Jump to content

కార్బన్ గ్రూప్

వికీపీడియా నుండి
(Carbon group నుండి దారిమార్పు చెందింది)


కార్బన్ గ్రూప్ (గ్రూప్ 14)
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
IUPAC group number 14
Name by element కార్బన్ గ్రూప్
Trivial name tetrels, crystallogens
CAS group number
(US, pattern A-B-A)
IVA
old IUPAC number
(Europe, pattern A-B)
IVB

↓ పీరియడ్
2 title="Carbon: పాలీ అటామిక్ లోహం; ఆదిమ; ఘన" style="text-align:center; vertical-align:bottom; width:210px; background:#f0f0f0; border:transparent; ;"|
Image: Diamond and graphite, two allotropes of carbon
Carbon (C)
6 పాలీ అటామిక్ లోహం
3 title="Silicon: అర్ధ లోహం; ఆదిమ; ఘన" style="text-align:center; vertical-align:bottom; width:210px; background:#f0f0f0; border:transparent; ;"|
Image: Purified silicon
Silicon (Si)
14 అర్ధ లోహం
4 title="Germanium: అర్ధ లోహం; ఆదిమ; ఘన" style="text-align:center; vertical-align:bottom; width:210px; background:#f0f0f0; border:transparent; ;"|
Image: Polycrystallline germanium
Germanium (Ge)
32 అర్ధ లోహం
5 title="Tin: ట్రాన్సిషన్-అనంతర లోహం; ఆదిమ; ఘన" style="text-align:center; vertical-align:bottom; width:210px; background:#f0f0f0; border:transparent; ;"|
Image: Alpha- and beta-tin, two allotropes of tin
Tin (Sn)
50 ట్రాన్సిషన్-అనంతర లోహం
6 title="Lead: ట్రాన్సిషన్-అనంతర లోహం; ఆదిమ; ఘన" style="text-align:center; vertical-align:bottom; width:210px; background:#f0f0f0; border:transparent; ;"|
Image: Lead crystals
Lead (Pb)
82 ట్రాన్సిషన్-అనంతర లోహం
7 title="Flerovium: ట్రాన్సిషన్-అనంతర లోహం; సింథటిక్; తెలియదు" style="text-align:center; vertical-align:bottom; width:210px; background:#f0f0f0; border:transparent; ;"| Flerovium (Fl)
114 ట్రాన్సిషన్-అనంతర లోహం

Legend
ఆదిమ మూలకం
సింథటిక్ మూలకం
Atomic number color:
black=solid

కార్బన్ గ్రూప్ అనేది కార్బన్ (C), సిలికాన్ (Si), జెర్మేనియం (Ge), టిన్ (Sn), సీసం (Pb), ఫ్లెరోవియం (Fl)లతో కూడిన ఆవర్తన పట్టిక గ్రూప్ . ఇది p-బ్లాక్ లో ఉంది.

ఆధునిక IUPAC సంజ్ఞామానంలో, దీనిని గ్రూప్ 14 అంటారు. సెమీకండక్టర్ ఫిజిక్స్ రంగంలో, ఇది ఇప్పటికీ విశ్వవ్యాప్తంగా గ్రూప్ IV అని అంటారు. దీన్ని ఒకప్పుడు టెట్రల్స్ అని కూడా పిలిచేవారు (గ్రీకు పదం టెట్రా, దీని అర్థం నాలుగు). గుంపు పేర్లలోని రోమన్ సంఖ్య IV నుండి గాని, ఈ మూలకాలు నాలుగు వేలెన్స్ ఎలక్ట్రాన్‌లను కలిగి ఉన్నందున గానీ ఈ పేరు వచ్చింది. వాటిని క్రిస్టలోజెన్ లని అడమాంటోజెన్స్ అని కూడా అంటారు. [1]

లక్షణాలు

[మార్చు]

రసాయన ధర్మాలు

[మార్చు]

