Jump to content

సేషెల్స్

అక్షాంశ రేఖాంశాలు: 4°35′S 55°40′E / 4.583°S 55.667°E / -4.583; 55.667
వికీపీడియా నుండి
(సేచెల్లిస్ నుండి దారిమార్పు చెందింది)

4°35′S 55°40′E / 4.583°S 55.667°E / -4.583; 55.667

Republic of Seychelles

Flag of Seychelles
జండా
Coat of arms of Seychelles
Coat of arms
నినాదం: "Finis Coronat Opus" (Latin)
"The End Crowns the Work"
గీతం: Koste Seselwa
Join together all Seychellois
Location of  సేషెల్స్  (dark blue) – in Africa  (light blue & dark grey) – in the African Union  (light blue)
Location of  సేషెల్స్  (dark blue)

– in Africa  (light blue & dark grey)
– in the African Union  (light blue)

రాజధానిVictoria
4°37′S 55°27′E / 4.617°S 55.450°E / -4.617; 55.450
అధికార భాషలు
జాతులు
(2000)
పిలుచువిధం
  • Seychellois
  • Seychelloise
  • Seselwa (Creole)
ప్రభుత్వంUnitary presidential republic
• President
Danny Faure
Vincent Mériton
శాసనవ్యవస్థNational Assembly
Independence
• from the United Kingdom
29 June 1976
విస్తీర్ణం
• మొత్తం
459 కి.మీ2 (177 చ. మై.) (181st)
• నీరు (%)
negligible
జనాభా
• 2016 estimate
94,228[1] (195th)
• జనసాంద్రత
205.3/చ.కి. (531.7/చ.మై.) (67th)
GDP (PPP)2018 estimate
• Total
$2.919 billion[2]
• Per capita
$30,486[2]
GDP (nominal)2018 estimate
• Total
$1.564 billion[2]
• Per capita
$16,332[2]
జినీ (2013)46.8[3]
high
హెచ్‌డిఐ (2017)Increase 0.797[4]
high · 62nd
ద్రవ్యంSeychellois rupee (SCR)
కాల విభాగంUTC+4 (SCT)
• Summer (DST)
UTC+4 (not observed)
వాహనాలు నడుపు వైపుleft
ఫోన్ కోడ్+248
ISO 3166 codeSC
Internet TLD.sc

సేషెల్స్ [5][6][7] [8]), అధికారికంగా " సేషెల్స్ రిపబ్లిక్ " హిందూ మహాసముద్రంలో ఒక ద్వీపసమూహ దేశం. 115 ద్వీపాల దేశం రాజధాని విక్టోరియా, తూర్పు ఆఫ్రికాకు తూర్పున 1,500 కిలోమీటర్ల (932 మైళ్ళు) దూరంలో ఉంది. ఇతర సమీపంలోని ద్వీప దేశాలు, భూభాగాలు కొమొరోస్, మయొట్టె (ఫ్రాన్స్ ప్రాంతం), మడగాస్కర్, రీయూనియన్ (ఫ్రాన్సు ప్రాంతం), దక్షిణసరిహద్దులో మారిషస్, అలాగే తూర్పు సరిహద్దులో మాల్దీవులు, బ్రిటీషు హిందూ మహాసముద్రం ఉన్నాయి. దేశ జనసంఖ్య సుమారు 94,228. సార్వభౌమ ఆఫ్రికన్ దేశాలలో అతిస్వల్పమైన జనసంఖ్యగా గుర్తించబడుతూ ఉంది.[9]

సేషెల్స్ ఆఫ్రికా సమాఖ్య, సదరను ఆఫ్రికా డెవెలప్మెంటు కమ్యూనిటీ, కామన్వెల్తు ఆఫ్ నేషన్సు, యునైటెడు నేషన్సులో సభ్యదేశంగా ఉంది. 1976 లో యునైటెడు కింగ్డం నుండి స్వాతంత్ర్యం ప్రకటించిన తరువాత సేషెల్స్ వ్యవసాయరంగ ఆధారిత ఆర్థికవ్యవస్థను మార్కెట్టు-ఆధారిత వైవిధ్యభరితమైన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసింది. వ్యవసాయం రంగాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న సేవ, ప్రభుత్వ రంగాలు, పర్యాటక రంగం అధిగమించాయి. 1976 నుండి 2015 మద్య కాలంలో నామమాత్రపు జి.డి.పి. ఉత్పత్తి 7 రెట్లు అధికరించింది. కొనుగోలు శక్తి సమానత దాదాపు 16 రెట్లు అధికరించింది. 2010 చివరిలో అధ్యక్షుడు డానీ ఫౌరె, నేషనలు అసెంబ్లీ ఈ రంగాలను మరింత మెరుగుపరిచేందుకు విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాలని ప్రణాళికలు సమర్పించారు.

ప్రస్తుతం సేషెల్స్ ఆఫ్రికాలోని ఫ్రెంచి భూభాగాలను మినహాయించి, నామమాత్రపు తలసరి జీడీపీ అత్యధికంగా ఉంటుందని సగర్వంగా చెప్పుకుంటుంది. అధిక మానవ అభివృద్ధి సూచికతో ఉన్న ఆఫ్రికాలోని కొన్ని దేశాలలో ఇది ఒకటి. దేశం కొత్తగా ఆర్థిక శ్రేయస్సు ఉన్నప్పటికీ అధిక స్థాయి ఆర్థిక అసమానత్వం అత్యధికంగా ఉన్న ప్రపంచదేశాలలో ఇది ఒకటిగా ఉంది. ఉన్నత వర్గాలు, పాలక వర్గానికి మరింత అనుకూలంగా ఉండి ప్రజలలో అసమాన సంపద పంపిణీ కారణంగా పేదరికం అధికంగా ఉంది.[10]

చరిత్ర

[మార్చు]
Victoria, Seychelles 1900s

నమోదిత చరిత్రలో అత్యధిక కాలం సేషెల్స్ నిర్జనంగా ఉండేది. కొంతమంది పరిశోధకులు ఆస్ట్రోనేషియను నావికులు, తరువాత మాల్దీవుల ప్రజలు, అరబ్బు వ్యాపారులు జనావాసాలు లేని సేచిల్లిస్ దీవులలో మొదటిసారిగా ప్రవేశించారని భావిస్తున్నారు. ఈ భావన 1910 వరకు కనిపించే సమాధుల ఆధారంగా కనుగొనబడింది.[11] ఐరోపావాసుల మొట్టమొదటి రికార్డును పోర్చుగీసు అడ్మిరలు వాస్కో డా గామా 1502 లో అమిరాంటెసు గుండా వెళ్లి తనకు తానుగా ఈ ద్వీపాలను " అడ్మిరల్ ద్వీపాలు " నామకరణం చేసాడు. 1609 జనవరిలో బ్రిటీషు ఈస్టు ఇండియాకంపెనీ నాల్గవ సముద్రయానంలో కెప్టెను అలెగ్జాండర్ షార్పెయి ఆధ్వర్యంలో "అసెన్షన్" సిబ్బందితో ఈ దీవులలో అడుగుపెట్టడం మొట్టమొదటి నమోదిత ప్రవేశంగా భావించబడుతుంది.[12]

ఆఫ్రికా, ఆసియా మధ్య వాణిజ్యం కోసం ఒక రవాణా మజిలీగానూ సముద్రపు దొంగలచే ఈ ద్వీపాలు సముద్రపు దొంగలచే అప్పుడప్పుడు ఉపయోగించబడ్డాయి. 1756 లో ఫ్రెంచ్ ప్రారంభంలో నియంత్రణను ప్రారంభించడంతో కెప్టెన్ నికోలస్ మొర్ఫీచే మాచేపై ఒక రాయిని ఉంచారు. ఈ దీవులకు లూయిస్ XV యొక్క ఆర్థిక మంత్రి జీన్ మోరౌ డి సెచలెస్ పేరు పెట్టారు.

