Jump to content

బోత్సువానా

వికీపీడియా నుండి
లిఫత్షె లొ బోత్సువానా
రిపబ్లిక్ ఆఫ్ బోత్సువానా
Flag of బోత్సువానా బోత్సువానా యొక్క చిహ్నం
నినాదం
" పుల "
" రెయిన్(వాన) "
జాతీయగీతం
ఫాత్సె లెనొ ల రొన
బ్లెస్డ్ బి దిస్ నోబుల్ లాండ్
బోత్సువానా యొక్క స్థానం
బోత్సువానా యొక్క స్థానం
రాజధానిగెబరోన్
24°40′S 25°55′E / 24.667°S 25.917°E / -24.667; 25.917
అతి పెద్ద నగరం రాజధాని
అధికార భాషలు ఆంగ్లము, త్సువానా& ఎన్ బి ఎస్ పి ;(national)
ప్రభుత్వం పార్లమెంటరీ రిపబ్లిక్
 -  ప్రెసిడెంట్ ఫెస్టస్ మొగె
ఇండిపెండెన్స్ యునైటెడ్ కింగ్‌డమ్ నుండి 
 -  తేది 30 సెప్టెంబర్ 1966 
విస్తీర్ణం
 -  మొత్తం 581,726 కి.మీ² (41వ)
224,606 చ.మై 
 -  జలాలు (%) 2.5
జనాభా
 -  2006 అంచనా 1,639,833 (147th)
 -  జన సాంద్రత 3.0 /కి.మీ² (220th)
7.8 /చ.మై
జీడీపీ (PPP) 2006 అంచనా
 -  మొత్తం $18.72 బిలియన్ (114th)
 -  తలసరి $11,400 (60th)
జినీ? (1993) 63 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.570 ( మధ్యమం ) (131st)
కరెన్సీ పుల (బి వి పి)
కాలాంశం సి ఎ టి (UTC+2)
 -  వేసవి (DST) నాట్ అబ్సర్వ్డ్ (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ . బిడబ్ల్యు
కాలింగ్ కోడ్ +267

బోత్సువానా దీనిని అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ బోత్సువానా అంటారు. దక్షిణఫ్రికా స్థానికులు మాట్లడే భాషలలో ఒకటైన త్‌స్వానా భాషలో దీనిని లెఫత్‌షి లా బోత్సువానా అంటారు. ఇది దక్షిణాఫ్రికా దేశాలలో ఒకటి. ఇక్కడి పౌరుల చేత బాత్సువానా అని పిలువబడింది. వాత్సవంగా ఇది బ్రిటిష్ ప్రొటెక్రేట్ అఫ్ బెచ్యుయానాలాండ్గా గుర్తించబడింది. 1966 సెప్టెంబరు 30న ఈ దేశానికి కామన్‌వెల్త్ దేశాల నుండి స్వతంత్రం లభించిన తరువాత ఈ దేశానికి బోత్సువానా అనే నామంతరం చేసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇక్కడ స్వతంత్రమైన చక్కని స్వేచ్ఛా పూరితమైన ఎన్నికలు నిర్వహించారు. బోత్సువానా సమతల ప్రదేశం ఉన్న దేశం. 70% దేశ సరిహద్దులను కలహరి ఎడారి చుట్టి ఉంటుంది. బోత్సువానా దక్షిణ సరిహద్దు, ఆగ్నేయ సరిహద్దులలో దక్షిణాఫ్రికా ఉంది. పడమటి, ఉత్తర సరిహద్దులలో నమీబియా ఉంటుంది. ఉత్తర సరిహద్దులలో జింబాబ్వే ఉంటుంది. బోత్సువానా తూర్పు భాగములో స్వల్పముగా కొన్ని వందల మీటర్ల సరిహద్దులలో జాంబియా ఉంటుంది. బోత్సువానా మధ్యంతర పరిమాణము కలిగిన భూపరివేష్టిత (లాండ్ లాక్) దేశము. బోత్సువానా జనసంఖ్య 2,000,000. స్వతంత్రం రాక పూర్వము బోత్సువానా ఆఫ్రికా దేశాలలో అతి బీద దేశం. బోత్సువానా జిడిపి అప్పుడు 0.75 అమెరికా డాలర్లు మాత్రమే ఉండేది. స్వతంత్రం వచ్చిన తరువాత బోత్సువానా స్వశక్తితో శీఘ్రంగా అభివృద్ధి సాధించిన కారణంగా త్వరితగతిన అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో ఒకటిగా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 2010 అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా ప్రకారము బోత్సువానా సరాసరి తలసరి అదాయము 14,000 అమెరికా డాలర్లు. బోత్సువానా సంపూర్ణ స్వతంత్ర విధానాలను అనుసరిస్తున్నది.

