ఇండియం

వికీపీడియా నుండి
(Indium నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఇండియం,  49In
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/ˈɪndiəm/ (IN-dee-əm)
కనిపించే తీరుsilvery lustrous gray
ఆవర్తన పట్టికలో ఇండియం
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
Ga

In

Tl
కాడ్మియంఇండియంతగరము
పరమాణు సంఖ్య (Z)49
గ్రూపుగ్రూపు 13
పీరియడ్పీరియడ్ 5
బ్లాక్p-బ్లాక్
ఎలక్ట్రాన్ విన్యాసం[Kr] 4d10 5s2 5p1
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 18, 3
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం429.7485 K ​(156.5985 °C, ​313.8773 °F)
మరుగు స్థానం2345 K ​(2072 °C, ​3762 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)7.31 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు7.02 g/cm3
త్రిక బిందువు429.7445 K, ​~1[1] kPa
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
3.281 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
231.8 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ26.74 J/(mol·K)
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1196 1325 1485 1690 1962 2340
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు3, 2, 1 (amphoteric oxide)
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.78
పరమాణు వ్యాసార్థంempirical: 167 pm
సమయోజనీయ వ్యాసార్థం142±5 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం193 pm
ఇతరములు
స్ఫటిక నిర్మాణంtetragonal
Tetragonal crystal structure for ఇండియం
Speed of sound thin rod1215 m/s (at 20 °C)
ఉష్ణ వ్యాకోచం32.1 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత81.8 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం83.7 n Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమంdiamagnetic[2]
యంగ్ గుణకం11 GPa
మోహ్స్ కఠినత్వం1.2
బ్రినెల్ కఠినత్వం8.83 MPa
CAS సంఖ్య7440-74-6
చరిత్ర
ఆవిష్కరణFerdinand Reich and Hieronymous Theodor Richter (1863)
మొదటి సారి వేరుపరచుటHieronymous Theodor Richter (1867)
ఇండియం ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోపు సమృద్ధి అర్ధ జీవితం (t1/2) క్షయం ఉత్పత్తి
113In 4.29% - (SF) <24.281
115In 95.71% 4.41×1014 y β 0.495 115Sn
Decay modes in parentheses are predicted, but have not yet been observed
| మూలాలు | in Wikidata

మౌలిక సమాచారం[మార్చు]

ఇండియం ఆవర్తన పట్టికలో 13 వ సముదాయం/సమూహంనకు, p బ్లాకు, 5 వపిరియడుకు చెందిన మూలకం.[3] ఇండియం ఒక పోస్ట్ అనువర్తన (post-transition metallic) లోహా మూలకం. పోస్ట్ ట్రాన్సిసన్ మెటాలిక్ మూలకాలు అనగా ఆవర్తన పట్టికలో మూలకానికి ఎడమ వైపున పరివర్తనలోహ మాలకాలు (transition metals), కుడి వైపున ఉపధాతువులు (metalloids) ఉన్న లోహ మూలకాలు అని అర్థం. ఇది భూమి మీద అతి అరుదుగా లభ్యమగు మూలకం. మూలకం యొక్క రసాయనిక సంకేత అక్షరము In.

చరిత్ర[మార్చు]

ఆవిష్కరణ చరిత్ర[మార్చు]

ఈ మూలకాన్ని మొదటిగా 1863లో జర్మనీలోని ఫ్రీబెర్గ్ స్కూలుఆఫ్ మైన్స్ లో ఫెరిడ్నాండ్ రాయిక్ (Ferdinand Reich) అనునతడు కనుగొన్నాడు. జింకు బ్లెండును (ప్రస్తుతం స్పాలరేట్: ZnS) ను, కొత్తగా కనుగొన్న థాలియం మూలకంకై పరిశోధన చేస్తూండగా పసుపురంగు పదార్థం ఉత్పత్తి అయింది. దాన్ని థాలియం సల్ఫైడ్‌గా భావించాడు. ఆయన దీనిని పరమాణు విచ్ఛిన్న కిరణ దర్శకములో పరిశీలించినప్పుడు, ఆవర్ణపటం థాలియం మూలకానిది కాదు. ఫెరిడ్నాండ్ రాయిక్‌కు వర్ణ అంధత్వం ఉండటం వలన, దీనిని పరిశీలించమని హైరోనమస్ రిక్టరు (Hieronymous Richter) ను అభ్యర్థించగా అయన వర్ణ పటలంలో ప్రకాశవంతమైన ఉదారంగు వరుసను గుర్తించాడు.[4] రైయుక్, రిక్టరు ఇద్దరు కలిసి పనిచేసి, ఈ మూలకాన్ని వేరుచేసి, కొత్తమూలకాన్ని కనుగొన్న విధాన్ని ప్రపంచానికి వెల్లడించారు. ఆ తరువాత రిక్టరు ఒంటరిగా పారిస్ వెళ్ళినప్పుడు ఆమూలకాన్ని తానే కనుగొన్నట్లు చెప్పడంతో ఇద్దరు విడిపోయారు.

