ భాషలలో ఫాంగు, బ్యూబు, బెంగా, డోవె, బాలెంక్యూ, బుజెబా, బిస్సియో, గుము, ఇగ్బో, పిచింగ్లిస్, ఫా డి'అంబో, దాదాపు అంతరించిపోయిన బేస్సీసు ఉన్నాయి. చాలామంది ఆఫ్రికన్ జాతి సమూహాలు బంటు భాషలను మాట్లాడతాయి.[62]

పోర్చుగీసు క్రియోలుకు చెందిన ఫా డి అంబో, మలాబోలో (రాజధాని), ఈక్వెటోరియల్ గినియా ప్రధాన భూభాగంలోని కొంతమందికి(అన్నోబన్ ప్రావిన్సులో తీవ్రమైన వాడకం) అన్నొబొంసే భాష వాడుకభాషగా ఉంది. బయోకోలోని చాలామంది నివాసితులు (ప్రత్యేకంగా రాజధాని) స్థానిక పిచింగ్లీసు భాష వాణిజ్య భాష, ఆంగ్ల-ఆధారిత క్రియోల్ మాట్లాడతారు. అన్నోబాన్లో స్పానిషు వాడుకలో లేదు. ప్రభుత్వం నిర్వహణ, విద్యాబోధనలో స్పానిషు ఉపయోగించబడుతుంది. స్థానిక క్యాథలిక్కులు పోర్చుగీసును ప్రార్ధనా భాషగా ఉపయోగించారు.[63] పోర్చుగీస్ భాషా దేశాల కమ్యూనిటీలో అనోబొనీస్ జాతి సంఘం సభ్యత్వం పొందేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వం అనోబొన్లో ఒక ఇన్‌స్టిట్యూటో ఇంటర్నేషనల్ డా లింగ్యుయా పోర్చుగీసా (ఐఐఎల్పి)అన్నొబొను భాషా సాంఘిక విశ్లేషణ అధ్యయనానికి నిధులు సమకూర్చింది. ఇది సావో టోమే, ప్రిన్సిపి, కేప్ వెర్డే, గునియా-బిసావులలో పోర్చుగీసు క్రియోలు ప్రజల మద్య ఉన్న బలమైన సంబంధాలను నమోదు చేసింది.[60]

చారిత్రక, సాంస్కృతిక సంబంధాల కారణంగా 2010 లో ఈక్వెటోరియల్ గినియా రాజ్యాంగం నాలుగు చట్టసవరణలు చేసింది. పోర్చుగీసును రిపబ్లిక్కు అధికార భాషగా ఏర్పాటు చేసింది. పోర్చుగీసు-మాట్లాడే దేశాలతో సమాచార, వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఇది.[64][65][66] పోర్చుగలుతో ఉన్న దీర్ఘకాలిక చారిత్రక సంబంధాలు, బ్రెజిల్, సావో టోమ్, ప్రిన్సిపే, కేప్ వెర్డే పోర్చుగీస్ మాట్లాడే ప్రజలతో కూడా ఇది దృష్టిలోకి తీసుకున్నది.

పోర్చుగీసు భాషా దేశాల సమాజంలో ఈక్వెటోరియల్ గినియా సభ్యత్వం కోసం అనేక ప్రొఫెషనల్, అకాడెమిక్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. పౌరులు సరిహద్దు దాటడానికి ఇది దోహదపడింది.[61] అధికారిక భాషగా పోర్చుగీసును స్వీకరించడం సి.పి.ఎల్.పి. ఆమోదం కోసం దరఖాస్తు చేయడానికి ప్రాథమిక అవసరం. అంతేకాక దేశంలో రాజకీయ సంస్కరణలతో ప్రభావవంతమైన ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పట్ల గౌరవం కల్పించడానికి ఇది తప్పనిసరి అయింది.[67] 2011 అక్టోబర్లో జాతీయ పార్లమెంటు ఈ చట్టాన్ని గురించి చర్చించింది.[68]