చరిత్ర

[మార్చు]
దస్త్రం:Gaboronecitycentre.JPG
గెబొరోన్ వద్ద ఉన్న సిటీ సెంటర్ బిల్డింగ్

19వ శతాబ్దంలో బోత్సువానాలో నివసిస్తున్న త్‌స్వానా స్థానిక నివాసులు, ఈశాన్యభూభాగం నుండి వలస వచ్చిన ఎన్‌డిబెలే కొండజాతి ప్రజల మధ్య చెలరేగిన పగ ఉచ్ఛ స్థాయికి చేరుకుంది. అలాగే ట్రాన్స్‌వాల్ నుండి వచ్చిన ఒప్పందదార్ల మధ్య వివాదాలు తలెత్తాయి. ఒప్పందదారులు నాల్గవ ఖామా, బతోయెన్, వారి సహాయకుడైన సెబెలే ద్వారా అనుమతి పొంది వచ్చిన వారు. బ్రిటిష్ ప్రభుత్వం 1885 మార్చి 31 నుండి బెచ్యుయానాలాండ్ తన రక్షణలోకి తీసుకున్నది. బోత్స్‌వానా ఉత్తర భూభాగము బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష నిర్వహణలో బెచ్యుయానాలాండ్ ప్రొటెక్రేట్ పేరుతో ఉండేది. బొత్సువానా దక్షిణ భూభాగము కేప్ కాలనీలో ఒక భాగంగా ఉండేది. ఇప్పుడది దక్షిణాఫ్రికా వాయవ్య సరిహద్దుగా ఉంది. సెత్సువానా మాట్లాడే అత్యధికులు ఇప్పుడు దక్షిణాఫ్రికాలో నివసిస్తునారు. 1910లో యూనియన్ ఆఫ్ సౌత్‌ ఆఫ్రికా రూపు దిద్దుకున్నప్పుడు బెచ్యుయానాలాండ్ ప్రొటెక్రేట్, బాసుతోలాండ్, స్వాజీలాండ్ కలవక పోయినా అందుకు కావలసిన ప్రయత్నాలు మాత్రం జరిగాయి. అయినప్పటికీ అక్కడి నివాసితులతో జరిగిన చర్చలు మాత్రం నిష్ఫలమైనాయి. అయినప్పటికీ విజయవంతమైన దక్షిణాఫ్రికా దేశము కొన్ని ప్రదేశాలను మార్పిడి చేయాలని కోరినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వమ్ దానిని తొసిపుచ్చుతూ వచ్చింది. ఎలాగైతేనే అది జరగనే లేదు. 1948లో జరిగిన నేషనలిస్ట్ ఎన్నికల తరువాత దక్షిణాఫ్రికాలో మిశ్రిత ప్రభుత్వం ఏర్పడింది 1961లో కామన్వెల్త్ దేశాల నుండి దక్షిణాఫ్రికా వెలుపలికి వచ్చింది. దీనితో ఈ ప్రదేశాలు దక్షిణాఫ్రికాలో మిశ్రితం అయ్యే ప్రతిపాదన ముగింపుకు వచ్చింది. బ్రిటిష్ ప్రభుత్వం అధికార విస్తరణా ప్రయత్నాలు, స్థానిక జాతుల తిరుగుబాటు కారణంగా 1920లో రెండు సలహా కైన్సిల్స్ యురూపియన్లు, ఆఫ్రికన్ల కొరకు ఏర్పాటైనాయి. 1934లో రూల్స్, అధికారమును క్రమబద్ధీకరిస్తు ప్రకటన వెలువడింది. 1951లో యురోపియన్ ఆఫ్రికన్ సలహా కౌన్సిల్ ఏర్పాటైంది. 1961లో ఈ ప్రదేశము కన్సలేటివ్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌గా అవతరించింది. 1964లో బోత్సువానా స్వతంత్ర స్వయమ్ పరిపాలన ప్రతిపాదనకు బ్రిటన్ అంగీకారం తెలిపింది. 1965లో రాజధాని దక్షిణాఫ్రికాలో ఉన్న మాఫికెంగ్ నుండి క్రొత్తగా స్థాపించబడిన గబొరొన్‌కి మారింది. 1965లో దేశంలో మొదటి జనరల్ ఎన్నికలు జరిగాయి. 1966 సెప్టెంబరు 30న స్వతంత్ర బోత్సువానా అవతరించింది. స్వతంత్ర సమర వీరుడైన సెరెస్టే ఖామా తొలి దేశాధ్యక్షుడుగా ఎన్నికోబడ్డాడు. ఆయన రెండవ సారి కూడా అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు. 1984లో ఆ తరువాత దేశాధ్యక్షత అప్పటి ఉపాధ్యక్షుడైన క్వెట్‌మసిరె కు దక్కింది. ఆయన తిరిగి 1989, 1994 వరకు ఆ పదవికి ఎన్నుకోబడ్డాడు. 1998లో మసిరే అధికారము నుండి పదవీవిరమణ చేసిన తరువాత అప్పటి ఉపాధ్యక్షుడు ఫెస్టస్‌మోగెకు అధికారము దక్కింది. ఆయన 1999లో అధికారపూర్వకముగా ఎన్నుకోబడ్డాడు. ఆయన తిరిగి 2004లో అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు. తరువాత 2008లో అధికారము లాన్ ఖామా చేతికి మారింది. ఆయన బోత్సువానా డిఫెన్స్ ఫోర్స్ (రక్షణ శాఖ) నుండి పదవీ వీరమన చెసి రాజకీయ ప్రవేశం చేసి అధ్యక్షపదవిని చేపట్టాడు. 1999 వరకు బోత్సువానాకు చెందిన కసికిలికి నమీబియాకు మధ్య కాప్రివి స్ట్రిప్ గురించి భూవివాదం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వద్ద జరిగింది.

ప్రభుత్వము రాజకీయాలు

[మార్చు]

బోత్సువానా ప్రభుత్వ విధానాన్ని రెప్రెసెంటివ్ డెమొక్రెటిక్ రిపబ్లిక్ అంటారు. బోత్సువానా అధ్యక్షుడు ప్రభుత్వ నిర్వహణకు రజ్యాంగానికి ఏక కాలంలో అధ్యక్షత వహిస్తాడు. నిర్వహణాధికారము ప్రభుత్వాధీనములో ఉంటుంది. సరికొత్త ఎన్నికలు 2009 అక్టోబరు 16న జరిగాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుండి బోత్సువానాలో బోత్సువానా డెమొక్రెటిక్ పార్టీ ఆధిక్యత వహిస్తుంది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్‌నేషనల్ అనుసరించి ఆఫ్రికా దేశాలలో బోత్సువానాలో అవినీతి అత్యల్పంగా ఉంది. ఇది సౌత్ కొరియా పోర్చు్‌గీసులకు సమీపంగా ఉంటుంది.

అధికారపూరిత భూవిభాగాలు

[మార్చు]
బోత్సువానా జిల్లాలు
  • 1. సేంట్రల్ డిస్ట్రిక్.
  • 2. ఘాంజి డిస్ట్రిక్.
  • 3. క్గాలగడి డిస్ట్రిక్.
  • 4. క్గాట్లెంగ్ డిస్ట్రిక్.
  • 5. క్వెనెంగ్ డిస్ట్రిక్.
  • 6. నార్త్-ఈస్ట్ డిస్ట్రిక్.
  • 7. న్గామిలాండ్ డిస్ట్రిక్.
  • 8. సౌత్-ఈస్ట్ డిస్ట్రిక్.
  • 9. సదరన్ డిస్ట్రిక్.
  • 10. ఛోబ్‌ డిస్ట్రిక్.

