బంగారం

వికీపీడియా నుండి
(Gold నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బంగారం,  79Au
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
కనిపించే తీరుmetallic yellow
ప్రామాణిక అణు భారం (Ar, standard)196.966569(5)[1]
ఆవర్తన పట్టికలో బంగారం
Hydrogen (diatomic nonmetal)
Helium (noble gas)
Lithium (alkali metal)
Beryllium (alkaline earth metal)
Boron (metalloid)
Carbon (polyatomic nonmetal)
Nitrogen (diatomic nonmetal)
Oxygen (diatomic nonmetal)
Fluorine (diatomic nonmetal)
Neon (noble gas)
Sodium (alkali metal)
Magnesium (alkaline earth metal)
Aluminium (post-transition metal)
Silicon (metalloid)
Phosphorus (polyatomic nonmetal)
Sulfur (polyatomic nonmetal)
Chlorine (diatomic nonmetal)
Argon (noble gas)
Potassium (alkali metal)
Calcium (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (post-transition metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (post-transition metal)
Tin (post-transition metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanide)
Cerium (lanthanide)
Praseodymium (lanthanide)
Neodymium (lanthanide)
Promethium (lanthanide)
Samarium (lanthanide)
Europium (lanthanide)
Gadolinium (lanthanide)
Terbium (lanthanide)
Dysprosium (lanthanide)
Holmium (lanthanide)
Erbium (lanthanide)
Thulium (lanthanide)
Ytterbium (lanthanide)
Lutetium (lanthanide)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (post-transition metal)
Lead (post-transition metal)
Bismuth (post-transition metal)
Polonium (post-transition metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinide)
Thorium (actinide)
Protactinium (actinide)
Uranium (actinide)
Neptunium (actinide)
Plutonium (actinide)
Americium (actinide)
Curium (actinide)
Berkelium (actinide)
Californium (actinide)
Einsteinium (actinide)
Fermium (actinide)
Mendelevium (actinide)
Nobelium (actinide)
Lawrencium (actinide)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (post-transition metal)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
Ag

Au

Rg
ప్లాటినంబంగారంపాదరసం
పరమాణు సంఖ్య (Z)79
గ్రూపుగ్రూపు 11
పీరియడ్పీరియడ్ 6
బ్లాకుd-బ్లాకు
ఎలక్ట్రాన్ విన్యాసం[Xe] 4f14 5d10 6s1
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 18, 32, 18, 1
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం1337.33 K ​(1064.18 °C, ​1947.52 °F)
మరుగు స్థానం3129 K ​(2856 °C, ​5173 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)19.30 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు17.31 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
12.55 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
324 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ25.418 J/(mol·K)
భాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1646 1814 2021 2281 2620 3078
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు5, 4, 3, 2, 1, −1
(amphoteric oxide)
ఋణవిద్యుదాత్మకతPauling scale: 2.54
పరమాణు వ్యాసార్థంempirical: 144 pm
సమయోజనీయ వ్యాసార్థం136±6 pm
వాండర్‌వాల్ వ్యాసార్థం166 pm
Color lines in a spectral range
వర్ణపట రేఖలు
ఇతరములు
స్ఫటిక నిర్మాణంface centered cubic
Speed of sound thin rod2030 m/s (at r.t.)
ఉష్ణ వ్యాకోచం14.2 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత318 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం22.14 n Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమంdiamagnetic[2]
యంగ్ గుణకం79 GPa
షేర్ గుణకం27 GPa
బల్క్ గుణకం180[ఉల్లేఖన అవసరం] GPa
పాయిసన్ నిష్పత్తి0.44
మోహ్స్ కఠినత్వం2.5
వికర్స్ కఠినత్వం216 MPa
బ్రినెల్ కఠినత్వం25 HB = ?? MPa
CAS సంఖ్య7440-57-5
చరిత్ర
ఆవిష్కరణMiddle Easterns (before 6000 BC)
బంగారం ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోప్ లభ్యత అర్థ­జీవిత­కాలం (t1/2) విఘ­టనం లబ్దం
195Au syn 186.10 d ε 0.227 195Pt
196Au syn 6.183 d ε 1.506 196Pt
β 0.686 196Hg
197Au 100% - (α) 0.9545 193Ir
198Au syn 2.69517 d β 1.372 198Hg
199Au syn 3.169 d β 0.453 199Hg
Decay modes in parentheses are predicted, but have not yet been observed
| మూలాలు | in Wikidata
అమెరికన్ బంగారు నాణెం

బంగారం (Gold), ఒక విలువైన లోహము, రసాయనిక మూలకము. నగల్లో, అలంకారాల్లో విరివిరిగా వాడతారు, ఆయుర్వేద వైద్యములో కూడా వాడతారు. బంగారం ఆవర్తన పట్టికలో 11 వ సమూహం (గ్రూప్ ) కు చెందిన మూలకం. బంగారం యొక్క పరమాణు సంఖ్య 79. బంగారం యొక్క సంకేత అక్షర Au (లాటిన్ లో బంగారాన్ని Aurun అంటారు).[3] రసాయనికంగా బంగారం ఒక పరావర్తన మూలకం. స్వచ్ఛమైన బంగారం కొద్దిగా ఎరుపు చాయ కల్గిన పసుపుపచ్చ వన్నె కలిగిన ఎక్కువ సాంద్రత కలిగిన, మెత్తగా ఉండే లోహం.

పురాతన కాలంలో బంగారు వాడకం[మార్చు]

శిలాజ త్రవ్వక నిపుణులు స్పానిస్ లోని 40,000 ఏళ్ల క్రితం పాలియోలిథిక్ కాలానికి చెందిన మానవులు నివసించిన గుహలో స్వాభావిక బంగారుముక్కలను గుర్తించారు. కొందరి అంచనా ప్రకారం బంగారం క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాలనాటికి సిర్కా (Circa ) లో గుర్తించినట్లు తెలుస్తున్నది. క్రీ.పూ.3000 నాటికి పురాతన ఈజిప్టు సిర్కాలోని ఫారోలు, దేవాలయ పూజారులు బంగారాన్ని ఆభరణాలుగా ధరించారని తెలుస్తున్నది. అయితే ఆకాలంలో వస్తుమారకానికి బంగారాన్ని కాక బార్లీని మారక ద్రవ్యంగా వాడేవారు. మొట్టమొదటి సారిగా పశ్చిమ టర్కీకి చెందిన లైడియ (lydia ) లో బంగారాన్ని ధనంగా క్రీ.పూ. 700 సంవత్సరం నుండి ఉపయోగించడం మొదలైనది. పురాతన నాగరికతకాలం నాటి చేతివృత్తుల అలంకార కళాకారులు దేవాలయాలను, రాజవంశీయుల సమాధులను అత్యంత శోభాయమానంగా బంగారంతో అలంకరించేవారు. ఈజిప్టులో 5000 వేల సంవత్సరాల క్రితమే బంగారపు వస్తువులను తయారుచేసి వాడినట్లుగా తెలుస్తున్నది. క్రీ.శ.1922 లో ఈజిప్టు రాజు తుతంఖామన్ (Tutankhamun ) సమాధిలో ఉంచిన బంగారువస్తువులను హోవార్డ్‌కార్టర్, లార్డ్ కార్నర్‌వోన్ అనేవారు గుర్తించారు.

బంగారపు రసాయనిక, భౌతిక గుణ గణాలు[మార్చు]