2012 ఫిబ్రవరిలో ఈక్వెటోరియల్ గినియా విదేశాంగ మంత్రి ఐ.ఐ.ఎల్.పితో ఒప్పందం కుదుర్చుకుని దేశంలో పోర్చుగీసును ప్రోత్సాహించాడు. [69][70]


2012 జూలైలో సి.పి.ఎల్.పి.ని ఈక్వాటోరియల్ గినియా పూర్తి స్థాయి సభ్యత్వాన్ని నిరాకరించింది. ప్రధానంగా మానవ హక్కుల తీవ్ర ఉల్లంఘనల జరిగిందన్న కారణంగా ఇది జరిగింది. ప్రభుత్వం స్పందించి రాజకీయ పార్టీలను చట్టబద్ధం చేసి, మరణశిక్షపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించి, అన్ని రాజకీయ వర్గాలతో సమాలోచనలు చేసింది.[60][71] అంతేకాకుండా ఐ.ఐ.ఎల్.పికు పోర్చుగీసు భాషా సాంస్కృతిక కేంద్రాల నిర్మాణం కొరకు బటా, మలబోలో ప్రభుత్వ నుండి భూమి మంజూరు చేయబడింది.[60] 2014 జూలైలో డిలిలో జరిగిన దాని 10 వ సమావేశంలో ఈక్వెటోరియల్ గినియాను సి.పి.ఎల్.పి. సభ్యదేశంగా అనుమతించారు. మరణశిక్ష రద్దు, పోర్చుగీసును అధికార భాషగా ప్రోత్సహించడం ఆమోదానికి పూర్వగాములుగా ఉన్నాయి.[72]

Religion in Equatorial Guinea
Religion percent
Roman Catholic
  
87%
Other (indigenous beliefs / Bahá'í)
  
5%
Protestant
  
5%
Islam
  
2%

గినియాలో ప్రధాన మతం క్రైస్తవ మతం. జనాభాలో క్రైస్తవులు 93% ఉన్నారు. వీరిలో రోమను కాథలిక్కులు మెజారిటీ (87%) ఉన్నారు. అల్పసంఖ్యాక ప్రొటెస్టంట్లు (5%). ముస్లిములు 2% మంది (ముఖ్యంగా సున్నీ) ఉన్నారు. 5% మంది అనిమిజం, బహాయీ విశ్వాసం, ఇతర నమ్మకాలకు చెందిన వారు ఉన్నారు.[73]

ఆరోగ్యం

[మార్చు]

21 వ శతాబ్దం ప్రారంభంలో ఈక్వాటోరియల్ గినియా వినూత్న మలేరియా కార్యక్రమాల ద్వారా మలేరియా వ్యాధి మరణాల తగ్గింపులో విజయం సాధించాయి. [74] వారి కార్యక్రమంలో సంవత్సరానికి రెండుమార్లు గృహాలలో రెసిడ్యువల్ స్ప్రేయింగ్ (ఐఆర్ఎస్), ఆర్టిమిసినిన్ కలయిక చికిత్స (ఆక్స్), గర్భిణీ స్త్రీలలో నివారణ చికిత్సను ఉపయోగించడం, దీర్ఘకాలిక క్రిమిసంహారకాల పరిచయం చేయడం, దోమతెరల ఉపయోగం భాగంగా ఉన్నాయి. వారి ప్రయత్నాలతో 5 సంవత్సరాల లోపు పిల్లలలో 1,000 మందిలో మరణాలు 152 నుండి 55 మరణాలకు తగ్గించడానికి కారణమయ్యాయి.[75] 2014 జూనులో నాలుగు పోలియో కేసులు నివేదించబడ్డాయి. ఈ వ్యాధి దేశంలో మొదటి సారిగా కనిపించింది.[76]

విద్య

[మార్చు]

ఫ్రాన్సిస్కో మాసిస్ పాలనలో విద్య నిర్లక్ష్యం చేయబడింది. ప్రెసిడెంట్ ఒబుయాంగు పాలనలో నిరక్షరాస్యత రేటు 73% నుండి 13% కు పడిపోయింది.[6] 1986 లో 65,000 ఉన్న ప్రాధమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య నుండి 1994 నాటికి 1,00,000 కు అధికరించింది. 6 సంవత్సరాల వయస్సు నుండి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు నిర్బంధ విద్య అమలులో ఉంది.[48][77]2018 నాటికి 51 మోడేల్ స్కూల్సు ఉన్నాయి.

