కువైట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దేశ బహిష్కారం[మార్చు]

చట్టబద్దమైన వీసాలపై వచ్చినా, వాస్తవానికి ఎలాంటి ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా ఉంటూ వివిధ అక్రమాలకు, నేరాలకు పాల్పడుతున్న విదేశీయులందరినీ తమ దేశం నుండి బహిష్కరించడానికి కువైత్ నిర్ణయించింది. బహిష్కరణ చేయబడుతున్న వారిలో బంగ్లాదేశ్ జాతీయుల తర్వాత 3500 మందితో భారతీయులు రెండవ స్ధానంలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్‌లోని కడప, చిత్తూరు జాల్లాలకు చెందిన వారే. సంవత్సర క్రితం క్షమాభిక్షతో దాదాపుగా మూడున్నర వేల మంది భారతీయులు కువైత్‌ను వదిలి వెళ్లినా, పెద్దగా ప్రయోజనం చేకూరలేదని కువై త్‌లోనేరాలు పెరిగిపోతున్నాయని విదేశీయులను బహిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకొన్నారు. (ఆంధ్రజ్యోతి 6.10.2009)

పాస్ పోర్టుకు భర్త అనుమతి అవసరం లేదు[మార్చు]

కువైట్‌లో మహిళలకు పాస్‌పోర్టు పొందాలంటే భర్త అనుమతి సంతకం లేకుండానే పాస్‌పోర్టులిచ్చే విధంగా ఆ దేశ రాజ్యాంగ కోర్టు రూలింగ్ ఇచ్చింది. నాలుగేళ్ళ క్రితమే కువైట్ మహిళలు ఓటుహక్కు సాధించుకున్నారు. (ఈనాడు 22.10.2009).

دولة الكويت
Dawlat al-Kuwayt
State of Kuwait
Flag of Kuwait Kuwait యొక్క Coat of arms
జాతీయగీతం
అల్ నషీద్ అల్ వతని
Kuwait యొక్క స్థానం
రాజధానికువైట్ నగరం
29°22′N 47°58′E / 29.367°N 47.967°E / 29.367; 47.967
Largest city రాజధాని
అధికార భాషలు అరబ్బీ
ప్రభుత్వం రాజ్యాంగపర వారసత్వ ఎమిరేట్1
 -  ఎమీర్ సబా అల్ అహ్మద్ అల్ జాబిర్ అల్ సబా
 -  ప్రధానమంత్రి నాసిర్ అల్ ముహమ్మద్ అల్ అహ్మద్ అల్ సబా
స్వతంత్రం
 -  యునైటెడ్ కింగ్ డం నుండి జూన్ 19, 1961 
విస్తీర్ణం
 -  మొత్తం 17,818 కి.మీ² (157వది)
6,880 చ.మై 
 -  జలాలు (%) negligible
జనాభా
 -  2006 అంచనా 3,100,0002 (లభ్యం లేదు)
 -  జన సాంద్రత 131 /కి.మీ² (68వది)
339 /చ.మై
జీడీపీ (PPP) 2005 అంచనా
 -  మొత్తం $88,7 బిలియన్లు (n/a)
 -  తలసరి $29,566 (n/a)
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) Increase 0.871 (high) (33వది)
కరెన్సీ కువైటీ దీనార్ (KWD)
కాలాంశం AST (UTC+3)
 -  వేసవి (DST) (not observed) (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .kw
కాలింగ్ కోడ్ +965
1 Nominal.
2 Figure includes approximately two million non-nationals (2005 estimate).

కువైత్ Listeni/kˈwt/ (అరబ్బీ: دولة الكويتAbout this sound Dawlat al-Kuwait), అధికారికంగా " స్టేట్ ఆఫ్ కువైత్ " పశ్చిమాసియా దేశాలలో ఒక దేశం. ఇది తూర్పు అరేబియా సరిహద్దులో పర్షియన్ గల్ఫ్ చివరన ఉంది. దేశ సరిహద్దులో ఇరాక్, సౌదీ అరేబియా దేశాలు ఉన్నాయి. 2014 గణాంకాలు అనుసరించి కువైత్ జనసంఖ్య 4.2 మిలియన్లు. వీరిలో 1.3 మిలియన్లు కువైత్ ప్రజలు ఉండగా 2.9 మిలియన్లు బహిష్కృత ప్రజలు ఉన్నారు .[1] 1938లో కువైత్‌లో ఆయిల్ నిలువలు వెలువడ్డాయి. 1946 నుండి 1982 దేశం బృహత్తర ప్రణాళికలో ఆధునికీకరణ చేయబడింది. 1980 లో కువైత్ భౌగోళిక అస్థిరత, ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నది. 1990 లో కువైత్ మీద ఇరాక్ దాడి చేసింది. 1991లో యునైటెడ్ స్టేట్స్ నాయకత్వంలో నడిచిన సైనికుల విజయంతో ఇరాకీ యుద్ధం ముగింపుకు వచ్చింది. యుద్ధం ముగింపుకువచ్చిన తరువాత కువైత్ తిరిగి ఇంఫ్రాస్ట్రక్చర్, ఆర్థికరగం పునరుద్ధరణ చేసింది.

