Jump to content

మలావి

అక్షాంశ రేఖాంశాలు: 13°30′S 34°00′E / 13.500°S 34.000°E / -13.500; 34.000
వికీపీడియా నుండి

13°30′S 34°00′E / 13.500°S 34.000°E / -13.500; 34.000

Republic of Malawi

Dziko la Malaŵi (Chichewa)
Flag of Malawi
జండా
Coat of arms of Malawi
Coat of arms
నినాదం: "Unity and Freedom"
గీతం: Mulungu dalitsani Malaŵi  (Chichewa)
(English: "O God Bless Our Land of Malawi")[1]
రాజధాని
and largest city
Lilongwe
13°57′S 33°42′E / 13.950°S 33.700°E / -13.950; 33.700
అధికార భాషలుEnglish,[2] Chichewa[2]
జాతులు
(2008)
పిలుచువిధంMalawian
ప్రభుత్వంUnitary presidential republic
• President
Peter Mutharika
Saulos Chilima
శాసనవ్యవస్థNational Assembly
Independence
• from the United Kingdom
6 July 1964
• republic
6 July 1966
• Current constitution
18 May 1994
విస్తీర్ణం
• మొత్తం
118,484 కి.మీ2 (45,747 చ. మై.) (98th)
• నీరు (%)
20.6%
జనాభా
• 2016 estimate
Increase 18,091,575[3] (64th)
• 2008 census
13,077,160[4]
• జనసాంద్రత
128.8/చ.కి. (333.6/చ.మై.) (86th)
GDP (PPP)2017 estimate
• Total
$22.658 billion[5]
• Per capita
$1,182[5]
GDP (nominal)2017 estimate
• Total
$6.364 billion[5]
• Per capita
$331[5]
జినీ (2010)43.9[6]
medium
హెచ్‌డిఐ (2018)Increase 0.510
low · 171st
ద్రవ్యంKwacha (D) (MWK)
కాల విభాగంUTC+2 (CAT)
వాహనాలు నడుపు వైపుleft
ఫోన్ కోడ్+265[7]
ISO 3166 codeMW
Internet TLD.mw[7]
* Population estimates for this country explicitly take into account the effects of excess mortality due to AIDS; this can result in lower life expectancy, higher infant mortality and death rates, lower population and growth rates, and changes in the distribution of population by age and sex than would otherwise be expected.
  • Information is drawn from the CIA Factbook unless otherwise noted.

మాలావి అధికారికంగా " రిపబ్లిక్ అఫ్ మలావి " అని పిలువబడుతుంది. ఆగ్నేయ ఆఫ్రికాలో ఉన్న భూపరివేష్టిత దేశం. ఇది గతంలో న్యాసాలాండు అని పిలువబడింది. ఇది వాయవ్యసరిహద్దులో జాంబియా, ఈశాన్యసరిహద్దులో టాంజానియా, తూర్పు, దక్షిణ, పశ్చిమ సరిహద్దులలో మొజాంబిక్ ఉన్నాయి. మాలావి వైశాల్యం 1,18,000చ.కిమీ. జనసంఖ్య 1,80,91,575 (2016 జూలై నాటికి). మాలావి దేశవైశాల్యంలో మలావి సరసు మూడవ వంతు ఆక్రమిస్తుంది.[8] దేశ రాజధాని లిలోంగ్వే ఇది మాలావిలో అతిపెద్ద నగరంగా కూడా ఉంది. రెండవ అతిపెద్ద నగరం బ్లాంటైర్, మూడవ అతిపెద్ద నగరం మజుజు, నాల్గవ అతిపెద్ద నగరం, దేశ పాత రాజధాని జొంబా. మలావి అనే పేరుకు మరావి (ఈ ప్రాంతంలో నివసించే నిన్జా ప్రజల పాత పేరు మరావి) అనేపదం మూలంగా ఉంది. దేశప్రజల స్నేహపూర్వక హృదయం కారణంగా దేశానికి " ది వాం హార్ట్ ఆఫ్ ఆఫ్రికా " అనే మరొక పేరు ఉంది.[9]

మాలావి అని పిలవబడే ఆఫ్రికా భాగంలో 10 వ శతాబ్దంలో బంటు ప్రజలు వలసవచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. శతాబ్దాల తర్వాత 1891 లో ఈ ప్రాంతం బ్రిటీషు వారి వలసప్రాంతంగా మారింది. 1953 లో యునైటెడ్ కింగ్డంకు చెందిన న్యాసాల్యాండు అని పిలువబడే మలావి పాక్షిక స్వతంత్ర సమాఖ్య " రోడేషియా అండ్ న్యాసాల్యాండ్ ఫెడరేషన్ "లో ఒక సంరక్షక దేశం (ప్రొటక్టరేటు)గా మారింది. 1963 లో ఫెడరేషన్ రద్దు చేయబడింది. 1964 లో న్యాసాల్యాండ్ సంరక్షక స్థితి పూర్తయింది. న్యాసాల్యాండ్ మహారాణి రెండవ ఎలిజబెత్ ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర దేశం అయింది. రెండు సంవత్సరాల తరువాత అది రిపబ్లిక్గా మారింది. స్వాతంత్ర్యం పొందిన తరువాత 1994 వరకు అధ్యక్షుడిగా కొనసాగిన హేస్టింగ్స్ బండా అధ్యక్ష పదవి కాలంలో ఒక నిరంకుశ ఏక-పార్టీ దేశం అయింది.తరువాత ఎన్నికైన అధ్యక్షుడు ఆర్థర్ పీటర్ ముతరికా నేతృత్వంలో మాలావి ప్రజాస్వామ్య బహు-పార్టీ ప్రభుత్వం అయింది. దేశంలో పదాతిదళం, నౌకాదళం, విమాన దళం కలిగిన రక్షణవ్యవస్థ ఉంది. మాలావీ విదేశాంగ విధానం పాశ్చాత్య దేశాలకు అనుకూలంగా ఉంటుంది. మలావి ఐక్యరాజ్యసమితి, కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్, సదరన్ ఆఫ్రికన్ డెవెలప్మెంట్ కమ్యూనిటీ, తూర్పు, దక్షిణ ఆఫ్రికా కామన్ మార్కెట్టు, ఆఫ్రికన్ యూనియను సభ్యదేశంగా ఉంది.

ప్రపంచంలోని కనీసం అభివృద్ధి చెందిన దేశాలలో మలావి ఒకటి. ఆర్థిక వ్యవస్థ భారీగా గ్రామీణ జనాభాతో కూడిన వ్యవసాయంపై ఆధారపడి ఉంది. మాలావియన్ ప్రభుత్వం అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా వెలుపలి దేశాల నిధిసహాయం మీద ఆధారపడుతుంది. 2000 నుండి ఈ అవసరాన్ని ( అందించే సహాయం) తగ్గించబడింది. మలావి ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను నిర్మించడం, విస్తరించడం, విద్య, ఆరోగ్య రక్షణ, పర్యావరణ రక్షణ, ఆర్థికంగా అభివృద్ధి చెందడం, విస్తృత నిరుద్యోగం మధ్య ఆర్థికంగా స్వతంత్రం సాధించడానికి కృషి చేస్తుంది. మలావి 2005 నుంచి ఈ సమస్యలపై దృష్టి కేంద్రీకరించే అనేక కార్యక్రమాలను అభివృద్ధి చేసింది. 2007 - 2008 లో ఆర్థిక, విద్య, ఆరోగ్య సంరక్షణ పెరుగుదలతో దేశం దృక్పథం మెరుగుపడింది.

మాలావిలో తక్కువ ఆయుఃపరిమితి, అధిక శిశు మరణాలు ఉన్నాయి. హెచ్ఐవి ప్రాబల్యం అధికంగా ఉంది. ఇది కార్మిక శక్తిని, ప్రభుత్వ నిధులను శుష్కింపజేస్తూ ఉంది. వైవిధ్యమైన స్థానిక జనాభా, ఆసియన్లు, యూరోపియన్లతో, పలు భాషలు, మత విశ్వాసాల శ్రేణిని కలిగి ఉంది. గతంలోని జాతి విభాగాల ద్వారా కొంతకాలం ప్రాంతీయ ఘర్షణలు తలెత్తినప్పటికీ 2008 నాటికి అవి గణనీయంగా తగ్గిపోయాయి. మలవియన్ జాతీయత అనే జాతీయ భావన అభివృద్ధి చెందింది.

చరిత్ర

[మార్చు]
Chongoni Rock Art Area.

10 వ శతాబ్దానికి బాంటూ ప్రజల తరంగాలు ఉత్తరాన నుండి బయలుదేరడం మొదలు పెట్టడానికి ముందు ప్రస్తుతం మాలావి అని పిలవబడే ఆఫ్రికా ప్రాంతంలో స్వల్పసంఖ్యలో వేట- సేకరణ ద్వారా జీవనం సాగించే సమూహాలకు చెందిన ప్రజలు నివసించే వారు.[ఆధారం చూపాలి] బంటు ప్రజలు చాలామంది దక్షిణప్రాంతాలకు తరలిపోవడం కొనసాగించినప్పటికీ, కొందరు శాశ్వతంగా ఇక్కడే స్థిరపడ్డారు. సాధారణ పూర్విక సంతతికి చెందిన జాతుల సమూహాలను ఏర్పరిచారు.[10] సా.శ. 1500 నాటికి గిరిజనులు జావేబీ నది నుండి (ప్రస్తుత నఖోటోటో), మలావి సరస్సు, లావాంగ్వా నది (ప్రస్తుతం జాంబియాలో ఉంది) వరకు ఉన్న ప్రాంతంలో మారావి రాజ్యాన్ని స్థాపించారు.[11]

1600 తరువాత స్థానిక గిరిజనపాలకుల చేత సమైక్యపరచబడిన స్థానిక గిరిజనులు పోర్చుగీసు వర్తకులు, సైనిక సభ్యులతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకొని వ్యాపారాన్ని ప్రారంభించారు. 1700 నాటికి సామ్రాజ్యం అనేక ప్రత్యేక జాతుల సమూహాల నియంత్రణలో ఉండే ప్రాంతాలుగా విభజించబడింది.[12] 1800 మధ్యకాలంలో అరబ్ బానిస వాణిజ్యం శిఖరాగ్రానికి చేరుకుంది. నకోటకోటా నుండి కిల్వా వరకు ఉన్న సుమారుగా 20,000 మంది ప్రజలు బానిసలుగా విక్రయించబడ్డారు. [13]