ఈక్వెటోరియల్ గినియా ప్రభుత్వం హేస్ కార్పరేషన్, ది అకాడెమి ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ (AED) తో భాగస్వామిగా ఉంది. ఇది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఆధునిక బాలల అభివృద్ధి పద్దతులకు బోధించడానికి ఒక $ 20 మిలియన్ల డాలర్లు వ్యయం చేస్తుంది.

ఇటీవల సంవత్సరాలలో ఆర్ధిక, రాజకీయ వాతావరణం మార్పులతో ప్రభుత్వం యొక్క ఆర్ధిక సహకారంతో సాంస్కృతిక వ్యాప్తి, అక్షరాస్యత సంస్థలు (ప్రధానంగా స్పానిషు) స్థాపించబడింది. దేశంలో " యూనివర్సిడాడ్ నేషనల్ డే గినియా ఇక్వేటోరియల్ " విశ్వవిద్యాలయం ఉంది. ఇది మాలాబాలో క్యాంపసు, ప్రధాన భూభాగంలో బాటాలో ఒక మెడిసన్ ఫ్యాకల్టీ మెడిసిన్ కలిగి ఉంది. 2009 లో విశ్వవిద్యాలయం మొదటి 110 జాతీయ వైద్యులను ఉత్పత్తి చేసింది. [78] బాటా మెడికల్ స్కూల్ ప్రధానంగా క్యూబా ప్రభుత్వం, క్యూబా వైద్య విద్యావేత్తలు, వైద్యులు సిబ్బందికి మద్దతు ఇస్తుంది. వచ్చే ఐదు సంవత్సరాలలో ఈక్వాటోరియల్ గినియా దేశంలో తగినంత జాతీయ వైద్యులతో స్వయం సమృద్ధిగా ఉంటుందని అంచనా వేసింది.[78]

సంస్కృతి

[మార్చు]
The port of Malabo.

మొదటి హిస్పానిక్-ఆఫ్రికన్ సాంస్కృతిక కాంగ్రెస్ ఈక్వెటోరియల్ గినియా సాంస్కృతిక గుర్తింపును అన్వేషించడానికి సమావేశమైంది. జాతులను సంఘటితం చేయడానికి ఆఫ్రికన్ సంస్కృతులతో హిస్పానిక్ సంస్కృతిక ప్రజల వివాహవ్యవస్థను వివాహాన్ని ఏర్పాటు చేసింది.[48]

పర్యాటకం

[మార్చు]

ప్రస్తుతం యునెస్కొ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు లేవు.[79] యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద జాబితా చేయబడని దేశం, గానీ లేదా యునెస్కో కల్చరల్ హెరిటేజ్ జాబితాలో లేని దేశాలలో ఈక్వటోరియా గినియా ఒకటి.[80][81]

మాధ్యమం, సమాచారరంగం

[మార్చు]