1794 - 1810 మధ్యకాలంలో బ్రిటీషు ఈ ద్వీపాన్ని నియంత్రించింది. ఫ్రెంచి నిర్వాహకుడు జీను బాప్టిస్టే క్యూవా డి క్విన్సీ సాయుధ శత్రువు యునైటెడు కింగ్డంతో దీర్ఘకాల యుద్ధం తరువాత యుద్ధనౌకలు వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు తిరస్కరించి దానికి బదులుగా ఆయన బ్రిటనుకు లొంగిపోయే హోదాను విజయవంతంగా చర్చించాడు. తద్వారా సెటిలర్లకు తటస్థతకు విశేష స్థానం కల్పించారు.

రెండవ ఎలిజబెతు రాణ చిత్రంతో వెలువరించిన 1953 స్టాంపు

1810 లో మారిషస్ లొంగిపోవడంతో బ్రిటను ఈ ప్రాంతం మీద చివరకు పూర్తి నియంత్రణను చేపట్టింది. 1814 లో పారిసు ఒప్పందం తరువాత ఇది అధికారికంగా ప్రకటించబడింది. 1903 లో సేషెల్స్ మారిషస్ నుండి ప్రత్యేకమైన బ్రిటిషు క్రౌను కాలనీగా మారింది. 1966, 1970 లో ఎన్నికలు జరిగాయి.

స్వతంత్రం

[మార్చు]

1976 లో సేషెల్స్ స్వతంత్రం పొందింది. కామన్వెల్తులలో గణతంత్రం అయింది.[13] 1970 లలో సేషెల్స్ చలనచిత్ర నటులు, అంతర్జాతీయ జెటు సెటుకు క్రీడా స్థలం అయింది.[14] 1977 లో ఫ్రాన్సు ఆల్బర్టు రెనే తిరుగుబాటు చేసి రిపబ్లికు మొదటి అధ్యక్షుడు జేమ్సు మంచాన్ని పదవి నుండి తొలగించాడు.[15] రెనె పర్యాటకంపై ఆధారపడడం నిరాకరించాడు.[14]

1979 రాజ్యాంగం ఒక సోషలిస్టు ఏక పార్టీ దేశంగా ప్రకటించింది. ఇది 1991 వరకు కొనసాగింది.

1980 వ దశకంలో అధ్యక్షుడు రెనే వ్యతిరేకంగా వరుసగా తిరుగుబాటు ప్రయత్నాలు జరిగాయి. వీటిలో కొన్ని దక్షిణాఫ్రికా మద్దతుతో జరిగాయి. 1981 లో మైకు హొరే నాయత్వంలో జరిగిన " 1981 సేషెల్స్ తిరుగుబాటు కుట్ర " ప్రయత్నంలో హాలిడే రగ్బీ ఆటగాళ్ళుగా 43 దక్షిణ ఆఫ్రికా కిరాయి సైనిక బృందాన్ని నడిపించాడు.[14] విమానాశ్రయం వద్ద ఒక తుపాకీల యుద్ధం జరిగింది. అనేకమంది సభ్యుల తర్వాత హైజాకు చేసిన ఎయిరు ఇండియా విమానం ద్వారా తప్పించుకున్నారు.[14] ఈ హైజాకుకు రోడెసియను ఎస్.ఎ.ఎస్. మాజీ సభ్యుడు అయిన జర్మనీ కిరాయి సైనికుడు డి. క్లోడో. నాయకత్వం వహించాడు.[16] తరువాత క్లాడో దక్షిణాఫ్రికాలో (అతను నిర్దోషించబడ్డాడు)విచారణను ఎదుర్కొన్నాడు. తరువాత తన స్వంత దేశం జర్మనీలో ఎయిర్ పైరసీ కోసం విచారణను ఎదుర్కొన్నాడు.[17]

1986 లో సేషెల్స్ రక్షణ మంత్రి ఓగిల్వి బెర్లుయిస్ నేతృత్వంలోని ఒక తిరుగుబాటు ప్రయత్నం జరిగింది. అధ్యక్షుడు రెనే భారతదేశం నుండి సహాయం కోరాడు. " ఆపరేషన్ ఫ్లవర్సు ఆర్ బ్లూమింగు " పేరుతో భారత నావికాదళం యుద్ధనౌక " ఐఎన్ఎస్ వింధ్యగిరి "లో ప్రయాణించి తిరుగుబాటును నివారించడానికి పోర్టు విక్టోరియాకు చేరుకున్నారు.[18]

1962 లో కొత్త రాజ్యాంగం తొలి ముసాయిదా జయించడానికి అవసరమైన 60% ఓటర్లను పొందడంలో విఫలమైంది. కానీ 1993 లో సవరించిన ఒక రాజ్యాంగం ఆమోదించబడింది.

2013 జనవరిలో సెచెల్లిస్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఉష్ణ మండలీయ తుఫాను ఫెల్లెంగు కారణంగా సంభవించిన ఘన వర్షం కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడి వందల కొద్దీ ఇళ్ళను నాశనం చేశాయి.[19][20]

భౌగోళికం

[మార్చు]
View of Praslin, the second largest island of the Seychelles

ఒక ద్వీప దేశం సేషెల్స్ హిందూ మహాసముద్రంలో మడగాస్కర్ ఈశాన్యంలో, కెన్యాకు తూర్పున 1,600 కిమీ (994 మైళ్ళు) దూరంలో ఉంది. ద్వీపసమూహంలో 115 ద్వీపాలు ఉన్నాయి. ద్వీపాలలో ఎక్కువ భాగం జనావాసరహితంగా ప్రకృతి రిజర్వులుగా ఉన్నాయి.

42 ద్వీపాల సమూహం లోతట్టు ద్వీపాలుగా ఉన్నాయి. మొత్తం వైశాల్యం 244 కిలోమీటర్ల ఉంది. సేషెల్స్ మొత్తం భూభాగ వైశాల్యంలో ఇవి 54% ఉంటుంది. సేషెల్స్ మొత్తం జనాభాలో 98% ఇక్కడ నివసిస్తున్నారు.

ఈ ద్వీపాలు సమూహాలుగా విభజించబడ్డాయి.

గ్రానిటికు సేషెల్స్ అని పిలువబడే 45 గ్రానైటు-ఆధారిత దీవులు ఉన్నాయి. పరిమాణ క్రమం: మాయే, ప్రస్లిను, సిల్హౌటు ద్వీపం, లా డిగ్యు, క్యూరీయుసు, ఫెలిసిటే, ఫ్రెగేటు, స్టీ-అన్నే, నార్తు, సెర్ఫు, మరియన్నె, గ్రాండు సాయిరు, థెరిసే, అరిడు, కాన్సెప్షను, పెటైటు సాయూరు, కజిను, కౌసైను, లాంగు, రెసిఫు, రౌండ్ (ప్ర్యాస్లిన్), అనోనిమె, మమెల్లెసు, మయొన్నే, ఈడెను, ఇలే సోలెయిలు, రొమైంవిల్లె, ఇలే ఆక్సు వచెసు మెరైను ఎల్ ' ఇస్లెట్టె, బెకను (ఇలే సెచె ), కాచీ, కోకోసు, రౌండు (మాచె), ఎల్.ఇలాటు ఫ్రెగట, బోబీ, చౌవు-సౌరిసు (మాహె), చౌవు-సౌరిసు (ప్రస్లిను), ఐలు లా ఫౌచీ, హోడౌలు, ఎల్'లోట్, రాటు, సౌరిసు, సెయింటు పియరు (ప్రస్లిన్), జావే, హారిసను రాక్సు (గ్రాండు రోచరు).

