Jump to content

మాలి (దేశం)

అక్షాంశ రేఖాంశాలు: 17°N 4°W / 17°N 4°W / 17; -4
వికీపీడియా నుండి
(మాలి(ఆఫ్రికా) నుండి దారిమార్పు చెందింది)

17°N 4°W / 17°N 4°W / 17; -4

మాలి గణతంత్రం

Flag of మాలి
జండా
Coat of arms of మాలి
Coat of arms
నినాదం: "Un peuple, un but, une foi" (French)
"One people, one goal, one faith"
గీతం: "Le Mali" (French)[1]
Location of  మాలి (దేశం)  (green)
Location of  మాలి (దేశం)  (green)
Location of మాలి
రాజధాని
and largest city
Bamako
12°39′N 8°0′W / 12.650°N 8.000°W / 12.650; -8.000
అధికార భాషలుFrench
Lingua francaBambara
National languages
జాతులు
పిలుచువిధంMalian
ప్రభుత్వంUnitary semi-presidential republic
• President
Ibrahim Boubacar Keïta
Soumeylou Boubèye Maïga
శాసనవ్యవస్థNational Assembly
Independence
• from Francea
20 June 1960
• as Mali
22 September 1960
విస్తీర్ణం
• మొత్తం
1,240,192 కి.మీ2 (478,841 చ. మై.) (23rd)
• నీరు (%)
1.6
జనాభా
• November 2018 census
19,329,841[2] (67th)
• జనసాంద్రత
11.7/చ.కి. (30.3/చ.మై.) (215th)
GDP (PPP)2018 estimate
• Total
$44.329 billion[3]
• Per capita
$2,271[3]
GDP (nominal)2018 estimate
• Total
$17.407 billion[3]
• Per capita
$891[3]
జినీ (2010)33.0[4]
medium
హెచ్‌డిఐ (2017)Decrease 0.427[5]
low · 182th
ద్రవ్యంWest African CFA franc (XOF)
కాల విభాగంUTC+0 (GMT)
వాహనాలు నడుపు వైపుright[6]
ఫోన్ కోడ్+223
Internet TLD.ml

మాలి అధికారికంగా "మాలి గణతంత్రం" అని పిలువబడుతుంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న భూపరివేష్టిత దేశం. భౌగోళికంగా పశ్చిమ ఆఫ్రికను క్రాటనులో భాగంగా ఉంది. వైశాల్యపరంగా మాలి ఆఫ్రికాలో ఎనిమిదో అతిపెద్ద దేశంగా ఉంది. దేశవైశాల్యం 1,240,000 చదరపు కిలో మీటర్లు (480,000 చదరపు మైలు) ఉంది. మాలి జనాభా 18 మిలియన్లు.[7]దేశ రాజధాని బామాకో. మాలి సార్వభౌమ దేశం. దేశంలోని ఎనిమిది ప్రాంతాలలో ఉత్తరప్రాంతం సహారా ఎడారిలో చొచ్చుకుని ఉంటుంది. అదే సమయంలో దేశంలో అధికసంఖ్యలో ప్రజలు నివసిస్తున్న దక్షిణ భాగంలో నైగరు, సెనెగలు నదులు ప్రవహిస్తున్నాయి. వ్యవసాయం, గనులు దేశం ఆర్థిక కేంద్రాలుగా ఉన్నాయి. మాలి ముఖ్యమైన సహజ వనరులలో బంగారం ప్రాధాన్యత వహిస్తుండగా. ఉప్పు ఉత్పత్తిలో దేశం అతి పెద్ద నిర్మాతగా ఉంది.[8][9]

ప్రస్తుతమున్న మాలి మూడు పశ్చిమ ఆఫ్రికా సామ్రాజ్యములలో భాగంగా ఉంటూ ట్రాన్స్-సహారన్ వర్తకాన్ని నియంత్రించింది: ఘనా సామ్రాజ్యం, మాలి సామ్రాజ్యం (దీనికి మాలి పేరు పెట్టబడింది), తూయింగ్ సామ్రాజ్యం. దేశ స్వర్ణ యుగంలో గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, సాహిత్యం, కళలు అభివృద్ధి చెందాయి.[10][11] 1300 లో శిఖరాగ్రస్థితిలో ఉన్న సమయంలో మాలి సామ్రాజ్యం ఆధునిక ఫ్రాన్సు కంటే రెండు రెట్లు అధిక వైశాల్యంతో ఆఫ్రికా పశ్చిమ తీరం వరకూ విస్తరించింది.[12] 19 వ శతాబ్దం చివరలో ఆఫ్రికా ఆక్రమణ సమయంలో మాలి నియంత్రణను ఫ్రాన్సు స్వంతం చేసుకుంది. ఇది ఫ్రెంచ్ సుడాన్లో భాగంగా మారింది. ఫ్రెంచ్ సుడాన్ (సుడానీస్ రిపబ్లిక్గా పిలువబడేది) 1959 లో సెనెగల్తో కలిసి, 1960 లో మాలి ఫెడరేషనుగా స్వాతంత్ర్యం పొందింది. తరువాత కొంతకాలానికి సెనెగలు సమాఖ్య నుంచి ఉపసంహరించిన తరువాత సుడానీస్ రిపబ్లిక్కు మాలిని స్వయంగా స్వతంత్ర రిపబ్లిక్కుగా ప్రకటించింది. సుదీర్ఘకాలం ఏక-పార్టీ పాలన కొనసాగిన తర్వాత 1991 లో తలెత్తిన తిరుగుబాటు తరువాత కొత్త రాజ్యాంగం రూపొందించబడి తరువాత మాలిని ఒక బహుళ-పార్టీ ప్రజాస్వామ్య దేశంగా స్థాపించడింది.

2012 జనవరిలో ఉత్తర మాలిలో సాయుధ పోరాటాలు జరిగాయి. తిరుగుబాటు మార్చిలో తీవ్రరూపం దాల్చింది. తిరుగుబాటులో ఉత్తరప్రాంతం టువరెగ్ తిరుగుబాటుదారులు వశపరచుకుని ఏప్రిలులో అజావాడు పేరుతో కొత్త దేశాన్ని ప్రకటించారు.[13] టువరెక్ ప్రతిస్పందనగా 2013 జనవరిలో ఫ్రెంచి సైన్యం " ఆపరేషన్ సర్వెలును " ప్రారంభించింది.[14][15] ఒక నెల తరువాత మాలీ, ఫ్రెంచి దళాలు ఉత్తరప్రాంతం లోని చాలా భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాయి. 2013 జూలై 28 న రెగ్యులర్ ఎన్నికలు జరిగాయి. ఆగస్టు 11 న జరిగిన రెండో రౌండ్ రన్-ఆఫ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. నవంబరు 24 న, డిసెంబరు 15 న జరిగాయి.

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

మాలి అనే పేరు మాలి సామ్రాజ్యం పేరు నుండి తీసుకోబడింది. ఈ పేరును మొదట్లో "హిప్పోపోటామస్" అనే అర్థాన్ని స్పురింపజేసే మండిన్కా లేదా బంబార పదం మాలి నుండి తీసుకోబడింది. కానీ చివరికి ఇది "రాజు జీవించే చోటు" అనే అర్థం స్పురిపజేసే పదంగా మారింది.[16] ఈ పదం బలం అనే అర్ధం కూడా స్పురింపజేస్తుంది.[17]

గినియా రచయిత్రి జిబ్రిల్ న్యానీ సూచించన ఆధారంగా " సుందియాతా " అనే మాలి పురాతన కావ్యం (1965)లో చక్రవర్తుల రాజధానిలో మాలి అనే పేరు పెట్టడం సాధారణం అని పేర్కొంది. 14 వ శతాబ్దపు మొరాకో ప్రయాణికుడు ఇబ్ను బటుట మాలి సామ్రాజ్యం రాజధాని మాలి అని పిలువబడింది అని పేర్కొన్నాడు.[18] మొట్టమొదటి పౌరాణిక చక్రవర్తి సుండియాత కీయిత శంకరని నదిలో మునిగి మరణించిన తరువాత " నీటి ఏనుగు " (హిపోపోటమసు) గా మరు అవతారం చందాడని ఒక మడింకా సాంప్రదాయ తెలియజేస్తుంది. ఈ నది ప్రాంతంలోని గ్రామాలలో మాలి ఈ నదీప్రాంతాన్ని పాత మాలి అని పేర్కొంటారు. పాత మాలీలో ఒక గ్రామాన్ని " మాలికా " అనే వారు. మాలికా అంటే కొత్త మాలి అని అర్ధం.[19]

మరో సిద్ధాంతం ప్రకారం ఫులానీ భాషలో మాలీ అంటే మాండే ప్రజలని అర్ధం అని తెలియజేస్తుంది.[20][21] ఒక ధ్వని కాలానుగుణ మార్పుగా కూడా కొందరు పేర్కొంటారు. ఫులని అల్వియోలారు చివరి అచ్చు మార్పిడిలో "మాండెన్" మాలిగా మారిందని భావిస్తున్నారు.[19]

చరిత్ర

[మార్చు]
The extent of the Mali Empire's peak
The pages above are from Timbuktu Manuscripts written in Sudani script (a form of Arabic) from the Mali Empire showing established knowledge of astronomy and mathematics. Today there are close to a million of these manuscripts found in Timbuktu alone.
Griots of Sambala, king of Médina (Fula people, Mali), 1890

బంగారం, ఉప్పు, బానిసలు, ఇతర విలువైన వస్తువులతో " ట్రాన్స్-సహారన్ " వాణిజ్యాన్ని నియంత్రించిన మాలి మూడు ప్రముఖమైన పశ్చిమ ఆఫ్రికా సామ్రాజ్యాలలో భాగంగా ఉంది.[22] ఈ సహేలియన్ రాజ్యాలలో ఖచ్ఛితమైన భౌగోళిక సరిహద్దులు, ఖచ్ఛితమైన జాతి గుర్తింపులు లేవు.[22] ఈ సామ్రాజ్యాలలో ఘనా సామ్రాజ్యం మొట్టమొదటిదిగా ఉంది. దీని మీద సోనిన్కే, మాండే భాషల ప్రజలు ఆధిపత్యం సాధించారు.[22] ఈ సామ్రాజ్యం 8 వ శతాబ్దం నుండి 1078 వరకూ పశ్చిమ ఆఫ్రికా అంతటా విస్తరించింది. తరువాత ఈ సామ్రాజ్యాన్ని అల్మోరావిడ్సు వశపరచుకున్నారు.[23]

తరువాత మాలి సామ్రాజ్యం ఎగువ నైజరు నది వరకు విస్తరించబడి 14 వ శతాబ్దంలో ఉన్నత స్థాయికి చేరుకుంది.[23] మాలి సామ్రాజ్యంలో జేన్నే, టింబక్టు వంటి పురాతన నగరాలు వర్తకం, ఇస్లాం బోధనా కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.[23] తరువాత అంతర్గత కుట్ర ఫలితంగా సామ్రాజ్యం క్షీణించి చివరకు సొంఘై సామ్రాజ్యం చేత స్వాధీనం చేయబడింది.[23] వాయవ్య నైజీరియాలో సంఘై ప్రజలు ప్రస్తుత ఉద్భవించారు. సంఘై మాలి సామ్రాజ్య పాలనలో తూర్పు పశ్చిమ దేశాలలో అతిపెద్ద శక్తిగా ఉంది.[23]