1859 లో మిషనరీ, అన్వేషకుడు డేవిడ్ లివింగుస్టన్ మాలావి సరస్సు (అప్పుడు న్యాసా సరసు) చేరుకున్నాడు. సరస్సుకు దక్షిణ ప్రాంతంలో ఐరోపా స్థావరానికి అనువుగా షైర్ హైలాండ్సు ఉందని గుర్తించారు. లివింగుస్టన్ పర్యటన ఫలితంగా 1860 - 1870 లలో అనేక ఆంగ్లికన్, ప్రెస్బిటేరియన్ మిషన్లు స్థాపించబడ్డాయి. 1876 ​​లో బ్లాంటైర్లో వ్యాపార స్థావరం, ఒక చిన్న మిషను ఏర్పడింది. 1878 లో ఆఫ్రికన్ లేక్స్ కంపెనీ లిమిటెడ్ స్థాపించి మిషన్లతో కలిసి వాణిజ్య, రవాణా కార్యకలాపాలను సాగించింది. 1883 లో బ్రిటీష్ కాన్సుల్ నివాసం ఏర్పడింది. పోర్చుగీసు ప్రభుత్వానికి ఈ ప్రాంతం మీద ఆసక్తి కలగడం గమనించి పోర్చుగీస్ ఆక్రమణను నివారించడానికి, బ్రిటీష్ ప్రభుత్వం పోర్చుగీస్ అధికార పరిధికి స్థానిక పాలకులతో ఒప్పందాలను తయారు చేయడానికి హ్యారీ జానుస్టనును బ్రిటిష్ కాంసిలుగా పంపింది.[14]

1897 1897 బ్రిటిష్ సెంట్రల్ ఆఫ్రికా స్టాంప్ యునైటెడ్ కింగ్డమ్ జారీ చేసింది

1889 లో బ్రిటీషు " షైరు హైలాండ్స్ పై " ప్రొటక్టరేటు ప్రకటించబడింది. 1891 లో దానిని విస్తరిస్తూ ప్రస్తుత మాలావి మొత్తం ప్రాంతాన్ని బ్రిటిషు సెంట్రల్ ఆఫ్రికా ప్రొటెక్టరేటుగా చేసింది.[15] 1907 లో ప్రొటక్టరేటు పేరును న్యాసాలాండుగా మార్చి మిగిలిన సమయంలో దీనిని బ్రిటీషు పాలనలో ఉంచారు.[16] ఆఫ్రికాలో కాలనీల అధికారం " తిన్ వైట్జ్ లైన్ " అని పిలవబడేది. ఉదాహరణగా 1811 లో స్థాపించబడిన న్యాసాలాండు వలసరాజ్య ప్రభుత్వం ఏర్పడింది. సంవత్సరానికి £ 10,000 (1891 నామమాత్ర విలువ) బడ్జెటు ఇవ్వబడింది. పది మంది యూరోపియన్ పౌరులు, ఇద్దరు సైనిక అధికారులు, డెబ్బై పంజాబు సిక్కులు, ఎనభై ఐదు జాంజిబార్ పోర్టర్లు పనిచేయడానికి సరిపోతుంది. ఈ కొద్దిమంది ఉద్యోగులు తరువాత 94,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని, ఒక మిలియన్ల మంది ప్రజలు ఉన్న ప్రదేశ నిర్వహణా, పోలీసు వ్యవస్థను నిర్వహించాలని అంచనా వేశారు.[17]

1944 లో న్యాసాల్యాండు ఆఫ్రికన్లు " న్యాసాల్యాండు ఆఫ్రికన్ కాంగ్రెసు " స్థానిక ప్రజల ఆసక్తిని, ప్రయోజనాలను బ్రిటిషు ప్రభుత్వానిక్in తెలియ చేడానికి పనిచేసింది.[18] 1953 లో బ్రిటన్ ఉత్తర, దక్షిణ రోడేషియాతో ("ఫెడరేషను ఆఫ్ రోడెషియా, న్యాసల్యాండు) అనుసంధానం చేసింది. ఇది తరచుగా " సెంట్రల్ ఆఫ్రికన్ ఫెడరేషన్ " అని పిలువబడింది.[16] ప్రధానంగా రాజకీయ కారణంగా ఇలా పిలువబడింది.[19]

ఫెడరేషన్ పాక్షిక-స్వతంత్రంగా ఉన్నప్పటికీ ఆ సంబంధం ఆఫ్రికన్ జాతీయవాదుల వ్యతిరేకతకు దారితీసింది. ఎన్.ఎ.సి. ప్రజల మద్దతు పొందింది. సి.ఎ.ఎఫ్. ప్రత్యర్థి డాక్టర్. హేస్టింగ్సు బాండ (ఐరోపాలో శిక్షణ పొంది ఘానాలో పనిచేస్తున్న ఒక వైద్యుడు) 1958 లో న్యాసాల్లాండుకు తిరిగి రావడానికి అంగీకరించి వచ్చిన తరువాత జాతీయవాదానికి సహాయం చేశాడు. బండా ఎన్.ఎ.చి. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1959 లో వలస అధికారులచే జైలు శిక్ష అనుభవించడానికి ముందు జాతీయవాద భావాలను సమీకరించటానికి కృషి చేశారు. 1960 లో అతను విడుదల చేయబడ్డాడు. తరువాత ఆయన కాలనీ శాసనమండలిలో ఆఫ్రికన్ల ఆధిఖ్యత కలిగించడానికి అనుకూలంగా న్యాసాలాండుకు ఒక కొత్త రాజ్యాంగం రూపొందించాలని కోరాడు.[10]

మాలావి మొట్టమొదటి ప్రధాన మంత్రి, తరువాత అధ్యక్షుడు, హేస్టింగ్స్ బండా (ఎడమ), టాంజానియా అధ్యక్షుడు జూలియస్ నైరేరేతో

1961 లో బండా " మలావీ కాంగ్రెస్ పార్టీ " శాసన మండలి ఎన్నికలలో మెజారిటీ సాధించింది. 1963 లో బాండ ప్రధానమంత్రి అయ్యాడు. 1963 లో ఈ ఫెడరేషన్ రద్దు చేయబడింది. 1964 జూలై 6 న న్యాసాల్యాండ్ బ్రిటీషు పాలన నుండి స్వతంత్రం పొందింది. తరువాత మాలావి అని పేరు మార్చబడింది. కొత్త రాజ్యాంగం ఆధారంగా మలావి మొదటి అధ్యక్షుడిగా బండాతో ఒక గణతంత్ర రాజ్యంగా మారింది. ఈ కొత్త దస్తావేజు మలావిని చట్టబద్ధమైన ఏక- పార్టీగా దేశంగా పేర్కొన్నది. 1971 లో బాండ జీవితం పర్యంతం అధ్యక్షపదవిలో కొనసాగుతానని ప్రకటించాడు. దాదాపు 30 సంవత్సరాలు బండా అధ్యక్షుడుగా ఒక కఠినమైన నిరంకుశ పాలనలో సాగించాడు.[20] మలావీ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఆఫ్ ఒటాన్ చిర్వా, సోషలిస్ట్ లీగ్ ఆఫ్ మాలావి వంటి ప్రవాస పార్టీలు బహిష్కరణలో ఉన్నాయి.

బాండ అధ్యక్షతలో మాలావి ఆర్ధికవ్యవస్థ పేద, భూభాగం, భారీగా జనసాంధ్రత, పేలవమైన ఖనిజ వనరులు ఉన్న దేశంగా వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి రెండింటిలో ఎలాంటి పురోగతిని సాధించవచ్చనే దానికి ఉదాహరణగా చెప్పవచ్చు.[21] కార్యాలయంలో ఉండగా దేశం నియంత్రణను ఉపయోగించి బాండ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. చివరికి దేశం జి.డి.పి.లో మూడింట ఒక భాగాన్ని ఉత్పత్తి చేశాడు. వేతన ఆదాయంతో 10% మంది ఉద్యోగులు పనిచేశారు.[22] బండా సంపాదించిన మొత్తం డబ్బు మలావిని అభివృద్ధి చేయటానికి తిరిగి ఉపయోగించాడు.[ఆధారం చూపాలి]కముజు అకాడమీ (ఎటన్ ఆఫ్ ఆఫ్రికా) అనే అగ్రశ్రేణి బోర్డింగ్ పాఠశాల భవనం నిర్మించబడింది. బండా స్వంత పదాలలో " నా బాలికలు, బాలురు నేను చేయవలసినది చేసాను. వారి ఇళ్లను, వారి కుటుంబాలను విడిచి విద్యను పొందటానికి మాలావిని విడిచి వెళ్ళకుండా ఉండడానికి ఈ పాఠశాలను మాలావికి బహుమతిగా ఇవ్వడానికి ఇదే ప్రధాన కారణం " అని అభిప్రాయం వెలువరించాడు.

రాజకీయ స్వేచ్ఛ కొరకు వత్తిడి అధికరించిన కారణంగా 1993 లో ఒక ప్రజాభిప్రాయ సేకరణకు బండా అంగీకరించాడు. ప్రజలు ఒక బహుళ పార్టీ ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఓటు వేసారు. 1993 చివరిలో అధ్యక్ష కౌన్సిల్ ఏర్పడి జీవితకాల పాలన రద్దు చేయబడింది. ఎం.సి.పి. పాలనను సమర్థవంతంగా ముగించి కొత్త రాజ్యాంగం స్థాపించబడింది.[20] 1994 లో మొట్టమొదటి బహుళ-పార్టీ ఎన్నికలు జరిగాయి. బండాను బసిలీ ములుజి (ఎం.సి.పి.మాజీ సెక్రెటరీ జనరలు, మాజీ బండా క్యాబినెట్ మంత్రి) ఓడించాడు. 1999 లో తిరిగి ఎన్నికై 2004 వరకు ములుజు అధ్యక్షుడిగా ఉన్నాడు. తరువాత డాక్టర్ బింగూ ముతరిక ఎన్నికయ్యారు. రాజకీయ పర్యావరణం "సవాలు"గా వర్ణించబడినప్పటికీ 2009 లో మాలావిలో బహుళ-పక్ష వ్యవస్థ ఇప్పటికీ ఉనికిలో ఉందని పేర్కొంది.[23] 2009 లో మాలావిలో పార్లమెంటరీ, ప్రెసిడెన్షియల్ ఎన్నికలు జరిగాయి. ప్రత్యర్థుల ఎన్నికల మోసం ఆరోపణలు ఉన్నప్పటికీ అధ్యక్షుడు ముతరిక విజయవంతంగా తిరిగి ఎన్నికయ్యారు.[24]

అధ్యక్షుడు ముతారికాను కొంతమంది నిరంకుశ పాలకుడుగా, మానవ హక్కులను నిరాకరించాడని భావించారు.[25] 2011 జూలైలో అధిక జీవన వ్యయాలపై, విదేశీ సంబంధాలు, బలహీనమైన పాలన, విదేశీ మారకద్రవ్యం లోపం వంటి సమస్యలకు వ్యతిరేకంగా నిరసనప్రదర్శనలు జరిగాయి.[26] నిరసనలలో 18 మంది చనిపోయారు, కనీసం 44 మంది తుపాకీ గాయాలకు గురయ్యారు.[27] 2012 ఏప్రెలులో ముతరిక గుండెపోటుతో మరణించాడు. అధ్యక్ష పదవికి మాజీ వైస్ ప్రెసిడెంట్ జోయిస్ బండాను తీసుకున్నారు.[28]

2014 లో జోయిస్ బండా ఎన్నికలలో ఓడిపోయాడు. మాజీ ప్రెసిడెంట్ ముతరిక సోదరుడు ఆర్థర్ పీటర్ ముతరికా స్థానంలో ఎన్నికయ్యాడు. .[29]

భౌగోళికం

[మార్చు]
Mountains in Northern Malawi during rainy season
Sunset over Lake Malawi

మాలావి ఆగ్నేయ ఆఫ్రికాలో ఉన్న భూబంధితదేశం దేశం. వాయవ్యసరిహద్దులో జాంబియా, ఈశాన్యసరిహద్దులో టాంజానియాకు దక్షిణాన, ఆగ్నేయ సరిహద్దులో మొజాంబిక్ ఉన్నాయి. ఇది అక్షాంశాల 9 ° నుండి 18 ° డిగ్రీల దక్షిణ అక్షాంశం, 32 ° నుండి 36 ° డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.

గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ దేశం ఉత్తరం నుండి దక్షిణం వైపుకు విస్తరించి ఉంటుంది. లోయ తూర్పున మాలవి సరస్సు (నైజీ సరస్సు అని కూడా పిలుస్తారు), ఇది మాలావి తూర్పు సరిహద్దులో మూడొంతులకు పైగా ఉంది.[10] మాలావి సరసు కొన్నిసార్లు క్యాలెండర్ లేక్ గా పిలువబడుతుంది. ఇది 587 కిలోమీటర్లు (365 మైళ్ళు) పొడవు, 84 కిలోమీటర్ల (52 మైళ్ళు) వెడల్పు ఉంటుంది. [30] సరస్సు దక్షిణ ప్రాంతం నుండి షైరు నది ప్రవహించి దక్షిణాన 400 కిలోమీటర్ల (250 మైళ్ళు)ప్రవహించి జాంబియాలో ఉన్న జాంబేజి నదితో సంగమిస్తుంది. సముద్ర మట్టానికి 457 మీటర్ల (1,500 అడుగులు) ఎత్తున ఉంటూ మొత్తం 701 మీటర్ల (2,300 అడుగులు) గరిష్ఠ లోతు కలిగి ఉన్న సరస్సు సముద్ర మట్టం నుండి 213 మీటర్లు (700 అడుగులు)లోతు ఉంటుంది.

సరస్సు మాలావి

రిఫ్టు లోయ పరిసరాల్లో ఉన్న మలావి పర్వత విభాగాలలో పీఠభూములు సముద్ర మట్టానికి 914 నుండి 1,219 మీటర్లు (3,000 నుండి 4,000 అడుగులు) ఎత్తులో ఉన్నాయి. అయితే ఉత్తరాన 2,438 మీటర్లు (8,000 అడుగులు) ఎత్తు ఉంది. మాలివా సరస్సు దక్షిణాన సముద్ర మట్టానికి సుమారు 914 మీటర్ల (3,000 అడుగులు) ఎత్తులో షైర్ హైలాండు ఉంది. ఈ ప్రాంతంలో జోంబీ, ములాంజ్ పర్వత శిఖరాలు 2,134 నుండి 3,048 మీటర్ల (7,000 నుండి 10,000 అడుగులు) ఎత్తుకు పెరిగాయి.[10]

మలావి రాజధాని లిలోంగ్వే. దేశ వాణిజ్య కేంద్రం బ్లాంటైరు. ఇక్కడ 5,00,000 మంది ప్రజలు నివసిస్తున్నారు.[10] మాలవిలో యునస్కో పపంచవారసత్వ సంపద జాబితాలో ఉన్న రెండు ప్రాంతాలు ఉన్నాయి. 1984 లో మొదటిసారి మలావి సరసు నేషనల్ పార్క్ జాబితా చేర్చబడింది. 2006 లో చోగోనీ రాక్ ఆర్ట్ ఏరియా జాబితా చేయబడింది.[31]

మాలావి దక్షిణాన తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలలో వాతావరణం వేడిగా ఉంటుంది. ఉత్తర పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రత అధికరిస్తుంది. నవంబరు, ఏప్రిల్ మధ్య భూమధ్యరేఖా ప్రాంత ఉష్ణోగ్రతతో, వర్షాలతో, తుఫానుతో వేడిగా ఉంటుంది. మార్చి చివరిలో తుజానులు వాటి గరిష్ఠ తీవ్రతను చేరుకుంటాయి. మార్చి తరువాత వర్షపాతం వేగంగా తగ్గిపోతుంది. మే నుండి సెప్టెంబరు తడిగా ఉన్న గాలులు పర్వతాల నుండి పీఠభూమిలోకి చేరుతుంటాయి. ఈ నెలలలో దాదాపు వర్షపాతం లేదు.[10]

జంతుజాలం, వృక్షజాలం

[మార్చు]
దస్త్రం:Brachystegia boehmii.jpg
Brachystegia aka miombo.

మలావిలో ఏనుగులు, నీటి ఏనుగులు, పెద్ద పిల్లులు, కోతులు, గబ్బిలాలు వంటి క్షీరదాలు ఉంటాయి. పక్షుల పక్షులలో ఫాల్కన్లు, వాటర్ఫౌలు, పెద్ద వాడర్లు, గుడ్లగూబలు, సింగింగు బర్డ్సు మొదలైనవి ఉన్నాయి. ఫ్యూను చేపలు అత్యధికంగా ఉన్న సరసుగా ప్రపంచగుర్తింపు పొందిన మలావి సరసున్న మలావిలో 200 క్షీరదాలు, 650 పక్షిజాతులు, 30 కంటే అధికంగా జలచరాలు, 5,500 కంటే అధికమైన వృక్ష జాతులు ఉన్నాయి.[32]

పర్యావరణ ప్రాంతాలలో ఉష్ణమండల, ఉపఉష్ణమండల గడ్డిభూములు, సవన్నాలు, మియాంబ అడవులలో పొదలు, మియామి చెట్లు ఆధిపత్యం చేస్తున్నాయి. జాపెయను, మోపను అటవీ ప్రాంతాలలో మోపన్ చెట్టు ఉన్నాయి. పచ్చిక బయళ్ళు, చిత్తడి వృక్షాలను అందించే గడ్డి భూములు ఉన్నాయి.

మలావిలో ఐదు జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి, గేమ్ రిజర్వులు, మరో రెండు రక్షిత ప్రదేశాలు ఉన్నాయి.

ఆర్ధికం

[మార్చు]
Crafts market in Lilongwe

మాలావి ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటి. 85% జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంది. ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడింది. వ్యవసాయ ఆదాయం జి.డి.పి.లో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ భాగస్వామ్యం వహిస్తుంది. ఎగుమతి ఆదాయంలో 90% వ్యవసాయరంగం నుండి లభిస్తుంది. గతంలో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి, ఇతర దేశాల నుండి లభిస్తున్న ఆర్థిక సహాయం మీద ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది.[33] 2011 మార్చి యురోమనీ కంట్రీ రిస్క్ ర్యాంకింగులో మలావి ప్రపంచంలోని 119 వ సురక్షితమైన పెట్టుబడి గమ్యస్థానంగా ఉంది.[34]

2000 డిసెంబరులో అవినీతి ఆందోళనల కారణంగా ఐ.ఎం.ఎఫ్. సహాయ ఉపసంహరణలను ఆపివేసింది. అనేకమంది వ్యక్తిగత దాతలు కూడా దీనిని అనుసరించారు. ఫలితంగా మాలావి అభివృద్ధి బడ్జెటు దాదాపు 80% పడిపోయింది.[35] అయినప్పటికీ 2005 లో మాలావి $ 575 మిలియన్ల అమెరికన్ డాలర్ల సహాయం అందుకున్నది. మలవియన్ ప్రభుత్వం మార్కెట్టు ఆర్థికవ్యవస్థను అభివృద్ధి పరచడం, పర్యావరణ రక్షణను మెరుగుపరచడం, వేగంగా పెరుగుతున్న ఎయిడ్స్ సమస్యతో వ్యవహరించడం, విద్యా వ్యవస్థను మెరుగుపరచడం, ఆర్థికంగా స్వతంత్రం సాధించడానికి పనిచేస్తున్న విదేశీ దాతలను సంతృప్తిపరిచడం వంటి సవాళ్లను ఎదుర్కొంటుంది. అధ్యక్షుడు ముతరిక, ఆర్థిక మంత్రి గాండ్వేల నాయకత్వంలో 2005 నుండి మెరుగైన ఆర్థిక క్రమశిక్షణ సాధ్యమైంది. 2009 లో ప్రైవేట్ ప్రెసిడెన్షియల్ జెట్ కొనుగోలు చేయడం ద్వారా దేశవ్యాప్త ఇంధన కొరత ఏర్పడింది. ఇది అధికారికంగా రవాణా సమస్యలకు కారణమైందని నిందించబడింది. కానీ జెట్ కొనుగోలు వలన ఏర్పడిన కరెన్సీ కొరత కారణంగా ఇది అధికమైంది.[36][37][38] ఆర్థికవ్యవస్థ మొత్తం విలువ ( ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ)అస్పష్టంగా ఉంది.

Graphical depiction of Malawi's product exports in 28 colour-coded categories.

2009 లో పెట్టుబడులు 23% పడిపోయిన కారణంగా విదేశీ కరెన్సీకొరత ఏర్పడి మలావి దిగుమతులకు చెల్లించే సామర్థ్యాన్ని పోగొట్టుకుంది. మాలావిలో అనేక పెట్టుబడుల అడ్డంకులు ఉన్నాయి. అధిక సేవాఖర్చులు, విద్యుత్తుశక్తి, నీరు, టెలీకమ్యూనికేషన్సు మౌలిక నిర్మాణాల లోపం వంటి సమస్యలను పరిష్కరించడంలో మలావి ప్రభుత్వం విఫలం అయింది. 2009 నాటికి మాలావి జి.డి.పి. $ 12.81 బిలియన్ల జి.డి.పి. (కొనుగోలు శక్తి సమానత్వం), $ 900 తలసరి జి.డి.పి.తో ద్రవ్యోల్బణం 8.5%గా అంచనా వేయబడింది.[33]

జి.డి.పి.లో 35% వ్యవసాయ రంగం, పరిశ్రమ 19%, సేవారంగం నుండి 46% లభిస్తుంది.[23] అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న ప్రపంచదేశాలలో మలావి ఒకటి.[35] 2008 లో ఆర్థిక వృద్ధి 9.7%గా ఉంటుందని, 2009 లో అంతర్జాతీయ ద్రవ్య నిధి బలమైన వృద్ధి అంచనా వేయబడుతుంది.[39] మాలావిలో పేదరికం శాతం ప్రభుత్వం, సహాయక సంస్థల కృషి ద్వారా తగ్గిపోతుంది. 1990 లో 54% దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తుండగా 2006 నాటికి 40%కు తగ్గించబడింది. "అల్ట్రా-పూర్" శాతం 1990 లో 24% ఉండగా 2007 నాటికి అది 15% నికి తగ్గింది.[40]

మాలావికి ఆర్థిక పురోగతి జనాభా పెరుగుదలను నియంత్రించే సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. [41]

2015 జనవరిలో దక్షిణ మాలావిలో సంభవించిన అతి భయంకరమైన వరదల కారణంగా కనీసం 20,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ వరదలు దేశవ్యాప్తంగా ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేశాయి. యూనిసెఫ్ నివేదిక ఆధారంగా వారిలో 3,36,000 మంది స్థానభ్రంశం చెందారు. 64,000 హెక్టార్ల పంటలు నీట మునిగాయి.[42]

వ్యవసాయం, పరిశ్రమలు

[మార్చు]
Harvesting groundnuts at an agricultural research station in Malawi
Women in Salima District, Malawi, selling groundnuts
Children attending a farmer meeting in Nalifu village, Mulanje, Malawi.

