అయాన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అణువు లేదా బహుళ అణువుల్లో ఎలక్ట్రాన్ల సంఖ్య ప్రోటాన్ల సంఖ్య సమానంగా లేకుంటే దానిని అయాన్ అని వ్యవహరిస్తారు. దీనివల్ల అయాన్ ధనావేశం లేదా ఋణావేశం కలిగిఉంటుంది. అయాన్లను రసాయనిక లేదా భౌతిక పద్ధతుల ద్వారా లేదా అయనైజేషన్ ప్రక్రియ ద్వారా సృష్టించవచ్చు.

రసాయనిక శాస్త్ర పదజాలం ప్రకారం ఏదైనా తటస్థ అణువు ఒకటి లేదా అంతకన్నా కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు కోల్పోతే దానికి ధనావేశం వస్తుంది. దాన్ని కాటయాన్ అని వ్యవహరిస్తారు. అదే విధంగా ఏదైనా అణువు ఎలక్ట్రాన్లను పొందితే దానికి ఋణావేశం వస్తుంది. దాన్ని ఆనయాన్ అని వ్యవహరిస్తారు.

ఒకే అణువు కలిగిన అయాన్లను మోనో అటామిక్ (ఏక అణు) అయాన్లనీ, బహుళ అణువులు కలిగిన అయాన్లను పాలీఅటామిక్ అయాన్లనీ వ్యవహరించవచ్చు. వాటికి ఉండే విద్యుదావేశాల వల్ల అయాన్లు పరస్పరం ఆకర్షించుకుని లవణాలు (సాల్ట్) లాంటి అయానిక్ సంయోజనాలుగా (అయానిక్ కాంపౌండ్లు) ఏర్పడతాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=అయాన్&oldid=1881706" నుండి వెలికితీశారు