14 వ శతాబ్దం చివరలో సంఘై క్రమంగా మాలి సామ్రాజ్యం నుండి స్వాతంత్ర్యం పొందింది. తరువాత సంఘై విస్తరించి మాలి సామ్రాజ్యం మొత్తం తూర్పు భాగాన్ని స్వాధీనం చేసుకున్నది.[23] జుదారు పాషా ఆధ్వర్యంలో తూర్పు సామ్రాజ్యం 1591 లో మొరాకో మీద దాడి చేసింది.[23] సంఘై సామ్రాజ్యం పతనం తరువాత వర్తక కూడలిగా ఈ ప్రాంతం పాత్ర ముగింపుకు వచ్చింది. [23] ఐరోపా శక్తులు సముద్ర మార్గాలు స్థాపించిన తరువాత " ట్రాన్స్-సహారా " వర్తక మార్గాలు ప్రాముఖ్యతను కోల్పోయాయి. [23]

18 వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో నమోదైన చరిత్రలో అత్యంత ఘోరమైన కరువులలో ఒకటి సంభవించింది. జాను ఇల్ఫు అభిప్రాయంలో " " 1680 లలో ఘోరమైన కరువు సంభవించింది. సెనెగాంబియన్ తీర నుండి ఉన్నత నైలు ప్రాంతం వరకు కరువుకు విస్తరించింది. చాలామంది కేవలం జీవనోపాధి కొరకు తమకు తాము స్వయంగా బానిసలకు మారారు. ముఖ్యంగా 1738-1756లో పశ్చిమ ఆఫ్రికాలో అత్యధికంగా జీవనోపాధి సంక్షోభం నమోదైంది. కరువు, మిడుతల దాడి కారణంగా టింబక్టు ప్రజలలో సగం మంది మరణించారు. [24]

ఫ్రెంచి వలస పాలన

[మార్చు]
Cotton being processed in Niono into 180 కి.గ్రా. (400 పౌ.) bales for export to other parts of Africa and to France, సుమారు 1950

19 వ శతాబ్దం చివరలో మాలి ఫ్రాన్సు నియంత్రణకి మారింది.[23] 1905 నాటికి ఈ ప్రాంతం చాలా వరకు ఫ్రెంచి సుడానులో భాగంగా ఫ్రెంచి నియంత్రణలో ఉంది.[23] 1959 ప్రారంభంలో ఫ్రెంచి సుడాను (దీని పేరును సుడానీసు రిపబ్లిక్కుగా మార్చబడింది). సెనెగలు మాలి ఫెడరేషనులో భాగంగా మారింది. 1960 జూన్ 20 న మాలి ఫెడరేషను ఫ్రాంసు నుండి స్వాతంత్ర్యం పొందింది.[23]

1960 ఆగస్టులో సెనెగలు ఫెడరేషను నుండి ఉపసంహరించుకుంది. 1960 సెప్టెంబరు 22 న సుడానీ రిపబ్లికు " ఇండిపెండెంటు మాలి రిపబ్లిక్కు "గా మార్చబడింది. ఆ తేదీలో ఇప్పుడు దేశం స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటుంది.[25] మాలి మొదటి అధ్యక్షుడిగా " మోడిబో కెయిటా " ఎన్నికయ్యాడు.[23] కేయిటా వేగంగా ఏక-పార్టీ రాజ్యంగా స్థాపించబడింది. తూర్పు ప్రాంతంతో సన్నిహిత సంబంధాలతో స్వతంత్ర ఆఫ్రికా, సామ్యవాద ధోరణిని స్వీకరించి ఆర్థిక వనరులను విస్తృతంగా జాతీయం చేసింది.[23] 1960 లో మాలి జనాభా 4.1 మిలియన్లకు చేరింది.[26]

మౌసా ట్రయోరె

[మార్చు]

1968 నవంబరు 19 న ఆర్థిక తిరోగమనం తరువాత మౌసా ట్రొరారే నిర్వహించిన రక్తపాతరహిత తిరుగుబాటుతో కైట పాలన తొలగించబడింది. [27] ఇది ఇప్పుడు లిబరేషన్ డేగా గుర్తించబడుతుంది.[28] తరువాత ట్రారారే అధ్యక్షతలో సైనికప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సంస్కరించటానికి ప్రయత్నించింది. 1968, 1974 మధ్యకాలంలో రాజకీయ సంక్షోభం, వినాశకరమైన కరువు కారణంగా వేలాది మంది ప్రజలు మరణించిన కారణంగా ఆయన ప్రయత్నాలు నిరాశాజనకంగా మారాయి.[27][29] 1970 ల చివరలో ట్రోరే పాలన విద్యార్థి అశాంతి, మూడు తిరుగుబాట్లను ఎదుత్కొన్నది. 1980 ల చివరి వరకు అభిప్రాయబేధాలు అన్నింటినీ టొర్రారె పాలన అణచివేసింది.[27]

ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను కొనసాగించడానికి ప్రయత్నించినప్పటికీ ప్రజలు అధికంగా అసంతృప్తికి గురైయ్యారు.[27] బహుళ పక్ష ప్రజాస్వామ్యం కొరకు నిర్బంధం అధికరించినందుకు స్పందనగా ట్రారే పాలన కొంత పరిమిత రాజకీయ సరళీకరణను అనుమతించినప్పటికీ వారు పూర్తి స్థాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రవేశించడానికి నిరాకరించారు.[27] 1990 లో సంకీర్ణ ప్రతిపక్ష ఉద్యమాలు తలెత్తాయి. ఉత్తరాదిలో జాతి హింసాకాండల కల్లోలంతో సంక్లిష్టంగా మారిన పరిస్థితి కారణంగా తురెగాప్రజలు మాలికి తిరిగి వచ్చారు. [27]

"ఆర్మీ నోయిర్"లో WWI స్మారక కట్టడం

1991 లో ప్రభుత్వ-వ్యతిరేక నిరసనలు తిరుగుబాటు ఫలితంగా తాత్కాలిక ప్రభుత్వం, నూతన రాజ్యాంగం ఏర్పడడానికి దారి తీసాయి.[27] 1980 లలో జనరలు మౌస్సా ట్రోరే అవినీతి, నియంతృత్వ పాలనకు వ్యతిరేకత అధికరించింది. ఈ సమయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి నిర్బంధాలను సంతృప్తి పరచడానికి కఠినమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఫలితంగా ప్రముఖులు ప్రభుత్వానికి సామీప్యంగా ఉండి సంపద అధికరింపజేసుసుకున్నప్పటికీ ప్రజలు మరింత కష్టాలను ఎదుర్కొన్నారు. 1991 జనవరిలో శాంతియుతమైన విద్యార్థి నిరసనలు సామూహిక ఖైదు, నాయకును పాల్గొనేవారిని హింసించడంతో దారుణం అణచివేయ్యబడ్డాయి.[30] చెదురుమదురుగా అల్లర్లు, ప్రభుత్వ భవనాల విధ్వంసక చర్యలు కొనసాగాయి. కానీ నిరసనకారుల చర్యలు అహింసాతకంగా ఉన్నాయి.[30]

మార్చి తిరుగుబాటు

[మార్చు]

1991 మార్చి 22 నుండి 1991 మార్చి 26 వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రజాస్వామ్య ర్యాలీలు, దేశవ్యాప్త సమ్మెలు జరిగాయి. వీటిని " లెస్ ఎవెన్మెంట్సు ("సంఘటనలు") ", మార్చి విప్లవం అన్న పేర్లతో పిలువబడింది. బమాకోలో విశ్వవిద్యాలయ విద్యార్థులు నిర్వహించిన ప్రజా ప్రదర్శనలు తరువాత అల్లర్లలో ట్రేడు యూనియన్లు, ఇతరులు చేరారు. అహింసాత్మక ప్రదర్శనకారులపై సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల తరువాత కొంతకాలం అల్లర్లు చెలరేగాయి. బారికేడ్లు, రోడ్డు బ్లాకులు నిర్మించబడ్డాయి. టర్రారె ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి రాత్రివేళ కర్ఫ్యూ విధించింది. నాలుగు రోజుల వ్యవధిలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు. నిరసనకారులు ప్రతి రోజు బమాకోకు తిరిగి వచ్చి నియంత అధ్యక్షుడి రాజీనామా, ప్రజాస్వామ్య విధానాలను అమలు చేయాలని డిమాండు చేస్తూ అహింసాత్మకంగా ప్రదర్శనలు కొనసాగించారు.[31]

1991 మార్చి 26 సైనిక సైనికులు, శాంతియుత ప్రదర్శనలు నిర్వహించిన విద్యార్ధుల ఘర్షణ, అధ్యక్షుడు మౌస్సా టరారె ఆధీనంలో డజన్ల కొద్దీ ప్రజల మరణానికి కారణమైన సామూహిక హత్యకు చిహ్నంగా మారింది. తరువాత రోజులలో ఆయనా, ముగ్గురు సహచరులు తాము తీసుకున్న హింసాత్మక నిర్ణయానికి మరణశిక్ష స్వీకరించారు. ఈ రోజు విషాద సంఘటనలు, చంపబడిన ప్రజలకు గుర్తుగా అది ఒక జాతీయ శలవుదినంగా ప్రకటించబడింది. గుర్తుంచుకోవడానికి ఈ రోజు ఒక జాతీయ సెలవుదినం.[32][నమ్మదగని మూలం?] ఈ తిరుగుబాటు 1991 మార్చి తిరుగుబాటుగా వర్ణించబడుతుంది.

26 మార్చి నాటికి సైనికులు ఎక్కువగా అహింసా నిరసన వ్యక్తుల సమూహాలను కాల్చడానికి తిరస్కరించడం పూర్తిస్థాయిలో కల్లోలానికి దారి తీసింది. వేలాదిమంది సైనికులు వారి ఆయుధాలను విసర్జించి ప్రజాస్వామ్య ఉద్యమంలో చేరారు. ఆ మధ్యాహ్నం లెఫ్టినెంటు కల్నలు అమడౌ టౌమాని టూరు నియంత అధ్యక్షుడు, మౌస్సా ట్రోరారేను అరెస్టు చేసానని రేడియోలో ప్రకటించాడు. పర్యవసానంగా ప్రతిపక్ష పార్టీలు చట్టబద్ధం చేయబడ్డాయి. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఆమోదించబడిన నూతన ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడానికి పౌర, రాజకీయ సమూహాల జాతీయ కాంగ్రెసు సమావేశం అయింది.[31]

అమాడౌ టౌమాని టౌరె ప్రెసిడెంసీ

[మార్చు]

1992 లో ఆల్ఫా ఓమర్ కోనారే మాలి మొట్టమొదటి ప్రజాస్వామ్య, బహుళ-పార్టీ అధ్యక్ష ఎన్నికలలో గెలిచారు. 1997 లో రెండోసారి తిరిగి ఎన్నికకావడానికి రాజ్యాంగం నుండి చివరి అనుమతి లభించింది. 2002 ఎనీకలలో అమడౌ టౌమని టౌరె " 1991 ప్రజాస్వామ్య తిరుగుబాటు సైనిక అంశంగా నాయకుడు, రిటైర్డు జనరలు " అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.[33] ఈ ప్రజాస్వామ్య కాలంలో మాలి ఆఫ్రికాలో అత్యంత రాజకీయంగా, సామాజికంగా స్థిరంగా ఉన్న దేశాలలో ఒకటిగా పరిగణించబడింది.[34]

మాలిలో బానిసత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. దీనితోపాటు దాదాపుగా 2,00,000 మంది ప్రజలు యజమానికి నేరుగా దాసునిగా వ్యవహరిస్తారు.[35] 2012 టువరెగు తిరుగుబాటులో మాజీ బానిసలు వారి మాజీ మాస్టర్సు ద్వారా తిరిగి స్వాధీనపరుచుకునబడ్డారు.[36]