భౌగోళిక పరిస్తితులు పరిసరాలు

[మార్చు]
బొత్సువానా భౌగోళిక చిత్రం

600,370 చదరపు కిలోమీటర్ల వైశాల్యముతో బోత్సువానా ప్రపంచదేశాలలో ఉక్రెయిన్ తరువాత 47వ స్థానములో ఉంది. వైశాల్యంలో బోత్సువానా మడగాస్కర్ దాదాపు సమానంగా ఉంటుంది. అంతేకాక యునైటెడ్ స్టేట్స్ లోని టెక్సాస్ రాష్ట్రమ్, కెనడాలోని మానిటోబా రాష్ట్రాల కంటే చిన్నది. బోత్సువానా 17 నుండి 27 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఉపస్థితమై ఉంది. అలాగే 20 నుండి 30 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. బోత్సువానా భౌగోళికంగా చదరమైన, మెత్తని పీఠభూమి భూభాగాన్ని కలిగి ఉంది. బోత్సువానా లోని అధిక భాగం ఖలహరి ఎడారి విస్తరించి ఉంటుంది. అది బోత్సువానా భూభాగములో 70 శాతమ్ భూభాగంలో విస్తరించి ఉంది. బొత్సువానా వాయవ్యంలో ఉన్న ఒకవాంగో డెల్టా ప్రపంచంలో అతి పెద్ద ఇన్లాండ్ డెల్టా. ఉత్తర భూభాగంలో మక్గాడిక్గాడి పాన్ అన్న సాల్ట్ పాన్ ఉంది.

బొత్సువానా ప్రాంతమ్లో ఒక జింక
బోత్సువానాలో సూర్యోదయం

బోత్సువానా జంతువులకు ఆలవాలమైన అరణ్య ప్రాంతాలు, ఎడారి భూమి, డెల్టా భూములు వంటి విభిన్న భూభాగాలను కలిగి ఉంది. ఇక్కడి పచ్చిక బయళ్ళు, చిన్న చెట్లతో మిశ్రితమైన పచ్చిక బళ్ళలో జింకలు, అడవిమృగాలు, ఇతర క్షీరదాలు, పక్షుల వంటి వాటిని చూడ వచ్చు. అతిస్వల్పంగా జీవించి ఉన్న ఆఫ్రికన్ అడవి కుక్కలు అధికంగా ఉన్న ప్రాంతాలలో ఉత్తర బోత్సువానా ఒకటి. చోబ్ జిల్లాలో ఉన్న చోబ్ నెషనల్ పార్క్‌లో ప్రపంచంలో అత్యధికమైన ఆఫ్రికన్ ఏనుగులు ఉన్నాయి. ఈ పార్క్ వైశాల్యమ్ 11,000 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ 350 జాతుల పక్షులు ఉన్నాయి. ది చోబ్ నెషనల్ పార్క్ ఒకవాంగో డెల్టాలో ఉన్న మొరోమి గేమ్ రిజర్వ్ బోత్సువానా లోని ప్రముఖ పర్యాఆతక ఆకర్షణలు. ఘాంజి జిల్లాలో ఉన్న ఉన్న ఖలహరి ఎడారిలో సెంట్రల్ ఖలహరి గేమ్ రిజర్వ ఉంది, మక్గాడిక్గాడి పాన్స్ నేషనల్ పార్క్ , ఎన్‌క్సై పాన్ నేషనల్ పార్క్ లు మక్గాడిక్గాడి పాన్స్‌లోని సెంట్రల్ జిల్లాలో ఉన్నాయి. బోత్సువానా తూర్పు ప్రాంతంలో షషి నది, లింపొపొ నది సంగమ ప్రాంతంలో ప్రైవేట్ యాజమాన్యంలో మషతు గేమ్ రిజర్వ్ ఉంది. గబరోన్‌లో ప్రైవేట్ యాజమాన్యంలో మొకొలొడి నేచుర్ రిజర్వ్ ఉంది. సెంట్రల్ డిస్ట్రిక్‌లో ప్రత్యేకంగా ఖడ్గమృగాలకు ఖామా రినో శాంక్‌చురీ, ఫ్లెమింగోల కొరకు మక్గాడిక్గాడి శాంక్‌చురీలు ఉన్నాయి.

పరిసరాలు సమస్యలు

[మార్చు]
బోత్సువానాలోని టిస్వపాంగ్ కొండలు
చోబ్ నెషనల్ పార్క్‌లో పర్యాటకులు
బయోబాబ్ చెట్టు