ఈక్వెటోరియల్ గినియాలో కమ్యూనికేషన్ ప్రధాన మార్గంగా మూడు ప్రభుత్వ ఆధారిత ఎఫ్.ఎం. రేడియో స్టేషన్లు ఉన్నాయి. బి.బి.సి. వరల్డ్ సర్వీస్, రేడియో ఫ్రాన్స్ ఇంటర్నేషనల్, గాబోన్ ఆధారిత ఆఫ్రికా నో 1 ప్రసారం (మాబబోలో ఎఫ్.ఎం). రేడియో మాకుటో అని పిలవబడే స్వతంత్ర రేడియో కూడా ఉంది. రేడియో మాకుటో ఒక వెబ్ ఆధారిత రేడియో ఒక వార్తా సంస్థగా ఉంది. ఐదు షార్ట్వేవ్ రేడియో స్టేషన్లు కూడా ఉన్నాయి. టెలివిజన్ నేషనల్, టెలివిజన్ నెట్వర్కులను ప్రభుత్వం నిర్వహిస్తుంది.[6][82] అంతర్జాతీయ టి.వి. కార్యక్రమం ఆర్.టి.వి.జి.ఇ. ఆఫ్రికా, ఐరోపా అమెరికా ఖండాలు, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా, ఉపగ్రహప్రసారాల ద్వారా అందుబాటులో ఉంది.[83] రెండు వార్తాపత్రికలు, రెండు పత్రికలు ఉన్నాయి.

ఈక్వటోరియల్ గినియా 2012 లో రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రెస్ ఫ్రీడమ్ జాబితాలో 179 దేశాల్లో 161 స్థానంలో ఉంది. జాతీయ ప్రసారాలు సమాచారం మంత్రిత్వ శాఖ ఆదేశాలను అనుసరిస్తుంది అని వాచ్డాగ్ చెబుతుంది. చాలామంది మీడియా కంపెనీలు స్వీయ-సెన్సార్షిప్పు విధానాన్ని పాటిస్తాయి. ప్రముఖులను విమర్శించడాన్ని చట్టం నిషేధిస్తుంది. ప్రభుత్వ యాజమాన్య మీడియా, ప్రధాన ప్రైవేటు రేడియో స్టేషన్ అధ్యక్షుడి కుమారుడు " తెడోర్ ఒబింగ్గు " మార్గదర్శకంలో పనిచేస్తున్నాయి.


ల్యాండ్లైన్ టెలిఫోన్ సౌకర్యం తక్కువగా ఉంటుంది. ప్రతి 100 మంది వ్యక్తులకు రెండు లైన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.[6] జి.ఎస్.ఎం. మొబైల్ టెలిఫోన్ ఆపరేటరు సేవలు మాబబో, బాటా, అనేక ప్రధాన భూభాగ నగరాలకు అందిస్తూ ఉంది. [84][85] 2009 నాటికి జనాభాలో సుమారు 40% మంది మొబైల్ టెలిఫోన్ సేవల సభ్యత్వాన్ని పొందారు.[6] " ఆరెంజ్ " ఈక్వెటోరియల్ గినియాలో టెలిఫోన్ ప్రొవైడరుగా ఉంది.

2011 డిసెంబరు నాటికి 42,000 మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు.

సంగీతం

[మార్చు]

ఈఈక్వటోరియల్ గినియాలో కొన్ని ప్రజాదరణ కల్గిన సంగీత శైలిలు ఉన్నాయి. సౌకాస్, మకోస్సా వంటివి ప్రసిద్ధి చెందిన ఆఫ్రికా సంగీతశైలులు (రెగె, రాకెన్ రోల్) ప్రజాదరణ కలిగి ఉన్నాయి. స్పానిష్ మోడల్ ఎకౌస్టిక్ గిటార్ బ్యాండ్లు దేశం అత్యంత ప్రసిద్ధ దేశీయ సంగీత సంప్రదాయంగా ఉంది.

క్రీడలు

[మార్చు]

ఈక్వటోరియా గినియా గాబన్ భాగస్వామ్యంతో 2012 ఆఫ్రికన్ కప్ ఆఫ్ ఆఫ్రికన్ కప్ సహ-హోస్టుగా ఎంపిక చేయబడింది. 2015 ఎడిషన్ను నిర్వహించారు. 2008 సంవత్సరపు మహిళల ఆఫ్రికన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్పుకు ఆతిథ్యం ఇవ్వటానికి ఈ దేశం ఎంపిక చేయబడింది. ఈ క్రీడలలో వారు గెలిచారు. మహిళల జాతీయ జట్టు జర్మనీలో 2011 ప్రపంచ కప్ కోసం అర్హత సాధించింది.