ఉత్తర మాలీ సంఘర్షణ

[మార్చు]
Tuareg separatist rebels in Mali, January 2012

2012 జనవరిలో " నేషనల్ మూవ్మెంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ ది అజవదు " నేతృత్వంలో ఉత్తర మాలిలో ఒక టువరెగ్ తిరుగుబాటు ప్రారంభమైంది.[37] మార్చిలో సైనిక అధికారి అమడౌ తిరుగుబాటు ద్వారా సానోగో టూరు వైఫల్యాన్ని పేర్కొంటూ అధికారం హస్థగతం చేసుకున్నాడు. తరువాత ఇది " ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్సు " అంక్షలు విధించడానికి దారితీసింది.[38] MNLA వేగంగా ఉత్తరప్రాంతాన్ని నియంత్రణలోకి తీసుకుని ఆజావాడ పేరుతో స్వాతంత్ర్యం ప్రకటించింది.[39] అయినప్పటికీ ఎం.ఎన్.ఎల్.ఎ. ప్రభుత్వాన్ని ఓడించటానికి సహాయంగా ఉన్న ఇస్లామికు మఘ్రేబులో అన్సారు డైను, అల్-ఖైదాతో సహా ఇస్లామిస్టు వర్గాలు షరియాను విధించే లక్ష్యంతో టువరెగు వ్యతిరేకంగా స్పందించి ఉత్తరప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి.[40] [41][42]

2013 జనవరి 11 న తాత్కాలిక ప్రభుత్వం అభ్యర్థనతో ఫ్రెంచి సాయుధ దళాలతో జోక్యం చేసుకుంది. జనవరి 30 న ఫ్రెంచి, మాలి దళాల సమన్వయ పురోగమనం శక్తివంతమైన చివరి ఇస్లామిస్టు ఆధీనంలో ఉన్న కైడలును తిరిగి మాలి స్వాధీనం చేసుకున్నది. ఇది మూడు ఉత్తర ప్రాంతీయ రాజధానులలో చివరిది.[43] ఫిబ్రవరి 2 న ఫ్రెంచి అధ్యక్షుడు " ఫ్రాంకోయిసు హాలెండు " మాలి తాత్కాలిక అధ్యక్షుడు, డియోన్కౌన్యా ట్రొరేతో కలిసి ఇటీవలే తిరిగి స్వాధీనం చేసుకున్న టింబక్టులో ప్రజా ప్రదర్శనలో పాల్గొన్నాడు.[44]

భౌగోళికం

[మార్చు]
Satellite image of Mali
Mali map of Köppen climate classification
Landscape in Hombori

మాలి అల్జీరియా నైరుతి దిశలో ఉన్న పశ్చిమ ఆఫ్రికాలోని ఒక భూపరివేష్టిత దేశం. ఇది 10 ° నుండి 25 ° ఉత్తర అక్షాంశాల మధ్య, 13 ° పశ్చిమ, 5 ° తూర్పు రేఖాంశంలో ఉంటుంది. మాలి ఉత్తర-ఈశాన్య సరిహద్దులలో అల్జీరియా, తూర్పున నైజర్, బుర్కినా ఫాసో, దక్షిణసరిహద్దులో ఐవరీ కోస్ట్, నైరుతిసరిహద్దులో గునియా, సెనెగల్, పశ్చిమసరిహద్దులో మౌరిటానియ ఉన్నాయి.

12,42,248 చదరపు కిలో మీటర్ల (479,635 చదరపు మైళ్ళు) వైశాల్యంతో మాలి ప్రపంచంలో 24 వ అతిపెద్ద దేశంగా ఉంటుంది. దక్షిణ ఆఫ్రికా, అంగోలా పరిమాణానికి సమానంగా ఉంటుంది. దేశంలోని అధికభాగం దక్షిణ సహారా ఎడారిలో ఉంది. ఇది చాలా వేడిగా, దుమ్ముతో నిండిన సుడానియ సవన్నా జోనును ఉత్పత్తి చేస్తుంది.[45] మాలి ఎక్కువగా చదునైన, ఇసుకతో కప్పబడిన ఉత్తర మైదానాలను పెరగడానికి పెరుగుతుంది. ఈశాన్య భాగంలో అడ్రారు డెస్ ఐఫోఘాలు కొండప్రాంతం ఉంటుంది.

మాలి అత్యుష్ణ మండలాలలో ఒకటిగా ఉంది. ప్రపంచంలో హాటెస్ట్ దేశాలలో ఒకటిగా ఉంది. దేశం మద్య నుండి భూమద్యరేఖ పయనిస్తున్న కారణంగా సగటు రోజువారీ వార్షిక ఉష్ణోగ్రత ఆధారంగా గ్రహం మీద ఏడాది పొడవునా అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే దేశంగా గుర్తించబడుతుంది.[45] మాలిలో అధికభాగం చాలా తక్కువ వర్షపాతంతో తరచుగా కరువులు సంభవిస్తూ ఉంటాయి.[45] జూన్ చివరి నుండి డిసెంబరు ప్రారంభం వరకు వర్షాకాలం కొనసాగుతుంది. ఈ సమయంలో నైగర్ నది వరదల కారణంగా సాధారణంగా ఇన్నర్ నైగర్ డెల్టాను సృష్టిస్తాయి.[45] ఉత్తరప్రాంతం ఎడారి భూభాగంలో వేడి ఎడారి వాతావరణం చాలా వేడిగా ఉన్న దీర్ఘమైన వేసవికాలాలు ఉంటాయి. అరుదుగా ఉండే వర్షపాతం ఉత్తరప్రాంతంలో మరింతగా తగ్గుతుంది. మద్య ప్రాంతంతో వేడి అర్ధ- పొడి వాతావరణం ఉంటుంది. సంవత్సరం పొడవునా చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు, సుదీర్ఘమైన తీవ్రమైన పొడి సీజన్, క్లుప్త అస్తవ్యస్తమైన వర్షాకాలం ఉంటుంది. దక్షిణప్రాంతంలో ఉష్ణమండల తడి, పొడి వాతావరణం ఉంటుంది. మాలి వాతావరణం శుష్క ఉపఉష్ణమండల వాతావరణంగా సమీక్షించబడింది. ఫిబ్రవరి నుండి జూన్ వరకు వేడి, పొడి వాతావరణం వుంటుంది. జూన్ నుండి నవంబరు వరకు వర్షాకాలంలో తేమ, తేలికపాటి వాతావరణం ఉంటుంది. నవంబరు నుండి ఫిబ్రవరి వరకు చల్లని పొడి వాతావరణం ఉంటుంది.

బంగారం, యురేనియం, ఫాస్ఫేట్లు, కాయోలినైట్, ఉప్పు, సున్నపురాయిలను విస్తారంగా దోపిడీ చేయబడింది. మాలిలో గణనీయమైన సహజ వనరులు ఉన్నాయి. మాలి 17,400 టన్నుల కంటే అధికమైన యురేనియం (కొలుస్తారు + సూచించినట్లు + ఊహించబడింది) ఉందని అంచనా వేయబడింది.[46][47] 2012 లో యురేనియం మరింత అధికంగా గుర్తించబడింది.[48] మాలి ఎడారీకరణ, అటవీ నిర్మూలన, నేల కోత, త్రాగునీరు సరఫరా కొరతతో సహా అనేక పర్యావరణ సవాళ్లను ఎదుర్కొంటుంది. [45]

ప్రాంతాలు, జిల్లాలు

[మార్చు]

2016 నుండి మాలి పది ప్రాంతాలుగా, బామాకో జిల్లాగా విభజించబడింది.[49] ఒక్కొక ప్రాంతానికి ఒక గవర్నరు నియమించబడతాడు.[50] 2016 లో రెండు సరికొత్త ప్రాంతాలు: టౌడెనిట్ (గతంలో టోంబౌటౌ ప్రాంతం భాగం), టౌడెనిట్ (మునుపు మేనాకా సెర్లెలో గావో రీజియన్) రూపొందించబడ్డాయి.[51][52] రెండు ప్రాంతాలకు గవర్నరు, ట్రాంస్షనల్ కౌంసిల్ ఉన్నాయి.[53] పది ప్రాంతాలు, 56 సర్కిల్సు, 703 కమ్యూన్లుగా ఉపవిభజన చేయబడింది.[54]

మాలి ప్రాంతాలు, జిల్లా రాజధానులు:

ప్రాంతం పేరు వైశాల్యం చ.కి.మీ జనసంఖ్య
గణాంకాలు 1998
జనసంఖ్య
గణాంకాలు 2009
కయేసు ప్రాంతం 119,743 1,374,316 1,996,812
కౌలికొరొ ప్రాంతం 95,848 1,570,507 2,418,305
బమాకో రాజధాని జిల్లా 252 1,016,296 1,809,106
సికాసో ప్రాంతం 70,280 1,782,157 2,625,919
సెగౌ ప్రాంతం 64,821 1,675,357 2,336,255
మొప్టి ప్రాంతం 79,017 1,484,601 2,037,330
తాంబౌక్టౌ ప్రాంతం 496,611 442,619 681,691
గావొ ప్రాంతం 89,532 341,542 544,120
కైడలు ప్రాంతం 151,430 38,774 67,638
టౌడెనిటు ప్రాంతం
మెనకా ప్రాంతం 81,040

కేంద్రప్రభుత్వ నియంత్రణలో

[మార్చు]

2012 మార్చిలో మాలీ ప్రభుత్వం టోంబౌక్టో, గావో, కైడలు మొదలైన ప్రాంతాలు, మోపిటి ప్రాంతం ఈశాన్య భూభాగం మీద నియంత్రణను కోల్పోయింది. 2012 ఏప్రెలు 6 న అజావాదు లిబరేషన్ జాతీయ ఉద్యమకారులు ఏకపక్షంగా మాలి నుండి అజావాదు ప్రాంతవిభజనను ప్రకటించింది. దీనిని మాలి ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం గుర్తించలేదు.[55] తరువాత మాలి ప్రభుత్వం ఈ ప్రాంతాల మీద తిరిగి నియంత్రణ సాధించింది.