బోత్సువానా ప్రస్తుతం రెండు ప్రత్యేక సమస్యలను ఎదుర్కొంటున్నది. అందులో ఒకటి కరువు రెండవది భూములు ఎడారులుగా మారుట. భూములు ఎడారిగా మారడనికి కారణం ఇఒక్కడ అధికంగా వచ్చిన కరువులే. కరువు సమయంలో 75% శాతం ప్రజలు ణీటి కొరకు పూర్తిగా భూగర్భ జలము మీద అధారపడతఅయి. భూగర్భ జలాలు కరువు సమస్యలను కొంత తగ్గించినా భూమి బలహీనమవడానికి అది కారణమ్ ఔతుంది. బోరులు తవ్వకానికి అందనంత లోతులకు భూగర్భ జలాలు పోయిన కారణంగా భూమి కోతకు గురి ఔతుంది. బోత్సువానాలో భూగర్భజలాలు అదుదుగా లభ్యమౌతున్న కారణంగా కేవలము 5% శాతం ప్రజలు మాత్రమే వ్యవసాయం మీద అధారపడుతున్నారు. మిగిలిన 95% శాతం ప్రజలు పశు పెంపకం, పెంపుడు జంతువల పెంపకం మీద ఆధారపడుతున్నారు. దేశం లోని 71% శాతం భూములు జంతువులు మేత కొరకు ఉపయోగంచడం కూడా భూములు ఎడారిగా మారడానికి మరి కొంత కారణం ఔతున్నాయి. జంతువుల పెంపకం అధికమైన అదాయాన్ని ఇస్తుందని ఋజువు కావడంతో భూమి ఎడతెరపి లేకుండా దుర్వినియోగానికి గురౌతూ ఉంది. జంతువుల సంఖ్య అనూహ్యంగా నిరంతరంగా పెరగడమే ఇందుకు ఋజువు. 1966 నుండి 1991 మధ్యకాలంలో జంతువుల 1.7 మిలియన్ల నుండి 5.5 మిలియన్ల వరకు వృద్ధి చెందింది. అలాగే 1971 నుండి 1995 మధ్య కాలములో జనసంఖ్య కూడా 574,000 నుండి 200% శాతం వృద్ధిచెందింది. బోత్సువానాలో 50% ప్రజల జీవనాధారం పసు సంపద. బోత్సువనా మాత్రమే పశుపోషణ మాత్రమే ఎకైక జీవనాధారం కలిగిన పల్లెవాసులు కలుగిన దేశంగా పరిగణించబడుతుంది. కరువులు వాతావరణ ప్రతికూలత ఫలితంగా వనప్రాంత క్షీనత, ఎడారి ప్రాంతం అధికమౌట లాంటి సమస్యలు ఎదురౌతున్నాయి. జంతువులు విపరీతంగా మేతకు ఉపయోగించడం వలన ఒకవాంగో డెల్టా క్రమంగా ఎండి పోగలదని పరిశీలకులు భావిస్తున్నారు. బోత్సువానాలోని ఒకవాంగో డెల్టా దేశంలోనే అతి పెద్ద ఇంలాండ్ డెల్టా, ఇది వనముతో కూడిన తడి నెలలతో అనేక విధముల జంతువులకు అభివృద్ధికి కారణమైన ప్రముఖ ఆధారము. ది డిపార్ట్‌మెంట్, ఫారెస్టరీ (వనము), రేంజ్ రిసర్‌వ్స్ ఇప్పటికే తిరిగి వనాభివృద్ధి పధకాలను దక్షిణ క్గాలగాడి, ఉత్తర క్వెనెగ్, బొటేటిలలో ప్రవేశ పెట్టింది. ఈ పధకాలను ప్రజల వద్దకు తిసుకుని పోవదమ్ వలన భూమి నాణ్యత క్షీణించడాన్ని తగిస్తుంచి వననాల పెంపొడడానికి తోడ్పడుతుంది. యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం కూడా ఈ భూమిని అభివృద్ధిపరిచే విధానానికి తోడ్పడడానికి బోత్సువానా ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదుర్చుకుని బోత్సువానా ప్రభుత్వ ఋణాలను తగ్గించడానికి 7 మిలియన్ల అమెరికన్ డలర్లు ఇచ్చి బోత్సువానా ఋణాన్ని 8.3 మిలియన్ల వరకు తగ్గిస్తుంది. అమెరికా ప్రభుత్వ ప్రేరణ కారణంగా ఋణము తగ్గించుకున్న బోత్సువానా ప్రభుత్వం వన సంరక్షణ మీద అధికంగా దృష్టిసారించింది. ఎడతెరిపి లేని కరువులు పేదరికము కారణంగా బోత్సువానా లోని భూములను అత్యధికముగా ఉపయొగించడం ద్వారా ఏర్పడుతున్న సమస్యలను సరిదిద్దడానికి ది యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ (యు ఎన్ డి పి) ను ఏర్పాటూ చేసి ఈ పధకాన్ని ముందుగా బోత్సువానా దక్షిణ ప్రామ్తమ్లోని క్గాలగాడిగా లోని స్ట్రుఇజెండమ్‌లో ప్రారంభించబడింది. ఈ పధకము ముఖ్య ఉద్దేశం ప్రజలలో చొరబాటు లేని వనప్రాంతాలను అభివృద్ధి పరచి అలాగే భూముల నిర్వహణా పద్ధతులను అవగాహన కలిగించాలన్నది. ఈ పధక మార్గదర్శకులు ఈ పధకంలో అక్కడి సమూహాల ప్రజలను భాగస్వాములను చేసి వారికి తగిన ఆదాయాన్ని కలిగించి పేదరికాన్ని తగ్గించినట్లైతే భూములను విపరీతమ్గా వాడడాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు. యు ఎన్ డి పి వారు కూడా బోత్సువానా ప్రభుత్వమ్ తమ నూతన విధానాలను రుపొందించి ప్రజలకు వారి వారి ప్రాకృతిక ఆధారాలను అభివృద్ధి చెయడానికి అనుమతించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని సూచిస్తుంది.

రక్షణ

[మార్చు]

ఆర్ధికం

[మార్చు]
బోత్సువానాలో ఒక ఉన్న పెద్ద పల్లెలు ఉన్న ప్రాంతం
గబరోన్ ఆకాశ వీక్షణం
దస్త్రం:Debswana HQ.jpg
బొత్సువానాకు చెందిన గబరోన్‌లో ఉన్న వజ్రాల తయారీ కార్యాలయం

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బోత్సువానా తలసరి ఆదాయాన్ని త్వరితగతిలో వృద్ధి చేసి అతి ప్రపంచంలో శీఘ్రంగా అభివృద్ధి చెందిన మొదటి దేశంగా పేరు తెచ్చుకుంది. ప్రపంచంలో అతి పేద దేశాలలో ఒకటిగా ఉన్న బోత్సువానా మధ్యంతర ఆదాయమున్న దేశంగా తనకు తానుగా కృషి చేసి మారింది. అధిక గ్రాస్ నేషనల్ ఇన్‌కమ్ (స్థూల జాతీయా ఆదాయము), కొనుగోలు శక్తి ఉన్న దేశాలలో బొత్సువానా ప్రపంచ దేశాలలో నాల్గవ స్థానంలో ఉంది. బోత్సువానా ప్రజల జీవన ప్రమాణము దాదాపు మెక్సికో, టర్కీలకు సమానం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనాలను అనుసరించి 1961 నుండి 1999 వరకు బొత్సువానా ఆర్థికాభివృద్ధి సంవత్సరానికి సరాసరి 9% శాతంగా గుర్తంచబడుతుంది. బోత్సువానా ప్రభుత్వం కోశ విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తోంది. బొత్సువానాలోని అతి పెద్ద వజ్రాలఖని డెబ్స్‌వానాలో 50% శాతం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. బోత్సువానా ప్రభుత్వ 40% శాతం ఆదాయాన్ని ఖనిజ కంపెనీల ద్వారా లభిస్తుంది. 2007లో బోత్సువానాలో కనుగొనబడిన యురేనియమ్ నిలువలను వెలుపలికి తీసే గనులు 2010 నుండి పనులు ప్రారంభించాయి. వజ్రాలు, బంగారం, యురేనియమ్, రాగి, చమురు నిలువలను సహితం వెలికి తీసే నిమిత్తం విదేశీ కంపెనీలు బొత్సువానాలో తమ కార్యాలయాలు స్థాపించాయి. 2009లో బొత్సువానా ప్రభుత్వం తమ అదాయము కొరకు వజ్రాల ఉత్పత్తి మీద ఆధారపడడనికి ప్రయత్నిస్తామని ప్రకటించింది. రాబోయే 20 సంవత్సరాలలో బోత్సువానాలోని వజ్రాల ఖనిజము ఖాళీ కాగలదన్న ఊహాగానాలు ప్రజలలో ప్రభుత్వంలో విభిన్న ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి.