పదోత్పత్తి[మార్చు]

ఈ మూలకాన్ని మొదటిగా 1863లో జర్మనీకి చెందిన ఫెరిడ్నాండ్ రాయిక్ (Ferdinand Reich) అనే అతడు కనుగొన్నప్పుడు, దీనిని పరమాణు విచ్ఛిన్నకిరణ దర్శకములో పరిశీలించినప్పుడు, వర్ణపటలంలో ప్రకాశవంతమైన ఉదారంగు వరుసను గుర్తించాడు. లాటిన్ లో indicum అనగా ఉదారంగు. అందువలన ఈ మూలకానికి ఇండియం పేరు స్థిరపడినది[4]

మూలక ధర్మాలు[మార్చు]

ఇండియం మెత్తని, వెండిలా తెల్లగా మెరిసే, సులభంగా సాగే రేకులు, తీగెలుగా సాగు గుణమున్న మూలకం[5].ఇండియం మూలకం యొక్క పరమాణు సంఖ్య 49. పరమాణు భారం 114.818. సోడియంను కత్తితో కత్తరించిన విధంగానే ఈలోహాన్నికూడా కత్తితో సులభంగా కత్తరించవచ్చును (మోహ్స్ దృఢత్వం1.2). ఇండియం యొక్క ద్రవీభవన స్థానం 156.60 °C; మూలకం యొక్క ద్రవీభవన స్థానం, దీనికన్నా తేలికగా ఉన్న గాలియం కన్న ఎక్కువ,, దీనికన్నా ఎక్కువ భారమున్న థాలియం కన్న తక్కువ. తగరం కన్నను ఇండియం ద్రవీభవన స్థానం తక్కువ. ఇండియం మరుగు స్థానం 2072 °C. ఈ మూలకం మరుగు స్థానం థాలియం కన్న ఎక్కువ, గాలియం కన్న తక్కువ విలువ కలిగియున్నది. ఇండియం లోహం యొక్క సాంద్రత 7.31 గ్రాములు/సెం.మీ3.[6]

ఈ విలువ కూడా గాలియం కన్న ఎక్కువ, థాలియం కన్న తక్కువ. ఈ లోహము సందిగ్ధ తాపక్రమము (critical temparature) కన్న తక్కువ 3.41K వద్ద సూపరు కండక్టరు గుణాన్నికలిగి యున్నది. ప్రామాణిక పీడనం, ఉష్ణోగ్రత వద్ద ఈ మూలకం అణువు చతుర్భుజ స్పటిక సౌష్టవాన్ని కలిగిఉండును.

రసాయనికధర్మాలు[మార్చు]

ఇండియం ఒక పోస్ట్ పరివర్తక లోహం.ఇది ఆవర్తన పట్టికలోని తన 13 వ సముహాయానికి చెందిన పొరుగు లోహాలైన గాలియం, థాలియంల మధ్యన ఉండు మూలకం.ఇండియం మూలక పరమాణువు 49 ఎలక్ట్రానులను కలిగి యున్నది.పరమాణువులో ఎలక్ట్రానుల విన్యాసం [Kr]4d105s25p1[4].ఇది ఇతర మూలకాలతో కలసి సమ్మేళనాలను ఏర్పరచు నప్పుడు, పరమాణు బయటి వలయంలోని 3 ఎలక్ట్రానుల వదలుకొని ఇండియం+3 ఆయానులను ఏర్పరచును.కొన్ని సందర్భాలలో 5 S లోని ఎలక్ట్రాన్ జత, జడత్వ జంటప్రభావాన్ని ప్రదర్శించినపుడు, మూలకం కేవలం ఇండియం (Ι), In+గా ఆక్సీకరణ చెందును.

మూలకం యొక్క ప్రామాణిక విద్యుత్‌వాహక ధ్రువ సంభావ్యవిద్యుత్తు

−0.40 In2+ + e− ↔ In+

−0.49 In3+ + e− ↔ In2+

−0.443 In3+ + 2 e− ↔ In+

−0.3382 In3+ + 3 e− ↔ In

−0.14 In+ + e− ↔ In

ఐసోటోపులు[మార్చు]

ఇండియం సమ్మేళనాలు[మార్చు]

ఇండియం నీటితో చురుకుగా చర్య జరపదు. అయితే హలోజనులు,, ఆక్సాలిక్ ఆమ్లం వంటి వాటి బలమైన ఆక్సీకరణ కారకం (oxidising agent) వలన In+3, (ఇండియం (ΙΙΙ) సమ్మేళనాలను ఏర్పరచును.ఇండియం బోరాన్, సిలికాన్, లేదా కార్బన్ వంటి మూలకాలతో రసాయనిక చర్యలో పాల్గొనదు.ఇండియం, హైడ్రోజన్ లమధ్య రసాయనిక చర్య జరగడంచూడనప్పటికి, In +, In+3 హైడ్రైడులు ఉనికిలో ఉన్నాయి.అధిక ఉష్ణోగ్రత వద్ద అక్సిజనుతో చర్య జరగడం వలన ఇండియం (III) ఆక్సైడ్ ఏర్పడును.