ఆర్ధికం

[మార్చు]
A market scene in Djenné
Kalabougou potters
Cotton processing at CMDT

" సెంట్రలు బ్యాంకు ఆఫ్ వెస్టు ఆఫ్రికన్ స్టేట్సు " మాలి ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తుంది. వెస్టు ఆఫ్రికన్ స్టేట్సు ఎకనామిక్ కమ్యూనిటీ అదనపు సభ్యులు నిర్వహణాబాఘ్యతలలో భాగస్వామ్యం వహిస్తున్నారు. ప్రపంచంలోని పేద దేశాలలో మాలి ఒకటి.[56] కార్మికుల సగటు వార్షిక వేతనం సుమారు $ 1,500 అమెరికన్ డాలర్లు. [57]

ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి ఒప్పందాలలో సంతకం చేయడం ద్వారా 1988 లో మాలి ఆర్థిక సంస్కరణను చేపట్టింది.[57] 1988 నుండి 1996 మధ్య కాలంలో మాలి ప్రభుత్వము ఎక్కువగా ప్రజాసంస్థలను పునఃప్రారంభించింది. ఒప్పందము జరిగిన తరువాత పదహారు సంస్థలు ప్రైవేటీకరించబడ్డాయి. 12 పాక్షికంగా ప్రైవేటీకరించబడ్డాయి. 20 లిక్విడేటెడు చేయబడ్డాయి.[57] 2005 లో మాలీ ప్రభుత్వం సావెజ్ కార్పోరేషనుకు ఒక రైల్రోడు కంపెనీని అంగీకరించింది.[57] 2008 లో సోసైటీ డి టెలికమ్యూనికేషన్సు డూ మాలి (సోటెల్మా), కాటన్ జినింగ్ కంపెనీ (సిఎండిటి) రెండు ప్రైవేటు సంస్థలుగా మార్చవచ్చని భావించారు.[57]

1992, 1995 మధ్యకాలంలో ఆర్థిక వృద్ధి, ఆర్థిక అసమానత తగ్గింపు కొరకు మాలి ఒక ఆర్థిక సర్దుబాటు కార్యక్రమం అమలు చేసింది. ఈ కార్యక్రమం సామాజిక, ఆర్థిక పరిస్థితులను అభివృద్ధి చేసింది. 1995 మే 31 లో మాలి ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరింది.[58]

మాలి " ఆర్గనైజేషను ఫర్ ది హార్మొనైజేషన్ ఆఫ్ బిజినెస్ లా ఇన్ ఆఫ్రికా "లో సభ్యదేశంగా ఉంది.[59] 2002 నుండి స్థూల జాతీయ ఉత్పత్తి అధికరించింది. 2002 లో జి.డి.పి. $ 3.4 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది.[60] 2005 లో $ 5.8 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది.[57] మాలి సుమారు 17.6% వార్షిక వృద్ధి రేటు కలిగి ఉంది.

మాలి "ఫ్రాన్సేన్ జోన్" (జోన్ ఫ్రాంక్) లో భాగంగా ఇది సి.ఎఫ్.ఎ. ఫ్రాంకును ఉపయోగిస్తుంది. 1962 నుండి మాలి ఫ్రెంచి ఒప్పందం ద్వారా ఫ్రెంచి ప్రభుత్వంతో అనుసంధానించబడింది. ప్రస్తుతం బి.సి.ఎ.ఒ. (మాలితో సహా) ఏడు దేశాలు ఫ్రెంచి సెంట్రల్ బ్యాంకుకు అనుసంధానించబడ్డాయి.[61]

వ్యవసాయం

[మార్చు]

వ్యవసాయం మాలి కీలక పరిశ్రమ వ్యవసాయం. పత్తి దేశం అతిపెద్ద పంటగా పశ్చిమ ప్రాంతంలోని సెనెగలు, ఐవరీ కోస్టు దేశాలకు ఎగుమతి చేయబడుతుంది.[62][63] 2002 లో 6,20,000 టన్నుల పత్తి మాలిలో ఉత్పత్తి చేయగా 2003 లో పత్తి ధరలు గణనీయంగా తగ్గాయి.[62][63] మాలి పత్తితో, బియ్యం, చిరుధాన్యాలు, మొక్కజొన్న, కూరగాయలు, పొగాకు, వృక్ష ఆధారిత పంటలు ఉత్పత్తి చేస్తుంది. మాలి ఎగుమతుల్లో 80% వరకు బంగారం, పశువుల, వ్యవసాయం భాగస్వామ్యం వహిస్తున్నాయి.[57] వ్యవసాయ రంగంలో 8% మాలీ కార్మికులు పనిచేసున్నారు. సేవా రంగంలో 15% మాలీ కార్మికులు పనిచేస్తున్నారు.[63] సీజనల్ వైవిధ్యాలు వ్యవసాయ కార్మికుల తాత్కాలిక నిరుద్యోగాలకు దారితీస్తుంది.[64]

గనులు

[మార్చు]

1991 లో " ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ " సహకారంతో మాలి మైనింగ్ కోడులు అమలు పరచడంతో మైనింగ్ పరిశ్రమలో విదేశీ ఆసక్తి, పెట్టుబడులను పునరుద్ధరించింది.[65] దక్షిణ ప్రాంతంలో త్రవ్వబడుతున్న బంగారం గనులు ఆఫ్రికాలో మూడవ అత్యధిక బంగారు ఉత్పత్తి చేస్తూ ఉంది (దక్షిణాఫ్రికా, ఘనా తరువాత).[62] ఐవరీ కోస్టు సంక్షోభాలు ప్రత్తి పంట మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిన కారణంగా 1999 నుంచి మాలి ప్రధాన ఎగుమతుల ఉత్పత్తిగా బంగారం వెలుగులోకి వచ్చింది.[66] ఇతర సహజ వనరులు కయోలిన్, ఉప్పు, ఫాస్ఫేటు, సున్నపురాయి ప్రాధాన్యత వహిస్తున్నాయి.[57]

విద్యుత్తు

[మార్చు]

విద్యుత్తు, నీటిసరఫరా బాధ్యతలను " ఎనర్జీ డు మాలి " (ఇ.డి.ఎం) నిర్వహిస్తుంది. వస్త్రాలు " ఇండస్ట్రీ టెక్స్టైల్ డు మాలి " (ఐ.టి.ఇ.ఎం.ఎ) ఉత్పత్తి చేస్తుంది.[57] మాలి హైడ్రోఎలక్ట్రిటీని సమర్థవంతంగా ఉపయోగించుకుంటుంది. ఇది మాలికి అవసరమైన విద్యుత్తు శక్తిలో సగానికి పైగా అందిస్తుంది. 2002 లో 700 గిగావాట్ల జలవిద్యుత్తు శక్తిని మాలిలో ఉత్పత్తి చేశారు.[63] మాలీ పౌరులకు విద్యుత్తును " ఎనర్జీ డు మాలి " అందిస్తుంది. " ఇ.డి.ఎం. " పట్టణ జనాభాలో 55% మంది మాత్రమే విద్యుత్తును సరఫరా చేయగలదు.[67]

రవాణా సౌకర్యాలు

[మార్చు]

మాలిలో సరిహద్దు దేశాలను అనుసంధానించే ఒక రైలుమార్గం ఉంది. మాలిలో సుమారు 29 విమానాశ్రయములు ఉన్నాయి. వీటిలో 8 రన్వేలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలు పెద్ద ఆకుపచ్చ, తెలుపు టాక్సీ క్యాబులకు ప్రసిద్ధి చెందాయి. మొత్తం ప్రజలు అధికంగా ప్రజా రవాణాపై ఆధారపడి ఉంటారు.

గణాంకాలు

[మార్చు]
A Bozo girl in Bamako
Population in Mali[7]
Year Million
1950 4.7
2000 11
2016 18

2016 లో మాలి జనాభా 18 మిలియన్లు 18 million[7]గా అంచనా వేయబడింది. జనాభా ప్రధానంగా గ్రామీణ (2002 లో 68%)ప్రాంతాలలో అధికంగా మలేషియన్లలో 5-10 శాతం మంది సంచార సమాజానికి చెందిన ప్రజలు ఉన్నారు.[68] దేశంలోని దక్షిణ భూభాగంలో 90% కంటే అధికంగా ప్రజలు నివసిస్తున్నారు. ప్రత్యేకించి బామాకోలో 1 మిలియను ప్రజలు నివసిస్తున్నారు.[68]

2007 గణాంకాల ఆధారంగా 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు 48% ఉన్నారు. 15-64 సంవత్సరాల మద్య వయసు ఉన్నారు 49% ఉన్నారు. 65 సంవత్సరాల కంటే అధిక వయసు ఉన్నవారు 3% కంటే అధికంగా ఉన్నారు.[56] మహిళల వివాహ వయస్సు 15.9 సంవత్సరాలు.[56] 2014 లో జనన రేటు 1,000 కు 45.53 జననాలు ఉండగా మొత్తం సంతానోత్పత్తి రేటు (2012 లో) మహిళకు 6.4 పిల్లలు.[56][69] 2007 లో మరణాల రేటు 1,000 కు 16.5 మరణాలు.[56] ప్రజల సరాసరి ఆయుఃప్రమాణం 53.06 సంవత్సరాలు (పురుషులకు 51.43, స్త్రీలకు 54.73).[56] మాలి ప్రపంచంలో అత్యధిక శిశు మరణాల రేటును కలిగి ఉంది.[68] 2007 లో 1,000 మందికి 106 మరణాలు సంభవించాయి.[56]

సంస్కృతి

[మార్చు]
The Tuareg are historic, nomadic inhabitants of northern Mali.

మాలి ప్రజలలో అనేక సహ-సహారా జాతి సమూహాలు ఉన్నారు. బంబారా ప్రజలు అతిపెద్ద జాతి సమూహంగా ఉన్నారు. వీరు జనాభాలో 36.5% మంది ఉన్నారు.[68]

మాలీలో సమష్టిగా బంబారా, సోనింకే, ఖస్సోన్కే, మాలిన్కే (మండిన్కా అని కూడా పిలుస్తారు), మండే సమూహంలోని అన్ని భాగాలు కలిసి మాలి జనాభాలో 50% ఉన్నారు.[56] ఇతర ముఖ్యమైన సమూహాలు (ఫులా 17%), వోల్టాయికు (12%), జుంగు (6%), టువరెగు, మూరు (10%) ఉన్నారు.[56] మాలి, నైగర్లలో మూర్లను అజవాఘు అరబ్బులు (సహారాలోని అజావాగు ప్రాంతం పేరుతో) అంటారు. వారు ప్రధానంగా హస్సనియను అరబిక్కు మాట్లాడతారు. ఇది అరబిక్కు ప్రాంతీయ మాండలికాలలో ఒకటి.[70] వ్యక్తిగత పేర్లు మాలి ప్రాంతీయ గుర్తింపుల సమగ్రరూపాన్ని ప్రతిబింబిస్తాయి.[71] ఈ ప్రాంతంలోని బానిసత్వం చారిత్రక వ్యాప్తి కారణంగా ఉత్తరప్రాంతంలో బెర్బెరు-సంతతికి చెందిన టువరెగు సంచార ప్రజలు, ముదురు రంగు చర్మంగల బెల్లా (తామషెకు ప్రజలు) ఒక విభాగంగా ఉన్నారు.