2016 జూన్ లో ఈక్వెటోరియల్ గినియా 2019 లో 12 వ ఆఫ్రికన్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఎన్నిక చేయబడింది.

ఈక్వెటోరియల్ గినియా ఈతక్రీడాకారుడు "ఎరిక్ ది ఈల్"(ఎరిక్ ది ఎల్ అనే ముద్దుపేరు ఉంది)[86] పౌలా బరీలా బోలోపా, "పౌలా ది క్రాలర్" అనే మారుపేరుతో పిలవబడే ఎరిక్ మౌసాంబాని 2000 సమ్మర్ ఒలంపిక్సులో విపరీతమైన నెమ్మదిగా ఆడేవారికి ప్రసిద్ధి చెందింది.[87]

మూలాలు

[మార్చు]
 1. Government of the Republic of Equatorial Guinea. "Equatorial Guinea, member of the Community of Portuguese Language Countries".
 2. Government of the Republic of Equatorial Guinea. "Acts continue to mark Portuguese Language and Portuguese Culture Day".
 3. PRNewsWire. "Equatorial Guinea Adds Portuguese as the Country's Third Official Language". Archived from the original on 12 జూన్ 2018. Retrieved 18 July 2015.
 4. "World Directory of Minorities and Indigenous Peoples – Equatorial Guinea : Overview". UNHCR. 20 May 2008. Archived from the original on 13 January 2013. Retrieved 18 December 2012.
 5. Dickovick, James Tyler (2012). Africa 2012. Stryker Post. p. 180. ISBN 1-61048-882-2.
 6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 Equatorial Guinea Archived 2020-08-31 at the Wayback Machine. Cia World Factbook.
 7. "Equatorial Guinea country profile". BBC. 2017-08-20.
 8. 8.0 8.1 "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 September 2017.
 9. "2015 Census Preliminary Results" (PDF). inege.gq. Archived from the original (PDF) on 15 జూన్ 2016. Retrieved 15 జనవరి 2019.
 10. 10.0 10.1 10.2 10.3 "World Economic Outlook Database, April 2016". IMF.
 11. 11.0 11.1 "2018 Human Development Report" (PDF). United Nations Development Programme. 2016. Retrieved 21 March 2017.
 12. "INEGE | INSTITUTO NACIONAL DE ESTADÍSTICA DE GUINEA ECUATORIAL". www.inege.gq (in యూరోపియన్ స్పానిష్). Archived from the original on 2017-04-20. Retrieved 2017-04-19.
 13. GDP – per capita (PPP) – Country Comparison. Indexmundi.com. Retrieved on 5 May 2013.
 14. GDP – per capita (PPP) Archived 2013-04-24 at the Wayback Machine, The World Factbook, Central Intelligence Agency.
 15. Worst of the Worst 2010. The World's Most Repressive Societies. freedomhouse.org
 16. Equatorial Guinea – Reporters Without Borders Archived 15 అక్టోబరు 2010 at the Wayback Machine. En.rsf.org. Retrieved on 5 May 2013.
 17. "Equatorial Guinea". Trafficking in Persons Report 2012. U.S. Department of State (19 June 2012). This source is in the public domain.
 18. Bostoen (K.), Clist (B.), Doumenge (C.), Grollemund (R.), Hombert (J.-M.), Koni Muluwa (J.) & Maley (J.), 2015, Middle to Late Holocene Paleoclimatic Change and the Early Bantu Expansion in the Rain Forests of Western Central Africa, Current Anthropology, 56 (3), pp.354-384.
 19. Clist (B.). 1990, Des derniers chasseurs aux premiers métallurgistes : sédentarisation et débuts de la métallurgie du fer (Cameroun, Gabon, Guinée-Equatoriale). In Lanfranchi (R.) & Schwartz (D.) éds. Paysages quaternaires de l'Afrique Centrale Atlantique. Paris : ORSTOM, Collection didactiques : 458-478
 20. Clist (B.). 1998. Nouvelles données archéologiques sur l'histoire ancienne de la Guinée-Equatoriale. L'Anthropologie 102 (2) : 213-217
 21. Sánchez-Elipe Lorente (M.). 2015. Las comunidades de la eda del hierro en África Centro-Occidental: cultura material e identidad, Tesi Doctoral, Universidad Complutense de Madrid, Madrid