ఆయిల్ నిలువల కారణంగా కువైత్ " అత్యున్నత ఆర్ధికాభివృద్ధి చెందిన దేశంగా " అభివృద్ధి చెందింది. కువైత్ దీనార్ ప్రపంచంలో అత్యంత విలువైన కరెంసీలలో ఒకటిగా గుర్తించబడుతుంది.[2] వరల్డ్ బ్యాంక్ అభిప్రాయం అనుసరించి కువైత్ తలసరి జి.డి.పి. అంతర్జాతీయస్థాయిలో 4వ స్థానంలో ఉంది. కువైత్ రాజ్యాంగం 1962 లో రూపొందించబడింది. తరువాత కువైత్ ఈ ప్రాంతంలో రాజకీయంగా ప్రభావితమై ఉంది.[3][4][5] సమీపకాలంలో రాజకీయ అస్థిరత దేశ ఆర్థికరగం మీద ప్రభావం చూపుతుంది.[6][7]

చరిత్ర[మార్చు]

ఆరంభకాల చరిత్ర[మార్చు]

1613 లో కువైత్ నగరం (ఆధునిక కువైత్ నగరం) స్థాపించబడింది. 1716లో బనీ ఉతుబ్ కువైత్‌లో స్థిరబడ్డాడు. ఉతుబ్ కువైత్‌లో ప్రవేశించే సమయంలో కువైత్‌లో కొంతమంది మత్స్యకారులు మాత్రమే ఉన్నారు. అది ఒక మత్స్యకారుల గ్రామంగా మాత్రమే ఉండేది.[8] 18వ శతాబ్దం నాటికి కువైత్ సుసంపన్నంగా అభివృద్ధి చెందింది. కువైత్ వేగవంతంగా వ్యాపార కూడలిగా మారి ఇండియా, మస్కట్, ఓమన్, బాగ్దాద్, అరేబియాల మద్య ప్రముఖ వ్యాపారకేంద్రంగా మారింది.[9][10] 1700 మద్యకాలానికి కువైత్ పర్షియన్ గల్ఫ్ నుండి అలెప్పో వరకు ప్రధాన వ్యాపార మార్గాన్ని నిర్మించింది.[11] 1775-79 లలో పర్షియన్లు బస్రాను ఆక్రమించుకున్నారు. ఇరాకీ వ్యాపారులు కువైత్‌లో ఆశ్రయం పొందారు. తరువాత వారు కువైత్‌లో నౌకానిర్మాణం అభివృద్ధిచేసి వ్యాపారకార్యక్రమాలు చేపట్టారు.[12] ఫలితంగా కువైత్ సముద్రవ్యాపారం శిఖరాగ్రానికి చేరింది. [12] 1775, 1779 మద్య బాగ్దాద్, అలెప్పో, స్మిర్నా, కాంస్టాటినోపుల్, ఇండియా మద్య వ్యాపార మార్గం కువైత్ వైపు మళ్ళించబడింది. .[11][13] 1792లో " ఈస్టిండియా కంపెనీ " కువైత్ వైపు దృష్టిసారించింది.[14] ఈస్టిండియా కంపెనీ కువైత్, ఇండియా, అరేబియా తూర్పు తీరం వరకు సముద్రమార్గాన్ని పునరుద్ధరించారు.[14] 1779లో పర్షియన్లు బార్సాను వదిలిన తరువాత బార్సా వ్యాపారులు కూడా కువైత్ వైపు ఆకర్షించబడ్డారు.[15] పర్షియన్ గల్ఫ్‌లో నౌకానిర్మాణ కేంద్రంగా అభివృద్ధిచెందింది.[16][17] 18వ శతాబ్దం చివర 19వ శతాబ్దంలో కువైత్‌లో తయారుచేయబడిన వెసెల్స్ పెద్దమొత్తంలో ఇండియా, తూర్పు ఆఫ్రికా, ఎర్ర సముద్రం మద్య సరుకులను చేరవేసాయి.[18][19][20] హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా కువైత్ షిప్ వెసెల్స్ ప్రాబల్యత సంతరించుకున్నాయి.[21] 18వ శతాబ్దం మద్యకాలంలో ప్రాంతీయ భౌగోళిక పరిస్థితులు కువైత్‌ను సుసంపన్నం చేసాయి.[22] 18వ శతాబ్దంలో బస్రా అస్థిరత కువైత్ సుసంపన్నమవడానికి దోహదం అయింది.[23] 18వ శతాబ్దం చివరలో ఓట్టమన్ హింస నుండి తప్పించుకుని వెలుపలికి వచ్చిన బస్రా వ్యాపారులకు కువైత్ స్వర్గభూమిగా మారింది.[24] నావికులకు అత్యంత అనుకూలప్రాంతంగా కువైత్ మారింది అని పాల్గ్రేవ్ అభిప్రాయపడ్డాడు. [21][25][26] 1899 (1961 వరకు కొనసాగింది) లో కువైత్ షేక్ ముబారక్ సబాహ్, బ్రిటిష్ ప్రభుత్వానికి మద్య అగ్రిమెంట్ జరిగిన తరువాత కువైత్‌లో బ్రిటిష్ ప్రభావం అధికరించింది. 1920లో " గ్రేట్ డిప్రెషన్ " కువైత్ ఆర్థిక రంగం మీద ప్రతికూల ప్రభావం చూపింది.[27] ఆయిల్ నిక్షేపాలు లభించక ముందు అంతర్జాతీయ వ్యాపారం కువైత్ ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేది.[27] కువైత్ వ్యాపారులు అధికంగా మద్యవర్తిత్వం మాత్రమే వహించారు.[27] ఐరోపా ప్రభావం క్షీణించిన ఫలితంగా ఇండియా, ఆఫ్రికా దేశాలవస్తుసరఫరా క్షీణించిన కారణంగా కువైత్ ఆర్థికరంగం దెబ్బతిన్నది. అంతర్జాతీయ వాణిజ్యం క్షీణించిన కారణంగా ఇండియాకు అక్రమ బంగారం రవాణా అధికం అయింది.[27] ఇండియాకు బంగారం అక్రమరవాణా కారణంగా పలు కువైత్ వ్యాపార కుటుంబాలు సంపన్నకుటుంబాలుగా మారాయి. [28] ప్రపంచవ్యాప్త ఆర్థికసంక్షోభం కారణంగా కువైత్ ముత్యాల పరిశ్రమ కూడా కుప్పకూలింది.[28] కువైత్ ముత్యాల పరిశ్రమ ఉన్నతస్థాయిలో ఉన్నసమయంలో యురేపియన్ మర్కెట్లకు ముత్యాల సరఫరా కొరకు 750 - 800 నౌకలు ఉపయోగించబడ్డాయి.[28] ఆర్థికసంక్షోభం కారణంగా ముత్యాల వంటి విలాస వస్తువులకు గిరాకీ తగ్గింది.[28] ముత్యాలను కృత్రిమంగా తయారుచేయడంలో జపాన్ కృతకృత్యులైన తరువాత కువైత్ ముత్యాల పరిశ్రమ పతనం అయింది.[28] 1919-1920 కువైత్- నజ్ద్ యుద్ధం తరువాత ఇబ్న్ సౌద్ కువైత్‌కు వ్యతిరేకంగా 1923-1937 వరకు వ్యాపరనిషేధం విధించాడు.[27] కువైత్ మీద సౌదీ సాగించిన ఆర్థిక, సైనిక దాడుల ఫలితంగా కువైత్‌లోని అధికభాగం సౌదీలో విలీనం చేయబడింది. 1922లో ఉగ్వైర్ కాంఫరెంస్ తరువాత కువైత్ - నజ్ద్ మద్య సరిహద్దులు నిర్ణయించబడ్డాయి. ఉగ్వైర్ కాంఫరెంస్ సందర్భంలో కువైత్ తరఫున ప్రతినిధులు పాల్గొనలేదు. ఇబ్న్ సౌదీ మూడింటరెండువంతుల భూభాగం కువైత్‌కు అప్పగించడానికి అంగీకరించాడు. ఉగ్వైర్ కాంఫరెంస్‌లో కువైత్ సగం కంటే అధికమైన భూభాగం కోల్పోయింది. సౌదీ ఆర్థిక నిషేధం, సౌదీ దాడులకు కువైత్ ఇప్పటికీ వ్యవహారం వివాదంగా ఉంది.