మాలిలో బానిసల సంతతికి చెందిన 8,00,000 మంది ప్రజలు ఉన్నారు.[35] మాలిలో శతాబ్దాలుగా బానిసత్వం కొనసాగింది.[72]

20 వ శతాబ్దం మధ్యలో ఫ్రెంచి అధికారులు బానిసత్వం అణిచివేసే వరకు అరబ్బు ప్రజలు 20 వ శతాబ్దం వరకు బానిసలను ఉపయోగించారు. కొన్ని వంశావళి సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయి.[73][74] కొన్ని అంచనాల ప్రకారం సుమారుగా 2,00,000 మంది మాలియన్లు ఇప్పటికీ బానిసలుగా ఉన్నారు.[75]

ఐరోపా, ఆఫ్రికా సంతతికి చెందిన స్పెయిను ముస్లింల మిశ్రమ ప్రజలు, అలాగే కొంతమంది ఫ్రెంచి, ఐరిషు, ఇటాలీ, పోర్చుగీసు మూలాలు కలిగిన ప్రజలు మాలిలో నివసిస్తున్నారు. అర్మా అని పిలువబడుతున్న ఈ ప్రజలు దేశం జనాభాలో 1% ఉన్నారు.[76]

సుదీర్ఘ చరిత్ర ఆధారంగా మాలి చక్కని జాత్యంతర సంబంధాలను అనుభవించినప్పటికీ, కొంత వంశానుగత దాస్యం, బానిసత్వం సంబంధాలు కొనసాగుతున్నాయి. అలాగే ఉత్తరప్రాంతంఒఓ స్థిరనివాసులు, సంచార టువరెగు ప్రజల మధ్య జాతి ఉద్రిక్తతలు ఉన్నాయి.[68] స్వాతంత్ర్యం తరువాత ఉత్తర ప్రాంతాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు కారణంగా మాలి ప్రస్తుతం వివక్షత గురించి ఫిర్యాదులు ఎదుర్కొంటున్నది.[77] కొనసాగుతున్న నార్తరన్ మాలి వివాదంలో ఈ వివాదం ప్రధానపాత్ర పోషిస్తుంది. షరియా చట్టం స్థాపించడానికి ప్రయత్నిస్తున్న టువరెగ్లు, రాడికల్ ఇస్లాంవాదులతో మాలీ ప్రభుత్వం మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి.[78]

భాషలు

[మార్చు]

మాలి అధికార భాష ఫ్రెంచి. అదనంగా వివిధ జాతుల సమూహాలలో 40 కంటే అధికమైన భాషలు వాడుకలో ఉన్నాయి.[68] మాలి జనాభాలో సుమారు 80% మంది బంబారాలో సంభాషించగలరు. ఇది ఒక ముఖ్యమైన ఫ్రాంకా భాషగా పనిచేస్తుంది.[68]

మాలీలో ఫ్రెంచి, బంబారాతో సామీపసంబంధం ఉన్న 12 జాతీయ భాషలు ఉన్నాయి. అవి వరుసగా బోము, టైయాక్సో బోజో, టోరో సో డోనో, మాసినో ఫుల్ఫుల్డే, హస్సనియన్ అరబిక్, మమరా సేనౌఫో, కిటా మనిన్కాకాన్, సోనిన్కే, చెయినా సినోఫో, తమాషెఖ్, క్సాసంగక్సాంగో . ప్రతీభాషా ప్రాథమికంగా జాతి సమూహాలను అనుసంధానించిన మొదటి భాషగా చెప్పబడుతుంది.

Religion in Mali[79]
Religion Percent
Islam
  
90%
Christianity
  
5%
Indigenous
  
5%
A mosque entrance

11 వ శతాబ్దంలో పశ్చిమాఫ్రికాలో ఇస్లాం పరిచయం అయ్యింది. ఇస్లాం ఈ ప్రాంతంలో చాలా వరకు ప్రధాన మతంగా ఉంది. సుమారుగా 90% మంది మాలియన్లు (ఎక్కువగా సున్నీ,[80]) ముస్లుములు ఉన్నారు. సుమారుగా 5% క్రైస్తవులు (సుమారుగా మూడింట రెండు వంతులు రోమన్ కాథలిక్కులు, ఒక వంతు ప్రొటెస్టంట్లు), మిగిలిన 5% స్థానిక విశ్వాసాలకు అనుగుణంగా ఉంటారు.[79] మాలియన్లలో నాస్తికత్వం, అజ్ఞేయవాదానికి చెందిన ప్రజలు చాలా అరుదుగా ఉన్నారు. వీరిలో ఎక్కువమంది వారి మతాన్ని దినసరి జీవితంలో ఆచరిస్తారు.[81]

మాలి రాజ్యాంగం దేశాన్ని ఒక లౌకిక దేశంగా ఏర్పరుస్తుంది. మతం స్వేచ్ఛను కల్పిస్తుంది. ప్రభుత్వం ఈ హక్కును ఎక్కువగా గౌరవిస్తుంది. [81]

మాలిలో చారిత్రాత్మకంగా పాటిస్తున్న ఇస్లాం స్థానిక పరిస్థితులకు అనుగుణమైనదిగా స్వీకరించబడింది; ముస్లింలు, అల్పసంఖ్యాక మత విశ్వాసాల అభ్యాసకులు సాధారణంగా స్నేహంగా ఉంటారు.[81] 2012 లో దేశం ఉత్తర భూభాగాలలో షరియా పాలన ప్రవేశపెట్టిన తరువాత ఉత్తర ప్రాంతంలో సంభవించిన తీవ్రమైన హింసను వివరించే ఓపెన్ డోర్స్ ప్రచురించిన క్రిస్టియన్ పీడన సూచికలో అధిక సంఖ్యలో (7 వ స్థానం) జాబితా చేయబడింది.[82][83]

విద్య

[మార్చు]
High school students in Kati

మాలి లోని ప్రజలకు విద్య ఉచితంగా ఇవ్వబడుతుంది. ఏడు నుండి పదహారు సంవత్సరాల వయస్సు మధ్య తొమ్మిది సంవత్సరాలకాలం నిర్బంధవిద్య తప్పనిసరి.[81] విధావ్యవస్థ 7 సంవత్సరాల వయస్సులో ప్రారంభించి ఆరు సంవత్సరాల ప్రాథమిక విద్య తరువాత ఆరు సంవత్సరాల ఉన్నత విద్యావిధానం కలిగి ఉంది.[81] కుటుంబాలకు యూనిఫాంలు, పుస్తకాలు, సరఫరా, హాజరుకు అవసరమైన ఇతర ఫీజులకు వ్యయంచేసే ఆర్థికస్తోమత లేనందున మాలి ప్రాథమిక పాఠశాల నమోదుశాతం చాలా తక్కువగా ఉంటుంది.[81]

2000-01 పాఠశాల సంవత్సరంలో ప్రాథమిక పాఠశాల నమోదు రేటు 61% (71% పురుషులు, 51% స్త్రీలు) ఉంది. 1990 ల చివరిలో ఉన్నత పాఠశాల నమోదు రేటు 15% (పురుషులు 20%, ఆడవారి 10%).[81] గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు లేకపోవడం, ఉపాధ్యాయుల, వస్తువుల కొరత విద్యా వ్యవస్థను ప్రభావితమవుతుంది.[81]

మాలి పరిధిలో 27-30 మద్య వయస్కులలో 46.4% అక్షరాస్యత ఉందని అంచనా. పురుషుల కంటే మహిళల అక్షరాస్యత రేటు గణనీయంగా తక్కువగా ఉంది.[81] బామాకో విశ్వవిద్యాలయం నాలుగు విభాగాలను కలిగి ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయం. 60,000 మంది అండరు గ్రాడ్యుయేటు, గ్రాడ్యుయేటు విద్యార్థులను నమోదుచేస్తుంది.[84]

ఆరోగ్యం

[మార్చు]

పేదరికం, పోషకాహార లోపం, అపరిశుభ్రత, పారిశుద్ధ్యసౌకర్యాల లోపం కారణంగా మాలి అనేక ఆరోగ్య సవాళ్లను మాలి ఎదుర్కొంటుంది.[81] మాలి ఆరోగ్యాభివృద్ధి సూచికలు ప్రపంచంలో అత్యంత హీనస్థితిలో ఉన్నాయి.[81] 2012 లో ఆయుఃప్రమాణం 53.06 సంవత్సరాలుగా అంచనా వేయబడింది.[85] 2000 లో 62-65% మంది ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు, కొన్ని రకమైన పారిశుధ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. 69% మందికి మాత్రమే పారిశుధ్యసేవలు అందుబాటులో ఉన్నట్లు అంచనా వేశారు.[81] 2001 లో ఆరోగ్యసంరక్షణ కొరకు ప్రభుత్వ ఖర్చులు సగటు US $ 4 అమెరికన్ డాలర్లు వ్యయం చేస్తుంది.[86]

పోషకాహార మెరుగుదల కొరకు ప్రయత్నాలు చేయబడ్డాయి. స్థానిక వంటకాలను పోషకారయుక్తంగా తయారుచేసేలా మహిళలను ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్య సమస్యలను తగ్గించటం జరిగింది. ఉదాహరణకు సెమీ-అరిడ్ ట్రాపిక్సు, ఇంటర్నేషనల్ క్రాప్సు రిసెర్చి ఇన్స్టిట్యూటు, అగా ఖాన్ ఫౌండేషను నుండి శిక్షణ పొందిన మహిళల సమూహాలు మహిళకు ఆరోగ్యకరమైన, పోషక సమృద్ధమైన సాంప్రదాయిక వంటకం డి-డిగ్గె (శనగ పేస్ట్, తేనె, మిల్లెట్ లేదా బియ్యం పిండి) తయారుచేయడంలో అవగాహన కలిగించారు. స్త్రీలు తయారు చేయగల, విక్రయించగల ఉత్పత్తి చేయడం ద్వారా పోషణ, జీవనోపాధిని పెంపొందించడం స్థానిక సంఘంచే ఆమోదించబడింది.[87]

మాలిలో వైద్య సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి. మందులు తక్కువ సరఫరాలో ఉన్నాయి.[86] మలేరియా, ఇతర ఆర్త్రోపోడ్-ప్రేరేపిత వ్యాధులు మాలిలో ఎక్కువగా ఉన్నాయి. వీటిలో కలరా, క్షయవ్యాధి వంటి అంటు వ్యాధులు ఉన్నాయి.[86] మాలి జనాభా కూడా అధిక బాలల పోషకాహార లోపంతో బాధపడుతుంది. మాలి తక్కువ శాతం వ్యాధి నిరోధకత కలిగి ఉంది.[86] వయోజన యువజనాభాలో 1.9% మంది ఎయిడ్సుతో బాధపడుతుంటారు. సబ్-సహారను ఆఫ్రికాలో ఇది అత్యల్ప రేటు.[86][dead link] మాలి బాలికలలో 85-91% మహిళలు ఖత్నా చికిత్సకు లోనౌతున్నారని అంచనా. [88][89]

లింగ వివక్ష

[మార్చు]

2017 లో యునైటెడు నేషన్సు డెవలప్మెంటు ప్రోగ్రాం నివేదించిన ప్రకారం లింగ అసమానత సూచికలో 160 దేశాలలో మాలి 157 వ స్థానాన్ని పొందింది.[90] మాలియన్ రాజ్యాంగం మహిళల హక్కులను కాపాడుతున్నప్పటికీ పలు చట్టాలు మహిళలపై వివక్షత కలిగి ఉన్నాయి.[91] చట్టాలలోని నిబంధనలు వివాహం తర్వాత మహిళల నిర్ణయాధికారాన్ని పరిమితం చేస్తాయి. అందులో భర్త తన భార్యకంటే ఉన్నతుడౌతాడు.[91] స్త్రీలు వారి భర్తలను కనిపించకుండా దూరంగా ఉంటే నిందకుగురౌతారు. తమ పిల్లల చర్యల కొరకు కూడా మహిళలు నిందలను ఎదుర్కొంటారు. ఇది మహిళల స్థితి తక్కువగా పరిగణించే సాంస్కృతిక వైఖరిని ప్రోత్సహిస్తుంది.[91] రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం లేకపోవడం రాజకీయాలు పురుషులతో సంబంధం కలిగి ఉండటం, మహిళలను ఈ రంగం నుండి తప్పించడానికి కారణంగా ఉంది.[91] బాలికల విద్యాభ్యాసంలో బాలుర ఆధిపత్యం అధికంగా ఉంది. ఎందుకంటే బాలురకు విద్యను అందించడం తల్లిదండ్రులకు మంచి పెట్టుబడిగా భావించబడుతుంది.[91] సాంప్రదాయ విలువలు, అభ్యాసాలు మాలిలో లింగ అసమానతకు దోహదపడ్డాయి. సంఘర్షణలు, చట్టవిరుద్ధత కూడా పెరుగుతున్న లింగ ఆధారిత హింసకు కారణం ఔతున్నాయి.[92] మాలి అస్థిర ప్రభుత్వం దేశాభివృద్ధిని తిరిగి చేపట్టడానికి ప్రజల ప్రాణాలను ప్రధానంగా మహిళల, బాలికల హక్కులను మెరుగుపర్చడానికి యు.ఎస్.ఎయిడు వంటి సంస్థల ఆగమనానికి దారితీసింది.[92]