 22. "Fernando Po", Encyclopædia Britannica, 1911.
 23. 23.0 23.1 23.2 Clarence-Smith, William Gervase (1986) "Spanish Equatorial Guinea, 1898–1940" in The Cambridge History of Africa: From 1905 to 1940 Ed. J. D. Fage, A. D. Roberts, & Roland Anthony Oliver. Cambridge: Cambridge University Press Archived 20 ఫిబ్రవరి 2014 at the Wayback Machine
 24. Martino, Enrique (2012). "Clandestine Recruitment Networks in the Bight of Biafra: Fernando Pó's Answer to the Labour Question, 1926–1945". International Review of Social History. 57: 39–72. doi:10.1017/s0020859012000417.
 25. Castillo-Rodríguez, S. (2012). "La última selva de España: Antropófagos, misioneros y guardias civiles. Crónica de la conquista de los Fang de la Guinea Española, 1914–1930". Journal of Spanish Cultural Studies. 13 (3): 315. doi:10.1080/14636204.2013.790703.
 26. Crowder, Michael, ed. (1984) The Cambridge History of Africa: Volume 8, from C. 1940 to C. 1975. Cambridge: Cambridge University Press, ISBN 0521224098.
 27. Campos, Alicia (2003). "The decolonization of Equatorial Guinea: the relevance of the international factor". Journal of African History. 44 (1): 95–116. doi:10.1017/s0021853702008319. Archived from the original on 2016-08-20. Retrieved 2019-01-30.
 28. "Equatorial Guinea - Mass Atrocity Endings". Tufts University. 7 August 2015.
 29. 29.0 29.1 Aworawo, David. "Decisive Thaw: The Changing Pattern of Relations between Nigeria and Equatorial Guinea, 1980–2005" (PDF). Journal of International and Global Studies. 1 (2): 103. Archived from the original (PDF) on 24 జనవరి 2013.
 30. Sengupta, Kim (11 May 2007). "Coup plotter faces life in Africa's most notorious jail". London: News.independent.co.uk. Archived from the original on 29 December 2007. Retrieved 3 May 2010.
 31. "True hell on earth: Simon Mann faces imprisonment in the cruellest jail on the planet". London: Dailymail.co.uk. 18 May 2007. Retrieved 3 May 2010.
 32. Daniels, Anthony (29 August 2004). "If you think this one's bad you should have seen his uncle". London: Telegraph.co.uk. Retrieved 22 May 2014.
 33. "The Five Worst Leaders In Africa". Forbes. 9 February 2012.
 34. BBC (14 November 2014) Equatorial Guinea profile.
 35. "DC Meeting Set with President Obiang as Corruption Details Emerge". Global Witness. 15 June 2012.
 36. Forbes (5 March 2006) Teodoro Obiang Nguema Mbasogo, President/Equatorial Guinea
 37. Empresas portuguesas planeiam nova capital da Guiné Equatorial. africa21digital.com (5 November 2011).
 38. Atelier luso desenha futura capital da Guiné Equatorial Archived 15 అక్టోబరు 2015 at the Wayback Machine. Boasnoticias.pt (5 November 2011). Retrieved on 5 May 2013.
 39. Arquitetos portugueses projetam nova capital para Guiné Equatorial Archived 10 మే 2013 at the Wayback Machine. Piniweb.com.br. Retrieved on 5 May 2013.
 40. Ateliê português desenha futura capital da Guiné Equatorial Archived 22 జనవరి 2012 at the Wayback Machine. Greensavers.pt (14 December 2011). Retrieved on 5 May 2013.
 41. Simon, Allison (11 July 2014). "Equatorial Guinea: One man's fight against dictatorship". The Guardian. Retrieved 9 May 2017.
 42. Nations Encyclopedia. Nations Encyclopedia (10 April 2011). Retrieved on 5 May 2013.
 43. 43.0 43.1 Law, Gwillim (22 March 2016). "Provinces of Equatorial Guinea". Statoids. Retrieved 25 September 2017.