ఇతర సమూహాల మాదిరిగానే, ఈ కుటుంబంలోని సభ్యులు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్‌లో నమూనాలను చూపుతారు. ముఖ్యంగా బయటి షెల్‌లలో, రసాయన ప్రవర్తనా ధోరణులు ఏర్పడతాయి:

Z మూలకం ఎలక్ట్రాన్లు/షెల్ సంఖ్య
6 కార్బన్ 2, 4
14 సిలికాన్ 2, 8, 4
32 జెర్మేనియం 2, 8, 18, 4
50 టిన్ 2, 8, 18, 18, 4
82 సీసం 2, 8, 18, 32, 18, 4
114 ఫ్లెరోవియం 2, 8, 18, 32, 32, 18, 4 (అంచనా)

ఈ సమూహంలోని ప్రతి మూలకానికి బయటి షెల్‌లో 4 ఎలక్ట్రాన్‌లు ఉంటాయి. గ్రూప్ 14 లోని ఒక వివిక్త, తటస్థ పరమాణువు గ్రౌండ్ స్టేట్‌లో s2 p2 కాన్ఫిగరేషన్ కలిగి ఉంటుంది. ఈ మూలకాలకు, ముఖ్యంగా కార్బన్, సిలికాన్ లకు, బలమైన సమయోజనీయ బంధ ధోరణి ఉంటుంది. ఈ మూలకాలలోని బంధాలు తరచుగా హైబ్రిడైజేషన్‌కు దారితీస్తాయి s, p ఆర్బిటాళ్ళ లక్షణాలను తొలగిస్తాయి. ఒకే బంధాలలో సాధారణంగా ఉండే అమరికలో నాలుగు జతల sp3 ఎలక్ట్రాన్‌లుంటాయి. అయితే గ్రాఫేన్ గ్రాఫైట్‌లలో మూడు sp2 జతలుండడం వంటి ఇతర సందర్భాలు కూడా ఉన్నాయి. ద్వంద్వ బంధాలు కార్బన్‌కు ఉన్న విలక్షణత (ఆల్కీన్స్, CO2 ...); సాధారణంగా π-సిస్టమ్‌లకు కూడా ఇలాగే ఉంటుంది. ఎలక్ట్రాన్‌లను కోల్పోయే ధోరణి పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ, అణువు పరిమాణం పెరిగే కొద్దీ, పెరుగుతూ పోతుంది. కార్బన్ మాత్రమే నెగటివు అయాన్లను - కార్బైడ్ (C4−) అయాన్ల రూపంలో - ఏర్పరుస్తుంది. అర్ధ లోహాలైన సిలికాన్, జెర్మేనియంలు +4 అయాన్లను ఏర్పరుస్తాయి. తగరం, సీసంలు రెండూ లోహాలు. ఫ్లెరోవియం సింథటిక్ రేడియోధార్మిక మూలకం. దీని అర్ధ జీవితం చాలా తక్కువ - కేవలం 1.9 సెకన్లు మాత్రమే ఉంటుంది. ఇది కొన్ని నోబుల్ గ్యాస్ -వంటి లక్షణాలను కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ ఇది పరివర్తన అనంతర లోహం. టిన్, సీసం రెండూ +2 అయాన్లను ఏర్పరచగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. టిన్ రసాయనికంగా లోహం అయినప్పటికీ, దాని α అలోట్రోప్ లోహం వలె కాకుండా జెర్మేనియం వలె కనిపిస్తుంది. ఇది హీనమైన విద్యుత్ వాహకం.

