పరమాణు సంఖ్య

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

'"పరమాణు సంఖ్య"' అనగా 'పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య ' లేక ' తటస్థ పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్య '. దీనిని Z అనే అక్షరంలతో సూచిస్తారు. ఈ అక్షరం జర్మన్ పదం Atomzahl(పరమాణు సంఖ్య) నుండి వచ్చినది.

ఉదాహరణలు[మార్చు]

  • హైడ్రోజన్ పరమాణు కేంద్రకం లో ఒక ప్రోటాన్ ఉంటుంది. కేంద్రకం చుట్టూ ఒక ఎలక్ట్రాన్ స్థిర కక్ష్యలో తిరుగుతుంది. అందువలన హైడ్రోజన్ పరమాణు సంఖ్య=1.
  • సోడియం పరమాణు కేంద్రకం లో 11 ప్రోటాన్లు ఉంటాయి. అందువలన దాని పరమాణు సంఖ్య=11.

వివరణ[మార్చు]

  • సాధారణంగా తటస్థ పరమాణువులో ఎలక్ట్రాన్ల సంఖ్య ప్రోటాన్ల సంఖ్య కు సమానంగా ఉంటుంది. కనుక తటస్థ పరమాణువులో పరమాణుసంఖ్య = ప్రోటాన్ల సంఖ్య లేక ఎలక్ట్రాన్ల సంఖ్య.
  • తటస్థ సోడియం పరమాణువు యొక్క పరమాణు సంఖ్య=11,
  • సోడియం అయాన్ ను తీసుకొన్నపుడు అందులో ప్రోటాన్లు 11 ఉండును. కాని ఎలక్ట్రాన్లు 10 మాత్రమే ఉండును.
  • కనుక పరమాను సంఖ్య అనగా కేంద్రకం లోని ప్రోటాన్ల సంఖ్య.


పరమాణు సంఖ్య రసాయన శాస్త్రం ఇంకా భౌతిక, అణు సంఖ్య (కూడా ప్రోటాన్ సంఖ్య అని పిలుస్తారు) ఒక అణువు మరియు న్యూక్లియస్ బాధ్యతలు సంఖ్యలో అందువలన ఒకేలా కేంద్రకంలో ప్రోటాన్లు దొరకలేదు యొక్క సంఖ్య. ఇది సాంప్రదాయంగా చిహ్నం Z. ప్రాతినిధ్యం వహిస్తుంది పరమాణు సంఖ్య ప్రత్యేకంగా ఒక రసాయన మూలకం గుర్తిస్తుంది. తటస్థ ఛార్జ్ ఒక అణువు లో, పరమాణు సంఖ్య కూడా ఎలక్ట్రాన్ల సంఖ్య సమానము.

పరమాణు సంఖ్య, Z, మాస్ సంఖ్యలో తికమకపడకూడదు, ఎ, ఒక అణువు యొక్క కేంద్రకంలో ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు సంఖ్య ఇది ఉంది. న్యూట్రాన్లతో సంఖ్య, N, అణువు యొక్క న్యూట్రాన్ సంఖ్య అంటారు; కాబట్టి, = Z + ఎన్ ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు సుమారు అదే మాస్ కలిగి నుండి (మరియు ఎలక్ట్రాన్ల మాస్ అనేక ప్రయోజనాల కోసం దాదాపు ఉంది), మరియు మాస్ లోపము మాస్ పోలిస్తే సాధారణంగా చాలా చిన్నది, ఒక అణువు యొక్క అణు మాస్ ఎ దాదాపు సమానంగా ఉంటుంది

అదే పరమాణు సంఖ్య Z కానీ వివిధ న్యూట్రాన్ సంఖ్య N, మరియు అందుకే వివిధ అణు మాస్ కలిగి అణువులు, ఐసోటోపులు పిలుస్తారు. అత్యంత సహజంగా మూలకాలు ఐసోటోపులు మిశ్రమం గా ఉన్నాయి సంభవించే, మరియు ఈ మిశ్రమం సగటు అణు మాస్ మూలకం యొక్క అణు బరువు నిర్ణయిస్తుంది.

చరిత్ర[మార్చు]

నవీన ఆవర్తన పట్టిక లో మూలకాలు క్రమం పరమాణు సంఖ్య ఆధారంగా అమరి ఉన్నాయి. అనగా పరమాణు సంఖ్య ఆవర్తన పట్టిక కు ఒక క్రమాన్ని నిర్దేశించింది.అవర్తన పట్టికలో మూలకాల పరమాణు సంఖ్యల ఆధారంగా ఎలక్ట్రాన్ విన్యాసం నందు వేలన్సీ ఎలక్ట్రాన్ విన్యాసం అనుసరించి గ్రూపులు అమరి ఉంటాయి.మెండలీఫ్ ఆవర్తన నియమం ప్రకారం మూలకాల ధర్మాలు పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు. దీని ప్రకారం ఆవర్తన పట్టికలో అయొడిన్ మూలకం(పరమాణు భారం127.6) తర్వాత టెల్లూరియం(పరమాణు భారం 127.6) ఉండాలి. కాని ధర్మాల ఆధారం గా ఈ నియమాన్ని అతిక్రమించి అయొడిన్ మూలకం ముందు టెల్లూరియం మూలకాన్ని అమర్చినాడు.ఈ అమరిక పరమాణు సంఖ్య ఆధారంగా ఉన్నది అని తెలియుచున్నది.ఆవర్తన పట్టిక లో మూలకాల భారాల ఆధారంగా అమరిక సంతృప్తి కరంగా లేదని గమనించారు. అదే విధంగా టెల్లూరియం తర్వాత మూలకాలైన ఆర్గాన్ మరియు పొటాషియం,కోబాల్ట్ మరియు నికెల్ జంటలు కూడా పరమాణు భారాల ఆధారంగా అమర్చినపుడు వాటి లక్షణాలలో లోపం కనిపించింది. వాటి రసాయన లక్షణాల ఆధారంగా అమరిస్తే పరమాణు భారాలు ఒకెలా ఉన్నాయి లేదా తారుమారు అయినాయి. అదే విధంగా ఆవర్తన పట్టికలో దిగువన గల లాంధనైడ్లు లో కూడా లుటేషియం నుండి అన్ని మూలకాలు పరమాణు భార క్రమంలో అమరిస్తే అనేక అసంగతాలకు దారి తీస్తున్నాయి. అందువల్ల మూలకాల ధర్మాలకు ఆవర్తన ప్రమేయాలుగా ఒక నిర్ధిష్ట సంఖ్య అవసరమై యున్నది. ఆ సంఖ్యయే పరమాణు సంఖ్య.

ఇవి కూడా చూడండి[మార్చు]