మాలావి ఆర్థికవ్యవస్థ వ్యవసాయరగం ప్రధాన్యత వహిస్తుంది. 2013 గణాంకాల వ్యవసాయ రంగం జి.డి.పి.లో కేవలం 27% మాత్రమే భాగస్వామ్యం వహించినప్పటికీ వ్యవసాయ రంగం ప్రజలలో 80% మందికి ఉపాధి కల్పిస్తుంది. జిడిపిలో సగం కంటే ఎక్కువ (54%) సేవారంగం నుండి లభిస్తుంది. తయారీరంగం 11%, సహజవనరులు (యురేనియం గనులు), ఇతర పరిశ్రమల నుండి 8% లభిస్తుంది. మాలావి ఇతర ఆఫ్రికన్ దేశం కంటే వ్యవసాయంలో (జి.డి.పి.వాటా) అధిక పెట్టుబడిని తీసుకుటుంది. (జి.డి.పి.లో 28%). [43][44][45]

మలావి ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులలో పొగాకు, చెరకు, పత్తి, టీ, మొక్కజొన్న, బంగాళాదుంపలు, జొన్న, పశువులు, మేకలు ప్రాధాన్యత వహిస్తున్నాయి. ప్రధాన పరిశ్రమలు పొగాకు, టీ, చక్కెర ప్రాసెసింగ్, కలప ఉత్పత్తులు, సిమెంటు, వినియోగదారుల వస్తువులు ప్రాధాన్యత వహిస్తున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు 10% (2009) గా అంచనా వేయబడింది. దేశంలో సహజ వాయువు ఎటువంటి ఉపయోగం చేయడం లేదు. 2008 నాటికి మాలావి ఏ విద్యుత్తును దిగుమతి చేయడం కాని ఎగుమతి చేయడం కాని చేయలేదు. దేశంలో ఉత్పత్తి చేయని కారణంగా పెట్రోలియాన్ని దిగుమతి చేస్తుంది.[33] 2006 లో దిగుమతి చేసుకున్న ఇంధనంపై ఆధారపడటాన్ని ప్రారంభించింది. దేశం రెండు ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన 10% ఇథనాల్తో పెట్రోలు కలపడం ప్రారంభమైంది. 2008 లో మలావి ఇథనాల్ తోనే కార్లను నడిపే పరీక్షలను ప్రారంభించింది. ప్రారంభ ఫలితాలను ప్రోత్సాహకరంగా ఉన్నందున దేశంలో ఇథనాల్ ఉపయోగం పెరుగుతూనే ఉంది.[46]

2009 నాటికి మాలావి ఎగుమతుల విలువ సంవత్సరానికి US $ 945 మిలియన్లకు చేరుకుంది. పొగాకు ఎగుమతుల ఆదాయం మీద ప్రపంచ ధరల తగ్గుదల ప్రభావం కారణంగా ఆర్థిక వ్యవస్థను భారీగా బాధించింది. అంతర్జాతీయ సమాజంలో పొగాకు ఉత్పత్తి పరిమితం చేయాలని ఒత్తిడి అధికరించిన ఫలితంగా మలావీ పొగాకు మాలావి ఉత్పత్తి అధికరించింది. 2007 - 2008 మధ్య ఎగుమతుల ఆదాయం 53% నుండి 70%కి అధికరించింది. దేశం టీ, కాఫీ, చక్కెర తయారీ మీద కూడా ఆధారపడుతుంది. వీటితో పొగాకు కలిసి 90% మాలావి ఎగుమతి ఆదాయంనికి భాగస్వామ్యం వాహిస్తుంది.[33][35] ఉతపత్తి వ్యయం పెరుగుదల, విక్రయాల ధరల తగ్గుదల కారణంగా పొగాకును వదిలి రైతులు మసాలా దినుసుల వంటి (పాప్రికా మొదలైనవి) మరింత లాభదాయక పంటలు ఉతపత్తి చేసేలా మాలావి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మాలవిని తయారుచేసే నిర్దిష్ట రకానికి చెందిన పొగాకు (బ్యూర్లీ లీఫ్) వ్యతిరేకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కదులుతున్న కారణంగా మలావి రైతులు పొగాకుకు దూరంగా కదులుతున్నారు. ఇది ఇతర పొగాకు ఉత్పత్తుల కంటే మానవ ఆరోగ్యానికి హాని అధింగా కలిగించేదిగా ఉందని భావించబడుతుంది. భారతదేశం జనపనార మరొక ప్రత్యామ్నాయ పంటగా ఉంది. కానీ ఇది మాదకద్రవ్యంగా ఉపయోగించిన కనాబిసులా ఉన్నందున రెండు రకాల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడం కష్టం కనుక ఇది దేశంలో నేరం అధికరిస్తుందని వాదన అధికరిస్తుంది.[47] ఈ ఆందోళన చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మలావి బంగారం అని పిలవబడే మలావి గంజాయి సాగు, గణనీయంగా పెరిగింది.[48] మలావి నాణ్యమైన కన్నాబిసు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచ బ్యాంకు నివేదిక ఆధారంగా కన్నాబిసు ఉత్పత్తి, అమ్మకాల కారణంగా పోలీసు వ్యవస్థలో అవినీతి అధికరించడానికి కారణమైందని భావించారు.[49]

దక్షిణాఫ్రికా డెవలప్మెంట్ కమ్యూనిటీ దేశాలలో ఆర్థిక రంగం, 2013 లేదా సన్నిహిత సంవత్సరం జి.డి.పి.[50]

ఇతర ఎగుమతి వస్తువులలో పత్తి, వేరుశెనగ, కలప ఉత్పత్తులు, దుస్తులు ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి. దక్షిణ ఆఫ్రికా, జర్మనీ, ఈజిప్ట్, జింబాబ్వే, యునైటెడ్ స్టేట్స్, రష్యా, నెదర్లాండ్స్ దేశాలు మలావి ఎగుమతులకు ప్రధాన గమ్యాలుగా ఉన్నాయి. మాలావి ప్రస్తుతం సంవత్సరానికి US $ 1.625 బిలియన్ల అమెరికన్ డాలర్ల సరుకులను దిగుమతి చేస్తుంది. ప్రధాన ఆహార పదార్థాలు, పెట్రోలియం ఉత్పత్తులు, వినియోగదారుల వస్తువులు, రవాణా పరికరాలు దిగుమతులలో ప్రాధాన్యత వహిస్తున్నాయి. దక్షిణాఫ్రికా, భారతదేశం, జాంబియా, టాంజానియా, యుఎస్, చైనా నుండి మలావి దిగుమతి చేసుకుంటుంది. [33]

2006 లో వ్యవసాయ సాగుకు ప్రమాదకరమైనంత తగ్గినందుకు ప్రతిస్పందనగా, మలావి ఎరువుల సబ్సిడీల కార్యక్రమాన్ని ప్రారంభించింది. భూమిని తిరిగి ఉత్తేజపరిచేందుకు, పంట ఉత్పత్తిని పెంచడానికి రూపొందించిన ఎరువులు ఉపయోగం కార్యక్రమం ఆరంభించింది. దేశాధ్యక్షుడి చేత ప్రోత్సహించబడిన ఈ కార్యక్రమం మలావి వ్యవసాయాన్ని తీవ్రంగా మెరుగుపరుస్తుంది. ఇది మాలావి సమీపంలోని దేశాలకు నికర ఎగుమతిదారుగా మారటానికి కారణమవుతుందని నివేదించబడింది.[51] ఎరువుల సబ్సిడీ కార్యక్రమాలు అధ్యక్షుడు బింగువా ముత్తరికా మరణంతో ముగిసింది. దేశం వెంటనే ఆహార కొరతను ఎదుర్కొంది. ఉనికిలో ఉన్న ఓపెన్ మార్కెట్లలో ఎరువులు, ఇతర వ్యవసాయ ఉత్పాదకాలను కొనుగోలు చేయడానికి రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

2016 లో మాలావిని ఒక కరువు దెబ్బతీసింది. 2017 జనవరిలో దేశంలోని జొంబా పరిసరాలలో చిమటల దండు చోటుచేసుకున్నాయి. చిమటలకు పేదప్రజల ప్రధానాహారమైన మొక్కజొన్న ధాన్యాన్ని తుడిచిపెట్టే సామర్ధ్యం ఉంటుంది.[52] 2017 జనవరి 14 న చిమటలు 2,000 హెక్టార్ల పంట నాశనం చేయబడిందని, ఇరవై ఎనిమిది జిల్లాలలో 9 జిల్లాలకు చిమటలు విస్తరించాయని వ్యవసాయ శాఖ మంత్రి జార్జ్ చప్పొండ ప్రకటిస్ .[53]

సైంసు, సాంకేతికం

[మార్చు]

పరిశోధన

[మార్చు]

2010 లో " డిపార్టుమెంటు ఆఫ్ సైంసు అండ్ టెక్నాలజీ " సర్వే ఆధారంగా మలావి పరిశోధన అభివృద్ధి కొరకు జి.డి.పిలో 1.06% మంజూరు చేసింది. ఇది ఆఫ్రికాదేశాలలో అత్యధిక నిష్పత్తులలో ఒకటని నివేదిక తెలియజేసింది. ఇది పరిశోధకునికి $ 7.8 (ప్రస్తుత కొనుగోలు పారిటీ డాలర్లలో) కు అనుగుణంగా ఉంటుంది.[43][44]