కార్బన్ అన్ని హాలోజన్‌లతో టెట్రాహాలైడ్‌లను ఏర్పరుస్తుంది. కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ సబ్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వంటి అనేక ఆక్సైడ్లను కూడా ఏర్పరుస్తుంది. కార్బన్ డైసల్ఫైడ్లు, డైసెలెనైడ్లను ఏర్పరుస్తుంది.[2]

సిలికాన్ అనేక హైడ్రైడ్‌లను ఏర్పరుస్తుంది; వాటిలో రెండు SiH4. Si2H6. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్‌లతో టెట్రాహాలైడ్‌లను ఏర్పరుస్తుంది. సిలికాన్ డయాక్సైడ్, డైసల్ఫైడ్‌ను కూడా ఏర్పరుస్తుంది.[3] సిలికాన్ నైట్రైడ్ రసాయన సూత్రం Si3N4. [4]

జెర్మేనియం ఐదు హైడ్రైడ్‌లను ఏర్పరుస్తుంది. మొదటి రెండు జెర్మేనియం హైడ్రైడ్‌లు GeH4, Ge2H6. అస్టాటిన్ మినహా అన్ని హాలోజన్‌లతో జెర్మేనియం, టెట్రాహలైడ్‌లను ఏర్పరుస్తుంది. బ్రోమిన్, అస్టాటిన్ మినహా అన్ని హాలోజన్‌లతో డైహాలైడ్‌లను ఏర్పరుస్తుంది. పొలోనియం మినహా అన్ని సహజ సింగిల్ చాల్‌కోజెన్‌లతో బంధాలను ఏర్పరుస్తుంది. డయాక్సైడ్‌లు, డైసల్ఫైడ్‌లు, డైస్లెనైడ్‌లను ఏర్పరుస్తుంది. జెర్మేనియం నైట్రైడ్ రసాయమ్న సూత్రం Ge3N4. [5]


టిన్ SnH4, Sn2H6 అనే రెండు హైడ్రైడ్‌లను ఏర్పరుస్తుంది. అస్టాటిన్ మినహా అన్ని హాలోజన్‌లతో టిన్, డైహలైడ్‌లు, టెట్రాహలైడ్‌లను ఏర్పరుస్తుంది. పోలోనియం మినహా సహజంగా లభించే ప్రతి ఒక్కటితో టిన్, చాల్‌కోజెనైడ్‌లను ఏర్పరుస్తుంది. పొలోనియం, టెల్లూరియం మినహా సహజంగా లభించే రెండు చాల్‌కోజెన్‌లతో చాల్‌కోజెనైడ్‌లను ఏర్పరుస్తుంది. [6]

సీసం PbH4హైడ్రైడ్‌ను ఏర్పరుస్తుంది. సీసం ఫ్లోరిన్, క్లోరిన్‌లతో డైహాలైడ్‌లు, టెట్రాహలైడ్‌లను ఏర్పరుస్తుంది. డైబ్రోమైడ్, డయోడైడ్‌లను ఏర్పరుస్తుంది, అయినప్పటికీ సీసంలోని టెట్రాబ్రోమైడ్, టెట్రాయోడైడ్ అస్థిరంగా ఉంటాయి. సీసం నాలుగు ఆక్సైడ్‌లను - ఒక సల్ఫైడ్, సెలీనైడ్, టెల్యురైడ్ - ఏర్పరుస్తుంది,[7]


ఫ్లెరోవియం సమ్మేళనాలేమీ లేవు.[8]

భౌతిక ధర్మాలు

[మార్చు]

కార్బన్ గ్రూపులో మూలకాల మరిగే పాయింట్లు భారీ మూలకాలకు వెళ్ళేకొద్దీ తగ్గుతాయి. కార్బన్ సమూహంలో అత్యంత తేలికైన మూలకం కార్బన్, 3825 °C వద్ద ఉత్పతనం [గమనికలు 1]చెందుతుంది. సిలికాన్ మరిగే స్థానం 3265 °C, జెర్మేనియం 2833 °C, టిన్ 2602 °C, సీసం 1749 °C. ఫ్లెరోవియంను -60°C వద్ద మరుగుతుందని అంచనా వేసారు. [9] [10] కార్బన్ సమూహ మూలకాల ద్రవీభవన బిందువులు వాటి మరిగే బిందువుల వలె అదే ధోరణిని కలిగి ఉంటాయి. సిలికాన్ 1414 °C వద్ద కరుగుతుంది. జెర్మేనియం 939 °C వద్ద, టిన్ 232 °C వద్ద, సీసం 328 °C వద్ద కరుగుతాయి. [11]