 44. "El Gobierno inicia sus actividades en Djibloho" (in స్పానిష్). PDGE. 7 February 2017. Retrieved 25 September 2017.
 45. "La Presidencia de la República sanciona dos nuevas leyes" (in స్పానిష్). Equatorial Guinea Press and Information Office. 23 June 2017. Archived from the original on 25 జూన్ 2017. Retrieved 25 September 2017.
 46. "Equatorial Guinea government moves to new city in rainforest". BBC News. 8 February 2017. Retrieved 25 September 2017.
 47. Law, Gwillim (22 April 2016). "Districts of Equatorial Guinea". Statoids. Retrieved 25 September 2017.
 48. 48.0 48.1 48.2 "Equatorial Guinea". equatorialguinea.org. Archived from the original on 3 October 1999. Retrieved 3 May 2010.
 49. Justin Blum (7 September 2004). "U.S. Oil Firms Entwined in Equatorial Guinea Deals". washingtonpost.com. Retrieved 9 July 2008.
 50. "Inner City Press / Finance Watch: "Follow the Money, Watchdog the Regulators"". Innercitypress.org. Retrieved 3 May 2010.
 51. Glenday, Craig (2013). Guinness Book of Records 2014. p. 123. ISBN 978-1-908843-15-9.
 52. "OHADA.com: The business law portal in Africa". Retrieved 22 March 2009.
 53. Equatorial Guinea | EITI Archived 13 మే 2010 at the Wayback Machine. Eitransparency.org (27 September 2007). Retrieved on 5 May 2013.
 54. "50 Things You Didn't Know About Africa" (PDF). World Bank. Archived from the original (PDF) on 25 జూలై 2013. Retrieved 7 మే 2012.
 55. List of banned EU air carriers Archived 2012-04-04 at the Wayback Machine. Ec.europa.eu. Retrieved on 5 May 2013.
 56. Vines, Alex (2009). Well Oiled: Oil and Human Rights in Equatorial Guinea. Human Rights Watch. p. 9. ISBN 1-56432-516-4.
 57. "Equatorial Guinea's God". BBC. 26 July 2003. Retrieved 26 May 2011.
 58. Minahan, James (2002). Encyclopedia of the Stateless Nations: A-C. Greenwood Publishing Group. p. 330. ISBN 0-313-32109-4.
 59. "Guiné Equatorial" (in Portuguese). CPLP. Retrieved 28 November 2014.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
 60. 60.0 60.1 60.2 60.3 "Formação de professores e programas televisivos introduzem português na Guiné-Equatorial" [Teacher formation and television programs introduce Portuguese in Equatorial Guinea] (in Portuguese). Sol. 5 February 2014.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
 61. 61.0 61.1 Obiang convierte al portugués en tercer idioma oficial para entrar en la Comunidad lusófona de Naciones, Terra. 13 July 2007
 62. Oficina de Información y Prensa de Guinea Ecuatorial, Ministerio de Información, Cultura y Turismo. Guineaecuatorialpress.com. Retrieved on 5 May 2013.
 63. "Fa d'Ambu". Ethnologue. Retrieved 15 November 2010.
 64. "Equatorial Guinea Adds Portuguese as the Country's Third Official Language". PRNewsWire. 14 October 2011. Archived from the original on 12 జూన్ 2018. Retrieved 15 November 2010.
 65. "El portugués será el tercer idioma oficial de la República de Guinea Ecuatorial" (in Spanish). Gobierno de la Republica de Guinea Ecuatoria. Archived from the original on 3 సెప్టెంబరు 2015. Retrieved 15 November 2010.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
 66. "Proyecto de Ley Constitucional" (PDF). Gobierno de la Republica de Guinea Ecuatorial. 14 October 2011. Archived from the original (PDF) on 3 జనవరి 2012. Retrieved 15 November 2010.