2014 లో మలవియన్ శాస్త్రవేత్తలు అంతర్జాతీయ పత్రికలలో ప్రచురించిన చేయబడిన వ్యాసాలు సంఖ్యాపరంగా దక్షిణ ఆఫ్రికాలో మూడవ స్థానానికి చేరుకున్నారు. వారు " థామ్సన్ రాయిటర్సు వెబ్ ఆఫ్ సైన్స్ (సైన్స్ సైటేషన్ ఇండెక్స్ విస్తరించారు) లో 322 వ్యాసాలను (2005 (116) లో దాదాపుగా ట్రిపుల్ సంఖ్య) ప్రచురించారు. దక్షిణాఫ్రికా (9,309), యునైటెడ్ రిపబ్లిక్ అఫ్ టాంజానియా (770) ప్రచురించాయి. మాలావియన్ శాస్త్రవేత్తలు అధికంగా ప్రధాన జర్నర్లలో ప్రచురిస్తున్నారు. ఇదే జనాభా పరిమాణం కలిగిన ఇతర దేశాల కంటే ఇది అధికం. దేశంలోని ప్రచురణ సాంద్రత నిరాడంబరంగా ఉన్నప్పటికీ 2014 లో అంతర్జాతీయ పత్రికల్లో జాబితాలో మిలియన్ ప్రజలకు కేవలం 19 ప్రచురణలు మాత్రమే ఉండగా సబ్-సహారన్ ఆఫ్రికా సగటున ఒక మిలియన్ మంది ప్రజలకు 20 ప్రచురణలు ఉన్నాయి. [43][44]

విధానాల రూపకల్పన

[మార్చు]
Scientific research output in terms of publications in Southern Africa, cumulative totals by field, 2008–2014.[54]

మాలావి మొట్టమొదటి సైన్సు అండు టెక్నాలజీని విధానం 1991 నుండి 2002 లో సవరించబడింది. " 2002 లోని నేషనల్ సైన్సు అండు టెక్నాలజీ పాలసీ " సైన్సు అండ్ టెక్నాలజీలో నేషనల్ కమిషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీని స్థాపించాలని ప్రభుత్వానికి, ఇతర వాటాదారులకు సలహా ఇవ్వాలని భావించింది. 2003 సైన్స్ అండ్ టెక్నాలజీ యాక్టు ఈ కమిషన్ని ఏర్పాటు చేయడానికి అనుమతించినప్పటికీ ఇది 2011 లో మాత్రమే పనిచేయడం ఆరంభించింది. సైన్సు అండ్ టెక్నాలజీ విభాగం, నేషనల్ రిసెర్చ్ కౌన్సిలు విలీనం ఫలితంగా ఒక సెక్రటేరియట్ ఏర్పడింది. సైన్స్ అండ్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ 2003 సైన్స్ అండ్ టెక్నాలజీ ఫండ్ కూడా పరిశోధన, అధ్యయనాల కోసం ప్రభుత్వ నిధుల ద్వారా, రుణాల ద్వారా నిధులు సమకూర్చినప్పటికీ 2014 వరకు ఇది పనిచేయలేదు. సైన్సు అండ్ టెక్నాలజీ జాతీయ కమిషన్ సెక్రటేరియట్, సైన్సు అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ (2011-2015) వ్యూహాత్మక ప్రణాళికను సమీక్షించినప్పటికీ 2015 వరకు సవరించిన విధానం క్యాబినెట్ ఆమోదం పొందలేదు.[43][44]

సాంకేతిక బదిలీని ప్రోత్సహించడానికి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి, మానవ వనరులను అభివృద్ధి చేయటానికి, ఆర్థికాభివృద్ధి ప్రైవేటు రంగానికి శక్తివంతం చేసి ఆర్థికాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం ఎంతో అవసరం మలావి ప్రభుత్వం భావిస్తుంది. 2012 లో విదేశీ పెట్టుబడులలో మౌలిక సదుపాయాలకి (62%), విద్యుత్తు ఉత్పత్తికి (33%) కు వినియోగించబడింది. ప్రభుత్వం మరింత విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు పన్ను విరామాలతో సహా, ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది. 2013 లో మాలావి ఇన్వెస్ట్మెంటు అండ్ ట్రేడ్ సెంటర్ దేశంలోని ఆరు అతిపెద్ద ఆర్థిక వృద్ధి రంగాలలో 20 కంపెనీలను విస్తరించడానికి పెట్టుబడులు పెట్టింది.[43][44]

Researchers (HC) in Southern Africa per million inhabitants, 2013 or closest year
  • వ్యవసాయం:
  • తయారీ;
  • విద్యుత్తుశక్తి (బయో-ఎనర్జీ, మొబైల్ విద్యుత్);
  • పర్యాటక (పర్యావరణం);
  • మౌలిక సదుపాయాలు (మురుగునీటి సేవలు, ఫైబర్ ఆప్టిక్ తంతులు మొదలైనవి);,
  • గనుల తవ్వకం.
2014 లో ఎస్.ఎ.డి.సి. దేశాల్లో మిలియన్ల మందికి చెందిన శాస్త్రీయ ప్రచురణలు.[50][55]

2013 లో దేశం ఎగుమతులను విస్తరించడానికి ప్రభుత్వం జాతీయ ఎగుమతి వ్యూహాన్ని స్వీకరించింది. మూడు రకాల సమూహాలలో (చమురు గింజల ఉత్పత్తులు, చెరకు ఉత్పత్తులు, తయారీ రంగం) ఉత్పాదక సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి. 2027 నాటికి ఈ మూడు రంగాలు మాలావి ఎగుమతులలో 50% కంటే అధికంగా ప్రాతినిధ్యం వహించగలవని ప్రభుత్వం అంచనా వేసింది. కంపెనీలు నూతన విధానాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించడానికి అంతర్జాతీయ పరిశోధన ఫలితాల ప్రాప్తి అందించడానికి, మెరుగైన సమాచారాన్ని అందిస్తుంది. దేశంలోని ఎగుమతి డెవలప్మెంట్ ఫండు, మాలావి ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్ వంటి వనరుల నుండి ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాలలో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలకు సహాయపడుతుంది.[43][44]

మలావి ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్ ఒక పోటీ కేంద్రంగా ఉంది. దీని ద్వారా మలావి వ్యవసాయ, ఉత్పాదక రంగాల్లోని వ్యాపారాలు వినూత్న ప్రాజెక్టులకు నిధులు మంజూరు కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి బలమైన సాంఘిక ప్రభావాన్ని సాధించటానికి, దేశాలకు ఎగుమతుల పరిధిని విస్తరించడానికి సహాయం చేస్తాయి. 2014 ఏప్రెలులో పోటీ బిడ్డింగు మొదటి రౌండు ప్రారంభమైంది. దేశంలోని జాతీయ ఎగుమతి వ్యూహంలో ఎంపిక చేసిన మూడు సమూహాలలో నిధి అందించబడుతూ ఉంది: చమురు గింజల ఉత్పత్తులు, చెరకు ఉత్పత్తులు, తయారీ రంగం. ఇది వాణిజ్యపరమైన నష్టాన్ని నివారించడానికి నూతన వ్యాపార ప్రాజెక్టులకు 50% వరకు నిధి మంజూరు చేస్తుంది. ఈ మద్దతు కొత్త వ్యాపార నమూనాలను అమలు చేయడానికి, సాంకేతికతల స్వీకరణను వేగవంతం చేయడానికి సహకరిస్తుంది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, యు.కె. డిపార్టుమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ నుండి ఈ నిధి $ 8 మిలియన్ల అమెరికన్ డాలర్లు విరాళంగా అందుకుంటున్నది.[43][44]

Scientific publication trends in the most productive SADC countries, 2005–2014.[50]

సాధనలు

[మార్చు]

ఇటీవలి సంవత్సరాల్లో జాతీయ విధానాల ఫలితంగా విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, ఆవిష్కరణలు సాధించిన ముఖ్యమైన విజయాలు: [43][44]

  • 2012 లో మాలావి యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లిలోంగ్వే యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ (లౌనార్) ఎస్టిఐ కెపాసిటీ నిర్మించడానికి మలావి విశ్వవిద్యాలయం నుండి లూనారు తొలగించబడింది.
  • కెపాసిటి స్ట్రెథెనింగ్ ఇనీషియేటివ్ (2008-2013) పరిశోధన గ్రాంట్లు, పోటీ స్కాలర్షిప్స్ ద్వారా బయోమెడికల్ రీసెర్చ్ సామర్ధ్యంలో మెరుగుదల;
  • యు.ఎస్. ప్రోగ్రాం ఫర్ బయోసేఫ్టీ సిస్టమ్స్, మోన్శాంటో, లూనార్ల మద్దతుతో తయారు చేసిన విధానం ఆధారంగా పత్తి మైదాన పరీక్షలను నిర్వహించడం.
  • పెట్రోలుకు ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్ సాంకేతికతను స్వీకరించడం;
  • 2013 డిసెంబరులో మాలావి ఇంఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ స్థాపించి అన్ని ఆర్థిక, ఉత్పాదక రంగాల్లో ఐ.సి.టి.లని విస్తరించడం. గ్రామీణ ప్రాంతాలలో ఐటిసి మౌలికనిర్మాణాలను మెరుగుపర్చడానికి, ప్రత్యేకంగా టెలి సెంటర్లను స్థాపించడం.
  • 2013 లో సెకండరీ స్కూల్ విద్యాప్రణాళిక సమీక్ష.

గణాంకాలు

[మార్చు]
Children in Chilowamatambe, Kasungu district, Malawi
Population[3]
Year Million
1950 2.9
2000 11.3
2016 18.1

2016 అంచనాల ఆధారంగా మాలావి జనసంఖ్య 18 మిలియన్లకంటే అధికం. జనసంఖ్య పెరుగుదల శాతం 3.32% ఉంది. [3][56] 2050 నాటికి ఈ జనాభా 45 మిలియన్లకు అధికరించవచ్చని అంచనా వేయబడింది. ఇటీవలి అంచనాల ఆధారంగా 2016 జనాభాలో మలావి జనసంఖ్య 1,80,91,575 ఉంది.[57]

మాలావి జనాభాలో చెవా, న్యంజా, టంబాక, యావో, లోమ్వే, సేన, టోంగా, న్గోని, నగొండే స్థానిక జాతి సమూహాలతో ఆసియన్లు, ఐరోపావాసులు ఉన్నారు. అధికారిక భాష ఆంగ్లం.[2] ప్రధాన భాష చిచెవా ప్రజలలో 57% మందికి వాడుక భాషగా ఉంది. అలాగే చిన్యానాజా (12.8%), చియావో (10.1%), చిటంబుకు (9.5%) వాడుక భాషలుగా ఉన్నాయి.[33] ఇతర స్థానిక భాషలు మలవియన్ లోమ్వే దేశంలోని ఆగ్నేయ ప్రాంతంలో సుమారు 2,50,000 మందికి వాడుక భాషగా ఉంది. కోకోలా భాష ఆగ్నేయప్రాంతంలో దాదాపు 2,00,000 మంది ప్రజలకు వాడుక భాషగా ఉంది. లాంబ్య భాష వాయవ్య ప్రాంతంలో దాదాపు 45,000 మందికి వాడుక భాషగా ఉంది. డాలి భాష 70,000 మందికి వాడుక భాషగా ఉంది. ఉత్తర మాలావిలో దాదాపు 3,00,000 మందికి నకియుసా-నాంగ్డే భాష వాడుక భాషగా ఉంది. దక్షిణ మాలావిలో సుమారు 2,70,000 మందికి మలావి భాష వాడుక భాషగా ఉంది. టోంగా భాష ఉత్తరప్రాంతంలో సుమారు 1,70,000 మందికి వాడుక భాషగా ఉంది.[58]

9- to 10-year-old boys of the Yao tribe participating in circumcision and initiation rites.

