ఐన్‌స్టయినియం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరైన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
| ఐన్‌స్టీనియం | |
|---|---|
| Pronunciation | /aɪnˈstaɪniəm/ |
| Appearance | silver-colored |
| ఐన్‌స్టీనియం in the periodic table | |
| Group | f-block groups (no number) |
| Period | period 7 |
| Block | |
| Electrons per shell | 2, 8, 18, 32, 29, 8, 2 |
| Physical properties | |
| Phase at STP | solid |
| Melting point | 1133 K (860 °C, 1580 °F) |
| Boiling point | (estimated) 1269 K (996 °C, 1825 °F) |
| Density (near r.t.) | 8.84 g/cm3 |
| Atomic properties | |
| Oxidation states | +2, +3, +4 |
| Electronegativity | Pauling scale: 1.3 |
| Other properties | |
| Natural occurrence | synthetic |
| Crystal structure | face-centered cubic (fcc) |
| Magnetic ordering | paramagnetic |
| CAS Number | 7429-92-7 |
| History | |
| Discovery | Lawrence Berkeley National Laboratory (1952) |
| Isotopes of ఐన్‌స్టీనియం | |
| Template:infobox ఐన్‌స్టీనియం isotopes does not exist | |
ఈ రసాయన మూలకం పేరుని జెర్మనీ భాషలో ఉచ్చరిస్తే ఐన్‌ష్టయినియం అని పలకాలి. ఇంగ్లీషులో ష కారానికి బదులు స కారం వాడుతారు. కనుక తెలుగులో ఐన్‌స్టయినియం అంటే బాగుంటుంది. ఐ తరువార పూర్నానుస్వారం పెట్టి తరువాత స, ట, ఐ కలిపి ఒకే అక్ష్రరంగా రాయడంలో సదుపాయం లేదు.
ఐన్‌స్టయినియం (Einsteinium) ఒక రసాయన మూలకం. రసాయన హ్రస్వ నామం Es. అణు సంఖ్య 99, అనగా ఈ మూలకం అణువులో 99 ప్రోటానులు ఉంటాయి. అణుభారం 252. ఈ మూలకాన్ని ఐన్‌స్టయిన్ కనిపెట్టలేదు; ఆయన చేసిన పనికీ ఈ మూలకం ఉనికికీ ఏ విధమైన సంబంధం లేదు. శాస్త్రవేత్తల పేర్లు పెడితే బాగుంటుంది కదా అని ఒకరికి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనని ఆచరణలో పెడుతూ పెట్టిన పేర్లలో ఫెర్మియం ఒకటి, ఇది మరొకటి.
అమెరికా 1952లో మొట్టమొదటి హైడ్రొజన్ బాంబు ప్రయోగాత్మకంగా పేల్చినప్పుడు మిగిలిన శిధిలావశేషాలలో ఈ కొత్త మూలకం దొరికింది. ఈ మూలకం ప్రకృతి సిద్ధంగా దొరకదు. ఈ మూలకం సమస్థానులు లో ఎక్కువ తరచుగా కనిపించేది ఐన్‌స్టయినియం-253. ఈ సమస్థానులు అన్నీ వికిరణ ఉత్తేజిత లక్షణాలు ప్రదర్శిస్తాయి. దీని అర్థాయుర్దాయం 20.47 రోజులు. ఈ కారణాల చేత ఈ మూలకానికి ఇంతవరకు ఏ ఉపయోగాలూ ఉన్నట్లు లేదు.
ఐన్‌స్టయినియం మెత్తటి వెండిలా ఉంటుంది. చీకటిలో నీలి రంగుతో ప్రకాసిస్తుంది. ఇది ఆవర్తన పట్టికలో కేలిఫోర్నియం కి కుడి పక్కనా, ఫెర్మియం కి ఎడమ పక్కనా, హోల్మియం కి దిగువనా ఉంటుంది.