స్వాజీల్యాండ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాజీల్యాండ్ (ఆంగ్లం: Swaziland) దక్షిణ ఆఫ్రికా దేశాన్ని ఆనుకొని ఉన్న ఒక చిన్న దేశం. ఈ దేశానికి ఈశాన్యాన మొజాంబిక్ ఉండగా, చుట్టూ దక్షిణ ఆఫ్రికా కలదు. 19వ శతాబ్దంలో ఈ దేశపు విస్తరణకు, ఐకమత్యానికి కృషి చేసిన అప్పటి రాజు రెండవ మ్స్వాతి పేరు వలన ఈ దేశానికి స్వాజీల్యాండ్ అని, ఈ దేశ ప్రజలకు స్వాజీలు అని పేరు వచ్చినది. ఈ దేశపు అధికారిక భాష, స్వాతి.

ఉత్తరం నుండి దక్షిణం వరకు స్వాజీల్యాండ్ 200 కి.మీ (120 మైళ్ళు) విస్తరించి ఉండగా, తూర్పు నుండి పడమర వరకు 130 కి.మీ (81 మైళ్ళు) విస్తరించి ఉన్నది. ఆఫ్రికా ఖండంలోని అతి చిన్న దేశాలలో స్వాజీల్యాండ్ కూడా ఒకటి. అయినా, దీన్ వాతావరణం, భూగోళిక పరిస్థితులు చల్లని ఎత్తైన పర్వతాల నుండి లోతట్టు వేడి ప్రదేశాలతో చాలా వైవిధ్యంగా ఉంటాయి. ఇక్కడి జనాభాలో ప్రధానంగా స్థానిక స్వాజీలు కలరు. వీరు తమ రాజ్యాన్ని 18వ శతాబ్దపు మధ్యలో, మూడవ న్గ్వానే నాయకత్వంలో స్థాపించుకొన్నారు. ప్రస్తుత సరిహద్దులు 1881 లో జరిగిన ఆఫ్రికా కోసం పెనుగులాట (Scramble for Africa) సమయంలో గీయబడినవి. రెండవ బోయర్ యుద్ధం తర్వాత 1903 నుండి 1967 వరకు స్వాజీల్యాండ్ బ్రిటీష్ ప్రొటెక్టరేటు గా కొనసాగినది. మరల స్వాజీల్యాండ్ స్వతంత్రాన్ని 6 సెప్టెంబరు 1968లో సాధించుకొన్నది.