కార్బన్ క్రిస్టల్ నిర్మాణం షట్కోణంగా ఉంటుంది; అధిక పీడనాలు, ఉష్ణోగ్రతల వద్ద అది వజ్రాన్ని ఏర్పరుస్తుంది. సిలికాన్, జెర్మేనియంలు, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద టిన్ (13.2 °C కంటే తక్కువ) డైమండ్ క్యూబిక్ క్రిస్టల్ నిర్మాణాలను కలిగి ఉంటాయి. గది ఉష్ణోగ్రత వద్ద టిన్ టెట్రాగోనల్ క్రిస్టల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సీసం ఫేస్ సెంటర్‌డ్ క్యూబిక్ క్రిస్టల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. [11]

కార్బన్ గ్రూప్ మూలకాల సాంద్రతలు పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ పెరుగుతూ పోతాయి. కార్బన్ సాంద్రత క్యూబిక్ సెంటీమీటర్‌కు 2.26 గ్రాములు, సిలికాన్ సాంద్రత క్యూబిక్ సెంటీమీటర్‌కు 2.33 గ్రాములు, జెర్మేనియం సాంద్రత క్యూబిక్ సెంటీమీటర్‌కు 5.32 గ్రాములు. టిన్ సాంద్రత క్యూబిక్ సెంటీమీటర్‌కు 7.26 గ్రాములు ఉండగా, సీసం 11.3 గ్రాముల సాంద్రత కలిగి ఉంటుంది. [11]

కార్బన్ సమూహ మూలకాల పరమాణు వ్యాసార్థాలు పరమాణు సంఖ్య పెరిగే కొద్దీ పెరుగుతాయి. కార్బన్ పరమాణు వ్యాసార్థం 77 పీకోమీటర్లు, సిలికాన్ 118 పికోమీటర్లు, జెర్మేనియం 123 పికోమీటర్లు, టిన్ 141 పికోమీటర్లు, సీసం 175 పికోమీటర్లు. [11]


ఐసోటోపులు

[మార్చు]

కార్బన్‌కు 15 ఐసోటోపులు ఉన్నాయి. వీటిలో మూడు సహజసిద్ధమైనవే. అత్యంత సాధారణమైనది స్థిరమైన కార్బన్-12, తరువాత స్థిరమైన కార్బన్-13. [11] కార్బన్-14 అనేది 5,730 సంవత్సరాల అర్ధ-జీవితాన్ని కలిగి ఉన్న సహజ రేడియోధార్మిక ఐసోటోప్. [12]

సిలికాన్‌కు 23 ఐసోటోపులు ఉన్నాయి. వీటిలో ఐదు సహజసిద్ధమైనవే. అత్యంత సాధారణమైనది స్థిరమైన సిలికాన్-28, తరువాతవి స్థిర సిలికాన్-29, స్థిర సిలికాన్-30. సిలికాన్-32 అనేది రేడియోధార్మిక ఐసోటోప్, ఇది ఆక్టినైడ్స్ యొక్క రేడియోధార్మిక క్షయం ఫలితంగా, ఎగువ వాతావరణంలో స్పేలేషన్ ద్వారా సహజంగా సంభవిస్తుంది. ఆక్టినైడ్‌ల రేడియోధార్మిక క్షయం ఫలితంగా సిలికాన్-34 కూడా సహజంగా సంభవిస్తుంది. [12]

జెర్మేనియంకు 32 ఐసోటోపులు ఉన్నాయి. వీటిలో ఐదు సహజసిద్ధమైనవే. అత్యంత సాధారణమైనది స్థిర ఐసోటోప్ జెర్మేనియం-74. తరువాతవి స్థిర ఐసోటోప్ జెర్మేనియం-72, స్థిర ఐసోటోప్ జెర్మేనియం-70, స్థిర ఐసోటోప్ జెర్మేనియం-73. ఐసోటోప్ జెర్మేనియం-76 ఒక ఆదిమ రేడియో ఐసోటోప్. [12]