లా డిగ్యు ద్వీపంలో ఆన్సే సోర్ డి'ఆర్గ్ బీచ్

రెండు పగడపు ఇసుక గ్రానైట్లకి ఉత్తరంగా ఉన్నాయి: డెనిసు, బర్డు.

గ్రాన్టిక్సుకు దక్షిణాన రెండు పగడపు దీవులు ఉన్నాయి: కోటివి, ప్లాట్టే.

ప్రస్లిన్ ద్వీపంలో ఆన్సే లాజియో బీచ్

అరారాంట్సు గుంపులో 29 పగడపు ద్వీపాలు ఉన్నాయి. అవి: గ్రామాల పడమటి వైపు: డిసోచెసు, పోవిరు అటోలు (మూడు దీవులు-పోవిర్, ఫ్లోరెంటైన్, సౌత్ ఐలండ్), అల్ఫోన్స్, డి'ఆర్రోస్, సెయింట్ జోసెఫ్ అటాల్ (14 దీవులు-సెయింట్ జోసెఫ్, ఇలే ఆక్స్ Fouquets, రిసోర్స్, పెటిట్ Carcassaye, గ్రాండ్ Carcassaye, బెంజమిన్, Bancs ఫెరారీ, Chiens, పెలికాంసు, Vars, ఇలే పాల్, బాంకు డి సబ్లె, బాంకు ఆక్సు కోకోసు, ఐలే ఆక్సు Poules), మేరీ లూయిస్, Desnœufs, ఆఫ్రికన్ బ్యాంక్స్ (రెండు కూడిన దీవులు-ఆఫ్రికన్ బ్యాంక్స్, సౌత్ ఐల్యాండ్), రేమెర్, సెయింట్ ఫ్రాంకోయిస్, బౌడ్యూస్, ఎటోయిలీ, బిజౌటైర్.

ఫార్గుహార్ గ్రూప్, Amirantes దక్షిణ-నైరుతిలో 13 పగడపు దీవులు ఉన్నాయి: ఫార్గుహార్ అటోల్ (10 ద్వీపాలను-Bancs డి సబ్లె, ఫ్లె ఆక్స్ Goëlettes, Lapins, ఇలే డు మిలెయు, ఉత్తర Manaha, దక్షిణ Manaha, మధ్య Manaha, ఉత్తర ద్వీపం, దక్షిణ ద్వీపం), ప్రొవిడెన్స్ అటోల్ (రెండు దీవులు-ప్రావిడెన్స్, బాంగ్స్ ప్రొవిడెన్స్), సెయింట్ పియెర్ ఉన్నాయి.

మాహె ద్వీపం

అల్డబ్రా బృదంలో 67 వలసపాలకులు అభివృద్ధిచేసిన పగడపు దీవులు ఉన్నాయి. ఫర్క్యుహరు పశ్చిమంలో అల్డబ్రా Aldabra అటోలు (46 ద్వీపాలు-గ్రాండే టెర్రె, పికార్డు, పాలీమైన్, మలబారు, ఇలే మైకేలు, ఇలే ఎస్పిరొటు, ఇలే ఆక్సు, మౌస్టిక్యూసు, ఇలాటు పార్కు, ఇలాటు ఎమిలే, ఇలాటు యంగ్యూ. ఇలాటు మాగ్నను, ఇలే లేనియర్, చాంపిగ్నను డెస్ ఓసు, యుఫ్రేటు, గ్రాండు మెంటరు, గ్రాండు ఇలాటు, గ్రాసు ఇలాటు జియోనెటు, గ్రాసు ఇలాటు సీసమె, హెరాను రాకు, హైడు ద్వీపం, ఇలే ఆక్సు అయిగ్రెట్టెసు, ఇలే ఆక్సు సెడ్రెసు, ఇలెసు చలాండ్సు, ఇలే ఫంగమె, ఇలే హెరాను, ఇలే మైకేలు, ఇలే స్క్వక్కొ, ఇలే సిల్వెస్ట్రె, ఇలే వర్టె, ఇలాటు డెడరు, ఇలాటు డు సుడు, ఇలాటు డు మిలియు, ఇలాటు డ్యు నార్డు, ఇలాటు డుబోయిసు, ఇలాటు మకోయా, ఇలాటు మార్క్యూయిసు, ఇలాటు నికోయిసు, ఇలాటు సాలడ్సు, మధ్య వరుసలో ద్వీపాలు, నాడీ రాకు, పెటిటు మెంటరు, పెటిటు మెంటరు ఎండాంసు, పెటిటు ఇలాట్సు, పింకు రాకు అండు టేబులురొండే) అసంప్షను ద్వీపం, అస్టోవు అట్టోవు, కాస్మోలిడో అటోలు (19 దీవులు-మేనై, ఐలె డూ నార్డు (పశ్చిమం, ఉత్తరం), ఐలె నోర్డ్-ఎస్టేట్ (తూర్పు ఉత్తరం), ఉత్తరం రో ఐల్యాండు, పెటిటు మెంటారు, పెటిటు మెంటరు ఎండన్సు, పెటిటు ఇలోట్సు, పింకు రాకు, టేబుల్ రోండే), ఐలె డు ట్రౌ, జియొలెట్సు, గ్రాండు పాలిటె, పెటిటు పాలీటే, గ్రాండు ఐలె (విజార్డు), పగోడె, ఐలె డు ఆక్సు సడు క్వెస్టు (దక్షిణం), ఐలె అక్సు మౌస్టిక్యూసు, ఐలె బలెయినె, ఐలె ఆక్సు చౌవె- సౌరిసు, ఐలె ఆక్సు మకాక్యూసు, ఐలె ఆక్సు ర్యాట్సు, ఐలె డూ నార్డు- క్వెస్టు, ఐలె అబ్జర్వేషను, ఐలె సుడు ఈస్టు, ఐలాటు లా క్రోఇక్సు.

వాతావరణం

[మార్చు]

The climate is equable although quite humid, as the islands are small,[21] classified by Köppen-Geiger system as tropical rain forest (Af). The temperature varies little throughout the year. Temperatures on Mahé vary from 24 నుండి 30 °C (75 నుండి 86 °F), and rainfall ranges from 2,900 mమీ. (114 అం.) annually at Victoria to 3,600 mమీ. (142 అం.) on the mountain slopes. Precipitation is somewhat less on the other islands.[22]

During the coolest months, July and August, the average low is about 24 °C (75 °F). The southeast trade winds blow regularly from May to November, and this is the most pleasant time of the year. The hot months are from December to April, with higher humidity (80%). March and April are the hottest months, but the temperature seldom exceeds 31 °C (88 °F). Most of the islands lie outside the cyclone belt, so high winds are rare.[22]

శీతోష్ణస్థితి డేటా - Victoria (Seychelles International Airport)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 29.8
(85.6)
30.4
(86.7)
31.0
(87.8)
31.4
(88.5)
30.5
(86.9)
29.1
(84.4)
28.3
(82.9)
28.4
(83.1)
29.1
(84.4)
29.6
(85.3)
30.1
(86.2)
30.0
(86.0)
29.8
(85.6)
రోజువారీ సగటు °C (°F) 26.8
(80.2)
27.3
(81.1)
27.8
(82.0)
28.0
(82.4)
27.7
(81.9)
26.6
(79.9)
25.8
(78.4)
25.9
(78.6)
26.4
(79.5)
26.7
(80.1)
26.8
(80.2)
26.7
(80.1)
26.9
(80.4)
సగటు అల్ప °C (°F) 24.1
(75.4)
24.6
(76.3)
24.8
(76.6)
25.0
(77.0)
25.4
(77.7)
24.6
(76.3)
23.9
(75.0)
23.9
(75.0)
24.2
(75.6)
24.3
(75.7)
24.0
(75.2)
23.9
(75.0)
24.4
(75.9)
సగటు అవపాతం mm (inches) 379
(14.9)
262
(10.3)
167
(6.6)
177
(7.0)
124
(4.9)
63
(2.5)
80
(3.1)
97
(3.8)
121
(4.8)
206
(8.1)
215
(8.5)
281
(11.1)
2,172
(85.6)
సగటు అవపాతపు రోజులు (≥ 1.0 mm) 17 11 11 14 11 10 10 10 11 12 14 18 149
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) 82 80 79 80 79 79 80 79 78 79 80 82 79.8
నెలవారీ సరాసరి ఎండ పడే గంటలు 153.3 175.5 210.5 227.8 252.8 232.0 230.5 230.7 227.7 220.7 195.7 170.5 2,527.7
Source 1: World Meteorological Organization[23]
Source 2: National Oceanic and Atmospheric Administration[24]