స్వర్ణయుగం (1946–82)[మార్చు]

1946 - 1982 మద్యకాలంలో ఆయిల్ నిక్షేపాల వెలికితీత, స్వేచ్ఛాయుత వాతావరణం వాణిజ్యరంగానికి అనుకూలంగా ఉన్న కారణంగా ఇది కువైత్ స్వర్ణయ సుసంపన్నం అయింది.[29][30][31] 1946-1982 జనబాహుళ్యంలో కువైత్ స్వర్ణయుగంగా అభివర్ణించబడింది.[29][30][31][32] 1950 లో కువైత్ ఆధునీకరణలో భాగంగా ప్రభుత్వం ప్రాధానమైన ప్రణాళికలను చేపట్టింది. 1952 నాటికి కువైత్ పర్షియన్ గల్ఫ్ దేశాలలో బృహత్తర ఆయిల్ ఎగుమతి దేశంగా అవతరించింది. ఈ బృహత్తర అభివృద్ధి పాలస్తీనా,ఈజిప్ట్, భారతదేశం లకు చెందిన శ్రామికులను ఆకర్షించింది. 1961 నాటికి కువైత్ షేక్డం (బ్రిటిష్ ప్రొటక్టరేట్) ముగింపుకు వచ్చి కువైత్ స్వతంత్రదేశంగా అవతరించింది. కొత్త దేశానికి షేక్ అబ్దుల్లా అల్ - సబాహ్ ఎమీర్‌గా నియమించబడ్డాడు. కొత్తగా రూపొందించిన కువైత్ 1963 లో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించింది. గల్ఫ్ దేశాలలో రాజ్యంగ నిర్మాణం చేసి పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించిన దేశంగా కువైత్ ప్రత్యేకత సంతరించుకుంది. 1960 - 1970 లలో అత్యధిక అభివృద్ధి చెందిన దేశాలలో కువైత్ ఒకటి.[33][34][35] మిడి ఈస్ట్ దేశాలలో ఆయిల్ నిక్షేపాల ఎగుమతులతో ఆర్థికవనరును ఏర్పరుచుకున్న దేశాలకు కువైత్ మార్గదర్శకంగా నిలిచింది.[36] 1970నాటికి మనవహక్కుల సంరక్షణ ఇండెక్స్‌లో అరబ్ దేశాలలో కువైత్ అత్యున్నత స్థానంలో నిలిచింది.[35] 1966 లో కువైత్ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.[35] కువైత్ థియేటర్ పరిశ్రమ అరబ్ ప్రాంతమంతా గుర్తింపు కలిగి ఉంది.[29][35] 1960-1970 నాటికి కువైత్ ప్రెస్ " ప్రపంచ స్వేచ్ఛాయుత ప్రెస్ "లో ఒకటిగా వర్ణించబడింది.[37] అరేబియన్ ప్రాంతంలో సాహిత్యానికి పునరుజ్జీవనం కలిగించిన దేశంగా కువైత్ మార్గదర్శకంగా నిలిచింది.[38] 1958లో మొదటిసారిగా కువైత్‌లో " అల్ అరబి మేగజిన్ " ప్రారంభించబడింది. ఈ మేగజిన్ అరబ్ ప్రపంచంలో ప్రాబల్యత సంతరించుకుంది.[38] పలువురు అరబ్ రచయితలు భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆకర్షితులై కువైత్ చేరుకున్నారు. [39][40] ఇరాకీ కవి " అహమ్మద్ మాతర్ " 1970 లో ఇరాక్‌ను వదిలి స్వేచ్ఛాయుతవాతావరణం కలిగిన కువైత్‌లో స్థిరపడ్డాడు.[41] 1960-1970 లలో కువైత్ ప్రజలు పశ్చిమదేశాల సంస్కృతి వైపు ఆకర్షితులైయ్యారు.[42] 1960-1970 లలో కువైత్ స్త్రీలలో అత్యధికులు " హిజాబ్ " ధరించలేదు.[43][44] కువైత్ విశ్వవిద్యాలయంలో హిజాబ్ కంటే మినీ స్కర్టులు సాధారణం అయ్యాయి. [45]