ఇది ద్విశ్వభావయుత (amphoteric) సమ్మేళనం. అనగా అటు ఆమ్లాలతోనూ, ఇటు క్షారాలలోను చర్య జరుపును. ఇండియం నీటితో చర్య జరపడం వలన నీటిలో కరుగని ఇండియం (ΙΙΙ) హైడ్రోక్సైడ్ (In (OH) 3 ) ఏర్పడును.ఇండియం (ΙΙΙ) హైడ్రోక్సైడ్ కుడా ద్విశ్వభావయుతం కావడం వలన ఇది కుడా అటు ఆమ్లం తోనూ, ఇటు క్షారముతోనూ రసాయనిక చర్య జరుపి, క్షారాలతో ఇండేట్స్ (indates), ఆమ్లాలతో ఇం డియం (III) లవణాలను ఏర్పరచును.

In (OH) 3 + 2 NaOH → 2 Na[InO2] + H2O

In (OH) 3 + 3 HCl → InCl3 + 3 H2O

సోడియం ఇండేట్ (III) జల విశ్లేషణ (hydrolysis) చెందటం వలన బలహీన ఇండిక్ ఆమ్లం (HInO2) ఏర్పడును. ఇండియం యొక్క లవణాలలో ఇండియం క్లోరైడు, ఇండియం సల్ఫేట్,, ఇండియం నైట్రేట్‌లు నీటిలో కరుగును. నీటిలో In3+, [InO2] ఆయాన్‌లు జలవిశ్లేషకము వలన InOH2+, HInO2 లను ఏర్పరచును.In3+ అయాను వర్ణ రహితం, పరమాణువు యొక్క d, f గదులలో ఒంటరి ఎలక్ట్రానులు లేకపోవటమే ఇందుకు కారణం.

ఇండియం (I) సల్ఫైడ్, ఇండియం, సల్ఫరు లమధ్య రసాయనిక చర్య వలన, లేదా ఇండియం, హైడ్రోజన్ సల్ఫైడ్ మధ్య 700-1000 °C వద్ద చర్య జరగడం వలన ఏర్పడును.అలాగే ఇండియం (I) ఆక్సైడ్ అనునది 850 °C వద్ద కార్బన్ డై ఆక్సైడ్/బొగ్గుపులుసు వాయువుతో చర్యవలన, లేదా 1200 °C వద్ద ఇండియం ( III) ఆక్సైడ్ వియోగం/విచ్చేదం చెందటం వలన ఏర్పడును.

అతి అరుదుగా మధ్యస్థ ఆక్సీకరణ స్థాయి +2 ఇండియం-ఇండియం బంధాలున్న సమ్మేళనాలాలో, ముఖ్యంగా In2X4, [In2X6] 2_ హలైడులలో కన్పించును.

ఇవి కాకుండగా ఇండియం (I),, ఇండియం (III) లలో కలిసి ఏర్పడిన InI6 (InIIICl6) Cl3, InI5 (InIIIBr4) 2 (InIIIBr6), InIInIIIBr4 వంటిపలు సమ్మేళనాలు ఉన్నాయి.

స్వాభావిక లభ్యత[మార్చు]

భూమిఉపరితల మన్నులో:: 2.5×10−1 మిల్లీగ్రాములు/కిలో మన్నులో[3]

సముద్ర గర్భంలో:2×10−2మిల్లీ గ్రాములు/లీటరు నీటిలో [3]

వినియోగం[మార్చు]

దేహ జీవవ్యవస్థలో ఇండియం యొక్క ఉపచయాపచయ సంబంధమైన ( metabolic) పాత్ర లేదు.ఇండియం (III) అయానులను ఇజెక్షను రూపంలో శరీరంలో ప్రవేశపెట్టిన మూత్ర పిండాల మీద దుష్ప్ర భావం చూపును.అలాగే గుండె, కాలేయం పైకూడ విషప్రభావం చూపించును[5] రేడియో ధార్మికత కలిగిన ఇండియం-111 ను పరమాణు వైద్యపర పరీక్షలలో రేడియో ట్రేసరుగా ఉపయోగిస్తారు. ఇండియాన్ని ఉపయోగించి అద్దాలు/దర్పణాలు చెయ్యుదురు, ఇవి వెండివలె ప్రతిబింబాలను చక్కగా ప్రతిఫలింపఁ జేయును [3]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Mangum, B W (1989). "Determination of the Indium Freezing-point and Triple-point Temperatures". Metrologia. 26 (4): 211. Bibcode:1989Metro..26..211M. doi:10.1088/0026-1394/26/4/001.
  2. Magnetic susceptibility of the elements and inorganic compounds, in Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.
  3. 3.0 3.1 3.2 3.3 "The Element Indium". education.jlab.org. Retrieved 2015-04-15.
  4. 4.0 4.1 4.2 "Indium-Histry". rsc.org. Retrieved 2015-04-15.
  5. 5.0 5.1 "Indium - In". lenntech.com. Retrieved 2015-04-15.
  6. "Indium: the essentials". webelements.com. Retrieved 2015-04-15.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇండియం&oldid=3829457" నుండి వెలికితీశారు