బంగారం చాలా వరకు చాలా ఆమ్లాల విడి చర్యకు గురికాదు, కరుగదు కానీ నైట్రిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపి తయారుచేసిన ఆక్వా రెజియా అనే ద్రవంలో కరుగుతుంది. పై రెండు ఆమ్లాల మిశ్రమ ద్రవం బంగారాన్ని టెట్రా క్లోరైడి అయానుగా పరివర్తనం చెందిస్తుంది. అలాగే సైనైడ్ యొక్క క్షార ద్రావణాలలో బంగారం కరుగుతుంది. బంగారం పాదరసంలో కరుగుతుంది. బంగారం పాదరసంలో కరుగుట వలన ఏర్పడిన మిశ్రమ ధాతువును అమాల్గం (Amalgam) అంటారు. తెలుగులో పాదరసమేళనము లేదా రసమిశ్రలోహము, నవనీతమంటారు.సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద పాదరసంలో బంగారం కరిగి రసమిశ్రలోహము మిశ్రమ ధాతువుగా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన ఆమాల్గం నత్రికామ్లం (నైట్రిక్ ఆసిడ్) లో కరుగదు. (వెండి, క్షారలోహాలు నత్రికామ్లంలో కరుగుతాయి). ఒక ఔన్సు బంగారాన్ని 300 చదరపు అడుగుల పలుచని రేకు /పత్రంలా సాగ గొట్టవచ్చును. అత్యంత పలుచని రేకులుగా సాగే భౌతిక ధర్మాన్ని కలిగివున్నది. అంతే కాదు కేశముల కన్న సన్నని తీగెలుగా సాగుతుంది. ఒక ఔన్సు బంగారం నుండి 50 మైళ్ళ పొడవున్న తీగెను తీయవచ్చును. కేవలం ఒక గ్రాము భారమున్న బంగారాన్ని ఒక చదరపు మీటరు వైశాల్యంగల రేకుగా సాగతీయ వచ్చును. పలుచగా సాగగొట్ట బడిన బంగారు పత్రంనుండి వెలుతురు పచ్చని ఛాయగలిగిన నీలిరంగుగా వెలువడుతుంది. ఒకగ్రాము బంగారాన్ని 20 మైక్రో మీటర్లు మందమున్న, 165 మీటర్ల పొడవున్న తీగెలా సాగతీయ వచ్చును.

బంగారు మిగతా లోహలతో కూడా సంయోగం చెందుతుంది. కాని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఈమిశ్రమ ధాతువులు ఏర్పడతాయి. ఇతరలోహాలను బంగారంలో దాని యొక్క మెత్తదనాన్ని తక్కించి దృఢత్వం పెంచుటకై కలుపుతారు. గాలి, చెమ్మ, లేదా క్షయికరణ పదార్థాలు బంగారం పై ఎటువంటి రసాయనిక చర్యను కలిగించలేవు. ఓస్మియం (osmium ) తరువాత బరువైన లోహం బంగారమే. ఒస్మియం ఒక ఘనమీటరుకు 22,588 కిలోలు ఉంటే బంగారం 19,300 కిలోలు తూగుతుంది[4]. శుద్ధమైన చాలా లోహాలు సాధారణంగా ఊదారంగులో లేదా వెండిలా తెల్లగా ఉంటాయి. కాని బంగారం మాత్రం ఎరుపు ఛాయకలిగిన పసిమిరంగులో ఉంటుంది. బంగారంలో కలుపబడే రాగి, వెండి, నిష్పత్తిని బట్టి బంగారం రంగులో వ్యత్యాసం కన్పిస్తుంది. బంగారం యొక్క స్వచ్ఛత పాళ్ళను ఫైన్నెస్ (fineness ) లేదా కారెట్ (karat) లల్లో కొలుస్తారు. బంగారాన్ని పైన్నెస్‌లో అయ్యినచో వెయ్యిలో వంతుగా లెక్కిస్తారు. ఉదాహరణకు పైన్నేస్ 885 అనగా అందులో బంగారం 885 వంతులు, మిగిలిన 115 వంతులు వెండి, రాగి వంటి ఇతరలోహాలు కలుపబడి ఉన్నాయని అర్థం. అలాగే 24 కారెట్ అనేది, కల్తీలేని స్వచ్ఛమైన బంగారానికి సూచిక. ఉదాహరణకు 22 కారెట్ల బంగారం అనగా, అందులో బంగారం 22 భాగాలు, మిగిలిన 2 భాగాలు రాగి, లేదా వెండి వంటి ఇతర లోహాలు కలిసి ఉన్నాయని అర్థం.

యాంత్రిక గుణములు/ ధర్మములు[మార్చు]

బంగారం ఒక భార మూలకం. అనగా బరువైన మూలకాలలో బంగారం ఒక్కటి. బంగారం యొక్క విశిష్ట గురుత్వం 19.3. అనగా ఒక లీటరు ఘనపరిమానం నీరు ఒక కిలో భారముంటే, అంతే ఘన పరిమాణమున్న బంగారం 19.3 కిలోలు బరువు తూగుతుంది. ఒక ఘనపు అడుగు పరిమాణమున్న బంగారం 1,206 పౌండ్ల బరువు ఉంటుంది. అంటే సుమారు అరటన్ను.

భౌతిక గుణ గణాల పట్టిక

భౌతిక లక్షణం మితి లేదా
విలువ
సాంద్రత 19.3గ్రాం/cm3
మొలారు ఘనపరిమాణము 10.21 cm3
రంగు ఎరుపుఛాయ యున్న
పసిమివన్నె
మరుగు స్థానం 28560C
బాష్పీభవనోష్ణం 324 kJ·mol−1
ద్రవీభవన స్థానం 1064.180C,

బంగారం యొక్క స్థితిస్థాపక గుణం, లోహంయొక్క కఠినత్వం విలువలు

స్థితిస్థాపకత విలువ కాఠిన్యత విలువ
యాంగ్సు (youngsమోడులస్ 78 GPa ఖనిజ కఠీనత్వం 2.5
రిజిడిటి మోడులస్ 27 GPa వికేర్సు కఠీనత్వం 216 MN m−2
బల్క్ మోడులస్ 220 GPa బ్రినేల్ల్ కఠీనత్వం 2450 MN m−2
poission's ratio 0.44 (no units)

అనాదికాలం నాటి బంగారం వనరులు[మార్చు]

ఈజిప్టులో ఫారోల కాలంలో బంగారాన్ని ఎగువ నైలుప్రాంతం, మధ్య తూర్పులోని ఎర్రసముద్ర సమీపప్రాంతాలలో, నూబియన్ ఎడారి ప్రాంతాలలోని గనులనుండి త్రవ్వితీసినట్లు తెలుస్తున్నది. ఈ ప్రాంతంలో త్రావ్వితిసిన బంగారం అవసరానికి తగినంతగా లభించనప్పుడు ఎమెను, దక్షిణాఫ్రికాలో కుడా అన్వేషణ కొనసాగించినట్లు తెలుస్తున్నది. సోలోమన్ రాజు కాలం (క్రీ.పూ .961 -922) లో ప్రస్తుత సౌదీ అరేబియా లోని “మహ్ద్ అద్ దాహాబ్” ప్రాంతంలోని గనులనుండి బంగారు, వెండి, రాగి ఖనిజాలను త్రవ్వివాడినట్లు తెలుస్తున్నది.

బంగారు నిల్వల వివరాలు[మార్చు]

పూర్వ కాలంలో బంగారాన్ని ఎక్కువగా ద్రవ్యంగా వాడేవారు. బంగారంనుండి ఎక్కువగా నాణేలు, ఆభరణాలు తయారు చేయుటకు ఉపయోగిస్తున్నారు. క్రీ.శ.1930నుండి బంగారపు నాణేల చలామణిని నిలిపివేసారు. 2012 నాటికి 174,100 టన్నుల బంగారం ప్రపంచం మొత్తంమీద ఉత్పత్తి అయ్యింది.[5] ఇది 9020m3కి సమానం. ఉత్పత్తి అవుతున్న బంగారంలో 50% నగలతయారీలో, 40% మూల నిల్వ ధనంగాను/మదుపు/పెట్టుబడిగా మిగిలిన 10%ను పరిశ్రమలలో వినియోగిస్తున్నారు. అమెరికా సంయుక్తరాష్ట్రాలలోని అతిపెద్ద బంగారుగని హోమ్స్ స్టేక్, ఇది దక్షిణడకోటాకు చెందిన లీడ్ లో ఉంది. గనిలో ఖనిజ త్రవ్వకం 1876 లో మొదలైనది. అమెరికాలో ఉత్పత్తి అయ్యే బంగారంలో 10% ఈ గనిలోనే ఉత్పత్తి అవుతున్నది. ఈ గని 8000 వేల అడుగుల లోతున ఉంది. ఈ గనిలో 40 మిలియను ట్రాయ్ ఔన్సుల బంగారు నిల్వలున్నాయని అంచనా.

లభ్యత[మార్చు]

బంగారం అతి తక్కువ ప్రమాణంలో నేల పొరలలో నిక్షిప్తమై ఉంది. భూమిలో బంగారం ప్రధానంగా రెండు రకాలుగా నిల్వ ఉంటుంది. ఒకటి ప్రథమ శ్రేణి, లోడ్ (Lode) నిల్వలు అనియు, ద్వితీయ శ్రేణి నిల్వలను ప్లసెర్ (placer ) అంటారు. మొదటిగా బంగారం ఆవిర్భావం గురించి రకరకాల అంచనాలు, సిద్ధాంతాలు చెలామణిలో ఉన్నాయి. బంగారం మొదటగా సూపరు నోవా నక్షత్రాలు విస్పోటనం చెందినప్పుడు పుట్టినట్లు భౌతిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బంగారం యొక్క సాంద్రత ఎక్కువ కావున భూమియొక్క కేంద్ర భాగంలోని మాగ్మాలో బంగారం అధిక మొత్తంలో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. వేడిగా ఉన్న మాగ్మా చల్లబడే సమయంలో ద్రవ రూపంలో ఉన్న బంగారం ఉపరితలం చేరి అవక్షేపశిలలలో చేరి ఉంటుందని తెలుస్తున్నది. కారణం ఇలాంటి శిలల నుండి వచ్చే నీటిలో బంగారపు ఆనవాళ్ళు కన్పించడమే. బంగారం భూమియొక్క రాతిపొరలలో ఖనిజరూపంలో ప్రికంబరియన్ (Precambrian) కాలంనాటికి ఏర్పడినట్లు తెలుస్తున్నది.[6]

బంగారు భారాన్ని ట్రాయ్ ఔన్సులలో లెక్కిస్తారు. ఒక ఔన్సు 20 పెన్నీ వెయిట్స్‌కు సమానం. ఒక పెన్నీవెయిట్ 1.555 గ్రాం.లకు సమానం.

ఐసోటోపు[మార్చు]

పరమాణువు లోని ప్రోటాను, న్యుట్రానుల మొత్తం సంఖ్యను ఆ మూలకం యొక్క భారసంఖ్య అంటారు. పరమాణువులోని ప్రోటాను సంఖ్య మూలకాన్ని నిర్ణయిస్తుంది. ప్రతిమూలకంలో ప్రోటానుల సంఖ్య స్థిరంగా ఉంటాయి. అయితే ప్రోటానుల సంఖ్య స్థిరంగా వుండి, న్యుట్రానుల సంఖ్య మారినచో ఆ నిర్మాణాన్ని ఐసోటోపు అంటారు. బంగారానికి ఒకటే స్థిరమైన ఐసోటోపు ఉంది. అది197AU. ఈ ఐసోటోపు స్వాభావికంగా లభించే ఐసోటోపు. కాని అణుధార్మికతను విడుదలచేసే, పరమాణు భారం 169-205 వున్న రేడియో ఐసోటోప్లు 36 వరకు ఉన్నాయి. అందులో 198AU అనే ఐసోటోప్‌ను కాన్సరు చికిత్సలో, colloid రూపంలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా లివరు, పొత్తికడుపుల రుగ్మతల నిర్ధారణ విధానాలలోను ఉపయోగిస్తారు .