1982 నుండి ప్రస్తుత కాలం వరకు[మార్చు]

1980 ఆరంభంలో స్టాక్ మార్కెట్ పతనం , ఆయిల్ ధరలు పతనం కారణంగా క్కువైత్ ప్రధాన ఆర్ధిక సంక్షోభం " ఎదుర్కొంది. [46]ఇరాన్-ఇరాక్ యుద్ధంలో కువైత్ ఇరాక్‌కు మద్దతు ఇచ్చింది. 1980 అంతా కువైత్‌లో పలు తీవ్రవాద దాడులు జరిగాయి. 1983లో కువైత్ బాంబుల దాడి, 1984-1988 కువైత్ ఎయిర్ క్రాఫ్ట్ హైజాక్, 1985లో ఎమీర్ జాబర్ కాల్చివేత మొదలైన సంఘటనలు జరిగాయి. 1960-1970 లలో మొదలై 1980 వరకూ కువైత్ సైన్సు, టేక్నాలజీ కేంద్రంగా కొనసాగింది.[47] తీవ్రవాదుల దాడి కారణంగా సైన్సు పరిశోధనారగం కూడా దెబ్బతిన్నది. [47]

Oil fires in Kuwait in 1991, which were a result of the scorched earth policy of Iraqi military forces retreating from Kuwait

ఇరాన్ - ఇరాక్ యుద్ధం ముగిసిన తరువాత కువైత్ పతనం ఆరంభం అయింది.[48]

భౌగోళికం[మార్చు]

Satellite image of Kuwait

అరేబియన్ ద్వీపకల్పం ఈశాన్యప్రాంతంలో ఉన్న కువైత్ వైశాల్యపరంగా ప్రపంచంలో అతి చిన్న దేశాలలో ఒకటి.[ఉల్లేఖన అవసరం] కువైత్ 28-31 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో, 46-49 డిగ్రీల తూర్పురేఖాంశంలో ఉంది. కువైత్‌లో అత్యధికభూభాగం చదరంగా ఉండి ఇసుకతో నిండిన అరేబియన్ ఎడారి ఆక్రమించి ఉంది. దేశం అంతా దిగువప్రాంతంగా ఉంటుంది. కువైత్‌లో అత్యంత ఎత్తైన ప్రాంతం సముద్రమట్టానికి 306 మీ ఎత్తున ఉంటుంది.[49] కువైత్‌లో ద్వీపాలు ఉన్నాయి. ఫైలక ద్వీపంలో మానవులు నివసించడం లేదు.[50] దీని వైశాల్యం 860 చ.కి.మి. కువైత్‌లోని అతిపెద్ద ద్వీపంగా ఉన్న బుబియాన్ ద్వీపం 2380 మీ పొడవైన వంతెనతో ప్రధాన భూభాగంతో అనుసంధానించబడి ఉంది.[51] కువైత్‌లో!0.6% మాత్రమే వ్యవసాయ యోగ్యమైనది.[49] సముద్రతీరంవెంట ఉన్న భూమిలో చెట్లు ఉన్నాయి.[49] కువైత్ బే తీరంలో కువైత్ నగరం నిర్మ్ంచబడి ఉంది. ఇక్కడ డీప్ వాటర్ హార్బర్ ఉంది. కువైత్ లోని బుర్గన్ ఫీల్డ్ 70 మిలియన్ల ఉత్పత్తి శక్తిని కలిగి ఉంది.[52] ఆయిల్ ఉత్పత్తి కారణంగా వాతావరణకాలుష్యం అధికం అయినందున కువైత్ ఆగ్నేయ ప్రాంతం మానవనివాస యోగ్యంగా లేదు.[53] గల్ఫ్ యుద్ధం సమయంలో చిందిన ఆయిల్ కువైత్ సముద్రవనరులను క్షీణింపజేసింది.[54]

వాతావరణం[మార్చు]

మార్చి మాసం (వసంతకాలం) లో వాతావరణం వేచ్చగా అప్పుడప్పుడూ ఉరుములు మెరుపులతో ఉంటుంది. నైరుతీ ౠతుపవనాలు ఆరంభించగానే చలి మొదలౌతుంది. వేసవి చాలా వేడిగా ఉంటుంది. ఆగ్నేయ పవనాలు జూలై, అక్టోబరు వరకు వీస్తుంటాయి. వేడి, పొడిగా ఉండే దక్షిణ వాయువులు వసతం నుండి వేసవి ఆరంభం వరకు వీస్తుంటాయి. నైరుతీ పవనాలు వీచే జూన్, జూలై మాసాలలో ఇసుకతుఫానులు సంభవిస్తుంటాయి[55]

The temperature in Kuwait during summer is above 25 °C (77 °F). The highest recorded temperature was 54.4 °C (129.9 °F) which is the highest temperature recorded in Asia.