సాంఘిక విధానాలు

[మార్చు]

మతం, సమూహ సాంఘిక వ్యవస్థ, లింగ ఆధారిత హింస మాలి మహిళలను ఆకృతి చేసే సాంఘిక అంశాలుగా ఉన్నాయి. [93] ఇవి లింగ సంబంధాల కొరకు ప్రవర్తనా నియమావళిగా ఉంటాయి. అలాగే అసమానతలకు కూడా కారణంగా ఉంటూ గృహంలో పురుషుల ఆధిపత్యం పటిష్ఠం చేస్తుంటాయి.[93] ప్రజలలో ఎక్కువమంది ముస్లింలు ఉండడం పురుషులు ఆధిపత్యం బలంగా ఉండడం సాధారణం.[94] పురుషుల, మహిళల సాంప్రదాయిక పాత్రలు గృహాధిపతిగా పురుషుడు, పురుషుల అవసరాలను తీర్చటానికి మహిళలు పాత్రలు వహించవలసిన అగత్యం ఏర్పరుస్తుంటాయి.[94] చిన్న వయసులోనే అమ్మాయిలు ఇంటి పనులు, వంట, పిల్లల పెంపకం వంటి గృహ కార్యకలాపాలను నేర్చుకోవడమే బాధ్యతగా నిర్ణయించబడుతుంది. పురుషులు కుటుంబానికి అవసరమైన ఆర్థిక సంబంధిత అవసరాలను అందించడానికి బాధ్యత వహిస్తుంటారు.[94] పితృస్వామ్య సాంఘిక వ్యవస్థలో పురుషులు గృహాధికారిగా భావించబడుతుంటారు. మహిళలు పురుషుల ఆదేశానుసారం నడుచుకుంటూ పురుషులను గౌరవిస్తూ జీవవనగమనం సాగిస్తుంటారు.[93] మహిళల ప్రాథమిక పాత్రలు భార్య, తల్లి, పిల్లల సంరక్షణా, ఇంటి పనులు, భోజన తయారీ వంటి ఒక విలక్షణ జీవితం జీవించడం మాలియన్ మహిళల నుండి కోరబడుతుంది.[93] అంటే పురుషులకు వర్తించని వృత్తిపరమైన, కుటుంబ బాధ్యతల వలన మహిళలు కొన్ని సందర్భాల్లో రెండింతల భారం వహిస్తూ ఉంటారు.[93] మహిళల ఈ అసమానత బాలికల విద్యాహీనతకు దారితీస్తుంది. ఎందుకంటే అబ్బాయిలు ప్రాధాన్యత కారణంగా పురుషులు కుటుంబపోషణ చేయడానికి వారి విద్యకు బాలికల విద్య కంటే అధికంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. బాలికలు వివాహం తరువాత పురుషుని ఇంటికి చేరి వారి భర్త కుటుంబం చేరుకుంటారు.[93] మాలిలో లింగ-ఆధారిత హింస జాతీయ, గృహ స్థాయిలో జరుగుతుంది. జాతీయ స్థాయిలో 2012 లో దేశంలోని ఉత్తర ప్రాంతంలో మహిళల కిడ్నాప్లు, అత్యాచార కేసులు అధికరించాయి.[92] సంఘర్షణ, లింగవివక్ష సామాజిక వ్యవస్థపై ప్రభావం చూపింది. వనరులు, ఆర్థిక వ్యవస్థ, అవకాశాలలో మహిళలకు ప్రాప్యతను తగ్గించబడుతుంది.[92] లింగ సమానత్వం సంబంధించి మాలి ప్రతికూలత తీవ్రమైన అసమానతకు దారీతీస్తుంది.[92] గృహ స్థాయిలో గృహ హింస, బలవంతపు వివాహాలు, బలవంతపు వివాహజీవితం, కుటుంబంలో సాంస్కృతిక విధానాలు మాలియన్ మహిళలు లింగ-ఆధారిత హింసను ఎదుర్కొనడానికి కారణాలుగా ఉన్నాయి.[91] 2013 లో మాలికి సంబంధించి మహిళల 76% మహిళలు, 54% పురుషులు మహిళలు ఆహారాన్ని మాడ్చినట్లైతే స్త్రీలకు శారీరక హానిచేయడం ఆమోదయోగ్యంగా ఉంటుందని తెలియజేసారు. తన భర్తకు తెలియజేయకుండా ఇల్లు వదిలి వెళ్ళడం అమోదయోగ్యం కాదని తెలియజేసారు.[92]

అవకాశాలు

[మార్చు]

విద్య లేకపోవడం మాలిలో లింగ అసమానతను అధికరిస్తుంది. అనేకమంది మహిళలు గృహ వెలుపల పనిచేయడం లేదు. ప్రభుత్వ పాలనా విభాగంలో పాల్గొనడం లేదు.[93] ప్రవేశ అవసరాలు, విద్యకు ప్రాప్యతను సర్దుబాటు చేసిన తర్వాత కూడా అమ్మాయిల నమోదు శాతం తక్కువగా ఉండి అధికారిక విద్య తక్కువగా అందుబాటులో ఉంది.[93] ఆడపిల్లల విద్య నుండి వైదొలగే శాతం మగపిల్లల కంటే 15% ఎక్కువ ఉంది. ఆడపిల్లలకు మగపిల్లలకంటే ఇంటి బాధ్యతలు అధికంగా ఉండడం ఇందుకు ఒక కారణం. చాలామంది తల్లిదండ్రులు తమ కుమార్తెలు పాఠశాలకు వెళ్ళడానికి అనుమతించరు కనుక బాలురు అధికశాతం విద్యావంతులుగా మారతుంటారు.[93] అదే విధంగా పట్టణాలలో శిక్షణా కేంద్రాలు కేంద్రీకృతమై ఉన్న కారణంగా సాంకేతిక, వృత్తి విద్యలో తక్కువ మంది బాలికలు పాల్గొంటున్నారు.[93] అంతిమంగా బాలికలకు ఉన్నత విద్యలో స్వల్పంగా అవకాశాలు ఉంటాయి. చిన్నవయసులో వివాహాలు చాలా మంది బాలికలు విజ్ఞాన శాస్త్రం వంటి దీర్ఘకాలిక విద్యా కార్యక్రమాన్ని అనుసరించకుండా అడ్డుకుంటాయి. [93] మహిళలకు విద్య తగినంత అందుబాటులో లేనప్పటికీ ఇటీవలి దశాబ్దాల్లో మహిళలు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో నిర్ణయించే స్థానాల్లో ప్రవేశించి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.[93] 2010 లో 147 మంది పార్లమెంటు సభ్యులలో 15 మంది మహిళలు ఉన్నారు.[93] ఇటీవలి దశాబ్దాలుగా మాలిలో మహిళల క్రమంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. ఇది హక్కును ప్రోత్సహించడానికి సహకరిస్తుంది. మాలిలోని మహిళల హోదాను రాజకీయాలలో మహిళల ప్రాముఖ్యతను అధికరిస్తుంది.[93]

ప్రయత్నాలు

[మార్చు]

మాలిలో మహిళల హక్కులను ప్రోత్సహించేందుకు దశాబ్ధాలుగా అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో చట్టాలు అమలు చేయబడ్డాయి.[93] అంతర్జాతీయ స్థాయిలో మహిళల హక్కుల అభివృద్ధికి పునాదిగా, మహిళల పట్ల వివక్ష సంబంధిత నిబంధనల నిర్మూలన మీద మహిళల నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనేందుకు, సమావేశం సూచించటానికి మాలి బీజింగు వేదిక చర్య మీద సంతకం చేసింది.[93] జాతీయస్థాయిలో మాలి రాజ్యాంగం మాలియన్ పౌరులకు సమానత్వం కలిగిస్తూ వివక్షత నిషేధించబడినప్పటికీ ఇది అనుసరించబడలేదు.[93] " పావర్టీ రిడక్షన్ స్ట్రాటజీ ప్రోగ్రాం " పథకం, గ్రోత్ పావర్టీ రిడక్షన్ స్ట్రాటజీ ప్రోగ్రాం ఆధ్వర్యంలో మాలీ ప్రభుత్వం పౌరుల శ్రేయస్సు మెరుగుపరచడానికి, లింగ వివక్షతకు మార్పులకు ప్రయత్నిస్తాయి.[93] మహిళల, పిల్లల అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా మంత్రిత్వశాఖ రూపొందించబడింది. తద్వారా వారి ప్రాథమిక హక్కులు, అవసరాలు చట్ట పరిధిలోకి వచ్చాయి.[93] లింగ సమానత్వం కోసం చట్టాలు, పాలసీ ఉన్నప్పటికీ, మాలి జాతీయ లింగ విధానంలో సంస్థాగతీకరణ అనేది మహిళల హక్కుల ప్రాముఖ్యతను సమర్ధించాల్సిన అవసరం ఉంది.[93] మాలిలో లింగ సమానత్వం మెరుగుపర్చడానికి విద్య, శిక్షణ కొరకు, మహిళల ప్రాబల్యాన్ని బలోపేతం చేయడం, మద్దతు ఇవ్వడం మంచిదని భావించబడుతుంది.[93] మహిళల హక్కుల మెరుగుదల ప్రయత్నాల ద్వారా తమ అభివృద్ధిని మెరుగుపరచడానికి యు.ఎస్.ఎయిడు వంటి అంతర్జాతీయ సంస్థలు మాలికి ఆర్థికంగా సహాయం చేస్తుంది.[92]

సంస్కృతి

[మార్చు]
Konoguel Mosque tower

మాలియన్ల విభిన్న దినసరి సంస్కృతి దేశం జాతి, భౌగోళిక వైవిధ్యం ప్రతిబింబిస్తుంది.[95] చాలా మంది మాలియన్లు పశ్చిమ ఆఫ్రికాకు చెందినవిగా కనిపించే బుబోస్ అని పిలవబడే రంగురంగుల దుస్తులను ధరిస్తారు. మాలియన్లు తరచూ సాంప్రదాయ పండుగ, నృత్యాలు, వేడుకలలో పాల్గొంటారు.[95]

సంగీతం

[మార్చు]

మాలీ సంగీత సంప్రదాయాలు గ్రియోట్సు నుండి తీసుకోబడ్డాయి. వీరు "మెమోరీస్ కీపర్స్"గా పిలవబడుతున్నారు.[96] మాలీ సంగీతం విభిన్నంగా ఉంటూ అనేక విభిన్న కళా ప్రక్రియలను కలిగి ఉంది. సంగీతంలో కొంతమంది ప్రసిద్ధ మాలీ సంగీతకళాకారులలో కోరా (ప్రసిద్ధ సంగీతకారుడు), టౌమాని డయాబెటే, బెస్సెకో కౌయుయేట్, జాలీ నోగోని, బ్లూస్ గిటారిస్టు అలీ ఫర్కా టూరే, టువరెగు బ్యాండు టినారివేను, సాలిఫు వంటి అనేక గాయకులు ప్రాధాన్యత వహిస్తున్నారు. కెయిటా, ద్వయ అమాడౌ ఎట్ మరీయం, ఊమా సంగరే, రికో ట్రోరే, హబీబ్ కోయిటే ఆఫ్రో-పాప్ కళాకారులుగా ప్రాబల్యత సంతరించికున్నారు. మాలియన్ సంస్కృతిలో నృత్యం కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది.[97] స్నేహితుల మధ్య డ్యాన్స్ పార్టీలు సాధారణం. వేడుకల కార్యక్రమాలలో సాంప్రదాయ ముసుగు నృత్యాలు ప్రదర్శించబడతాయి.[97]

సాహిత్యం

[మార్చు]

మాలీలో సాహిత్యం సంగీతం కంటే తక్కువ ప్రజాదరణ కలిగి ఉన్నప్పటికీ [98] అన్ని సమయాలలో మాలి ఆఫ్రికా అతి ప్రాముఖ్యమైన మేధో కేంద్రాలలో ఒకటిగా ఉంది.[99] మాలి సాహిత్య సాంప్రదాయం ప్రధానంగా మౌఖికంగా ప్రాచుర్యం పొందింది. జలిస్ (పఠించడం, హృదయానికి తెలిసిన కథలు, చరిత్రలను పాటలరూపంలో కథనం చెప్పడం వంటి ప్రక్రియలలో ప్రదర్శించబడుతుంటాయి.[99][100] అమడౌ హంపటే బా మాలి అత్యంత ప్రసిద్ధ చరిత్రకారుడుగా ఈ మౌఖిక సంప్రదాయాలను ప్రపంచాన్ని గుర్తుంచుకోవడానికి వీలుగా లిఖితరూపం ఇవ్వడానికి జీవితం అకింతం చేసాడు.[100]

మాలియన్ రచయిత " యమబో ఓయులోగ్యుయం " వ్రాసిన ప్రసిద్ధి చెందిన నవల " లే డెవోయిర్ డే వయోలెంసు " ఇది 1968 ప్రిక్సు రెనాడోట్ను గెలుచుకుంది. కానీ ఇది ప్లాగియారిజం అన్న ఆరోపణల ద్వారా దెబ్బతింది.[99][100] బాబా ట్రోరే, మోడిబో సౌంకలో కేయిటా, మాసా మకాన్ డయాబాటే, మౌసా కొనాటే, ఫాలీ డాబో సిసోకోలు ఇతరులు మలియన్ రచయితలుగా ప్రసిద్ధిచెందారు.[99][100]

క్రీడలు

[మార్చు]
Malian children playing football in a Dogon village

మాలిలో అసోసియేషన్ ఫుట్బాల్ (సాకర్), అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడగా ఉంది.[101][102] మాలి " 2002 ఆఫ్రికన్ కప్ ఆఫ్ నేషన్సు "కు ఆతిథ్యం ఇచ్చిన తరువాత ఇది మరింత ప్రముఖ్యత సంతరించుకుంది.[101][103] చాలా పట్టణాలు, నగరాలకు రెగ్యులర్ గేమ్స్ ఉన్నాయి.[103] రాజధాని వేదికగా జొబిబా ఎ.సి, స్టేడు మాలియన్, రియల్ బమాకో జాతీయ క్రీడాబృందాలు అన్నీ ఉన్నాయి.[102] తరచూ యువకులు గుండ్రంగా చుట్టబడిన రగ్గును బంతిగా ఉపయోగిస్తూ ఆడడం జరుగుతుంది.[102]

బాస్కెట్బాల్ మరొక ప్రధాన క్రీడ[102][104] హామీ టౌన్ మాగా నాయకత్వంలో మాలి మహిళల జాతీయ బాస్కెటు బాలు జట్టు 2008 బీజింగ్ ఒలింపిక్సులో పోటీ పడింది.[105] సాంప్రదాయ రెజ్లింగ్ (లా లూటే) కూడా కొంతవరకు సాధారణం అయినప్పటికీ ఇటీవలి సంవత్సరాలలో జనాదరణ తగ్గింది.[103] ఒక మన్కాల వైవిధ్యమైన వారీ క్రీడ ఒక సాధారణ కాలక్షేపంగా ఉంది.[102]

ఆహారం

[మార్చు]
Malian tea

బియ్యం, చిరుధాన్యాలు మాలియన్ ప్రధాన ఆహారాలుగా ఉన్నాయి.[106][107] సాధారణంగా ధాన్యాలు టమోటో, వేరుశెనగ సాసుతో కలిపి బచ్చలికూర, బయోబాబ్ వంటి తినదగిన ఆకుల నుంచి తయారుచేసిన సాసులతో తయారు చేస్తారు. కాల్చిన మాంసం ముక్కలు (సాధారణంగా కోడి, గొడ్డు మాంసం, గొడ్డు మాంసం, మేక) కలిసి తింటారు.[106][107] మాలియన్ వంటకాలు ప్రాంతాలవారీగా మారుతూ ఉంటాయి.[106][107] ఇతర ప్రముఖ వంటలలో ఫుఫు, జొలోఫ్ అన్నం, మాఫే ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి.

మాధ్యమం

[మార్చు]

మాలీలో లెస్ ఎకోస్, ఇన్ఫో మాటిన్, నౌవెల్ హారిజోను, లే రిపబ్లికన్ వంటి పలు వార్తాపత్రికలు.[108] మాలిలో టెలికమ్యూనికేషన్ల 8,69,600 మొబైల్ ఫోన్లు, 45,000 టెలివిజన్లు, 4,14,985 ఇంటర్నెటు వాడకం దారులు భాగంగా ఉన్నారు.[109]