 67. "Portuguese will be the third official language of the Republic of Equatorial Guinea". Guinea Ecuatorial Press, (20 July 2010). Retrieved on 5 May 2013.
 68. María Jesús Nsang Nguema (Prensa Presidencial) (15 October 2011). "S. E. Obiang Nguema Mbasogo clausura el Segundo Periodo Ordinario de Sesiones del pleno de la Cámara de Representantes del Pueblo" [President Obiang closes second session period of parliament] (in Spanish). Oficina de Información y Prensa de Guinea Ecuatorial (D. G. Base Internet). Retrieved 27 March 2012.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
 69. "Assinado termo de cooperação entre IILP e Guiné Equatorial" [Protocol signed on cooperation between IILP and Guinea Equatorial] (in Portuguese). Instituto Internacional de Língua Portuguesa. 7 February 2012. Retrieved 27 March 2012.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
 70. "Protocolo de Cooperação entre a Guiné-Equatorial e o IILP" [Protocol on cooperation between IILP and Guinea Equatorial] (in Portuguese). CPLP. 7 February 2012. Retrieved 27 March 2012.{{cite web}}: CS1 maint: unrecognized language (link) This note contains a link to the text of the protocol in PDF format.
 71. "CPLP vai ajudar Guiné-Equatorial a "assimilar valores"" (in Portuguese). Expresso. 20 September 2014. Retrieved 24 November 2012.{{cite web}}: CS1 maint: unrecognized language (link)[permanent dead link]
 72. "Nota informativa: Missão da CPLP à Guiné Equatorial" (in Portuguese). CPLP. 3 May 2011. Retrieved 27 March 2012.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
 73. "Equatorial Guinea. International Religious Freedom Report 2007". U.S. Department of State. 14 September 2007. Retrieved 3 May 2010.
 74. Steketee, R. W. (2009). "Good news in malaria control... Now what?". The American Journal of Tropical Medicine and Hygiene. 80 (6): 879–880. PMID 19478241.
 75. Marked Increase in Child Survival after Four Years of Intensive Malaria Control. Ajtmh.org. Retrieved on 5 May 2013.
 76. "Detection of poliovirus in São Paulo airport sewage: WHO". Brazil News.Net. Archived from the original on 10 జూలై 2014. Retrieved 23 జూన్ 2014.
 77. HESS and AED Partner to Improve Education in Equatorial Guinea. AED.org
 78. 78.0 78.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; www1.voanews.com అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
 79. Tentative Lists. unesco.org
 80. Equatorial Guinea – intangible heritage – Culture Sector. UNESCO. Retrieved on 19 January 2017.
 81. Memory of the World | United Nations Educational, Scientific and Cultural Organization. Unesco.org. Retrieved on 19 January 2017.
 82. "Country Profile: Equatorial Guinea: Media". BBC News. 26 January 2008.
 83. "TVGE Internacional". LyngSat. Retrieved 28 March 2012.
 84. "GSMWorld Providers: Equatorial Guinea". GSM World. 2008. Archived from the original on 14 ఏప్రిల్ 2008. Retrieved 1 ఫిబ్రవరి 2019.
 85. "GSMWorld GETESA Coverage Map". GSM World. 2008. Archived from the original on 8 January 2009.
 86. O'Mahony, Jennifer (27 July 2012). "London 2012 Olympics: how Eric 'the Eel' Moussambani inspired a generation in swimming pool at Sydney Games". Daily Telegraph. Archived from the original on 20 April 2005. Retrieved 18 December 2012.
 87. "'Paula the Crawler' sets record". BBC News. 22 September 2000. Retrieved 18 December 2012.