[56][57]

Kuwait experiences colder winters than other GCC countries because of its location in a northern position near Iraq and Iran.

గవర్నరేట్స్[మార్చు]

కువైత్ గవర్నరేటులుగా విభజించబడింది. గవర్నరేట్స్ అదనంగా ప్రాంతాలుగా విభజించబడ్డాయి.

జాతీయ పార్కులు[మార్చు]

ప్రస్తుతం కువైత్‌లో 5 సంరక్షిత ప్రాంతాలు ఉన్నాయి.[58] కువైత్‌లో 50,948 చ.హెక్టార్ల రిజర్వ్ ప్రాంతం ఉంది. ఇదులో చిన్న చిన్న మడుగులు, నిస్సారమైన సాల్ట్ మార్షెస్ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడకు రెండు మార్గాలలో వలసపక్షులు వస్తూ ఉంటాయి.[58] క్రాబ్- ప్లోవర్ పక్షులకు ఇది బ్రీడింగ్ కాలనీగా రిజర్వ్ ప్రాంతంగా ఉంది.[58]

పర్యావరణం[మార్చు]

కువైత్‌లో 393 జాతుల పక్షులు ఉన్నాయి. వీటిలో 18 జాతుల పక్షులు కువైత్‌లోనే సంతానోత్పత్తి చేస్తున్నాయి.[59] వలస పక్షుల ప్రయాణమార్గకూడలిలో కువైత్ ఉంది. ఈ కూడాలిని దాటి వార్షికంగా దాదాపు 2-3 మిలియన్ల పక్షులు ప్రయాణిస్తూ ఉంటాయి.[60] ఉత్తర కువైత్ లోని చిత్తడినేలలు, జాహ్రా వసలసపక్షుల మార్గానికి ప్రధాన ప్రదేశాలుగా ఉన్నాయి.[60] కువైత్ ద్వీపాలు 4 జాతుల పక్షులకు సంతానోత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయి.[60] కువైత్ సముద్రతీరం, సముద్రతీర పర్యావరణం కువైత్ పర్యావరణ వారసత్వంగా పరిగణించబడుతుంది.[60] కువైత్‌లో సాధారణంగా 28 జాతుల క్షీరదాలు (గజెల్లెస్, ఎడారి కుందేలు, హెడ్జాగ్) కనఇస్తుంటాయి.[60] మాంసాహార జంతువులలో తోడేలు, కరాకల్, నక్క వంటి జంతువులు అరుదుగా కలిపిస్తుంటాయి. [60] అంతరించిపోతున్న క్షీరాదాలైన ఎర్ర నక్క, విల్డ్ క్యాట్ కూడా కువైత్‌లో ఉన్నాయి.[60] క్రమబద్దీకరణ చేయని వేట, నివాసప్రాంతాల అభివృద్ధి వన్యప్రాణుల జీవితానికి ఆపదగా మారుతుంది.[60] 40 జాతుల సరీసృపాలు నమోదు చేయబడ్డాయి.[60]

ఆర్ధికం[మార్చు]

Al Hamra Tower is the tallest sculpted tower in the world

కువైత్ ఆర్థికరంగానికి పెట్రోలియం ఆధారితమై ఉంటుంది. కువైత్ ఎగుమతులలో పెట్రోలియం ప్రధానపాత్రవహిస్తుంది.[2] ప్రపంచ బ్యాంక్ అంచనాల ఆధారంగా ప్రపమచ సంపన్నదేశాలలో కువైత్ 4 వ స్థానంలో ఉందని భావిస్తున్నారు.[61] కువైత్ జి.సి.సి. దేశాలలో రెండవస్థానంలో ఉంది. మొదటి స్థానంలో కతర్ ఉంది.[61][62][63] దేశ జి.డి.పిలో 50% నికి, ఎగుమతులలో 94% పెట్రోలియం బాధ్యత వహిస్తుంది.[49] పెట్రోలియానికి అతీతంగా షిప్పింగ్, వాటర్ డిలినేషన్, ఫైనాంషియల్ సర్వీసెస్ ఆర్థికరంగంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి.[49] కువైత్ చక్కగా అభివృద్ధి చేయబడిన బ్యాకింగ్ వ్యవస్థను కలిగి ఉంది. అరబ్ ప్రపంచంలో కువైత్ స్టాక్ ఎక్ష్చేంజ్ అతిపెద్ద స్టాక్ ఎక్ష్చేంజ్‌గా గుర్తించబడుతుంది.నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైత్ దేశంలో అతిపెద్ద బ్యాంక్‌గా గుర్తించబడుతుంది. అలాగే అరబ్ ప్రపంచంలో అతిపెద్ద బ్యాకులలో ఒకటిగా భావిస్తున్నారు. కువైత్‌లో అదనంగా గల్ఫ్ బ్యాంక్ ఆఫ్ కువైత్, బుర్గాన్ బ్యాంక్ మొదలైనన బ్యాంకులు ఉన్నాయి.

