Jump to content

రేడియో ధార్మికత

వికీపీడియా నుండి
(రేడియోధార్మికత నుండి దారిమార్పు చెందింది)
Alpha decay by a nucleus emits an alpha particle made of helium's nucleus

విశ్వంలో మొదట ప్రాథమిక కణాలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు ప్రధానమైనవి. ఇవి ఒక బృందంగా ఏర్పడడం వల్ల పరమాణువులు, వాటిలో ఒకే తరహా పరమాణువులు కలవడం వల్ల మూలకాలు, వేర్వేరు మూలకాల కలయిక వల్ల సంయోగ పదార్థాలు ఏర్పడ్డాయి. సాధారణంగా మనం చూసే ప్రపంచం ఈ మూలకాలు, సంయోగపదార్థాల సమాహారమే. పరమాణు కేంద్రకాల్లో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఈ కణాల సంఖ్య తక్కువైనా, మరీ ఎక్కువైనా స్థిరత్వం ఉండదు. ఎక్కువ పరిమాణంలో ఉండే కేంద్రకాలకు అస్థిరత్వం ఎక్కువ. కేంద్రకంలో న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఒక పరిమితికి మించి ఎక్కువైతే ఆ కేంద్రకాలు చిన్న కేంద్రకాలుగా మారే ప్రయత్నం చేస్తాయి. ఆ ప్రయత్నంలో ఆయా కేంద్రకాల నుంచి ఆల్ఫా కణాలను, ఎలక్ట్రాన్లను (బీటా కణాలు), కొంత శక్తిని గామా కిరణాల రూపంలోనూ పోగొట్టుకుంటూ స్థిరమైన కేంద్రకాలుగా మారతాయి. ఈ ప్రక్రియనే రేడియో ధార్మికత అంటారు. ఈ విషయాన్ని 1896లో హెన్రీ బెకెరల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అణు విద్యుత్ ఉత్పాదనలోను, వైద్య రంగంలోను, పంటల రోగ నిరోధక శక్తిని పెంచే ప్రక్రియల్లోను రేడియో ధార్మికత ఎంతో ఉపయోగపడుతోంది.

చరిత్ర

[మార్చు]

1896 లో హెన్రీ బెకెరల్, మేరీ క్యూరీ పాస్ఫారిసెంట్ పదార్థాల మీద పరిశోధనలు చేస్తున్నపుడు రేడియో ధార్మికతను గుర్తించారు.[1][2][3][4][5] చీకట్లో ఈ పదార్థాలపై కాంతి పడ్డప్పుడు మెరుస్తాయి. ఎక్స్ కిరణాల ద్వారా కాథోడ్-రే ట్యూబ్ లలో ఉత్పత్తి చేయబడిన వెలుగు ఫాస్ఫారిసెన్స్‌తో సంబంధం కలిగి ఉండవచ్చని బెక్వెరెల్ అనుమానించాడు. అతను నల్ల కాగితంలో ఫోటోగ్రాఫిక్ ప్లేట్‌ను చుట్టి, దానిపై వివిధ ఫాస్ఫారిసెంట్ లవణాలు ఉంచాడు. అతను యురేనియం లవణాలను ఉపయోగించే వరకు అన్ని ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి. ప్లేట్ బ్లాక్ పేపర్‌తో చుట్టబడినప్పటికీ యురేనియం లవణాలు ప్లేట్ నల్లబడటానికి కారణమయ్యాయి. ఈ రేడియేషన్లకు "బెక్వెరెల్ కిరణాలు" అని పేరు పెట్టారు.

మూలాలు

[మార్చు]
  1. Mould, Richard F. (1995). A century of X-rays and radioactivity in medicine : with emphasis on photographic records of the early years (Reprint. with minor corr ed.). Bristol: Inst. of Physics Publ. p. 12. ISBN 978-0-7503-0224-1.
  2. Henri Becquerel (1896). "Sur les radiations émises par phosphorescence". Comptes Rendus. 122: 420–421.
  3. Comptes Rendus 122: 420 (1896), translated by Carmen Giunta. Retrieved 12 April 2021.
  4. Henri Becquerel (1896). "Sur les radiations invisibles émises par les corps phosphorescents". Comptes Rendus. 122: 501–503.
  5. Comptes Rendus 122: 501–503 (1896), translated by Carmen Giunta. Retrieved 12 April 2021.