జనసంఖ్య

[మార్చు]
బోత్సువానా చేతితో నిప్పును రాజేస్తున్న బుష్‌మెన్లు
ఒక్వాంగో డెలతాలో ఒక అమ్మాయి
ఖుత్సే కల్హరిలోని బోత్సువానాకు చెందిన రాన్‌డేవెల్ అని పిలువబడే సుందర సంప్రదాయక వసతిగృహము

బోత్సువానా ప్రధాన సంప్రదాయ సమూహాలు బత్స్ఝ్‌వానా, బకలంగా, బుష్6మెన్ లేక అబత్వానా వీరు బసర్వ అని కూడా పిలుస్తారు. మిగిలిన స్థానిక జాతులు భయై, బసుబియా, బంముకుషు, బహెరియో, బక్గలగాడి. బోత్సువానా లోని ఇతర సంప్రదాయక ప్రజలు శ్వేతజ్కాతీయులు, భారతీయులు. ఈ రెండు సమూహాలు స్వల్ప సంఖ్యలో దగ్గర దగ్గర సంఖ్యలో ఉన్నారు. బోత్సువానా భారతీయులు అధికంగా భారతీయ ఆఫ్రికన్లు. వీరు కొన్ని తరాలుగా మొజాంబిక్యూ, కెన్యా, తంజానియా, మొరీషియస్, దక్షిణ ఆఫ్రికా , మొదటి తరానికి చెందిన వలస భారతీయులు. శ్వేతజాతీయులు స్థానికంగా బోత్సువానాకు చెందిన వారు కొందరు. మిగిలినవారు జింబాబ్వే, దక్షిణ ఆఫ్రికాకు చెందిన వారు. సుమారుగా 3% శాతం ఉన్న శ్వేతజాతీయులు ఆంగ్లము, ఆఫ్రికాన్ భాషను మాట్లాడుతారు. 2000 నుండి ఆర్థిక పరిస్థితిలో సమస్యలు అధికమైన కారణంగా జింబాబ్వే నుండి బోత్సువానాకు వలసవస్తున్న వారి సంఖ్య పలు వేల సంఖ్యగా పెరిగింది. 10,000 కంటే అధికమైన బుష్‌మెన్ జాతీయులు ఇప్పటికీ వేట - అడవి సంపద (హంట్ర్-గేదర్) శైలి జీననాన్ని సాగిస్తున్నారు. 1990లో బోత్సువానా కేంద్రప్రభుత్వం శాన్ అని పిలువబడే బుష్‌మెన్ ప్రజలను వారి వారి స్వంతభూముల నుండి కదిలించడానికి ప్రయత్నించింది. ఐక్యరాజ్యసమితి ఇండిగ్నియస్ రైట్స్ ఉన్నతాధికారి ప్రొఫెసర్ అనయ బోత్సువానా ప్రభుత్వ అధార్మికతను తీవ్రంగా ఖండిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

బోత్సువానా అధికారభాష ఆంగ్లమే అయినా అత్యధికంగా దేశమంతా సెత్స్వానా భాషను మాట్లాడుతుంటారు. సెత్స్వానా భాషలో ఇతర భాషలకంటే ప్రిఫిక్స్ ఆధిక్యత వహిస్తుంది. ప్రిఫిక్స్ అంటే లాటిన్ మూలముగా కలిగిన పదాలు. ఈ ప్రీఫిక్స్ పదాలలో చేరినవే దేశం అనే పదాన్నిసూచించే బొ . ప్రజలు అనే పదాన్ని సూచించే. వ్యక్తి అనే పదాన్ని సూచించే మొ. భాష అనే పదాన్ని సూచించే సె. అందువలన దేశం పేరు బోత్సువానా అయింది. ప్రజలందరిని బత్సువానా అని అయింది. వ్యతికగతంగా మత్సువానా అయింది. వీరు వాడే భాష సెత్సువానా అయింది.

మతము

[మార్చు]

బోత్సువానాలోని మతాలు

బోత్సువానాలోని మతాలు [1]
మతము
క్రిస్టియానిటీ
  
71.6%
ఏ మతానికి చెందిన వారు
  
20.6%
ఇండిగ్నియస్
  
6%
ఇతరులు
  
1.4%
వర్గీకరించని జాతికి చెందిన వారు
  
0.4%

బోత్సువానా లోని ప్రజలలో సుమారు 70% మంది క్రిస్టియనులుగా గుర్తింపును పోదుతున్నారు. ఆంగ్లికన్లు, మెథోడియన్లు వారిలో కొందరు. వీరిలో అత్యధికంగా యునైటెడ్ కాంగ్రికేషనల్ చర్చ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా వలన క్రిస్టియలుగా మారినవారే. ల్యూధరన్స్, రోమన్ కాధలిక్కులు, సెవన్త్‌డే అడ్వెంచరిస్ట్స్, బాప్టిస్ట్స్, ది డచ్ రిఫార్మిస్ట్ చర్చ్, మెన్నానిస్ట్స్, మార్మన్స్, జెహోవాస్ విట్నెసెస్ క్రిస్టియన్ సెక్ట్స్ వీరిలోని ఉప శాఖకు చెందిన క్రిస్టియన్లు. 2001 జనాభా గణాంకాలను అనుసరించి దక్షిణ ఆసియాకు చెందిన స్థానిక ముస్లిములు 5,000లకు మించి ఉన్నారు. 'హిందువులు 3,000 మంది వరకూ ఉన్నారు. బహయాస్ 700 వరకు ఉన్నారు. 20% శాతం ప్రజల వరకు తాము ఏమతానికి చెందని వారమని ప్రకటించుకున్నారు. నగరశివార్లు, దూరప్రాంతాలలో మతసేవలకు చెందిన వారు ప్రచారాన్ని కొనగిస్తున్నారు.