టిన్‌కు 40 ఐసోటోపులు ఉన్నాయి. వీటిలో 14 ప్రకృతిలో సంభవిస్తాయి. అత్యంత సాధారణమైనది టిన్-120, తర్వాత టిన్-118, టిన్-116, టిన్-119, టిన్-117, టిన్-124, టిన్-122, టిన్-112, టిన్-114: ఇవన్నీ స్థిరంగా ఉంటాయి. యురేనియం రేడియోధార్మిక క్షయం ఫలితంగా సంభవించే నాలుగు రేడియో ఐసోటోప్‌లు కూడా టిన్‌లో ఉన్నాయి. ఈ ఐసోటోపులు టిన్-121, టిన్-123, టిన్-125, టిన్-126. [12]

సీసంకు 38 ఐసోటోపులు ఉన్నాయి. వీటిలో 9 సహజంగా సంభవించేవి. అత్యంత సాధారణ ఐసోటోప్ సీసం-208, తరువాత సీసం-206, సీసం-207, సీసం-204: ఇవన్నీ స్థిరంగా ఉంటాయి. యురేనియం, థోరియంల రేడియోధార్మిక క్షయం నుండి 4 సీసం ఐసోటోపులు ఏర్పడతాయి. అవి సీసం-209, సీసం-210, సీసం-211, సీసం-212. [12]

ఫ్లెరోవియంకు 6 ఐసోటోప్‌లు (ఫ్లెరోవియం-284, ఫ్లెరోవియం-285, ఫ్లెరోవియం-286, ఫ్లెరోవియం-287, ఫ్లెరోవియం-288, ఫ్లెరోవియం-289) ఉన్నాయి. ఇవేవీ సహజంగా లభించేవి కావు. ఫ్లెరోవియం యొక్క అత్యంత స్థిరమైన ఐసోటోప్ ఫ్లెరోవియం-289, దీని అర్ధ జీవితం 2.6 సెకండ్లు. [12]

ఉపయోగాలు

[మార్చు]

కార్బన్ సాధారణంగా దాని నిరాకార రూపంలో ఉపయోగించబడుతుంది. ఈ రూపంలో, కార్బన్‌ను ఉక్కు తయారీకి, కార్బన్ బ్లాక్‌గా, టైర్‌లలో నింపడానికి, రెస్పిరేటర్‌లలో, యాక్టివేటెడ్ చార్‌కోల్‌గా ఉపయోగిస్తారు. కార్బన్ గ్రాఫైట్ రూపంలో కూడా ఉపయోగపడుతుంది. దీనిని సాధారణంగా పెన్సిల్‌లలో ముక్కుగా ఉపయోగిస్తారు. కార్బన్ యొక్క మరొక రూపమైన వజ్రాన్ని సాధారణంగా నగలలో ఉపయోగిస్త్తారు. [12] కార్బన్ ఫైబర్‌లను శాటిలైట్ స్ట్రట్‌ల వంటి అనేక అనువర్తనాల్లో ఉపయోగిస్తారు ఎందుకంటే ఫైబర్‌లు చాలా బలంగా, సాగే గుణం కలిగి ఉంటాయి. [13]

సిలికాన్ డయాక్సైడ్‌కు టూత్‌పేస్ట్, నిర్మాణ పూరకాలతో సహా అనేక రకాల ఉపయోగాలున్నాయి. సిలికా, గాజులో ప్రధాన భాగం. స్వచ్ఛమైన సిలికాన్‌లో సగ భాగాన్ని లోహ మిశ్రమాల తయారీ లోనే వాడతారు. మరో 45 శాతాన్ని సిలికాన్‌ల తయారీలో వాడతారు. 1950ల నుండి సిలికాన్‌ను సాధారణంగా సెమీకండక్టర్లలో కూడా ఉపయోగిస్తున్నారు. [14] [13]

జెర్మేనియం 1950ల వరకు సెమీకండక్టర్లలో ఉపయోగించేవారు. దాని స్థానంలో సిలికాన్ వచ్చింది. [14] రేడియేషన్ డిటెక్టర్లలో జెర్మేనియం ఉంటుంది. జెర్మేనియం డయాక్సైడ్‌ను ఫైబర్ ఆప్టిక్స్, వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్‌లలో ఉపయోగిస్తారు. వెండిలో జెర్మేనియంను కొద్ది మొత్తంలో అది వెండిని మసకబారకుండా చేస్తుంది. ఫలితంగా ఏర్పడే మిశ్రమాన్ని అర్జెంటియం అంటారు. [12]

టిన్ యొక్క అతి ముఖ్యమైన ఉపయోగం టంకము ; ఉత్పత్తి అయిన మొత్తం టిన్‌లో 50% దీనికే వెళుతుంది. మరో 20% టిన్ ప్లేట్‌లో ఉపయోగిస్తారు. మరో 20% టిన్ ను రసాయన పరిశ్రమలో ఉపయోగిస్తారు. ప్యూటర్‌తో సహా అనేక మిశ్రమాలలో టిన్ కూడా ఒక భాగం. టిన్ (IV) ఆక్సైడ్ సాధారణంగా వేల సంవత్సరాలుగా సిరామిక్స్‌లో ఉపయోగించబడుతోంది. కోబాల్ట్ స్టానేట్ అనేది ఒక టిన్ సమ్మేళనం, ఇది సెరూలియన్ బ్లూ పిగ్మెంట్‌గా ఉపయోగించబడుతుంది. [12]

ఉత్పత్తి చేయబడిన మొత్తం సీసంలో 80% లెడ్-యాసిడ్ బ్యాటరీలలోకి వెళుతుంది. సీసాన్ని బరువులు, వర్ణద్రవ్యాలు, రేడియోధార్మిక పదార్థాలకు వ్యతిరేకంగా రక్షణగానూ వాడతారు. లెడ్ చారిత్రికంగా టెట్రాఇథైలీడ్ రూపంలో గ్యాసోలిన్‌లో ఉపయోగించబడింది, అయితే విషపూరితం అనే ఆందోళనల కారణంగా ఈ వాడుకను నిలిపివేసారు. [15]

జీవ పాత్ర

[మార్చు]

తెలిసిన జీవులన్నిటి లోనూ కార్బన్ కీలకమైన మూలకం. ఇది అన్ని సేంద్రీయ సమ్మేళనాలలో ఉంటుంది, ఉదాహరణకు, DNA, స్టెరాయిడ్లు, ప్రోటీన్లు. [4] జీవానికి కార్బన్‌కు ఉన్న ప్రాముఖ్యత, అది ఇతర మూలకాలతో అనేక బంధాలను ఏర్పరుచుకునే సామర్థ్యం కారణంగా ఏర్పడింది. [14] సాధారణంగా 70 కిలోగ్రాముల మనిషిలో 16 కిలోగ్రాముల కార్బన్ ఉంటుంది. [12]

సిలికాన్ ఆధారిత జీవుల సాధ్యత సాధారణంగా చర్చనీయాంశం. అయితే, విస్తృతమైన వలయాలు, గొలుసులను రూపొందించే సామర్థ్యం కార్బన్ కంటే దీనికి తక్కువ ఉంటుంది. [4] సిలికాన్ డయాక్సైడ్ రూపంలో ఉన్న సిలికాన్‌ను డయాటమ్‌లు, సముద్రపు స్పాంజ్‌లు వాటి సెల్ గోడలు, అస్థిపంజరాలను రూపొందించడానికి ఉపయోగిస్తాయి. కోళ్లు, ఎలుకలలో ఎముకల పెరుగుదలకు సిలికాన్ అవసరం. మానవులలో కూడా అవసరం కావచ్చు. మానవులు రోజుకు సగటున 20 నుండి 1200 మిల్లీగ్రాముల సిలికాన్‌ను వినియోగిస్తారు - ఎక్కువగా తృణధాన్యాల నుండి. సాధారణ 70 కిలోగ్రాముల మానవునిలో 1 గ్రాము సిలికాన్ ఉంటుంది. [12]

