Jump to content

రోడియం

వికీపీడియా నుండి
(Rhodium నుండి దారిమార్పు చెందింది)
రోడియం, 00Rh
రోడియం
Pronunciation/ˈrdiəm/ (ROH-dee-əm)
Appearancesilvery white metallic
Standard atomic weight Ar°(Rh)
రోడియం in the periodic table
Groupgroup 9
Periodperiod 5
Block 
Electrons per shell2, 8, 18, 16, 1
Physical properties
Phase at STPsolid
Melting point2237 K ​(1964 °C, ​3567 °F)
Boiling point3968 K ​(3695 °C, ​6683 °F)
Density (near r.t.)12.41 g/cm3
when liquid (at m.p.)10.7 g/cm3
Heat of fusion26.59 kJ/mol
Heat of vaporization494 kJ/mol
Molar heat capacity24.98 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 2288 2496 2749 3063 3405 3997
Atomic properties
Oxidation states−3[3], −1, 0, +1,[4] +2, +3, +4, +5, +6, +7[5] (an amphoteric oxide)
ElectronegativityPauling scale: 2.28
Atomic radiusempirical: 134 pm
Covalent radius142±7 pm
Other properties
Natural occurrenceprimordial
Crystal structureface-centered cubic (fcc)
Face-centered cubic crystal structure for రోడియం
Speed of sound thin rod4700 m/s (at 20 °C)
Thermal expansion8.2 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity150 W/(m⋅K)
Electrical resistivity43.3 n Ω⋅m (at 0 °C)
Magnetic orderingparamagnetic[6]
Young's modulus380 GPa
Shear modulus150 GPa
Bulk modulus275 GPa
Poisson ratio0.26
Mohs hardness6.0
Vickers hardness1246 MPa
Brinell hardness1100 MPa
CAS Number7440-16-6
History
DiscoveryWilliam Hyde Wollaston (1804)
First isolationWilliam Hyde Wollaston (1804)
Isotopes of రోడియం
Template:infobox రోడియం isotopes does not exist
 Category: రోడియం
| references

రోడియం కూడా రుథీనియం లాంటి రసాయన మూలకమే. దీని రసాయన హ్రస్వనామం Rh. దీని అణు సంఖ్య 45; అనగా దీని అణు కేంద్రకంలో 45 ప్రోటానులు ఉంటాయి. ఇది ఆవర్తన పట్టికలో 9వ నిలువు వరుస (గ్రూప్‌) లో కనిపిస్తుంది. రోడియం ఇరుగు పొరుగు గదులలో రుథీనియం (Ru), పెల్లేడియం (Pd), ఓస్మియం (Os), ఇరిడియం (Ir), ప్లేటినం (Pt) ఉన్నాయి కనుక ఈలోహాల లక్షణాలలో పోలికలు బాగా కనిపిస్తాయి.

రోడియంకి ఉన్న ఒకే ఒక సమస్థాని (isotope) ఉంది: 103Rh. విలియం ఓల్స్‌టన్‌ (en:William Hyde Wollaston) ఈ మూలకాన్ని 1804 లో కనుక్కున్నారు.

గ్రీకు భాషలో రోడియం అంటే ఎరుపు లేదా గులాబి రంగు అనే అర్థం ఉంది. రోడియం లవజనులతో కలవగా వచ్చిన లవణాలు ఇలాంటి ఎరుపు రంగులో ఉంటాయి కనుక ఈ పేరు వచ్చింది కాని, రోడియం చూడడానికి వెండిలా ఉంటుంది. ఈ మూలకం పెల్లేడియం దొరికే ఖనిజపు రాళ్లల్లోనే, కల్తీ సరుకులా, స్వల్పమైన పాళ్లల్లో దొరుకుతుంది. సాలీనా దీని ఉత్పాదన 20 టన్నులకి మించదు. ఇది అపురూపమైన (precious) లోహాలన్నిటిలోకి ఎక్కువ విలువైనది. ఇది బంగారం కంటే రెట్టింపు ఖరీదు ఖరీదులో ఉంటుంది. అంతే కాకుండా ఈ లోహం ఉదాత్తమైన (noble) లోహం; అనగా, తుప్పు పట్టదు, గాఢ నత్రిక ఆమ్లంలో కరగదు. కానీ రోడియం గాఢ నత్రిక ఆమ్లం, ఉహహరికామ్లం కలవగా వచ్చిన "ఏక్వా రీజియా"లో నెమ్మదిగా కరుగుతుంది (అనగా, ఎలక్ట్రానులను పోగొట్టుకుంటుంది).