ఆయిల్ ఫీల్డ్స్‌కు అతీతంగా ఆర్థికరంగాన్ని తీర్చి దిద్దడంలో అరబ్ దేశాలకు కువైత్ మార్గదర్శకంగా ఉంది. గల్ఫ్ యుద్ధం తరువాత ఆర్థికరంగం తీరులో మార్పులు తీసుకురావడానికి సరికొత్త సమస్యలు ఎదురౌతున్నాయి. సమీపకాలంలో పార్లమెంట్, ప్రభుత్వం మద్య వ్యతిరేకవాతావరణం నెకొన్నందున కువైత్‌లో ఆర్థికసంస్కరణలకు ఆస్కారం లభించలేదు.[64] గడచిన 5 సంవత్సరాలలో కువైత్‌లో చిన్న వ్యాపారలవైపు మొగ్గుచూపడం అధికం అయింది.[65][66] ఇంఫార్మల్ రంగం ప్రస్తుతం అభివృద్ధిదశలో ఉంది.[67] ప్రధానంగా ఇంస్టాగ్రాం వ్యాపారానికి ప్రాబల్యత అధికం ఔతుంది. [68][69][70] కువైత్ పారిశ్రామికవేత్తలు అధికంగా ఇంస్టాగ్రాం వ్యాపారం వాడుకుంటున్నారు.[71]1961లో కువైత్ ఫండ్ ఫర్ అరబ్ ఎకనమిక్ డెవెలెప్మెంట్ స్థాపించబడింది. ఇది ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్లకు ఆర్థికసహాయం అందించింది. 1974లో ఈ సంస్థ సేవలు ప్రపంచదేశాలకు విస్తరించబడ్డాయి. ఇరాన్- ఇరాక్ యుద్ధంలో ఈ సంస్థ ఇరాక్‌కు ఆర్థిక సాయం అందించింది. 2000 సంవత్సరంలో ఈ సంస్థ 520 మిలియన్ల అమెరికన్ డాలర్లను సాయంగా ఇతర దేశాలకు అందించింది. కువైత్ ప్రభుత్వానికి చెందిన " కువైత్ ఇంవస్ట్మెంట్ అథారిటీ " విదేశీపెట్టుబడుల కొరకు ప్రత్యేకించబడింది. 1953 నుండి కువైత్ ప్రభుత్వం పెట్టుబడులను ఐరోపా, యునైటెడ్ స్టేట్స్, ఆసియా పసిఫిక్ వైపు మళ్ళించాయి. కువైత్ విదేశీ పెట్టుబడులు 592 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేరుకుంది.[72] 2013 లో అరబ్ ప్రపంచంలో విదేశాలు అధికంగా పెట్టుబడి పెట్టిన దేశాలలో కువైత్ (8.4 బిలియన్ల అమెరికన్ డాలర్లు) ప్రథమ స్థానంలో ఉంది.[73] 2013లో కువైత్ విదేశీ పెట్టుబడులు మూడింతలు అయింది.[73] గత 10 సంవత్సరాలలో యు.కెలో కువైత్ పెట్టుబడులు (24 బిలియన్ల అమెరికన్ డాలర్కంటే అధికం) రెండింతలు అయింది. [74][75] 2014 లో కువైత్ చైనాలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టింది.[76]

నీరు[మార్చు]

The Kuwait Water Towers in Kuwait City

కువైత్ సముద్రపునీటి నుండి ఉప్పును వేరుచేసిన నీటిని త్రాగడానికి, ఇతర గృహౌపయోగాలకు వాడుతుంటారు.[77][78] దేశంలో ప్రస్తుతం 6 లవణనిర్మూలన కేంద్రాలు (డిసాలినేషన్ ప్లాంటులు) ఉన్నాయి.[78] గృహ అవసరాలకు డిసాలినేషన్ వాటర్‌ను ఉపయోగిస్తున్న మొదటి దేశం కువైత్. కువైత్‌లో మొదటి డిసాలినేషన్ ప్లాంటు 1951లో స్థాపించబడింది.[77] 1995 లో కువైత్ ప్రభుత్వం " స్వదేష్ ఇంజనీరింగ్ కంపెనీ " స్థాపించింది. కువైత్‌కు త్రాగునీరు అందించడానికి ఈ ఆధునిక నీటిసరఫరా విధానం ఏర్పాటు చేయబడింది. ఈ కంపెనీ " కువైత్ వాటర్ టవర్స్ " నిర్మించింది. వీటిలో 31 టబర్లను చీఫ్ ఆర్కిటెక్ట్ " సునే లిండ్స్ట్రోం " రూపొందించాడు. వీటిని మష్రూం టవర్లు అంటారు.ఎమీర్ అల్- అహ్మద్ కోరిక మీద నిర్మించిన చివరి గ్రూప్ టబర్లను కువైట్ టవర్లు అంటారు. వీటిలో రెండు వాటర్ టవర్లుగా ఉపయోగించబడుతున్నాయి. [79] డిసాలినేషన్ ప్లాంటు నుండి లభించే నీటిని టవర్లకు పైప్ చేస్తారు. 33 టవర్లు 1,02,000 క్యూబిక్ లీటర్ల సామర్ధ్యం కలిగి ఉన్నాయి. 1980 లో కువైత్ వాటర్ టవర్లు ఆఘాకాన్ అవార్డును అందుకున్నాయి.[80] కువైత్ నీటి వనరులు డిసాలినేటెడ్ వాటర్, గ్రౌండ్ వాటర్, ట్రీటెడ్ వేస్ట్ వాటర్ అని మూడు విధాలుగా ఉంటాయి.[77] కువైత్‌లో మూడు ముంసిపల్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి.[77] సీ వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ల కారణంగా కువైత్ నీటి అవసరాలు సంపూర్తిచేయబడ్డాయి.[77][78] మురుగునీటి నిర్వహణ పనులను " నేషనల్ సేవేజ్ నెట్వర్క్ " చేస్తుంది. ఇది 98% ప్రాంతానికి మురుగునీటిని వెలుపలకు పంపే సేవలు అందిస్తుంది.[81]

ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

A highway in Kuwait City

కువైత్ ఆధునికమైన విస్తారమైన రహదారి సౌకర్యాలను కలిగి ఉంది. మొత్తం పేవ్ చేయబడిన రహదారి పొడవు 5749 కి.మీ. కువైత్‌లో 2 మిలియన్ల కార్లు, 5,00,000 పాసింజర్ కార్లు, బసులు, ట్రక్కులు ఉన్నాయి. ప్రధాన రహదారిలో వాహనాల వేగపరిమితి 120 కి.మీ.