ఆరోగ్యం

[మార్చు]

పూర్వము 64.1% శాతం ఉన్న బోత్సువానా ప్రజల ఆయుః ప్రమాణం 1990లో 49% శాతం వరకు పడిపోయిన కారణంగా ప్రపంచ బ్యాంకు తీసుకున్న చర్యల కారణంగా 55% శాతం వరకు అభివృద్ధిచేసారు.

హెచ్ ఐ వి లేక ఎయిడ్స్

[మార్చు]
1958-2003 వరకు జీవప్రమాణ ఉహా చిత్రము

సబ్-షహరాన్ ఆఫ్రికా ఎయిడ్స్ వ్యాధి కారణంగా దేశ ఆదాయములో 10% వరకు వెచ్చించవలసి రావడం వలన లోటు బడ్జెట్ ప్రతిపాదించవలసిన అగత్యం ఏర్పడింది. 2002-2003 వరకు బడ్జెట్ లోటు అధికం కావడంతో పాటు వైద్యసేవల ఖర్చు అధికమౌతూనే ఉంది. ఈ పరిస్థితి ఎకనమిక్ ఇంపాక్ట్ ఆఫ్ ఎయిడ్స్ గా అభివర్ణించబడింది. 2006 నాటికి బోత్సువానా కూడా చాలా బలంగా ఎయిడ్స్ వలన బాధింపబడుతుందని అప్పుడు ఊహించారు. ఈ కారణంగా జననాల రేటు కూడా 65 నుండి 35 వరకు పడిపోతుందని అప్పుడు ఊహించబడింది. 2006 నాటికి ప్రజలలో 24% యుక్తవయసుకు పైబడిన వారు ఎయిడ్స్ వాత పడతారని ఊహించి 2003 నుండి బోత్సువానా ప్రభుత్వం కలుగచేసుకుని విస్తారంగా ఉచితంగా లేక చవకగా యాంటీ రిట్రోవియల్ మందులను ప్రజలకు సరఫరా చేయడం ద్వారా అలాగే ఎయిడ్స్ పట్ల ప్రజలను జాగృతం చేసే కార్యక్రమాలను చేపట్టడం ద్వారా వ్యాధిని వ్యాపించకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ప్రజాసంస్కృతిలో భాగమైన స్వేచ్ఛా విహారం ఈ వ్యాధి వ్యాపించడానికి కారణంగా భావించబడింది. సుమారు బోత్సువానా ప్రజలలో 6 మందిలో ఒకరు ఎయిడ్స్ వ్యాధి పీడితులై ప్రపంచంలో రెండవస్థానంలో ఉన్నారు. ఇది స్విడ్జర్ లాండ్ ‌కు దాదాపు సమీపంలో ఉంది. బోత్సువానా ప్రభుత్వం ఎయిడ్స్ దేశాఅర్ధిక పరిస్థితిని విపరీతంగా దెబ్బతీస్తుందని గుర్తించింది. బోత్సువానా ప్రభుత్వం అత్యధికంగా వ్యాపించి దేశీయుల వ్యక్తిగతజీవితం మీద విపరీత ప్రభావం చూపించే ఈ వ్యాధితో పోరాడదలచి ఉచిత యాంటీ రిట్రోవియల్ మందులను సరఫరా చేస్తూ దేశమంతా ఈ వ్యాధి తాల్లుల నుండి శిశువులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. బోత్సువానా తల్లుల నుండి ఎయిడ్స్ వ్యాధి శిశువులకు రాకుండా జాగ్రత్తలు తీసుకొని శిశువులలో ఈవ్యాధిని 40% నుండి 4% మాత్రమే ఉండేలా చేయగలిగినది.

కేన్సర్

[మార్చు]

ది కేన్సర్ అసోసియేషన్ ఆఫ్ బోత్సువానా ప్రభుత్వానికి చెందని స్వయంసేవక సంస్థ. ఈ అసోసియేషన్ యూనియన్ ఫర్ ఇంటర్ నేషనల్ కేన్సర్ కంట్రోలలో సభ్యత్వం కలిగి ఉంది. ఈ సంస్థ కేన్సర్ వ్యాధిగ్రస్థులకు సలహాలను అందిస్తూ ఉచిత వైద్య సేవలందించడమే కాక ప్రజలను కేన్సర్ వ్యాపించకుండా జాగృతం చేస్తుంది. అలాగే ప్రజలకు ఆరోగ్యసంరక్షణా విధానాలను అందిస్తూ తమ సేవలు అందిస్తుంది.

విద్య

[మార్చు]