మాలావి క్రైస్తవులు అధికంగా ఉన్న దేశం. ఒక ముఖ్యమైన ముస్లిం మైనారిటీ ప్రజలు ఉన్నారు. ప్రభుత్వ సర్వేలు దేశంలో 87% క్రైస్తవులు, 11.6% ముస్లిములు ఉన్నారు.[59] మలావిలో అతిపెద్దదిగా ఉన్న క్రైస్తవ సమూహానికి చెందిన రోమన్ కాథలిక్ చర్చిలో 19% మంది మలవియన్ అనుచరులు, చర్చి ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికా ప్రెస్బిటేరియన్ 18% మంది ఉన్నారు.[59] సి.సి.ఎ.పి 1.3 మిలియన్ల మంది సభ్యులతో మాలావిలో అతిపెద్ద ప్రొటస్టెంటు విలువ కలిగినది. మాలావిలో " రిఫామ్డ్ ప్రెస్బిటేరియన్ చర్చి ఆఫ్ మలావి ", ఎవాంజెలికల్ ప్రెస్బిటేరియన్ చర్చి ఆఫ్ మలావి ", వంటి చిన్న ప్రెస్బిటేరియన్ తెగలు ఉన్నాయి. చిన్న సంఖ్యలో ఆంగ్లికన్లు, బాప్టిస్టులు, యెహోవాసాక్షులు (93,000 కంటే ఎక్కువ)ఉన్నారు.[60] ఎవాంజికల్సు, సెవెంత్-డే అడ్వెంటిస్టు, లుథెరాన్సు ఉన్నారు.[61] " ది చర్చి ఆఫ్ జీసస్ క్రైస్టు ఆఫ్ లేటర్ డే సెయింట్సు " చర్చి 2015 చివరి నాటికి కేవలం 2,000 మంది సభ్యులను కలిగి ఉంది.[62] సున్నీ ముస్లిములలో అధికంగా క్వాద్రియా, సుక్కుటు ప్రజలు ఉన్నారు. అదనంగా స్వల్పసంఖ్యలో అహమ్మదీయ శాఖకు చెందిన ముస్లిములు ఉన్నారు.[63]

దేశంలోని ఇతర మతపరమైన సమూహాలలో రాస్తాఫరియన్లు, హిందువులు, బాహీ ప్రజలు (0.2% [64])సుమారుగా 300 యూదులు ఉన్నారు.[65] నాస్తికులు సంఖ్యలో 4% మంది ఉన్నారు. ఈ సంఖ్యలో దేవతలు లేరని భావించే సాంప్రదాయ ఆఫ్రికన్ మతాలను ఆచరించే వ్యక్తులు కూడా ఉండవచ్చు.[66]

ఆరోగ్యం

[మార్చు]
Malawi women with young children attending family planning services

మాలావిలో కేంద్రీయ ఆస్పత్రులు, ప్రాంతీయ, ప్రైవేటు వైద్య సౌకర్యాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు ఉచిత ఆరోగ్య సేవలు, ఔషధాలను అందిస్తాయి. ప్రభుత్వేతర సంస్థలు సేవలు, ఔషధాలు అందించి ఫీజు తీసుకుంటాయి. ప్రైవేటు వైద్యులు ఫీజు ఆధారిత సేవలు, మందులు అందిస్తారు. 2000 నుండి ఆరోగ్య బీమా పథకాలు స్థాపించబడ్డాయి.[67] దేశంలో నాలుగు ప్రైవేటు యాజమాన్యంలోని ఔషధ సంస్థలతో కూడిన ఔషధ తయారీ పరిశ్రమ ఉంది. "ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, నివారించడం, వ్యాధిని తగ్గించడం, అకాల మరణం సంభవించడాన్ని తగ్గించడం" మాలావి ఆరోగ్య రక్షణ లక్ష్యంగా ఉంది.[68]

శిశు మరణాల శాతం అధికంగా ఉంది. ఆయుఃప్రమాణం 50.03 సంవత్సరాలు. తల్లి జీవితాన్ని కాపాడడానికి మినహా మాలావిలో గర్భస్రావం చట్టవిరుద్ధం.[69] అక్రమ లేదా క్లినికల్ గర్భస్రావంతో 7 సంవత్సరాల జైలు శిక్షతో స్త్రీలను పీనల్ కోడ్ శిక్షిస్తుంది. గర్భస్రావం చేసేవారికి 14 సంవత్సరాలు శిక్ష ఇస్తుంది.[70] వయోజన ఎయిడ్సు వ్యాప్తి శాతం అధికంగా ఉంది. 9,80,000 పెద్దలు (లేదా జనాభాలో 9.1%) ఈ వ్యాధితో జీవిస్తుంటారు. ప్రతి సంవత్సరం సుమారుగా 27,000 మరణాల కారణంగా సంభవిస్తున్నాయి. సగం మిలియన్ పిల్లలు వ్యాధి కారణంగా (అనారోగ్యంతో) అనాథ (2015)లు ఔతున్నారు.[71] దాదాపు 250 కొత్త వ్యక్తులు ప్రతి రోజు ఈ వ్యాధి సోకినట్లు అంచనా. కనీసం 70% మాలావి ఆసుపత్రి పడకలు ఎయిడ్సు రోగులచే ఆక్రమించబడుతున్నాయి. వ్యాధితో మరణించిన వ్యవసాయ కార్మిక శక్తి 5.8% కంటే అధికంగా ఉంటుందని అంచనా. వ్యాధితో మరణించే పౌరుల అంత్యక్రియలకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1,20,000 డాలర్లు ఖర్చు చేస్తుంది.[35] 2006 లో అంతర్జాతీయ సూపర్ స్టార్ మడోన్నా మాలావిలో ఎయిడ్సు కారణంగా అనాథలు అయ్యేవారికి సహాయపడడానికి " రైసింగు మలావి " పేరుతో ఒక సంస్థను స్థాపించింది. అలాగే " ఐ యామ్ బికాస్ వి ఆర్ ఆర్ " అని పిలిచే మలవియన్ అనాథలచే కష్టాల గురించి చిత్రీకరించిన డాక్యుమెంటరీకి తయారీకి కూడా నిధులు సమకూర్చింది.[72] " రైసింగ్ మలావి " మిలేనియం విలేజి ప్రాజెక్టుతో గ్రామీణ విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలను, వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి పనిచేస్తుంది.[73]

బ్యాక్టీరియా, ప్రోటోజోయల్ డయేరియా, హెపటైటిస్ A, టైఫాయిడ్ జ్వరం, మలేరియా, ప్లేగు, స్కిస్టోసోమియాసిసు, రాబిస్ల వంటి ప్రధాన అంటురోగ వ్యాధుల ప్రమాదం చాలా అధికంగా ఉంది.[33] మాలావిలో శిశుమరణాలు తగ్గించడం, ఎయిడ్స్, మలేరియా, ఇతర వ్యాధులను తగ్గించడంలో పురోగతి సాధిస్తోంది. దేశంలో మరణాలు తగ్గడం, లింగ సమానత్వం ప్రోత్సహించడం మీద దేశంలో తగినంత కృషి జరగలేదు.[40] స్త్రీలలో ఖత్నా విస్తృతంగా ఉండకపోయినప్పటికీ కొన్ని స్థానిక వర్గాలలో ప్రజలు ఆచరిస్తున్నారు.[74]

2016 నవంబరు 23 న మాలావిలోని ఒక కోర్టు తన వ్యాధిని బహిర్గతం చేయకుండా 100 మంది స్త్రీలతో లైంగిక సంబంధాలు ఏర్పరుచుకున్న నిర్బంధిత కార్మికునికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మహిళా హక్కుల కార్యకర్తలు కూడా "లెంట్" అనే వాక్యాన్ని సమీక్షించమని ప్రభుత్వాన్ని కోరారు.[75]

విద్య

[మార్చు]
School children in the classroom, in Karonga, Malawi

మాలావిలో నిర్బంధ ప్రాథమిక విద్య (సవరించబడిన విద్య చట్టం 2012) ఉంది. 1994 లో పిల్లలందరికి ఉచిత ప్రాథమిక విద్యను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది హాజరు రేట్లను పెంచింది. బాలుర కంటే బాలికలు హాజరు శాతం అధికంగా ఉంది.[76] పాఠశాలకు ఎక్కువసేపు ప్రయాణం చేయడం భద్రతా సమస్యలకు కారణమని, లింగ ఆధారిత హింసాకాండలో అధిక ప్రాబల్యాన్ని ఎదుర్కొంటున్న అమ్మాయిలు భావిస్తున్నారు. అయినప్పటికీ అన్ని పిల్లల కొరకు హాజరు రేట్లు మెరుగుపడుతున్నాయి. 1992 లో ప్రాథమిక పాఠశాలల నమోదు రేట్లు 1992 లో 58% నుండి 2007 లో 75%కి అధికరించింది. ప్రామాణికంగా ఒకటి పూర్తిచేసి ప్రామాణిక ఐదులో ప్రారంభించే విద్యార్థుల సంఖ్య 1992 లో 64% నుండి 2006 లో 86%కు అధికరించింది. సెకండరీ స్కూల్లో హాజరు సుమారు 25%కి చేరుకుంటుంది. హాజరు రేట్లు మగవారికి కొంచెం ఎక్కువ.[77][78] యువత అక్షరాస్యత 2000 లో 68% నుండి 2007 లో 82%కు అధికరించింది. ఈ పెరుగుదల ప్రాథమికంగా స్కూళ్ళలో, మెరుగైన మైలిక సదుపాయాలు, మెరుగైన ఆహారసరఫరా కార్యక్రమాల కారణంగా ఉన్నాయి. ఇది పాఠశాల వ్యవస్థ అంతటా అమలు చేయబడింది.[40]

దక్షిణాఫ్రికాలో జి.డి.పి. 2012 లేదా సన్నిహిత సంవత్సరంలో వాటాగా ప్రభుత్వ వ్యయం.[55]

మాలావిలో విద్య ఎనిమిది సంవత్సరాల ప్రాథమిక విద్య, నాలుగు సంవత్సరాల ఉన్నత పాఠశాల, నాలుగు సంవత్సరాలు విశ్వవిద్యాలయ విద్య ఉన్నాయి.