కువైత్‌లో రైల్వే విధానం లేదు. అధికంగా ప్రజలు ఆటోమొబైల్స్‌లో ప్రయాణం చేస్తుంటారు. ప్రభుత్వం రాజధాని నగరంలో సిటీ మెట్రోతో కూడిన రైలుమార్గాలు నిర్మించడానికి 11 మిలియన్ల అమెరికన్ డాలర్ల వ్యయంతో ప్రణాళిక రూపొందిస్తుంది.

కువైత్ పబ్లిక్ ట్రాంస్పోర్టేషన్ నెట్వర్క్‌లో బసు మార్గాలు చేర్చబడి ఉన్నాయి. 1962లో దేశానికి స్వతమైన కువైత్ పబ్లిక్ ట్రాంపోర్టేషన్ కంపెనీ స్థాపించబడింది. ఇది కువైత్‌లో ప్రాంతీయ బస్ మార్గాలతో దూరప్రాంత మర్గాలలో ఇతర గల్ఫ్ దేశాలకు బస్ ప్రయాణాలు నిర్వహిస్తుంది.[82] ప్రధాన ప్రైవేట్ బస్ కపెనీ 20 బస్ మార్గాలలో కువైత్ అంతటా సిటీ బస్ సర్వీసులు నడుపుతుంది. మరొక ప్రైవేట్ బస్ కంపెనీ " కువైత్ గల్ఫ్ లింక్ పబ్లిక్ ట్రాంస్పోర్ట్ 2006లో ఆరంభించబడింది. ఇది కువైత్ అంతటా ప్రాంతీయ బసులను నడుపుతూ ఉంది. అలాగే పొరుగున ఉన్న అరేబియన్ దేశాలకు కూడా బసులను నడుపుతూ ఉంది. [83]

విమానాశ్రయాలు[మార్చు]

కువైత్‌లో రెండు ప్రధాన విమానాశ్రయాలు ఉన్నాయి. కువైత్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుండి అంతర్జాతీయ విమానసేవలు అందించబడుతున్నాయి. ప్రభుత్వానికి స్వంతమైన " కువైత్ ఎయిర్ వేస్ " దేశంలో అతిపెద్ద విమానాశ్రయంగా గుర్తించబడుతుంది. విమానాశ్రయంలో కొతభాగం ముబారక్ ఎయిర్ బేస్‌గా మార్చబడింది. ఇందులో " కువైత్ ఎయిర్ ఫోర్స్ " ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే ఇక్కడ కువైత్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియం కూడా ఉంది. 2004 లో మొదటి కువైత్ ఎయిర్ లైన్ విమానసంస్థ జజీరా ఎయిర్ వేస్ స్థాపించబడింది. [84] 2005 లో రెండవ విమానసంస్థగా " వతానియా ఎయిర్ వేస్ " స్థాపించబడింది.

నౌకాయానం[మార్చు]

కువైత్ అతిపెద్ద నౌకాపరిశ్రమను కలిగి ఉంది. " కువైత్ పోర్ట్ పబ్లిక్ అథారిటీ " కువైత్ నౌకాయానలను నిర్వహిస్తుంది. కువైత్ ప్రధాన నౌకాశ్రయం " షువైక్, షుయైబా " లు కార్గో సేవలను అందిస్తుంది.[85] కువైత్‌లోని అతిపెద్ద నౌకాశ్రయం " మినా అల్ అహ్మది " నుండి అధికంగా కువైత్ ఆయిల్ ఎగుమతి చేయబడుతుంది.[86] 2007 లో బుబియాన్ ద్వీపంలో రెండవ నౌకాశ్రయం నిర్మించడానికి పనులు ప్రారంభించబడ్డాయి.

గణాంకాలు[మార్చు]

Kuwaiti youth celebrating Kuwait's independence and liberation, 2011

2014 గణాంకాలను అనుసరించి కువైత్ జనసంఖ్య 4.1 మిలియన్లు. వీరిలో 1.2 మిలియన్లు కువైత్ ప్రజలు, 1.4 మిలియన్లు ఆసియన్ దేశాల బహిస్కృత ప్రజలు , 76,698 ఆఫ్రికన్ ప్రజలు ఉన్నారు. .[87]

సంప్రదాయ ప్రజలు[మార్చు]

కువైత్ మొత్తం జనసంఖ్యలో బహిష్కృత ప్రజలు 70% ఉన్నారు. కువైత్ ప్రజలలో 60% అరేబియన్లు (బహిస్కృత అరేబియన్లతో సహా) ఉన్నారు.[49] విదేశీప్రజలలో భారతీయులు, ఈజిప్షియన్లు అధిక సంఖ్యలో ఉన్నారు..[88]

మతం[మార్చు]

కువైత్ ప్రజలలో ముస్లిములు అత్యధికంగా ఉన్నారు.[89][90] అధికారిక గణాంకాలు లేనప్పటికీ కువైత్‌లో 60-70% సున్నీ ముస్లిములు , 30-40% షియా ముస్లిములు ఉన్నారని అంచనా.[91][92][93][94] ఇతర మతస్థులు స్వల్పసంఖ్యలో ఉన్నారు. కువైత్‌లో బహిష్కృత క్రైస్తవులు (4,50,000) అధికసంఖ్యలో ఉన్నారు. హిందువులు (6,00,000 మంది), బౌద్ధులు (1,00,000 మంది) , సిక్కులు (10,000 మంది) ఉన్నారు.[95] కువైత్‌లో 259-400 మంది క్రైస్తవులు పౌరసత్వం కలిగి ఉన్నారు.[96] అరబ్ దేశాలలో కువైత్‌లో మాత్రమే " కోపరేటివ్ కౌంసిల్ " ఉంది. కువైత్‌లో స్వల్పసంఖ్యలో బహై ప్రజలు ఉన్నారు.[95][97]

భాషలు[మార్చు]

ఆధునిక అరబిక్ భాష కువైత్ అధికారభాషగా ఉంది. కువైత్ అరబిక్ భాష కువైత్ వ్యయహారిక యాసను కలిగి ఉంటుంది. చెవిటి వారి కొరకు కువైత్ సంఙాభాష వాడుకలో ఉంది. అత్యధికులు అర్ధం చేసుకోగలిగిన ఆంగ్లభాష వ్యాపార వ్యవహారాలలో వాడుకభాషగా ఉంది.[98] 1990 ఆగస్టు ఇరాకీ సైన్యం కువైత్ మీద దాడిచేసింది. తరువాత జరిగిన పలు దౌత్యప్రయత్నాలు నిష్ఫలమైయ్యాయి. తరువాత కువైత్ నుండి ఇరాకీ సైన్యాలను తొలగించడానికి యునైటెడ్ స్టేట్స్ నాయకత్వంలో సంకీర్ణదళాలు ప్రవేశించాయి. ఇది గల్ఫ్ యుద్ధంగా అభివర్ణించబడింది. 1991 ఫిబ్రవరి 26 న సంకీర్ణ దళాలు ఇరాక్ సైన్యాలను కువైత్ నుండి వెలుపలకు తరమడంలో విజయవతం అయ్యాయి. ఇరాకీ దళాలు ప్రతీకారంతీర్చుకుంటూ కువైత్ వదిలిపోయే ముందుగా ఆయిల్ బావులకు నిప్పు అంటించి పోయాయి.[99] ఇరాకీ దాడిసమయంలో 1,000 మంది కువైత్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.[100] అదనంగా ఇరాకీ దాడి సమయంలో 600 మంది కనిపించకుండా పోయారు.[101] దాదాపు 375 మంది ఇరాక్ లోని మూకుమ్మడి సమాధులలో కనుగొనబడ్డారు.

2003 మార్చిలో యు.ఎస్. నాయకత్వంలో ఇరాక్ మీద దాడి జరిగిన సమయంలో కువైత్ ప్రధాన వేదికగా మారింది. 2006 లో ఎమీర్ జాబర్ మరణించిన తరువాత సాద్ అల్ సబాహ్ ఎమీర్‌గా నియమించబడి 9 రోజుల తరువాత ఆయన ఆరోగ్యకారణంగా కువైత్ పార్లమెంట్ చేత పదవి నుండి తొలగించబడ్డాడు.

2005 లో కువైత్ షియా మసీదులో జరిగిన బాంబు దాడి కువైత్ చరిత్రలో అతి పెద్ద తీవ్రవాద దాడిగా భావించబడింది.

మూలాలు[మార్చు]

 1. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 2. 2.0 2.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 3. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 4. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 5. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 6. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 7. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 8. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 9. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 10. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 11. 11.0 11.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 12. 12.0 12.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 13. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 14. 14.0 14.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 15. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 16. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 17. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 18. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 19. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 20. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 21. 21.0 21.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 22. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 23. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 24. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 25. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 26. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 27. 27.0 27.1 27.2 27.3 27.4 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 28. 28.0 28.1 28.2 28.3 28.4 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 29. 29.0 29.1 29.2 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 30. 30.0 30.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 31. 31.0 31.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 32. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 33. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 34. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 35. 35.0 35.1 35.2 35.3 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 36. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 37. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 38. 38.0 38.1 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; pioneer అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 39. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; newsmedia అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 40. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 41. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 42. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 43. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 44. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 45. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 46. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 47. 47.0 47.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 48. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 49. 49.0 49.1 49.2 49.3 49.4 49.5 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; cia అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
 50. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 51. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 52. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 53. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 54. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 55. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 56. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 57. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 58. 58.0 58.1 58.2 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 59. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 60. 60.0 60.1 60.2 60.3 60.4 60.5 60.6 60.7 60.8 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 61. 61.0 61.1 "GDP per capita, PPP (current international $)", World Development Indicators database, World Bank. Database updated on 14 April 2015.
 62. GDP – per capita (PPP), The World Factbook, Central Intelligence Agency.
 63. Economic Outlook Database, October 2015, International Monetary Fund. Database updated on 6 October 2015.
 64. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 65. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 66. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 67. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 68. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 69. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 70. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 71. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 72. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 73. 73.0 73.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 74. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 75. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 76. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 77. 77.0 77.1 77.2 77.3 77.4 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 78. 78.0 78.1 78.2 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 79. Kultermann 1981
 80. Aga Khan Award
 81. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 82. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 83. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 84. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 85. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 86. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 87. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 88. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 89. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 90. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 91. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 92. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 93. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 94. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 95. 95.0 95.1 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 96. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 97. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 98. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 99. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 100. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
 101. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
"https://te.wikipedia.org/w/index.php?title=కువైట్&oldid=2977326" నుండి వెలికితీశారు