1966లో స్వాతంత్ర్యం లభించిన నాటి నుండి బోత్సువానా ప్రభుత్వం విద్యారంగంలో అతిచక్కని అభివృద్ధిపధంలో ముందుకుసాగింది. ఆ సమయములో దేశంలో అత్యల్ప సంఖ్యలో మాత్రమే ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఉన్నారు. చాలా స్వల్ప సంఖాకులు మాత్రమే దేశ ప్రజలలో అక్షరాస్యులు ఉన్నారు. 1991-2008 మధ్యకాలములో బోత్సువానా వయోజనవిద్యను 69% నుండి 83% శాతం వరకు అభివృద్ధి పరచింది. దేశంలో వజ్రాలఖనులను కనిపెట్టడమే ఇందుకు ప్రధాన కారణం. దేశంలో విద్యను అందించే సంస్థల అభివృద్ధి విస్తారంగా జరిగింది. విద్యార్థులందరికి పది తరగతుల వరకు నిరాటంకంగా విద్యను కొనసాగించే సౌలభ్యం లభిస్తుంది. సుమారుగా సగం మందికి పైగానే తమ విద్యను సెకండరీ విద్యను రెండు సంవత్సరాలను కొనసాగిస్తున్నారు. బోత్సువానా సెకండరీ విద్య ఉచితంగాను లేక తప్పనిసరిగా అందించబడుతుంది. స్కూలును వదిలిన తరువాత విద్యార్థులు దేశంలోని 6 వృత్తి విద్యాశాలలో తమ చదువును కొనసాగిస్తున్నారు లేకపోతే ఒకేషనల్ కోర్స్ మూలంగా ఉపాధ్యాయులుగా, నర్సులుగా తమ విద్యను కొనసాగిస్తున్నారు. వీరిలో ఉత్తమ విద్యార్థులు గాబ్రోన్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ బోత్సువానా , బోత్సువానా కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, ది బోత్సువానా అక్కౌంటెన్సీ కాలేజ్ ప్రవేశిస్తారు. మిగిలిన విద్యార్థులు అధికులు దేశమంతా అనేకంగా ఉన్న ప్రాంతీయ కళాశాలలో తమ విద్యను కొనసాగిస్తారు. ప్రాంతీయ విద్యార్థులలో అత్యధికులు దేశంలోని పలాప్యే ఉన్న అంతర్జాతీయ విశ్వవిద్యాలయమైన బోత్సువానా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో తమ విద్యాభ్యాసం కొనసాగించాలని అభిలషిస్తారు. గుర్తించతగిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయమైన లిమ్కోక్వింగ్ యూనివర్సిటీ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నత కళాశాల విద్యను అందిస్తుంది. ఈ కారణంగా దేశంలోని యువత దేశవ్యాప్తంగా స్వంత వ్యారారాలలో తమ ఉపాధిని ఏర్పరచుకుంటున్నారు. దేశంలోని అనేక ప్రాథమిక పాఠశాలలు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. సెంకడరీ స్కూల్ టీచర్స్ కంటే వీరు తక్కువ జీతాలను అందుకుంటున్నారు. ఆఫ్రికన్ లైబ్రెరీ ప్రాజెక్ట్ భాగస్వామ్యంతో ది బోత్సువానా ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ చేతులు కలిపి పనిచేస్తూ ప్రాథమిక పాఠశాలలకు లైబ్రరీ సౌకర్యాలను కలిగిస్తుంది. బోత్సువానా ప్రభుత్వం తమ అదాయంలో అధికభాగం విద్యారంగంలో పెట్టుబడి పెట్టి అభివృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తుంది. బోత్సువానా ప్రభుత్వం తాము ఆర్థికంగా వజ్రాల మీద అధారపడడం, నిపుణులైన ఉద్యోగులకు వెచ్చించే వ్యయాన్ని తగ్గించడానికి విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి తమ బడ్జెట్‌లో 21% శాతం ధనాన్ని పెట్టుబడిగా పెడుతుంది. 2006లో బోత్సువానా ప్రభుత్వం తమ రెండు దశాబ్దాల ఉచిత విద్యా విధానం నుండి విద్యారుసుము తీసుకొనే విధానాన్ని ప్రవేశపెట్టింది. అయినా బోత్సువానా ప్రభుత్వం తమ పౌరులకు ఇప్పటికీ విశ్వవిద్యాలయ విద్యార్థులకు తమ ఖర్చుల కొరకు ఉపకారవేతనాలను అందిస్తుంది.

క్రీడలు

[మార్చు]

బోత్సువానాలో ప్రజాదరణ పొందిన క్రీడ ఫుట్ బాల్ . 20012లో ఆఫ్రికన్ కప్ క్రీడలలో పాల్గొనే అవకాశం సాధించడమే ద్శం సాధించిన అత్యున్నత సాధన. మిగిలిన ప్రజాదరణ పొందిన క్రీడలు క్రికెట్, టెన్నిస్, రగ్బీ, సాఫ్ట్ బాల్, హేండ్ బాల్, గోల్ఫ్, ట్రాక్ అండ్ ఫీల్డ్. బోత్సువానా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లో ఒక అసోసియేట్ మెరంబర్. 2011లో ఒలింపిక్స్ క్రీడలలో అమాంటే మోంట్షో 400 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ చాంపియన్ షిప్ సాధించి బోత్సువానా ప్రభుత్వానికి మొదటి అధ్లెటిక్ పతకాన్ని అందించింది. కబెలో క్గోసియామంగ్ హైజెంపప్‌లో మూడుమార్లు ఆఫ్రికన్ చాపియన్ షిప్ సాధించి బోత్సువానా ప్రభుత్వానికి గౌరవాన్ని తెచ్చిన మరొక అధెటిక్ వీరుడు. ది కార్డ్ గేమ్ అయిన బ్రిడ్జ్ ఆటకు ప్రజాదరణ అధికమే. అది 30 సంవత్సరాల ముందు ఆడడం ప్రారంభించి 1980 నుండి ప్రజలను ఆకట్టుకోసాగింది. ఆంగ్లేయ పాఠశాలలు అధికంగా ఈ క్రీడలో తమ విద్యార్థులకు శిక్షణ అందిస్తుంది. 1988లో బోత్సువానా బ్రిడ్జ్ ఫెడరేషన్ స్థాపించబడి నిరవధికంగా ఈ క్రీడాపోటీలను నిర్వహిస్తూ ఉంది. బ్రిడ్జ్ ప్రజలలో ప్రాచుర్యం పొందిది. బి బి ఎఫ్ 800 మంది సభ్యులను కలుగి ఉంది. బి బి ఎఫ్ తమ సభ్యులకు శిక్షణ ఇవ్వడానికి ది ఇంగ్లీష్ బ్రిడ్జ్ యూనియన్ ఒక వారం రోజుల శిక్షణ కొరకు ప్రాతినిధ్యం వహించడానికి ఆహ్వానించింది.