బంగారం వినియోగం[మార్చు]

2009 నాటికి165,000టన్నుల బంగారాన్ని గనులనుండి వెలికి తీసారు. ప్రస్తుతం లభిస్తున్న బంగారంలో 50 % ఆభరణాలు చెయ్యుటకు, 40%ను మూలధనం పెట్టుబడిగా,10%ను నాణేల తయారికి, ఇతరత్రా పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. భారతదేశంలో విశ్వకర్మ సంతానం బంగారంతో వస్తువుల తయారీ గుడిలో నగల తయారు చేశారు.[7] కేవలం వెండి మాత్రమే కలుపబడిన 14K, 18K బంగారం, ఆకుపచ్చ–పసుపు రంగుల మిళితంగా ఉంటుంది. దీనిని పచ్చ బంగారు అంటారు.తెల్ల బంగారు మిశ్రమ లోహాం, పల్లాడియం లేదా నికెల్ లోహాన్ని బంగారంలో కలపడం వలన ఏర్పడును.17.3 %నికెల్, 5.5%జింకు, 2.2% రాగి కలిపిన 18K బంగారు వెండిలా కనబడుతుంది. బంగారంయొక్క క్షయికరణను నిలువరించే గుణంవలన దీన్ని కంప్యుటర్, ఎలక్ట్రికల్ పరికరాలలో కనెక్టరులుగా ఉపయోగిస్తారు .ప్రపంచ బంగారు సమాఖ్య (world Gold council) ప్రకారం ఒక సెల్ ఫోనులో కనిష్ఠం 50 మి.గ్రాముల బంగారం వినియోగింపబడి ఉండే అవకాశము ఉంది.

బంగారాన్ని దానికున్నా పరారుణ కిరణాలను ప్రతిబింబింపఁజేయు కారణంగా అంరరిక్ష ప్రయాణికులు, వ్యోమగాముల దుస్తుల తయారరీలో పరారుణ కిరణ నిరోధక పలకంగా బంగారాన్ని ఉపయోగిస్తారు.[8]

ఇతర లోహనిర్మిత ఆభరణాలు, వస్తువుల ఉపరితలంపై బంగారాన్ని పలుచని పూతగా లేపనం చెయ్యడానిని బంగారు తాపకం లేదా తాపడం అంటారు. ఆంగ్లంలో గోల్డ్ ఫిల్లింగ్ (gold filling) అంటారు. ఇలా పలుచగా బంగారపుపూత కలిగిన ఇత్తడి లేదా వెండి ఆభరణాలను రోల్డ్ గోల్డ్ ఆభరణాలు అంటారు. రోల్డు గోల్డు ఆభరణాలను సాధారణంగా ఎలక్ట్రో ప్లేటింగు విధానంలో చెయ్యడం కద్దు. 0.18 మైక్రో మీటరు మందపు బంగారపుపూత కలిగిన వాటినే ఎలక్ట్రోప్లేటేడు అంటారు. అంతకన్న తక్కువ మందపుపూత ఉన్న వాటిని గోల్డ్‌ ఫ్లాషేడ్ (gold flashed) లేదా గోల్డ్‌వాషేడ్ అంటారు. బంగారపు దారాలను దుస్తులను ఎంబ్రాయిడరి చెయ్యడానికి ఉపయోగిస్తారు.

ఆహారంలో E175 అనే బంగారాన్ని ఉపయోగిస్తారు[9].

ఇవికూడా చూడండి[మార్చు]

ఆధారాలు/ఉల్లేఖనం[మార్చు]

  1. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
  2. Magnetic susceptibility of the elements and inorganic compounds in Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
  3. Notre Dame University Latin Dictionary Retrieved 17 march 2015
  4. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
  5. World Gold Council FAQ. Gold.org. Retrieved on 12 September 2013.
  6. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
  7. "Gold Mining Boom Increasing Mercury Pollution Risk". oilprice.com. http://oilprice.com/Metals/Gold/Gold-Mining-Boom-Increasing-Mercury-Pollution-Risk.html. Retrieved 2015-03-17. 
  8. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
  9. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 834: Argument map not defined for this variable: Contribution.
"https://te.wikipedia.org/w/index.php?title=బంగారం&oldid=2866806" నుండి వెలికితీశారు