వన్యజీవితం

[మార్చు]
Seychelles Paradise-flycatcher
An Aldabra giant tortoise
Nerita plicata on Mahe island
Bird flocks Bird Island Seychelles

Seychelles is among the world's leading countries to protect lands for threatened species, allocating 42% of its territory for conservation.[25] Like many fragile island ecosystems, Seychelles saw the loss of biodiversity when humans first settled in the area, including the disappearance of most of the giant tortoises from the granitic islands, the felling of coastal and mid-level forests, and the extinction of species such as the chestnut flanked white eye, the Seychelles parakeet, and the saltwater crocodile. However, extinctions were far fewer than on islands such as Mauritius or Hawaii, partly due to a shorter period of human occupation (since 1770). Seychelles today is known for success stories in protecting its flora and fauna. The rare Seychelles black parrot, the national bird of the country, is now protected.

The granitic islands of Seychelles are home to about 75 endemic plant species, with a further 25 or so species in the Aldabra group. Particularly well-known is the coco de mer, a species of palm that grows only on the islands of Praslin and neighbouring Curieuse. Sometimes nicknamed the "love nut" because the shape of its "double" coconut resembles buttocks, the coco-de-mer produces the world's heaviest seed. The jellyfish tree is to be found in only a few locations on Mahe. This strange and ancient plant in a genus of its own (Medusagyne) seems to reproduce only in cultivation and not in the wild. Other unique plant species include Wright's gardenia (Rothmannia annae) found only on Aride Island Special Reserve.

The freshwater crab genus Seychellum is endemic to the granitic Seychelles, and a further 26 species of crabs and five species of hermit crabs live on the islands.[26]

The Aldabra giant tortoise now populates many of the islands of Seychelles; the Aldabra population is the largest remaining. These unique reptiles can be found even in captive herds. The granitic islands of Seychelles may support distinct species of Seychelles giant tortoises; the status of the different populations is currently unclear.

There are several unique species of orchid on the islands.

Seychelles hosts some of the largest seabird colonies in the world, notably on the outer islands of Aldabra and Cosmoledo. In granitic Seychelles the largest colonies are on Aride Island including the world's largest numbers of two species. Sooty terns also breed on the islands. Other birds include Cattle egrets (Bubulcus ibis) and Fairy terns (Gygis alba).[27]

The marine life around the islands, especially the more remote coral islands, can be spectacular. More than 1,000 species of fish have been recorded.

పర్యావరణ వివాదాలు

[మార్చు]

Since the use of spearguns and dynamite for fishing was banned through efforts of local conservationists in the 1960s, the wildlife is unafraid of snorkelers and divers. Coral bleaching in 1998 has damaged most reefs, but some reefs show healthy recovery (e.g., Silhouette Island).

Despite huge disparities across nations,[ఆధారం చూపాలి] Seychelles claims to have achieved nearly all of its Millennium Development Goals.[28] 17 MDGS and 169 targets have been achieved.[ఆధారం చూపాలి] Environmental protection is becoming a cultural value.[ఆధారం చూపాలి]

Their government's Seychelles Climate Guide describes the nation's climate as rainy, with a dry season with an ocean economy in the ocean regions. The Southeast Trades is on the decline but still fairly strong.[29] Reportedly, weather patterns there are becoming less predictable.[30]

ఆర్ధికం

[మార్చు]
మాహె బీచ్ లో సముద్రపు చేప
సేషెల్స్ మార్కెట్లో రంగురంగుల వస్త్రాలు

తోటల యుగంలో దాల్చినచెక్క, వెనిల్లా, కొబ్బరి ప్రధాన ఎగుమతులుగా ఉన్నాయి. 1965 లో ద్వీపాలకు మూడునెలల పర్యటన సందర్భంగా దార్శనికుడు డోనాల్డు ప్రెలు అప్పటి క్రౌను కాలనీ గవర్నరు జనరలుకు " ఆర్థిక భవిస్యత్తును స్పురింపజేసే ఆర్థిక నివేదిక తయారుచేసి అందించాడు. 1960 లలో తన నివేదిక కలిగించిన ప్రేరణతో ఆసమయంలో ఉన్న కార్మికశక్తిలో సుమారు 33% మంది తోటల పెంపకంలో పనిచేశారు. 20% ప్రభుత్వ లేదా ప్రభుత్వ రంగాలలో పనిచేశారు.[31][32] సేషెల్స్ ప్రభుత్వం సంవత్సరానికి $ 1,00,00,000 అమెరికా డాలర్ల కంటే అధికంగా అద్దెని పెంచిన కారణంగా ఎయిరు ఫోర్సు ఉపగ్రహ నియంత్రణ నెట్వర్కును ఉపయోగించిన (మాహెలో) ఇండియన్ ఓషను ట్రాకింగు స్టేషను 1996 ఆగస్టులో మూసివేయబడింది.

1976 లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి తలసరి ఆదాయం సుమారుగా 7 రెట్లు అధికరించింది. ఆర్థిక వృద్ధిరేటును పర్యాటక రంగం నిర్వహిస్తుంది. ఇది కార్మిక శక్తిలో సుమారు 30% మందికి ఉపాధి కల్పిస్తుంది. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో 3% మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పర్యాటక వృద్ధి ఉన్నప్పటికీ వ్యవసాయం, చేపలు పట్టడం కొరకు ఉద్యోగులను నియమించడమే కాకుండా కొబ్బరి, వెనిల్లాలను ప్రాసెసు చేసే పరిశ్రమలు స్త్యాపించబడ్డాయి.

2013 నాటికి ప్రధాన ఎగుమతి ఉత్పత్తులు చేపలు (60%), ఫిల్లెటు శీతలీకరణ చేయబడిన చేప (22%) ప్రాసెసు చేయబడతాయి.[33]

ప్రస్తుతం సేషెల్స్ ఉత్పత్తి చేయబడుతున్న ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులలో చిలగడ దుంపలు, వెనిల్లా, కొబ్బరికాయలు, దాల్చినచెక్క ఉన్నాయి. ఈ ఉత్పత్తులు స్థానికప్రజలకు చాలావరకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నాయి. శీతలీకరించి టిన్నులలో చేర్చబడిన తయారుగా ఉన్న చేప, కొబ్బరి, దాల్చినచెక్క, వెనిల్లా ఎగుమతులలో ప్రధానాన్యత వహిస్తున్నాయి.