జెర్మేనియంకు జీవసంబంధమైన పాత్ర ఎంత ఉందో తెలియనప్పటికీ ఇది జీవక్రియను ప్రేరేపిస్తుంది. 1980లో, జెర్మేనియం ఆరోగ్యానికి మేలు చేస్తుందని కజుహికో అసై నివేదించారు, అయితే అది నిరూపించబడలేదు. కొన్ని మొక్కలు జెర్మేనియం ఆక్సైడ్ రూపంలో మట్టి నుండి జెర్మేనియం తీసుకుంటాయి. ధాన్యాలు, కూరగాయలతో కూడిన ఈ మొక్కలలో మిలియనుకు దాదాపు 0.05 భాగాలు జెర్మేనియం ఉంటుంది. మానవులు రోజుకు 1 మిల్లీగ్రాము జెర్మేనియం తీసుకుంటారని అంచనా. సాధారణ 70 కిలోగ్రాముల మానవునిలో 5 మిల్లీగ్రాముల జెర్మేనియం ఉంటుంది. [12]

ఎలుకలలో సరైన పెరుగుదలకు టిన్ అవసరం అని తేలింది. అయితే 2013 నాటికి, మానవుల ఆహారంలో టిన్ అవసరమని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవు. మొక్కలకు టిన్ అవసరం లేదు. అయినప్పటికీ, మొక్కలు వాటి మూలాలలో టిన్ను సేకరిస్తాయి. గోధుమ, మొక్కజొన్నలో మిలియన్‌కి ఏడు, మూడు భాగాలు ఉంటాయి. అయినప్పటికీ, మొక్కలు టిన్ స్మెల్టర్‌కు సమీపంలో ఉన్నట్లయితే మొక్కలలో టిన్ స్థాయి మిలియన్‌కు 2000 భాగాలకు చేరుకుంటుంది. సగటున, మానవులు రోజుకు 0.3 మిల్లీగ్రాముల టిన్ను వినియోగిస్తారు. సాధారణంగా 70 కిలోగ్రాముల మనిషిలో 30 మిల్లీగ్రాముల టిన్ ఉంటుంది. [12]


సీసంకు జీవసంబంధమైన పాత్ర ఏదీ ఉన్నట్లు తెలియదు. నిజానికి ఇది అత్యంత విషపూరితమైనది. అయితే కొన్ని సూక్ష్మజీవులు సీసం-కలుషితమైన పరిసరాలలో జీవించగలుగుతాయి. దోసకాయల వంటి కొన్ని మొక్కల్లో మిలియన్ పదుల భాగాల వరకు సీసం ఉంటుంది. సాధారణ 70 కిలోగ్రాముల మానవునిలో 120 మిల్లీగ్రాముల సీసం ఉంటుంది. [12]

ఫ్లెరోవియంకు జీవసంబంధమైన పాత్ర లేదు. ఇది కణ యాక్సిలరేటర్లలో మాత్రమే తయారవుతుంది.

విషం

[మార్చు]

కార్బన్ మూలకం సాధారణంగా విషపూరితం కాదు. కానీ కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోజన్ సైనైడ్ వంటి అనేక సమ్మేళనాలు చాలా విషపూరితం. అయితే, కార్బన్ ధూళి ఆస్బెస్టాస్ మాదిరిగానే ఊపిరితిత్తులలో చేరడం ప్రమాదకరం. [12]

సిలికాన్ ఖనిజాలు సాధారణంగా విషపూరితమైనవి కావు. అయితే, అగ్నిపర్వతాల ద్వారా వెలువడే సిలికాన్ డయాక్సైడ్ ధూళి ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తే ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తుంది. [14]