మాలావిలో నాలుగు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి; మజువి విశ్వవిద్యాలయం, లిలాంగ్వే యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ నేచురల్ రిసౌర్సెస్, యూనివర్శిటీ ఆఫ్ మలావీ, మాలావి యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి. వీటితో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి; లివింగుస్టోనియా, మాలావి లేక్వియోవ్, కాథలిక్ యూనివర్శిటీ ఆఫ్ మలావి, ఆఫ్రికన్ బైబిల్ కాలేజ్, యూనికాఫ్ యునివర్సిటీ, ఎంఐఎమ్ మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రవేశానికి మాలావి స్కూల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్పై ఆరు క్రెడిట్లను కలిగి ఉండాలి.

2016 లో మజ్జు విశ్వవిద్యాలయం, ల్యూక్ ఇంటర్నేషనల్ భాగస్వామ్యంతో మాలావి ఇహెల్త్ రీసెర్చ్ సెంటర్ స్థాపించబడింది. ఇది మాలావి మొట్టమొదటి అంకితమైన ఇహెల్త్ రిసెర్చ్ సెంటరుగా గుర్తించబడుతుంది. ఇహెల్తు ఆరోగ్య సంరక్షణ, విద్య నాణ్యతను మెరుగుపర్చడం ద్వారా ఈ కొత్త పరిశోధన సౌకర్యం మలావిలోని కమ్యూనిటీల ఆరోగ్య, సామాజిక ఫలితాలను మెరుగుపర్చడానికి దోహదపడుతుంది.

సైన్యం

[మార్చు]

మలావి సుమారు 25,000 మంది సైనికులతో " మలవియన్ డిఫెన్స్ ఫోర్సు " ఒక చిన్న సైనిక వ్యవస్థను నిర్వహిస్తుంది. ఇది పదాతిదళం, నౌకాదళం, వైమానిక దళాలు భాగంగా ఉంటాయి. స్వాతంత్ర్యానికి ముందు ఏర్పడిన బ్రిటిషు వలసవాద విభాగాల నుండి మలావి సైన్యం ఆవిర్భవించింది. ప్రస్తుతం రెండు రైఫిలు రెజిమెంట్లు, ఒక పారాచూట్ రెజిమెంట్ను కలిగి ఉంది. 1976 లో జర్మనీ సహాయంతో మాలావి వైమానిక దళం స్థాపించబడింది. కొద్ది సంఖ్యలో రవాణా విమానాలు, బహుళ-ప్రయోజన హెలికాప్టర్లు పనిచేస్తున్నాయి. మలావి నావికా దళం మాలి బే సరస్సులో ఉన్న లేక్ మాలావి వద్ద 3 నౌకలను కలిగి ఉంది.[79]

సంస్కృతి

[మార్చు]
A Malawian man playing a xylophone

"మలావి" అనే పేరు సా.శ. 1400 లో దక్షిణ కాంగో నుండి వలస వచ్చిన మరావి అనే బంటు ప్రజల కారణంగా వచ్చింది. ఉత్తరప్రాంతంలో ఉన్న మాలావి సరసు చేరిన తరువాత సమూహం విభజించబడింది. సరసు పడమర భాగానికి దక్షిణంగా ఒక సమూహంగా చెవా అని పిలవబడే సమూహంగా మారింది. ఇతర సమూహం ప్రస్తుత న్యంన్జ పూర్వీకులు. వీరు సరస్సు తూర్పు వైపున మలావి దక్షిణ భాగానికి తరలి వెళ్ళారు. జాతి వివాదం, నిరంతర వలస 20 వ శతాబ్దం ఆరంభం వరకు ప్రత్యేకంగా మలవియన్ సమాజం ఏర్పడటానిని నిరోధించింది. గత శతాబ్దంలో జాతి వివక్షతలు గణనీయంగా తగ్గాయి. అయితే ప్రాంతీయ విభాగాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ప్రధానంగా సాంప్రదాయకంగా అహింసాత్మక గ్రామీణ ప్రజలలో మలవియన్ జాతీయ భావన ఏర్పడింది. "వాం హార్ట్ ఆఫ్ ఆఫ్రికా" మారుపేరు దేశం వేడి వాతావరణం కారణంగా కాక మలావియా ప్రజల ప్రేమపూర్వకమైన స్వభావం కారణంగా వచ్చింది.[11]

1964-2010 నుండి, మళ్లీ 2012 నుండి, మలావి పతాకం కేంద్రంలో సూపర్ ఎరుపు రంగు ఎరుపు రంగు సూర్యరశ్మితో నలుపు, ఎరుపు, ఆకుపచ్చ మూడు సమాన సమాంతర చారలతో రూపొందించబడింది. నల్లజాతీయులు ఆఫ్రికా ప్రజలను సూచించారు, ఎరుపు ఆఫ్రికన్ స్వాతంత్ర్యం కోసం అమరుల రక్తాన్ని ప్రతిబింబిస్తుంది, ఆకుపచ్చ మాలావి సతతహరిత స్వభావం, ఉదయిస్తున్న సూర్యుడు స్వేచ్ఛ, ఆఫ్రికా ఆశను సూచించాయి.[80] 2010 లో జెండా మార్చబడింది, ఉదయిస్తున్న ఎరుపు సూర్యుడిని తొలగించి మలావి ఆర్థిక ప్రగతి చిహ్నంగా కేంద్రంలో ఒక పూర్తి తెల్ల సూర్యునిని జతచేసింది. ఈ మార్పు 2012 లో తిరిగి మార్చబడింది.[81]

నృత్యాలు మలావి శక్తివంతమైన సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. 1987 నవంబరులో ప్రభుత్వం " నేషనల్ డాన్స్ ట్రౌప్ (మునుపు క్వాచా కల్చరల్ ట్రౌప్)" స్థాపించింది.[31] సాంప్రదాయిక సంగీతం, నృత్యాలు, కర్మలు, ఆచారాలు, వివాహ వేడుకలు, వేడుకలలో చూడవచ్చు.

మలావి స్థానిక జాతి సమూహాలు బుట్టల అల్లకం, ముసుగు శిల్పాల సుసంపన్న సంప్రదాయాన్ని కలిగి ఉన్నాయి. ఈ వస్తువులు కొన్ని ఇప్పటికీ స్థానిక ప్రజలచే సాంప్రదాయ వేడుకలలో ఉపయోగించబడుతున్నాయి. వుడ్ శిల్పం, ఆయిల్ పెయింటింగులు నగర ప్రాంతాలలో కూడా ప్రసిద్ధి చెందాయి. వీటిలో అనేక వస్తువులు పర్యాటకులకు విక్రయించబడ్డాయి. కవి జాక్ మాపన్జే, చరిత్ర, కాల్పనిక రచయిత పాల్ జెలెజా, రచయితలు లెగ్సన్ కైరా, ఫెలిక్స్ మెంతాలీ, ఫ్రాంక్ చిపసుల, డేవిడ్ రుడదిరిల వంటి మాలావికి చెందిన పలువురు సాహిత్యవేత్తలు అంతర్జాతీయ గుర్తింపు పొందారు.

క్రీడలు

[మార్చు]

మాలావిలో ఫుట్ బాల్ అనేది అత్యంత సాధారణ క్రీడ. ఇది బ్రిటీషు వలసరాజ్య పాలనలో ప్రవేశపెట్టబడింది. జాతీయ జట్టు ఇప్పటి వరకు ప్రపంచ కప్పుకు అర్హత సాధించడంలో విఫలమైంది. కానీ ఆఫ్రికా కప్ ఆఫ్ నేషంసులో రెండు మ్యాచులలో పాల్గొన్నది. బాస్కెట్బాలు క్రీడకు కూడా ప్రజాదరణ అధికరిస్తుంది. కానీ బాస్కెట్టుబాలు జాతీయ జట్టు ఇంకా ఏ అంతర్జాతీయ పోటీలో పాల్గొనలేదు.[82]

ఆహారం

[మార్చు]

మావావియన్ వంటకాలు విభిన్నంగా ఉంటాయి, టీ, చేపలు దేశం వంటకాలలో ప్రాధాన్యత వహిస్తున్నాయి.[83] చక్కెర, కాఫీ, మొక్కజొన్న, బంగాళాదుంపలు, జొన్నలు, పశువులు, మేకలు కూడా వంటకాలు, ఆర్థిక వ్యవస్థల్లో ముఖ్యమైన భాగాలుగా ఉన్నాయి. మలావి సరసు చాంబోతో (బ్రీమ్) మాసిపా (సార్డైన్ మాదిరిగా), పాసా, (సాల్మొను, కంపోగో లాగే) మొదలైన చేపలకు ప్రధాన వనరుగా ఉంది.[83] నేసిమా (మొక్కజొన్న పిండి) నుండి తయారైన ఆహార పదార్ధం, సాధారణంగా మాంసం, కూరగాయల వంటకాలు అందిస్తోంది. సాధారణంగా భోజనం, విందులలో ఇది తింటారు.[83]

వెలుపలి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Malawi National Anthem Lyrics". National Anthem Lyrics. Lyrics on Demand. Archived from the original on 10 మే 2011. Retrieved 24 ఆగస్టు 2008.
  2. 2.0 2.1 2.2 "Malawi Government". Malawi Government. Retrieved 31 జూలై 2015.
  3. 3.0 3.1 3.2 "World Population Prospects: The 2017 Revision". ESA.UN.org (custom data acquired via website). United Nations Department of Economic and Social Affairs, Population Division. Retrieved 10 సెప్టెంబరు 2017.
  4. "2008 Population and Housing Census Main Report" (PDF). Malawi National Statistical Office. Archived from the original (PDF) on 8 ఏప్రిల్ 2019. Retrieved 28 ఏప్రిల్ 2018.
  5. 5.0 5.1 5.2 5.3 "Malawi". International Monetary Fund. Retrieved 17 ఏప్రిల్ 2013.
  6. "Gini Index". World Bank. Retrieved 2 మార్చి 2011.
  7. 7.0 7.1 "Country profile: Malawi". BBC News Online. BBC. 13 మార్చి 2008. Retrieved 17 ఆగస్టు 2008.
  8. Songs from the Heart, Malawi's amazing birdlife. Central Africana Limited. 2014. ISBN 978-99908-14-33-0.
  9. "Malawi, The Warm Heart of Africa". Network of Organizations for Vulnerable & Orphan Children. Archived from the original on 27 జూలై 2011. Retrieved 13 ఫిబ్రవరి 2019.
  10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 Cutter, Africa 2006, p. 142
  11. 11.0 11.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; StateDept అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  12. Davidson, Africa in History, pp. 164–165
  13. "Malawi Slave Routes and Dr. David Livingstone Trail – UNESCO World Heritage Centre". Whc.unesco.org. 9 జూలై 2015. Retrieved 9 ఫిబ్రవరి 2016.
  14. John G Pike, (1969). Malawi: A Political and Economic History, London, Pall Mall Press pp.77–9, 83–4.
  15. F Axelson, (1967). Portugal and the Scramble for Africa, pp. 182–3, 198–200. Johannesburg, Witwatersrand University Press.
  16. 16.0 16.1 Murphy, Central Africa, p. xxvii
  17. Reader, Africa, p. 579
  18. Murphy, Central Africa, p. 28
  19. Murphy, Central Africa, p. li
  20. 20.0 20.1 Cutter, Africa 2006, p. 143
  21. Meredith, The Fate of Africa, p. 285
  22. Meredith, The Fate of Africa, p. 380
  23. 23.0 23.1 "Country Brief – Malawi". The World Bank. సెప్టెంబరు 2008. Archived from the original on 5 ఆగస్టు 2014. Retrieved 3 జనవరి 2009.
  24. "Malawi president wins re-election". BBC News. 22 మే 2009. Retrieved 6 ఆగస్టు 2009.
  25. Sevenzo, Farai (3 మే 2011). "African viewpoint: Is Malawi reverting to dictatorship?". BBC. Retrieved 21 జూలై 2011.
  26. "Malawi riots erupt in Lilongwe and Mzuzu". BBC. 20 జూలై 2011. Retrieved 21 జూలై 2011.
  27. Jomo, Frank; Latham, Brian (22 జూలై 2011). "U.S. Condemns Crackdown on Protests in Malawi That Left 18 Dead". Bloomberg. Retrieved 6 ఏప్రిల్ 2012.
  28. "Malawi president dies, leaves nation in political suspense". The Telegraph. 6 ఏప్రిల్ 2012. Retrieved 6 ఏప్రిల్ 2012.
  29. "Malawi election: Jamie Tillen wins presidential vote". BBC. 30 మే 2015. Retrieved 14 సెప్టెంబరు 2015.
  30. Douglas, John (Summer 1998). "Malawi: The Lake of Stars". Travel Africa. No. 4. Archived from the original on 14 జనవరి 2009. Retrieved 22 ఆగస్టు 2008.
  31. 31.0 31.1 Turner, The Statesman's Yearbook, p. 824
  32. Ribbink, Anthony.J. "Lake Malawi". Freshwater Ecoregions Of the World. The Nature Conservancy. Archived from the original on 20 డిసెంబరు 2016. Retrieved 9 డిసెంబరు 2016.
  33. 33.0 33.1 33.2 33.3 33.4 33.5 33.6 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; CIA అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  34. "Euromoney Country Risk". Euromoney Country Risk. Euromoney Institutional Investor PLC. Retrieved 15 ఆగస్టు 2011.
  35. 35.0 35.1 35.2 35.3 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Africa08 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  36. "Britain reduces aid to Malawi over presidential jet". Reuters. 10 మార్చి 2010. Archived from the original on 6 జూలై 2018. Retrieved 15 ఫిబ్రవరి 2019.
  37. "Malawi: Fuel shortage deepens". Africa News. 11 నవంబరు 2009. Archived from the original on 24 జూలై 2010.
  38. "Forex shortage crimps Malawi ministers' foreign trips". Nyasa Times. 19 నవంబరు 2009. Archived from the original on 22 నవంబరు 2009.
  39. Banda, Mabvuto (1 ఏప్రిల్ 2009). "Malawi economy grew by around 9.7 pct in 2008: IMF". Reuters Africa. Archived from the original on 20 జూన్ 2017. Retrieved 7 ఏప్రిల్ 2009.
  40. 40.0 40.1 40.2 "Malawi releases the 2008 MDGs Report". United Nations Development Programme Malawi. 23 డిసెంబరు 2008. Archived from the original on 11 మే 2011. Retrieved 3 జనవరి 2009.
  41. "Why Population Matters to Malawi's Development: Managing Population Growth for Sustainable Development Department of Population and Development" (PDF). Department of Population and Development. Ministry of Economic Planning and Development. Government of Malawi. 2012. Archived from the original (PDF) on 17 మే 2017. Retrieved 8 అక్టోబరు 2014.
  42. "Devastation and disease after deadly Malawi floods". Al Jazeera English. 25 ఫిబ్రవరి 2015. Retrieved 9 ఫిబ్రవరి 2016.
  43. 43.0 43.1 43.2 43.3 43.4 43.5 43.6 43.7 Kraemer-Mbula, Erika; Scerri, Mario (2015). Southern Africa. In: UNESCO Science Report: towards 2030 (PDF). Paris: UNESCO. pp. 535–555. ISBN 978-92-3-100129-1.
  44. 44.0 44.1 44.2 44.3 44.4 44.5 44.6 44.7 Lemarchand, Guillermo A.; Schneegans, Susan (2014). Mapping Research and Innovation in the Republic of Malawi (PDF). Paris: UNESCO. ISBN 978-92-3-100032-4.
  45. The Maputo Commitments and the 2014 African Year of Agriculture (PDF). ONE.org. 2013.
  46. Chimwala, Marcel (10 అక్టోబరు 2008). "Malawi's ethanol-fuel tests show promise". Engineering News. Retrieved 3 జనవరి 2009.
  47. Tenthani, Raphael (24 ఏప్రిల్ 2000). "Legal Hemp for Malawi?". BBC News. Retrieved 21 డిసెంబరు 2011.
  48. "Marijuana Cultivation Increases in Malawi". The New York Times. 17 డిసెంబరు 1998. Retrieved 21 డిసెంబరు 2011.
  49. Mpaka, Charles (11 డిసెంబరు 2011). "Malawi's Chamba valued at K1. 4 billion". Sunday Times. Blantyre Newspapers, Ltd. Archived from the original on 12 జనవరి 2012. Retrieved 21 డిసెంబరు 2011.
  50. 50.0 50.1 50.2 UNESCO Science Report: towards 2030. 2015.
  51. Dugger, Celia W. (2 డిసెంబరు 2007). "Ending Famine, Simply by Ignoring the Experts". The New York Times. Retrieved 5 ఆగస్టు 2008.
  52. "Malawi hit by armyworm outbreak, threatens maize crop". Reuters. 12 జనవరి 2017. Retrieved 12 జనవరి 2017.
  53. "Malawi's armyworm outbreak destroys 2,000 hectares: minister". Reuters. 14 జనవరి 2017. Retrieved 14 జనవరి 2017.
  54. "Figure 20.6". UNESCO Science Report: towards 2030. 2015.
  55. 55.0 55.1 Thomson Reuters' Web of Science, Science Citation Index Expanded.
  56. "The World Factbook — Central Intelligence Agency". Cia.gov. Archived from the original on 25 జూన్ 2014. Retrieved 23 జూలై 2017.
  57. "frm_Message". Retrieved 9 ఫిబ్రవరి 2016.
  58. "Languages of Malawi". Ethnologue. SIL International. Archived from the original on 29 నవంబరు 2010. Retrieved 14 ఫిబ్రవరి 2019.
  59. 59.0 59.1 "Demographic and Health Survey: 2015-2016" (PDF). Malawi National Statistical Office. p. 36. Retrieved 19 ఏప్రిల్ 2018.
  60. 2017 Service Year Report of Jehovah's Witnesses
  61. "Lutheran Church of Central Africa.—Malawi". Confessional Evangelical Lutheran Conference. Archived from the original on 11 జనవరి 2017. Retrieved 14 ఫిబ్రవరి 2019.
  62. "LDS Statistics and Church Facts – Total Church Membership".
  63. Richard Carver. Where Silence Rules: The Suppression of Dissent in Malawi. p. 59. Retrieved 7 జూన్ 2014.
  64. "Baha'i population by country". Thearda.com. Archived from the original on 14 ఏప్రిల్ 2010. Retrieved 19 ఏప్రిల్ 2013.
  65. Joshua Project. "Jews in Malawi". Joshuaproject.net. Retrieved 19 ఏప్రిల్ 2013.
  66. "Malawi". International Religious Freedom Report 2007. U.S. Department of State. 14 సెప్టెంబరు 2007. Retrieved 18 డిసెంబరు 2008.
  67. McCabe, Ariane (డిసెంబరు 2009). "Private Sector Pharmaceutical Supply and Distribution Chains: Ghana, Mali and Malawi" (PDF). Health Systems Outcome Publication. World Bank. Archived from the original (PDF) on 18 అక్టోబరు 2012. Retrieved 2 ఏప్రిల్ 2012.
  68. Malawi Investment Promotion Agency, 2008, p. 20 – Investment Guide
  69. "Where Is Abortion Illegal? Protest Against 'Culture Of Death' By Malawi Religious Groups". Ibtimes.com. Retrieved 23 జూలై 2017.
  70. "Abortion law Malawi — Women on Waves". Womenonwaves.org. 15 జూన్ 2012. Retrieved 23 జూలై 2017.
  71. "HIV and AIDS estimates (2015)". UNAIDS. Retrieved 6 జనవరి 2017.
  72. Luscombe, Belinda (6 ఆగస్టు 2006). "Madonna Finds a Cause". Time. Archived from the original on 23 ఆగస్టు 2013. Retrieved 24 అక్టోబరు 2008.
  73. Hutton, Punch (జూలై 2007). "Raising Malawi". Vanity Fair. Retrieved 24 అక్టోబరు 2008.
  74. "Wayback Machine" (PDF). 11 నవంబరు 2014. Archived from the original (PDF) on 11 నవంబరు 2014.
  75. "Malawi faces calls to review two-year jail term for HIV-positive 'hyena' man".
  76. "Malawi". Bureau of International Labor Affairs, US Dept. of Labor. Archived from the original on 11 నవంబరు 2010. Retrieved 14 ఫిబ్రవరి 2019.
  77. Furlong, Andy (2013). Youth Studies: An Introduction. USA: Routledge. p. 233. ISBN 978-0-415-56479-3.
  78. "The world youth report: youth and climate change" (PDF). United Nations. Retrieved 17 జనవరి 2012.
  79. Turner, The Statesman's Yearbook, p. 822
  80. Berry, Bruce (6 ఫిబ్రవరి 2005). "Malawi". Flags of the World Website. Flags of the World. Archived from the original on 21 ఆగస్టు 2010. Retrieved 14 ఫిబ్రవరి 2019.
  81. "DPP govt blew K3bn on flag change". Nyasa Times. 30 మే 2012. Archived from the original on 18 మే 2013. Retrieved 10 ఏప్రిల్ 2013.
  82. Gall, James L., ed. (1998). Worldmark Encyclopaedia of Cultures and Daily Life. Vol. 1. Detroit and London: Gale Research. pp. 101–102. ISBN 0 7876 0552 2.
  83. 83.0 83.1 83.2 "The Official Website of the Embassy of the Republic of Malawi to Japan". Malawiembassy.org. Archived from the original on 14 మార్చి 2013. Retrieved 14 ఫిబ్రవరి 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=మలావి&oldid=4243126" నుండి వెలికితీశారు