2008 ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభాల తరువాత సేషెల్స్ ప్రభుత్వం బడ్జెటూ లోటును నిరోధించటానికి ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో సామాజిక సంక్షేమ వ్యయాలు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ వంటివి ఉన్నాయి. పెట్రోలియం ఉత్పత్తి, పంపిణీ, బ్యాంకింగు, ప్రాథమిక ఉత్పత్తులు, టెలీకమ్యూనికేషన్సు, ఇతర వ్యాపారాల విస్తార పరిధిలో పబ్లిక్ ఎంటర్ప్రైజెసు వంటి ఆర్థిక కార్యకలాపాల్లో ప్రభుత్వం విస్తారంగా జోక్యం చేసుకుంటుంది. ఎకనామిక్ ఫ్రీడం 2013 సూచిక పరిమిత మార్కెట్టు పారదర్శకత, నియంత్రణ సామర్థ్యం, ​​చట్ట నియమం, ఇతర కారణాలు ఉన్నాయని 2010 నుండి ప్రతి సంవత్సరం ఆర్థిక స్వేచ్ఛ అధికరిస్తుందని తెలియజేస్తుంది.[34]

సేషెల్స్ జాతీయ కరెన్సీ సెచెల్లోయిస్ రూపీ, ప్రారంభంలో అంతర్జాతీయ కరెన్సీలతో ముడిపడి ఉంది. ఆర్థిక వ్యవస్థలో మరింత విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి 2008 లో దీని విలువ తగ్గించబడింది.

పర్యాటకం

[మార్చు]
Aircraft at Seychelles International Airport
Beach resort at Seychelles

1971 సేషెల్స్ ఇంటర్నేషనలు ఎయిర్పోర్టు ప్రారంభించిన తరువాత పర్యాటకం ఒక ముఖ్యమైన పరిశ్రమగా మారింది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ ప్లాంటేషను, పర్యాటక రంగంగా విభజించబడుతుంది. పర్యాటక రంగం అధికంగా భాగస్వామ్యం వహిస్తుంది. తోటల ఆర్థికవ్యవస్థ విస్తరించడానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ తోటల రంగానికి ప్రాముఖ్యతను తగ్గించింది. పర్యాటకం సేషెల్స్ ప్రధాన పరిశ్రమగా మారింది.

ఇటీవల సంవత్సరాల్లో హోటళ్లు, ఇతర సేవలను అభివృద్ధి చేయడానికి విదేశీ పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహించింది. ఈ ప్రోత్సాహకాలు రియలు ఎస్టేటు ప్రాజెక్టులు, టి.ఐ.ఎం.ఇ. కొత్త రిసార్టులు ప్రపంచ బ్యాంకు ద్వారా పంపిణీ చేయబడ్డాయి. దాని పూర్వపు ప్రాజెక్టు ఎం.ఎ.జి.ఐ.సి.తో సహా భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టింది.[ఆధారం చూపాలి]అభివృద్ధి ఉన్నప్పటికీ పర్యాటకరంగం 1991-1992లో గల్ఫు యుద్ధం కారణంగా పర్యాటక రంగంలో గణనీయమైన క్షీణత సంభవించింది.[35]

తరువాత ప్రభుత్వం వ్యవసాయం, చేపల పెంపకం, చిన్న తరహా తయారీ, ఇటీవలే ఆఫ్షోరు ఫైనాన్షియలు సెక్టారు ఏర్పాటు, ఆర్థిక సేవల అథారిటీ స్థాపన, పలు శాసనాలతో చట్టం అమలు చేయడం ద్వారా పర్యాటక రంగం మీద ఆధారపడటం తగ్గించటానికి ప్రయత్నిస్తుంది.

2015 మార్చిలో సేషెల్స్ భారతదేశం చేత అభివృద్ధి చేయడానికి అజంప్షన్ ద్విపాన్ని కేటాయించింది.[36]

విద్యుత్తుచ్ఛక్తి

[మార్చు]

బహుళజాతి చమురు కంపెనీలు ద్వీపాల చుట్టూ జలాలను అన్వేషించినప్పటికీ చమురు లేదా వాయువు కనుగొనబడలేదు. 2005 లో కానిస్టెంటు, టోపజు, ఫర్కూరు, కొయటివీ దీవులలో సుమారుగా 30,000 కిలోమీటర్ల అన్వేషణ హక్కులను యు.ఎస్. సంస్థ పెట్రోక్వెస్టు ఒప్పందం కుదుర్చుకుంది. సేషెల్స్ పర్షియా గల్ఫు నుంచి శుద్ధి చేసిన చమురు రోజుకు 5,700 బారెల్సు దిగుమతి చేసుకుంటున్నది.

ఇటీవల సంవత్సరాల్లో చమురును కువైట్ నుండి, బహ్రెయిన్ నుండి దిగుమతి చేసుకుంటున్నది. సేషెల్స్ అంతర్గత ఉపయోగానికి అవసరమైనదానికంటే మూడు రెట్లు ఎక్కువ చమురును దిగుమతి చేస్తాయి. ఎందుకంటే మాయ వద్ద నౌకలకు, విమానాల కోసం బంకరు రూపంలో మిగులు చమురును తిరిగి ఎగుమతి చేస్తుంది. దీవులలో ఎటువంటి శుద్ధీకరణ సామర్థ్యాలు లేవు. చమురు, గ్యాసు దిగుమతులు, పంపిణీ, పునః ఎగుమతికి సేషెల్స్ పెట్రోలియం బాధ్యత వహిస్తుంది. చమురు అన్వేషణకు సేషెల్స్ నేషనల్ ఆయిలు కంపెనీ బాధ్యత వహిస్తుంది.

గణాంకాలు

[మార్చు]
Victoria, Seychelles
Demographics of Seychelles, Data of FAO, year 2005; Number of inhabitants in thousands.

నెపోలియను యుద్ధాల సమయంలో బ్రిటీషువారు ఈ ద్వీపాలపై నియంత్రణ సాధించినప్పుడు వారు ఫ్రెంచి ఉన్నత వర్గప్రజలు తమ భూమిని నిలుపుకోవటానికి అనుమతించారు. ఫ్రెంచి బ్రిటీషు సెటిలర్లు ఇద్దరూ బానిసలుగా ఉన్న ఆఫ్రికన్లను ఉపయోగించారు. 1835 లో బ్రిటీషు బానిసత్వాన్ని నిషేధించినప్పటికీ ఆఫ్రికా కార్మికులు రావడం కొనసాగించారు. ఆ విధంగా ఫ్రెంచి మూలం గ్రాను బ్లాను ("పెద్ద శ్వేతజాతీయులు") ఆర్థిక, రాజకీయ ఆధిపత్యం చేశారు. బ్రిటీషు పాలనా యంత్రాంగం భారతీయులను మారిషసులో ఉన్న అల్పసంఖ్యాక భారతీయులను ఉపయోగించినట్లు సేచెల్లిసులో కూడా ఒప్పంద కూలీలుగా నియమించింది. చైనీయుల అల్పసంఖ్యక ప్రజలు వర్తక తరగతి ప్రజలలాగా భారతీయుల స్థాయికి మాత్రమే పరిమితమయ్యారు.[37]

స్వల్పకాలంలో ప్రజాదరణ పొందిన సామాజిక ఆర్థిక విధానాలు, అభివృద్ధి [ఆధారం చూపాలి] ప్రస్తుతం సేషెల్స్ విభిన్న సంస్కృతుల కలయికగా వర్ణించబడింది. అనేకమంది సేచెల్లిసీయులు బహుళజాతి ప్రజలుగా పరిగణించబడ్డారు. ఆఫ్రికా, ఆసియా, ఐరోపీయులు వంశావళి నుండి ఆధునిక ప్రజా సంస్కృతి సృష్టించబడింది. ఫ్రెంచి, చైనీయులు, భారతీయ, ఆఫ్రికా వంటల వివిధ కోణాలను కలిపిన శ్రావ్యమైన మిశ్రమ ఆహారసంస్కృతికి సాక్ష్యం సెచెల్లోయిసు ఆహారసంస్కృతి ద్వారా వెల్లడి చేయబడింది.

సెయింటు ఫ్రాన్సిసు చర్చి, మాహె

సేషెల్స్ ద్వీపాలకు దేశీయ జనాభా లేనందున ప్రస్తుత సెచేల్లియిస్ ప్రజలు దాదాపు వలసప్రజలుగా ఉన్నారు. వీరిలో అతిపెద్ద జాతి సమూహాలుగా ఆఫ్రికా, ఫ్రెంచి, భారతీయ, చైనీయుల సంతతికి చెందినప్రజలు ఉన్నారు. సెచెల్లిస్ సరాసరి మెడియను వయసు 32 సంవత్సరాలు.[38]

భాషలు

[మార్చు]

సేచెల్లిసులో ఫ్రెంచి, ఆంగ్ల భాషలు సేచెల్లీసు క్రియోలుతో (ఫ్రెంచి ఆధారిత క్రియోలు, ప్రస్తుతం ఇది ఆగ్లభాషా పదాలను కూడా ఉపయోగిస్తూ వాడుకలో ఉంది) అధికారిక భాషలుగా ఉన్నాయి. ప్రాథమికంగా ఫ్రెంచి ఆధారంగా ఉంది. అయినప్పటికీ ఈ రోజులలో ఆంగ్ల పదాలను తరచుగా వాడుతూ ఉంటారు. రెండవ భాష మాట్లాడేవారితో సహా, సెచెల్లియన్లు అధికారిక భాష ఫ్రెంచి తరువాత అధికంగా మాట్లాడే భాష ఆంగ్లం.[39] 87% ప్రజలు సెచెల్లీసు మాట్లాడతారు. 51% ఫ్రెంచి మాట్లాడతారు, 38% ఆంగ్లం మాట్లాడతారు.[39]

2010 జనాభా లెక్కల ప్రకారం చాలామంది సెచేల్లియులు క్రైస్తవులు: 76.2% మంది రోమను కాథలిక్కులు. 10.6% ప్రొటెస్టంటులు, (ఆంగ్లికన్ 6.1%, పెంటెకోస్టలు అసెంబ్లీ 1.5%, సెవెంత్-డే అడ్వెంటిస్టు 1.2%, ఇతర ప్రొటెస్టంటు 1.6%).

హిందూమతం 2.4%, ఇస్లాంతం 1.6%. ఇతర క్రైస్తవేతర విశ్వాసాలు జనాభాలో 1.1% మంది ఉండగా, మరో 5.9% మతాన్ని ప్రత్యేకంగా పేర్కొనలేదు.[38]

సంస్కృతి

[మార్చు]
The district clock tower in the centre of the capital Victoria.

సెచెల్లియిస్ సమాజం ముఖ్యంగా మాతృస్వామ్య వ్యవస్థగా ఉంది.[40][41] గృహంలో తల్లుల ఆధిపత్యం ఉంటుంది. మహిళలు ఎక్కువ వ్యయాలను నియంత్రిస్తూ, పిల్లల ప్రయోజనాలను చూసుకోవాలి.[40] పెళ్ళికాని తల్లులు సాధారణం. చట్టం తండ్రులు తమ పిల్లలకు మద్దతు ఇవ్వాలని కోరుతుంది.[41] పురుషులకు సంపాదన సామర్ధ్యం కోసం ప్రాధాన్యత ఇస్తారు. కానీ గృహంలో వారి పాత్ర పరిధీయమైనది.[40]

విద్య

[మార్చు]

19 వ శతాబ్దం మధ్యకాలం వరకు సేషెల్స్ అధికారిక విద్య తక్కువగా అందుబాటులోకి ఉండేది. కాథలికు, ఆంగ్లికను చర్చిలు 1851 లో మిషను పాఠశాలలను ప్రారంభించాయి. కాథలికు మిషను తరువాత 1944 లో ప్రభుత్వం బాధ్యత వహించిన తరువాత కూడా విదేశాలకు చెందిన మిషనరీలు మతపరమైన సోదరులు, సన్యాసిలతో కూడిన బాలుర, బాలికల మాధ్యమిక పాఠశాలలను నిర్వహించింది.

1959 లో ఉపాధ్యాయుల శిక్షణా కళాశాల ప్రారంభమైంది. స్థానిక శిక్షణ పొందిన ఉపాధ్యాయుల సరఫరా అధికరించడం ప్రారంభమైంది. కొద్ది కాలంలోనే అనేక కొత్త పాఠశాలలు స్థాపించబడ్డాయి. 1981 నుండి ఉచిత విద్యా వ్యవస్థ అమలులోకి వచ్చింది. ఐదు సంవత్సరాల వయసులో ప్రారంభించి ఒకటి నుండి తొమ్మిది పిల్లలు అందరూ పాఠశాలలకు హాజరు కావాలి. నాలుగవ సంవత్సరాల వయస్సులో 90% మంది పిల్లలు నర్సరీ పాఠశాలలకు హాజరౌతూ ఉంటారు.

1980 చివరి నాటికి పాఠశాల వయసు పిల్లలలో 90% అక్షరాస్యత ఉంది. వయోజన సేచెల్లియులు చాలామంది వారి చిన్నతనంలో చదవడం, వ్రాయడం అభ్యసించలేదు. వయోజన విద్య తరగతుల ద్వారా వయోజన అక్షరాస్యత 60% అధికరించింది. 2014 లో ఇది 100%కు చేరింది.

సేచెల్లిసులో మొత్తం 68 పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు 23, ప్రాథమిక పాఠశాలలు 25, 13 మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి. ఇవి మాహె, ప్రస్లిను, లా డిగ్యు, సిల్హౌటులలో ఉన్నాయి. అదనంగా మూడు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి: ఎకోలు ఫ్రాంకైసు, ఇంటర్నేషనలు స్కూలు, స్వతంత్ర పాఠశాల. అన్ని ప్రైవేటు పాఠశాలలు మాహేలో ఉన్నాయి. ఇంటర్నేషనలు స్కూలు శాఖలలో ఒకటి ప్రస్లినులో ఉంది. పోస్టు సెకండరీ స్కూలు 7 ఉన్నాయి: సేషెల్స్ పాలిటెక్నికు, స్కూలు ఆఫ్ అడ్వాంస్డు లెవెలు స్టడీసు, సేచెల్లిసు పర్యాటకం అకాడమీ, సేషెల్స్ ఎడ్యుకేషను విశ్వవిద్యాలయం, సేషెల్స్ ఇన్స్టిట్యూటు ఆఫ్ టెక్నాలజీ, మారిటైం ట్రైనింగు సెంటరు, సీషెల్సు అగ్రికల్చరు అండ్ హార్టికల్చరలు ట్రైనింగు సెంటరు, నేషనలు ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్తు అండ్ సోషలు స్టడీసు.

ప్రభుత్వం మేధాసంపత్తి కొరతను తగ్గించే ప్రయత్నంలో విశ్వవిద్యాలయాన్ని తెరవడానికి ప్రణాళికలు ప్రారంభించింది. 2009 సెప్టెంబరు 17 న యూనివర్సిటీ ఆఫ్ సేషెల్స్, యూనివర్శిటీ ఆఫ్ లండనుతో కలిపి స్థానాలలో ప్రారంభించబడింది. యూనివర్సిటీ ఆఫ్ లండను ఆమోదితమైన ఈ విశ్వవిద్యాలయాలు తత్సమానమైన ప్ఉన్నత విద్యను అందిస్తుంది.