ఉపయోగాలు

[మార్చు]
  • కొన్ని రకాల రసాయన సంయోగాలని త్వరితపరచడానికి దీనిని ఉత్ప్రేరకి catalystగా ఉపయోగిస్తారు.
  • కారులు విసర్జించే అపాన వాయువులలో ఉన్న కల్మషాలని కడిగి శుభ్రం చెయ్యడానికి వాడే "కెటాలిటిక్‌ కన్వర్టర్‌" లలో దీనిని ఎక్కువ వాడుతున్నారు. ఇందువల్ల రోడ్డు మీద ఉన్న ధూళిలో స్వల్ప మోతాదులో రోడియం రేణువులు కూడా ఉంటాయి. అందుకని రోడ్లని తుడిచిన మట్టిని పారవేయకుండా అందులోంచి రోడియంని తిరిగి రాబట్టవచ్చు.
  • పలచటి రేకులా చేసి ఎక్సు-కిరణాలని గలనం చెయ్యడానికి రోడియంని ఉపయోగిస్తారు.
  • గుండె సరిగ్గా కొట్టుకోకపోతే హృదయ స్పందనని క్రమబద్ధం చెయ్యడానికి వాడే "పేస్ మేకర్" లలో వాడే సన్నని తీగని చెయ్యడానికి కూడా రోడియంని ఉపయోగిస్తారు.
  • కొన్ని లోహాలు తుప్పు పట్టకుండా ఉండడానికి పైపూతగా వాడే మలామాని తయారు చెయ్యడానికి కూడా రోడియంని వాడతారు. వెండితో చేసిన ఆభరణాలు, భోజన సామగ్రి కిల్లుం పట్టినట్లు నల్లబడిపోకుండా ఉండడానికి రోడియంతో పైపూత పూస్తారు.
  • అణుశక్తి ఉత్పాదక కేంద్రాలలో నూట్రాన్ అభిప్రవాహాల (flux) మట్టాన్ని పసికట్టడానికి వాడే పత్తాసుల (detectors) నిర్మాణంలో కూడా దీనికి ఉపయోగం ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Standard Atomic Weights: Rhodium". CIAAW. 2017.
  2. Prohaska, Thomas; Irrgeher, Johanna; Benefield, Jacqueline; et al. (2022-05-04). "Standard atomic weights of the elements 2021 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry (in ఇంగ్లీష్). doi:10.1515/pac-2019-0603. ISSN 1365-3075.
  3. Ellis J E. Highly Reduced Metal Carbonyl Anions: Synthesis, Characterization, and Chemical Properties. Adv. Organomet. Chem, 1990, 31: 1-51.
  4. "Rhodium: rhodium(I) fluoride compound data". OpenMOPAC.net. Retrieved 2007-12-10.
  5. Rh(VII) is known in the RhO3+ cation, see Da Silva Santos, Mayara; Stüker, Tony; Flach, Max; Ablyasova, Olesya S.; Timm, Martin; von Issendorff, Bernd; Hirsch, Konstantin; Zamudio‐Bayer, Vicente; Riedel, Sebastian; Lau, J. Tobias (2022). "The Highest Oxidation State of Rhodium: Rhodium(VII) in [RhO3]+". Angew. Chem. Int. Ed. 61 (38): e202207688. doi:10.1002/anie.202207688. PMC 9544489. PMID 35818987.{{cite journal}}: CS1 maint: article number as page number (link)
  6. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Handbook of Chemistry and Physics 81st edition, CRC press.
  7. "Rhodium: rhodium(I) fluoride compound data". OpenMOPAC.net. Retrieved 2007-12-10.

ఉపయుక్త ఆధారాలు

[మార్చు]

వేమూరి నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు)

"https://te.wikipedia.org/w/index.php?title=రోడియం&oldid=4095017" నుండి వెలికితీశారు