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Presidency of Mali: Symboles de la République, L'Hymne National du Mali. Koulouba.pr.ml. Retrieved 4 May 2012.
  2. "Mali preliminary 2018 census". Institut National de la Statistique. Archived from the original on 18 ఏప్రిల్ 2010. Retrieved 26 ఫిబ్రవరి 2019.
  3. 3.0 3.1 3.2 3.3 "Mali". International Monetary Fund.
  4. "Gini Index". World Bank. Retrieved 2 మార్చి 2011.
  5. "Human Development Reports". hdr.undp.org. Archived from the original on 18 నవంబరు 2018. Retrieved 26 ఫిబ్రవరి 2019.
  6. Which side of the road do they drive on? Brian Lucas. August 2005. Retrieved 28 January 2009.
  7. 7.0 7.1 7.2 "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 సెప్టెంబరు 2017.
  8. Mali gold reserves rise in 2011 alongside price Archived 21 నవంబరు 2015 at the Wayback Machine. Retrieved 17 January 2013
  9. Human Development Indices Archived 12 జనవరి 2012 at the Wayback Machine, Table 3: Human and income poverty, p. 6. Retrieved 1 June 2009
  10. Topics. MuslimHeritage.com (5 June 2003). Retrieved 8 October 2012.
  11. Sankore University. Muslimmuseum.org. Retrieved 8 October 2012.
  12. Mali Empire (ca. 1200- ) | The Black Past: Remembered and Reclaimed. The Black Past. Retrieved 8 October 2012.
  13. Polgreen, Lydia and Cowell, Alan (6 April 2012) "Mali Rebels Proclaim Independent State in North", The New York Times
  14. UN Security Council condemns Mali coup. Telegraph (23 March 2012). Retrieved 24 March 2013.
  15. "Mali – la France a mené une série de raids contre les islamistes". Le Monde. 12 జనవరి 2013. Retrieved 13 జనవరి 2013.
  16. Wolny, Philip (15 డిసెంబరు 2013). Discovering the Empire of Mali. The Rosen Publishing Group. p. 7. ISBN 9781477718896.
  17. Sasnett, Martena Tenney; Sepmeyer, Inez Hopkins (1 జనవరి 1967). Educational Systems of Africa: Interpretations for Use in the Evaluation of Academic Credentials. University of California Press. p. 673.
  18. Imperato, Pascal James; Imperato, Gavin H. (25 ఏప్రిల్ 2008). Historical Dictionary of Mali. Scarecrow Press. p. 231. ISBN 9780810864023.
  19. 19.0 19.1 Aku Adjandeh, Evelyn (జూలై 2014). "A STUDY OF PROVERBS IN THINGS FALL APART AND SUNDIATA: AN EPIC OF OLD MALI (SUNDIATA)" (PDF). UNIVERSITY OF GHANA, LEGON – INSTITUTE OF AFRICAN STUDIES. p. 100. Archived from the original (PDF) on 20 మార్చి 2017.
  20. Graft-Johnson, John Coleman De (1 జనవరి 1986). African Glory: The Story of Vanished Negro Civilizations. Black Classic Press. p. 92. ISBN 9780933121034.
  21. Fyle, C. Magbaily (1999). Introduction to the History of African Civilization: Precolonial Africa. University Press of America. p. 11. ISBN 9780761814566.
  22. 22.0 22.1 22.2 Mali country profile, p. 1.
  23. 23.00 23.01 23.02 23.03 23.04 23.05 23.06 23.07 23.08 23.09 23.10 23.11 23.12 23.13 Mali country profile. Mali was later responsible for the collapse of Islamic Slave Army from the North. The defeat of Tukuror Slave Army, was repeated by Mali against the France and Spanish Expeditionary Army in the 1800s ("Blanc et memoires"). . p. 2.
  24. John Iliffe (2007) Africans: the history of a continent. Cambridge University Press. p. 69. ISBN 0-521-68297-5
  25. "Public Holidays". Embassy of the Republic of Mali to the United States. Archived from the original on 20 సెప్టెంబరు 2018. Retrieved 20 సెప్టెంబరు 2018.
  26. Core document forming part of the reports of states parties: Mali. United Nations Human Rights Website.
  27. 27.0 27.1 27.2 27.3 27.4 27.5 27.6 Mali country profile, p. 3.
  28. "Liberation Day Commemorated in Mali". Archived from the original on 2 ఫిబ్రవరి 2019. Retrieved 1 ఫిబ్రవరి 2019.
  29. "Mali's nomads face famine". BBC News. 9 August 2005.
  30. 30.0 30.1 "Nonviolent Conflict Summaries". Archived from the original on 16 జూన్ 2011. Retrieved 27 ఫిబ్రవరి 2019. Mali March 1991 Revolution
  31. 31.0 31.1 Nesbitt, Katherine. "Mali's March Revolution (1991)". International Center on Nonviolent Conflict. Archived from the original on 16 జూన్ 2011. Retrieved 27 ఫిబ్రవరి 2019.
  32. Bussa, Edward (26 మార్చి 2009). "Mali's March to Democracy". threadster.com. Archived from the original on 24 మార్చి 2012. Retrieved 27 ఫిబ్రవరి 2019.
  33. Mali country profile, p. 4.
  34. USAID Africa: Mali. USAID. Retrieved 15 May 2008. Retrieved 3 June 2008.
  35. 35.0 35.1 Tran, Mark (23 అక్టోబరు 2012). "Mali conflict puts freedom of 'slave descendants' in peril". The Guardian. London. Retrieved 24 నవంబరు 2012.
  36. York, Geoffrey (11 నవంబరు 2012). "Mali chaos gives rise to slavery, persecution". The Globe and Mail. Toronto.
  37. Mali clashes force 120 000 from homes Archived 2017-10-10 at the Wayback Machine. News24 (22 February 2012). Retrieved 23 February 2012.
  38. Callimachi, Rukmini (3 April 2012) "Post-coup Mali hit with sanctions by African neighbours". Globe and Mail. Retrieved 4 May 2012.
  39. "Tuareg rebels declare independence in north Mali". France 24. 6 ఏప్రిల్ 2012. Retrieved 28 జూలై 2012.
  40. Tiemoko Diallo; Adama Diarra (28 జూన్ 2012). "Islamists declare full control of Mali's north". Reuters. Archived from the original on 15 ఆగస్టు 2020. Retrieved 28 జూలై 2012.
  41. "Mali Islamists want sharia not independence". Google News. Agence France-Presse. 20 జూన్ 2012. Archived from the original on 16 డిసెంబరు 2012. Retrieved 28 జూలై 2012.
  42. "Mali Possibilities and Challenges for Transitional Justice in Mali". International Center for Transitional Justice. 9 జనవరి 2014. Retrieved 25 ఆగస్టు 2016.
  43. "French Troops Retake Kidal Airport, Move into City". USA Today. 30 జనవరి 2013. Retrieved 30 జనవరి 2013. French troops retake the last remaining Islamist urban stronghold in Mali.
  44. "Mali conflict: Timbuktu hails French President Hollande". BBC News. 2 ఫిబ్రవరి 2013. Archived from the original on 2 ఫిబ్రవరి 2013. Retrieved 4 ఫిబ్రవరి 2013.
  45. 45.0 45.1 45.2 45.3 45.4 Mali country profile, p. 5.
  46. Uranium Mine Ownership – Africa. Wise-uranium.org. Retrieved 24 March 2013.
  47. Muller, CJ and Umpire, A (22 November 2012) An Independent Technical Report on the Mineral Resources of Falea Uranium, Copper and Silver Deposit, Mali, West Africa Archived 2021-08-24 at the Wayback Machine. Minxcon.
  48. Uranium in Africa Archived 2014-04-17 at the Wayback Machine. World-nuclear.org. Retrieved 24 March 2013.
  49. Martin, Phillip L. (2006). Managing Migration: The Promise of Cooperation. Lanham, Maryland: Lexington Books. p. 134. ISBN 978-0-7391-1341-7.
  50. DiPiazza, p. 37.
  51. "Report of the Secretary-General on the situation in Mali" (PDF). MINUSMA. 28 మార్చి 2016. Retrieved 21 ఫిబ్రవరి 2017.
  52. "Régionalisation: Deux Nouvelles régions créées au Mali". Malijet. 21 జనవరి 2016. Archived from the original on 22 ఫిబ్రవరి 2017. Retrieved 21 ఫిబ్రవరి 2017.
  53. "Report of the Secretary-General on the situation in Mali" (PDF). MINUSMA. 30 డిసెంబరు 2016. Retrieved 21 ఫిబ్రవరి 2017.
  54. Loi N°99-035/ Du 10 Aout 1999 Portant Creation des Collectivites Territoriales de Cercles et de Regions (PDF) (in French), Ministère de l'Administration Territoriales et des Collectivités Locales, République du Mali, 1999, archived from the original (PDF) on 9 మార్చి 2012, retrieved 27 ఫిబ్రవరి 2019{{citation}}: CS1 maint: unrecognized language (link)
  55. "Tuareg rebels declare the independence of Azawad, north of Mali". Al Arabiya. 6 ఏప్రిల్ 2012. Retrieved 6 ఏప్రిల్ 2012.
  56. 56.0 56.1 56.2 56.3 56.4 56.5 56.6 56.7 56.8 Central Intelligence Agency (2009). "Mali". The World Factbook. Archived from the original on 10 నవంబరు 2015. Retrieved 12 జనవరి 2010.
  57. 57.0 57.1 57.2 57.3 57.4 57.5 57.6 57.7 57.8 "Mali". U.S. State Department. మే 2008. Retrieved 4 జూన్ 2008.
  58. Mali and the WTO. World Trade Organization. Retrieved 24 March 2013.
  59. "OHADA.com: The business law portal in Africa". Retrieved 22 మార్చి 2009.
  60. Mali country profile, p. 9.
  61. Zone franc sur le site de la Banque de France Archived 2013-01-20 at the Wayback Machine. Banque-france.fr. Retrieved 24 March 2013.
  62. 62.0 62.1 62.2 Hale, Briony (13 మే 1998). "Mali's Golden Hope". BBC News. Retrieved 4 జూన్ 2008.
  63. 63.0 63.1 63.2 63.3 Cavendish, Marshall (2007). World and Its Peoples: Middle East, Western Asia, and Northern Africa. Tarrytown, New York: Marshall Cavendish. p. 1367. ISBN 978-0-7614-7571-2.
  64. May, Jacques Meyer (1968). The Ecology of Malnutrition in the French Speaking Countries of West Africa and Madagascar. New York: Macmillan Publishing Company. p. 291. ISBN 978-0-02-848960-5.
  65. Campbell, Bonnie (2004). Regulating Mining in Africa: For Whose Benefit?. Uppsala, Sweden: Nordic African Institute. p. 43. ISBN 978-0-7614-7571-2.
  66. African Development Bank, p. 186.
  67. Farvacque-Vitkovic, Catherine et al. (September 2007) DEVELOPMENT OF THE CITIES OF MALI — Challenges and Priorities. Africa Region Working Paper Series No. 104/a. World Bank
  68. 68.0 68.1 68.2 68.3 68.4 68.5 68.6 Mali country profile, p. 6.
  69. "Mali Demographics Profile 2014".
  70. Popenoe, Rebecca (2003) Feeding Desire — Fatness, Beauty and Sexuality among a Saharan People. Routledge, London. pp. 16–17. ISBN 0-415-28096-6
  71. "Popular baby names of MALI, West Africa". NamSor Blog. 24 నవంబరు 2017. Archived from the original on 1 డిసెంబరు 2017. Retrieved 24 నవంబరు 2017.
  72. Fortin, Jacey (16 జనవరి 2013). "Mali's Other Crisis: Slavery Still Plagues Mali, And Insurgency Could Make It Worse". International Business Times.
  73. "Kayaking to Timbuktu, Writer Sees Slave Trade". National Geographic News. 5 December 2002.
  74. "Kayaking to Timbuktu, Original National Geographic Adventure Article discussing Slavery in Mali". National Geographic Adventure. December 2002/January 2003.
  75. MacInnes-Rae, Rick (26 నవంబరు 2012). "Al-Qaeda complicating anti-slavery drive in Mali". CBC News.
  76. Fage, J. D.; Gray, Richard; Oliver, Roland (1975). The Cambridge History of Africa. Cambridge University Press. ISBN 9780521204132.
  77. Hall, Bruce S. (2011) A History of Race in Muslim West Africa, 1600–1960. Cambridge University Press. ISBN 9781107002876: "The mobilization of local ideas about racial difference has been important in generating, and intensifying, civil wars that have occurred since the end of colonial rule in all of the countries that straddle the southern edge of the Sahara Desert. [...] contemporary conflicts often hearken back to an older history in which blackness could be equated with slavery and non-blackness with predatory and uncivilized banditry." (cover text)
  78. Hirsch, Afua (6 July 2012) Mali's conflict and a 'war over skin colour', The Guardian.
  79. 79.0 79.1 International Religious Freedom Report 2008: Mali. State.gov (19 September 2008). Retrieved 4 May 2012.
  80. "The World's Muslims: Unity and Diversity" (PDF). Pew Forum on Religious & Public life. 9 ఆగస్టు 2012. Archived from the original (PDF) on 24 అక్టోబరు 2012. Retrieved 2 జూన్ 2014.
  81. 81.00 81.01 81.02 81.03 81.04 81.05 81.06 81.07 81.08 81.09 81.10 81.11 Mali country profile, p. 7.
  82. Report points to 100 million persecuted Christians.. Retrieved 10 January 2013.
  83. OPEN DOORS World Watch list 2012. Worldwatchlist.us. Retrieved 24 March 2013.
  84. "Université de Bamako – Bamako, Mali". Northwestern University Feinberg School of Medicine. Archived from the original on 13 మే 2013. Retrieved 28 ఫిబ్రవరి 2019.
  85. Life Expectancy ranks Archived 2018-12-06 at the Wayback Machine. CIA World Factbook
  86. 86.0 86.1 86.2 86.3 86.4 Mali country profile, p. 8.
  87. Nourishing communities through holistic farming Archived 2018-10-06 at the Wayback Machine, Impatient optimists, Bill & Melinda Gates Foundation. 30 April 2013.
  88. WHO | Female genital mutilation and other harmful practices Archived 2011-04-23 at the Wayback Machine. Who.int (6 May 2011). Retrieved 4 May 2012.
  89. Female genital cutting in the Demographic Health Surveys: a critical and comparative analysis. Calverton, MD: ORC Marco; 2004 (DHS Comparative Reports No. 7) Archived 2014-04-26 at the Wayback Machine. (PDF). Retrieved 18 January 2013.
  90. "Human Development Indices and Indicators: 2018 Statistical Update: Mali" (PDF). United Nations Development Programme. Retrieved 24 నవంబరు 2018.
  91. 91.0 91.1 91.2 91.3 91.4 91.5 "Violence against Women in Mali" (PDF). World Organisation Against Torture (OMCT). 7 జూలై 2004. Retrieved 24 నవంబరు 2018.
  92. 92.0 92.1 92.2 92.3 92.4 92.5 92.6 "USAID MALI:ADDENDUM TO THE 2012 GENDER ASSESSMENT" (PDF). United States Agency of International Development. మే 2015. Archived from the original (PDF) on 5 సెప్టెంబరు 2018. Retrieved 24 నవంబరు 2018.
  93. 93.00 93.01 93.02 93.03 93.04 93.05 93.06 93.07 93.08 93.09 93.10 93.11 93.12 93.13 93.14 93.15 93.16 93.17 93.18 93.19 93.20 "GENDER EQUALITY AND WOMEN'S EMPOWERMENT IN PUBLIC ADMINISTRATION: MALI CASE STUDY" (PDF). United Nations Development Programme. 2012. Archived from the original (PDF) on 18 డిసెంబరు 2018. Retrieved 24 నవంబరు 2018.
  94. 94.0 94.1 94.2 "Men, Gender Equality and Gender Relations in Mali: Findings from the International Men and Gender Equality Survey". Promundo (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 18 డిసెంబరు 2018. Retrieved 24 నవంబరు 2018.
  95. 95.0 95.1 Pye-Smith, Charlie & Rhéal Drisdelle. Mali: A Prospect of Peace? Oxfam (1997). ISBN 0-85598-334-5, p. 13.
  96. Crabill, Michelle and Tiso, Bruce (January 2003). Mali Resource Website. Fairfax County Public Schools. Retrieved 4 June 2008.
  97. 97.0 97.1 "Music". Embassy of the Republic of Mali in Japan. Archived from the original on 8 జూలై 2013. Retrieved 28 ఫిబ్రవరి 2019.
  98. Velton, p. 29.
  99. 99.0 99.1 99.2 99.3 Milet, p. 128.
  100. 100.0 100.1 100.2 100.3 Velton, p. 28.
  101. 101.0 101.1 Milet, p. 151.
  102. 102.0 102.1 102.2 102.3 102.4 DiPiazza, p. 55.
  103. 103.0 103.1 103.2 Hudgens, Jim, Richard Trillo, and Nathalie Calonnec. The Rough Guide to West Africa. Rough Guides (2003). ISBN 1-84353-118-6, p. 320.
  104. "Malian Men Basketball". Africabasket.com. Retrieved 3 June 2008.
  105. Chitunda, Julio. "Ruiz looks to strengthen Mali roster ahead of Beijing" Archived 2016-03-03 at the Wayback Machine. FIBA.com (13 March 2008). Retrieved 24 June 2008.
  106. 106.0 106.1 106.2 Velton, p. 30.
  107. 107.0 107.1 107.2 Milet, p. 146.
  108. Murison, Katharine, ed. (2002). Africa South of the Sahara 2003. Taylor & Francis. pp. 652–53. ISBN 978-1-85743-131-5.
  109. Batvina, Iryna. "Culture of Mali". www.best-country.com. Retrieved 18 సెప్టెంబరు 2016.