ఆహారవిధానం

[మార్చు]
Cutting open young coconuts for drinking, Seychelles

ప్రధానమైన ఆహారాలు చేపలు, సముద్ర ఆహారాలు, షెల్ ఫిషు వంటకాలు, తరచుగా వరి అన్నంతో కలిసి ఉంటాయి.[42][43] చేపల వంటకాలు వివిధరకాలుగా వండుతారు, ఆవిరిలో వండినవి, వేయించినవి, అరటి ఆకులు చుట్టి వండేవి, కాల్చినవి, ఉప్పుచేపలు, పొగబెట్టి చేపలు వంటి పలు రకాలుగా వండుతారు.[42] బియ్యంతో కూరగాయలు, మసాలా దినుసులు కలి వండే వంటకాలు దేశం లోని వంటలో ముఖ్యమైన అంశంగా ఉంటాయి.[43][44]

అదనపు ప్రధాన ఆహారాలలో కొబ్బరి, రొట్టె, మామిడి, కోర్డోన్నిను చేప ప్రాధాన్యత వహిస్తున్నాయి.[45] వండిన ఆహారాలను తరచుగా తాజా పువ్వులతో అలంకరిస్తారు.[45]

  • కోడి కూర కొబ్బరి పాలు వంటి చికెన్ వంటకాలు. .[43]
  • కొబ్బరి కూర [43]
  • ధాల్ (కాయధాన్యాలు) [45]
  • చేపల కూర [43]
  • కుంకుమ వరి [45]
  • తాజా ఉష్ణమండల పండ్లు [42][46]
  • లడాబు ఒక రుచికరమైన వంటకంగానూ డెజర్టు (భోజనానంతర తినుబండారం) తింటారు. డెజర్టుగా సాధారణంగా కొబ్బరి పాలు, పంచదార, జాజికాయ, వెనిల్లాలతో పండ్ల మృదువైన, సాసు క్రీములతో ఉడికించిన పండిన అరటి, చిలగడ దుంపలు ( కాసావా, బ్రెడ్డుఫ్రూటు, కొరోసోలు కూడా ఉండవచ్చు) కలిగి ఉంటుంది.[47] కూరలలో సాధారణంగా ఉప్పుచేపలు చేరుస్తారు. కాసవా, బ్రెడు ఫ్రూటులతో డెజర్టు వండే అదే పద్ధతిలో వండుతారు కానీ చక్కెర స్థానంలో ( వెనిల్లాని వదిలివేయబడుతుంది) ఉప్పుతో ఉప్పును చేరుస్తారు.
  • సొరచేప పచ్చడి:- సాధారణంగా చర్మంతో ఉడకబెట్టిన సొరచేపతో చేసిన చట్నీ (చక్కగా గుజ్జు చేస్తారు), ఉడకబెట్టిన బిలిమ్బి జ్యూసు, నిమ్మరసం చేర్చి వండుతారు. ఇది ఉల్లిపాయ, సుగంధ ద్రవ్యాల మిశ్రమంగా ఉంటుంది. ఉల్లిపాయ వేయించి నూనెలో వండుతారు.[47]
  • కూరగాయలు [43][46]

సంగీతం

[మార్చు]

సేషెల్స్ సంగీతం విభిన్నంగా ఉంటుంది. దాని చరిత్ర ద్వారా సంస్కృతుల కలయిక ప్రతిబింబంగా ఉంటుంది. ఈ ద్వీపాల జానపద సంగీతం ఆఫ్రికా లయలు, వీనులవిందుగా, జెలు, బాం (బ్రెజిల్లో బెరింబౌగా పిలుస్తారు) వంటి సగీత ఉపకరణాలతో ఐరోపా కాంట్రాడన్సె, పోల్కా, మాజూర్కా, ఫ్రెంచి జానపద సంగీతం, పాప్, సేగా మారిషస్, రీయూనియన్, తారాబ్బు, సౌకాసు, ఇతర పాన్-ఆఫ్రికా బాణీలు, పాలినేషియా, ఇండియా, ఆర్కాడియా సంగీతం నుండి గ్రహించిన మిశ్రమబాణి సంగీతం శ్రోతలకు వీనులవిందు చేస్తుంటాయి.

కంటోంబ్లే అని పిలువబడే పెర్కుషను సంగీతం ప్రజాదరణ కలిగి ఉంది. అలాగే ఇది కెన్యా బెంగాతో స్థానిక జానపద లయల కలయికతో కూడిన మౌట్యా సంగీతంలా ఉంటుంది. కాంట్రెడాంసు (ఐరోపా కాంట్రెడాంసు ఆధారంగా) ప్రజాదరణ కలిగి ఉంది. ముఖ్యంగా జిల్లా, స్కూలు పోటీలలో వార్షిక ఫెస్టివలు క్రెయోలు (ఇంటర్నేషనలు క్రియోలు ఫెస్టివలు) ప్రదర్శించబడుతుంది. మౌట్యా మీటుతూ నృత్యం తరచుగా బీచి బజార్లలో చూడవచ్చు. వారి ప్రధాన భాషలు సెచెల్లిస్ క్రియోలు భాష, ఫ్రెంచి, ఆంగ్ల భాషలలో ప్రదర్శించబడుతుంది.

మాధ్యమం, సమాచార రంగం

[మార్చు]

ప్రధాన ప్రభుత్వ దినపత్రిక సీచెల్లిస్ నేషను స్థానిక ప్రభుత్వ అభిప్రాయాలకు, ప్రస్తుత వ్యవహారాలకు అంకితంగా ప్రచురించబడుతుంది. ఇతర రాజకీయ పార్టీలు రేజరు వంటి ఇతర పత్రికలను నిర్వహిస్తాయి. విదేశీ వార్తాపత్రికలు, మేగజైన్లు చాలా బుక్ షాపులలో, న్యూసు ఏజెంసీలలో లభిస్తాయి. వార్తాపత్రికలలో తక్షణమే అందుబాటులో ఉంటాయి. ఈ పత్రికలు అధికంగా సెచెల్లోయిస్ క్రియోల్, ఫ్రెంచి, ఆంగ్లంలో వ్రాయబడుతుంటాయి.

ప్రధాన టెలివిజన్, రేడియో నెట్వర్కులను " సేషెల్స్ బ్రాడ్కాస్టింగు కార్పొరేషను " నిర్వహిస్తుంది. ఇది సేషెల్స్ క్రియోలు భాషలో స్థానికంగా సేకరించిన వార్తలు, చర్చా కార్యక్రమాలను సాయంకాలం 3-11 వరకు అందిస్తుంది. వారాంతాలలో రోజులలో ఎక్కువ గంటలలో ప్రసారాలు ఉంటాయి. సేషెల్స్ భూగోళ టెలివిజన్, అంతర్జాతీయ ఉపగ్రహ టెలివిజన్లలో దిగుమతి అయిన ఇంగ్లీషు, ఫ్రెంచి భాషా టెలివిజను కార్యక్రమాలు కూడా ఇటీవలి సంవత్సరాలలో వేగంగా అభివృద్ధి చెందాయి.

క్రీడలు

[మార్చు]

The most popular sport in Seychelles is basketball, which has particularly developed in this decade.[48] The country's national team qualified for the 2015 African Games, its greatest accomplishment to date. There, the team competed against some of the continent's largest countries such as Egypt.

మూలాలు

[మార్చు]
  1. "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 సెప్టెంబరు 2017.
  2. 2.0 2.1 2.2 2.3 "Seychelles". International Monetary Fund. Archived from the original on 10 అక్టోబరు 2017. Retrieved 8 జూన్ 2017.
  3. "GINI index". World Bank. Archived from the original on 21 జనవరి 2018. Retrieved 20 జనవరి 2018.
  4. "2018 Human Development Report". United Nations Development Programme. 2018. Archived from the original on 14 సెప్టెంబరు 2018. Retrieved 14 సెప్టెంబరు 2018.
  5. "Seychelles - English translation in German - Langenscheidt dictionary French-German" (in ఇంగ్లీష్, జర్మన్, and ఫ్రెంచ్). Retrieved 29 డిసెంబరు 2018.
  6. "Traduction : Seychelles - Dictionnaire français-anglais Larousse" (in ఇంగ్లీష్ and ఫ్రెంచ్). Retrieved 29 డిసెంబరు 2018.
  7. "Seychelles | French » English | PONS" (in ఇంగ్లీష్ and ఫ్రెంచ్). Retrieved 29 డిసెంబరు 2018.
  8. "English Translation of "Seychelles" | Collins French-English Dictionary" (in ఇంగ్లీష్ and ఫ్రెంచ్). Retrieved 29 డిసెంబరు 2018.
  9. Anouk Zijlma (9 జూలై 2011). "Facts about Africa". Goafrica.about.com. Archived from the original on 4 మార్చి 2012. Retrieved 23 మార్చి 2012.
  10. "Seychelles – Income Inequality – GINI index". Knoema, World Data Atlas. 2013. Archived from the original on 10 ఆగస్టు 2017. Retrieved 11 జూలై 2017.
  11. Lionnet, Guy (1972). The Seychelles. David and Charles. pp. 55–56. ISBN 978-0811715140.
  12. "Our History". National Assembly of Seychelles. Archived from the original on 28 జూన్ 2012. Retrieved 12 మే 2012.
  13. "History of Seychelles". seychelles.com. 2009. Archived from the original on 8 జూన్ 2010. Retrieved 9 సెప్టెంబరు 2010.
  14. 14.0 14.1 14.2 14.3 Joanna Symons (21 March 2005). "Seychelles: Life's a breeze near the equator" Archived 4 మే 2018 at the Wayback Machine. Telegraph.co.uk.
  15. "africanhistory.about.com". africanhistory.about.com. Archived from the original on 14 మార్చి 2012. Retrieved 23 మార్చి 2012.
  16. Hoare, Mike The Seychelles Affair (Transworld, London, 1986; ISBN 0-593-01122-8)
  17. Bartus László: Maffiaregény ISBN 9634405967, Budapest 2001
  18. David Brewster; Ranjit Rai. "Flowers Are Blooming: the story of the India Navy's secret operation in the Seychelles. Retrieved 10 August 2014". Archived from the original on 7 జూన్ 2015. Retrieved 11 ఆగస్టు 2014. {{cite journal}}: Cite journal requires |journal= (help)
  19. "International Chapter activated for flooding in the Republic of Seychelles". United Nation. Archived from the original on 3 ఫిబ్రవరి 2013. Retrieved 1 ఫిబ్రవరి 2013.
  20. "State of Emergency declared in the Seychelles". Aljazeera. Archived from the original on 30 జనవరి 2013. Retrieved 1 ఫిబ్రవరి 2013.
  21. U.S. Department of State. "Background Note: Seychelles". Archived from the original on 27 మే 2010. Retrieved 25 మే 2010. This article incorporates text from this source, which is in the public domain.
  22. 22.0 22.1 "Climate". STGT.com. Archived from the original on 6 మార్చి 2012. Retrieved 13 మార్చి 2019.
  23. "World Weather Information Service – Victoria". World Meteorological Organization. Archived from the original on 13 మార్చి 2013. Retrieved 16 నవంబరు 2012.
  24. మూస:NOAA normals
  25. "Mapped: The countries with the most protected land (#1 might surprise you)". The Telegraph (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 23 ఫిబ్రవరి 2018. Retrieved 7 ఫిబ్రవరి 2018.
  26. Janet Haig (1984). "Land and freshwater crabs of the Seychelles and neighbouring islands". In David Ross Stoddart (ed.). Biogeography and Ecology of the Seychelles Islands. Springer. p. 123. ISBN 978-90-6193-107-2.
  27. Attenborough, D. 1998.The Life of Birds. p.220-221. BBC. ISBN 0563-38792-0
  28. "Seychelles Millennium Development Goals: Status Report 2010" (PDF). United Nations Development Programme. ఆగస్టు 2010. Archived from the original (PDF) on 29 అక్టోబరు 2018. Retrieved 29 అక్టోబరు 2018.
  29. Seychelles Climate Guide, 2015. Ministry of Environment, Energy and Climate Change. meteo.gov.sc
  30. Seychelles weather and climate, see 'Blue Economy' Archived 26 సెప్టెంబరు 2015 at the Wayback Machine. Expertafrica.com. Retrieved on 8 December 2016.
  31. D. B. Prell (1965). Economic Study of the Seychelles Islands. D.B. Prell.
  32. Economic. Study. Seychelles. 1965. D. B. Prell. 1965. {{cite book}}: |work= ignored (help)
  33. OEC – Products exported by the Seychelles (2013) Archived 21 ఆగస్టు 2016 at the Wayback Machine. Atlas.media.mit.edu. Retrieved on 8 December 2016.
  34. "2013 Index of Economic Freedom". The Heritage Foundation. Archived from the original on 8 జూలై 2013. Retrieved 23 ఆగస్టు 2013.
  35. "Seychelles economy – Seychelles Travel Guide". Seychellestour.com. Archived from the original on 2 మార్చి 2012. Retrieved 23 మార్చి 2012.
  36. India to develop two islands in Indian Ocean – Times of India Archived 15 మార్చి 2015 at the Wayback Machine. Timesofindia.indiatimes.com (11 March 2015). Retrieved on 8 December 2016.
  37. "Culture of Seychelles". Everyculture.com. Archived from the original on 22 ఏప్రిల్ 2012. Retrieved 23 మార్చి 2012.
  38. 38.0 38.1 "Seychelles". CIA – The World Factbook. Archived from the original on 13 ఫిబ్రవరి 2008. Retrieved 27 మే 2007.
  39. 39.0 39.1 Lewis, M. Paul; Gary F. Simons; Charles D. Fennig (2016). "Seychelles languages". Ethnologue: Languages of the World, Dallas, Texas; 19th edition. Archived from the original on 3 నవంబరు 2016. Retrieved 2 నవంబరు 2016.
  40. 40.0 40.1 40.2 Tartter, Jean R. "Status of Women". Indian Ocean country studies: Seychelles Archived 11 డిసెంబరు 2005 at the Wayback Machine (Helen Chapin Metz, editor). Library of Congress Federal Research Division (August 1994). This article incorporates text from this source, which is in the public domain.
  41. 41.0 41.1 Country Reports on Human Rights Practices: Seychelles (2007) Archived 20 జనవరి 2012 at the Wayback Machine Bureau of Democracy, Human Rights, and Labor (11 March 2008). This article incorporates text from this source, which is in the public domain.
  42. 42.0 42.1 42.2 Lonely Planet Mauritius, Reunion & Seychelles. Lonely Planet. 2010. pp. 273–274. ISBN 978-1-74179-167-9.
  43. 43.0 43.1 43.2 43.3 43.4 43.5 Dyfed Lloyd Evans. The Recipes of Africa. Dyfed Lloyd Evans. pp. 235–236.
  44. Practice Tests for IGCSE English as a Second Language Reading and Writing. Cambridge University Press. 4 ఫిబ్రవరి 2010. p. 50. ISBN 978-0-521-14059-1.
  45. 45.0 45.1 45.2 45.3 Paul Tingay (2006). Seychelles. New Holland Publishers. pp. 33–34. ISBN 978-1-84537-439-6.
  46. 46.0 46.1 Lloyd E. Hudman; Richard H. Jackson (2003). Geography of Travel and Tourism. Cengage Learning. p. 384. ISBN 978-0-7668-3256-5.
  47. 47.0 47.1 Sarah Carpin (1998) Seychelles, Odyssey Guides, The Guidebook Company Limited. p. 77
  48. Seychelles Basketball Federation eager to grow sport's popularity Archived 7 ఆగస్టు 2016 at the Wayback Machine, Fiba.com, 12 May 2016. Retrieved 8 June 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=సేషెల్స్&oldid=4275147" నుండి వెలికితీశారు