సంస్కృతి

[మార్చు]
త్సోడిలో కొండలలో ఉన్న శిలాచిత్రాలు

బోత్సువానా అధిక్యతలో ఉన్న భాష అయిన సెత్సువానా ఇక్కడి ప్రజల ప్రత్యేక సంస్కృతిని ముందుతరాలకు తీసుకుపోవడానికి అధికంగా ఉపయోగించబడుతుంది. స్కాటిష్ రచయిత అయిన అలెగ్జాండర్ మెక్ కాల్ స్మిత్ నంబర్ 1 లేడీస్ డిటెక్టివ్ ఏజెన్‌సీ నవలలు ప్రజాబాహుళ్యములో ప్రాచుర్యం పొందాయి. ఈ నవలలు బోత్సువానా గురించి వర్ణిస్తూ అలాగే ఇక్కడి ప్రజల సంస్కృతిని తెలియజేస్తూ ప్రజలను అలరించాయి.

సంగీతం

[మార్చు]

త్సువానా సంగీతము అధికముగా డ్రమ్స్ వాద్యమును ఉపయోగించని గాత్రసంగీతంగానే ప్రదర్శించబడుతుంది. ఇక్కడి గాయకులు అత్యధికంగా తంత్రీ వాయిద్యాలను ఉపయోగిస్తుంటారు. త్సువానా జనపదగాయకులు సెటింకనే, సెగంకూర్ లేక సెగా ' పారంపర్యంగా ఉపయోగిస్తున్నా కొన్నిదశాబ్దాలుగా బోత్సువానా గాయకుల చేత గిటార్ ఎక్కువగా ఉపయోగించబడుతుంది.

దార్శనిక కళలు

[మార్చు]

బోత్సువానా ఉత్తర ప్రాంతంలోని ఎత్సా, గుమారే పల్లెలకు చెందిన స్త్రీలు అల్లుతున్న బుట్టలు అక్కడి బుట్టలు అల్లడంలోఅక్కడి స్త్రీల నైపుణ్యాన్ని చాటుతుంది. ఈ బుట్టలు మొకొలా పామ్ ను ప్రాంతీయ సాంప్రదాయక వర్ణాలను ఉపయోగించి తయారు చెయ్యబడుతున్నాయి. ఈ బుట్టలు ఒకరకం పెద్దవి సామానులు నిలువ చేసుకోవడానికి మరి ఒకరం బుట్టలు సామానులు మోసుకురావడానికి ఉపయోగించబడుతుంటాయి. పెద్ద పళ్ళేల వంటివి ధాన్యాన్ని జల్లించడానికి ఉపయోగిస్తారు. చిన్న పళ్ళేల వంటి బుట్టలను ధాన్యాని కొలవడానికి ఉపయోగిస్తారు. ఈ బుట్టల తయారీలోని కళా సౌందర్యం వర్ణాలను ఉపయోగించడం లోను నూతన డిజైనుల రూపకల్పనలోను క్రమాభివృద్ధి చెందుతూ ఉంది. ఇవి వాణిజ్య ఉపయోగాల కొరకు తయారుచేస్తున్నారు. ఇతర గుర్తించతగిన కళలు కుండలు తయారు చెయ్యడం, ఊడీ వీవర్స్. ఇవి రెండు బోత్సువానా దక్షిణప్రాతంలో చూడవచ్చు. బోత్సువానా, దక్షిణ ఆఫ్రికాలలో కనిపిస్తున్న పురాతన శిలా చిత్రాలలో వేట, జంతువులు, మనుషులు చోటుచేసుకున్నాయి. ఇవి కల్హరీ జిల్లాలో 20 వేల సంవత్సరాల పూర్వం వేయబడినవని అంచనా. వీటిని కోయిసన్ (కుంఘ్ శాన్, బుష్ మెన్) వారు చిత్రించినవని ఉహిస్తున్నారు. సంప్రదాయరీతులలో అధునాతన విషయాలను జోడించి నేర్పరులైన కళాకారులు అనేకులు తమ ప్రతిభను చాటుతున్నారు. చిత్రాలను, శిల్పాలను ప్రదర్శించడానికి బోత్సువానాలో కొన్ని ప్రదర్శనాశాలలు ఉన్నాయి. వీటిలో కొన్ని బోత్సువానా చేత ప్రభావితులైన వారి చేత మరికొన్ని స్వయంగా బోత్సువానా ప్రజల చేత తయారైన కళాఖండాలుంటాయి.

అహారసంస్కృతి

[మార్చు]

బోత్సువానా కొన్ని అహారపుటలవాట్లు మిగిలిన దక్షిణాఫ్రికా దేశలతో పోలి ఉన్నా వీరికని కొన్ని ప్రత్యేక ఆహారపు అలవాట్లు ఉన్నాయి. వాటిలో కొన్ని పాప్, బోరివోర్స్, శాంప్, వెట్‌కోయెక్, మొపానే వార్మ్స్. సెత్సువానా ప్రజలంతా ఉపయోగించే అహ్హరాలలో అధికమైన ఉప్పుతో చేర్చిన మాంసము ఒకటి.

శలవు దినాలు

[మార్చు]
ఇత్సెంగ్ క్గొమొత్సొ, మిస్ బోత్సువానా 2008, ప్రపంచ సుందరి సందర్భంలో 2008
తేది ఆంగ్ల నామము ప్రాంతీయ నామము
1 జనవరి కొత్త సంవత్సరం పుట్టిన రోజున న్గవగ ఒ మొష '" గోల్ డ్జ్వ ఇన్ కలంగ "
2 జనవరి పబ్లిక్ హాలిడే
వారియస్ గుడ్ ఫ్రైడే లాబాట్ ఐ హేనొ యొ ఒ మొలెమొ
ఈస్టర్ మండే
వారియస్ అసెన్షన్ డే టి హాట్ లొగొ
1 జూలై సర్ సెరెత్సె డే
19 జూలై ప్రెసిడేంట్స్ డే త్సత్సి ల గ త్యుతొన
20 జూలై పబ్లిక్ హాలిడే
30 సెప్టెంబరు ఇండిపెండెన్స్ డే బొయిపుసొ
25 డిసెంబరు క్రిస్మస్ కిరిసెమొస్ " కిసిమోస్ ఇన్ కలంగ "
26 డిసెంబరు /27 డిసెంబరు బాక్సింగ్ డే
ది ఫస్ట్ మండే ఆఫ్టర్ క్రిట్మస్ ఈజ్ ఆల్సొ ఎ పబ్లిక్ హాలిడే .

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; cia అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు