ఐసోటోపులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఐసోటోపులు అంటే "ఒకే స్థానంలో ఉండేవి" అని అర్థం. ఈ భావాన్ని తెలుగులో సమస్థానులు లేదా ఏకస్థానులు అంటారు.

మెండలియెవ్ ఆవర్తన పట్టికలో మూలకానికి ఒకొక్క గది చొప్పున కేటాయించేరు. మూలకం కేంద్రకంలో ఎన్ని ప్రోటానులు ఉన్నాయో ఆ సంఖ్యని బట్టి ఈ కేటాయింపు జరిగింది. ఉదాహరణకి ఉదజని అణువు యొక్క కేంద్రకంలో ఒకే ఒక ప్రోటాను ఉంది; అందుకని ఒకటవ గది ఉదజనికి కేటాయించేరు. రవిజని (Helium) అణువు కేంద్రకంలో రెండే రెండు ప్రోటానులు ఉన్నాయి; అందుకని రెండవ గది రవిజనికి కేటాయించేరు. కాని కొన్ని కొన్ని మూలకాల అణువులు అన్ని విధాల సర్వసమానంగా ఉండవు. ఉదాహరణకి ప్రకృతిలో మూడు రకాల ఉదజని అణువులు ఉన్నాయి.

  • ఒక రకం ఉదజని అణువు లో 1 ప్రోటాను ఉంది. ప్రకృతిలో ఇది 99.98% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 1. దీనిని 1H1 అని సూచిస్తారు.
  • రెండవ రకం ఉదజని అణువు లో 1 ప్రోటాను, 1 నూట్రాను ఉన్నాయి. ప్రకృతిలో ఇది 0.018% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 2. దీనిని 1H2 అని సూచిస్తారు. దీనికి ఉదజని-2 అనిన్నీ డ్యూటీరియం అనిన్నీ పేర్లు ఉన్నాయి.
  • మూడవ రకం ఉదజని అణువు లో 1 ప్రోటాను, 2 నూట్రానులు ఉన్నాయి. ప్రకృతిలో ఇది 0.002% లభిస్తుంది. దీని గరిమ సంఖ్య 3. దీనిని 1H3 అని రాస్తారు. దీనికి ఉదజని-3 అనిన్నీ ట్రిటియం అనిన్నీ పేర్లు ఉన్నాయి.

కాని రసాయనికంగా ఈ మూడు ఉదజని అణువులే! కనుక ఈ మూడింటికి ఆవర్తన పట్టికలో ఒకే గది కేటాయించాలి. అంటే ఇవి "రూం మేట్స్" అన్న మాట. ఒకే గది (లేక స్థానం) లో ఉన్నవి కనుక వీటిని "సమస్థానులు" లేదా "ఏకస్థానులు" అందాం. గ్రీకు భాషలో ఐసొటోపులు అన్నా తెలుగులో సమస్థానులు అన్నా అర్థం ఒక్కటే!

ఉదాహరణలు[మార్చు]

  1. యురేనియం ఐసోటోపులు 92U235 , 92U238

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]