జెర్మేనియం లాక్టేట్, ఆల్కహాల్ డీహైడ్రోజినేస్ వంటి ఎంజైమ్‌లతో జోక్యం చేసుకోవచ్చు. సేంద్రీయ జెర్మేనియం సమ్మేళనాలు అకర్బన జెర్మేనియం సమ్మేళనాల కంటే ఎక్కువ విషపూరితమైనవి. జెర్మేనియం, జంతువులలో నోటి ద్వారా విషపూరితం కావడం తక్కువ. తీవ్రమైన జెర్మేనియం విషం శ్వాసకోశ పక్షవాతానికి తద్వారా మరణానికి కారణమవుతుంది. [16]

కొన్ని టిన్ సమ్మేళనాలు తీసుకోవడం విషపూరితం, కానీ టిన్ యొక్క చాలా అకర్బన సమ్మేళనాలు నాన్‌టాక్సిక్‌గా పరిగణించబడతాయి. ట్రైమిథైల్ టిన్, ట్రైథైల్ టిన్ వంటి సేంద్రీయ టిన్ సమ్మేళనాలు అత్యంత విషపూరితమైనవి. కణాల లోపల జీవక్రియ ప్రక్రియలకు ఇవి అంతరాయం కలిగిస్తాయి. [12]

సీసం, దాని సమ్మేళనాలు, సీసం అసిటేట్‌లు అత్యంత విషపూరితమైనవి. సీసం పాయిజనింగ్ తలనొప్పి, కడుపు నొప్పి, మలబద్ధకం, గౌట్‌లకు కారణమవుతుంది. [12]

ఫ్లెరోవియం చాలా రేడియోధార్మికమైనది - అది విషపూరితమా కాదా అనేది పరీక్షించలేం. అయినప్పటికీ దాని అధిక రేడియోధార్మికతే అత్యంత విషపూరితం.

గమనికలు

[మార్చు]
  1. ఘనస్థితి నుండి నేరుగా వాయు రూపానికి మారడం

మూలాలు

[మార్చు]
  1. W. B. Jensen, The Periodic Law and Table Archived 2020-11-10 at the Wayback Machine.
  2. Carbon compounds, retrieved January 24, 2013
  3. Silicon compounds, retrieved January 24, 2013
  4. 4.0 4.1 4.2 Gray, Theodore (2011), The Elements
  5. Germanium compounds, retrieved January 24, 2013
  6. Tin compounds, retrieved January 24, 2013
  7. Lead compounds, retrieved January 24, 2013
  8. Flerovium compounds, retrieved January 24, 2013
  9. Archived at Ghostarchive and the Oganessian, Yu. Ts. (27 January 2017). "Discovering Superheavy Elements". Oak Ridge National Laboratory. Archived from the original on 30 ఏప్రిల్ 2017. Retrieved 21 April 2017.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link): Oganessian, Yu. Ts. (27 January 2017). "Discovering Superheavy Elements". Oak Ridge National Laboratory. Retrieved 21 April 2017.
  10. Seaborg, G. T. "Transuranium element". Encyclopædia Britannica. Retrieved 2010-03-16.
  11. 11.0 11.1 11.2 11.3 11.4 Jackson, Mark (2001), Periodic Table Advanced
  12. 12.00 12.01 12.02 12.03 12.04 12.05 12.06 12.07 12.08 12.09 12.10 12.11 12.12 12.13 12.14 12.15 12.16 Emsley, John (2011), Nature's Building Blocks
  13. 13.0 13.1 Galan, Mark (1992), Structure of Matter, ISBN 0-809-49663-1
  14. 14.0 14.1 14.2 14.3 Kean, Sam (2011), The Disappearing Spoon
  15. Blum, Deborah (2010), The Poisoner's Handbook
  16. Risk Assessment (PDF), 2003, archived from the original on January 12, 2012, retrieved January 19, 2013