చర్చ:పరమాణు సంఖ్య
Jump to navigation
Jump to search
నిర్వచనము
[మార్చు]- "పరమాణు సంఖ్య" అనగా 'పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య ' లేక ' తటస్థ పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్య '.
- దీనిని Z అనే అక్షరంలతో సూచిస్తారు.
ఉదాహరణలు
[మార్చు]- హైడ్రోజన్ పరమాణు కేంద్రకం లో ఒక ప్రోటాన్ ఉంటుంది. కేంద్రకం చుట్టూ ఒక ఎలక్ట్రాన్ స్థిర కక్ష్యలో తిరుగుతుంది. అందువలన హైడ్రోజన్ పరమాణు సంఖ్య=1.
- సోడియం పరమాణు కేంద్రకం లో 11 ప్రోటాన్లు ఉంటాయి. అందువలన దాని పరమాణు సంఖ్య=11.
వివరణ
[మార్చు]- సాధారణంగా తటస్థ పరమాణువులో ఎలక్ట్రాన్ల సంఖ్య ప్రోటాన్ల సంఖ్య కు సమానంగా ఉంటుంది. కనుక తటస్థ పరమాణువులో పరమాణుసంఖ్య = ప్రోటాన్ల సంఖ్య లేక ఎలక్ట్రాన్ల సంఖ్య.
- తటస్థ సోడియం పరమాణువు యొక్క పరమాణు సంఖ్య=11,
- సోడియం అయాన్ ను తీసుకొన్నపుడు అందులో ప్రోటాన్లు 11 ఉండును. కాని ఎలక్ట్రాన్లు 10 మాత్రమే ఉండును.
- కనుక పరమాను సంఖ్య అనగా కేంద్రకం లోని ప్రోటాన్ల సంఖ్య.(Kvr.lohith (చర్చ) 07:51, 18 నవంబర్ 2012 (UTC))
చరిత్ర అనే అంశం తొలగింపు గూర్చి
[మార్చు]పరమాణు సంఖ్య యొక్క చరిత్ర అర్థవంతంగా లేదు. నా అభిప్రాయం ప్రకారం యంత్రం ఆంగ్ల భాషను తర్జుమా చేసినట్లుంది. దీనిని తొలగిస్తే మంచిదని నా అభిప్రాయం(Kvr.lohith (చర్చ) 10:54, 2 డిసెంబర్ 2012 (UTC))
- ఆ విభాగం యంత్రం ద్వారా అనువాదం చేసి చేర్చినది కావచ్చు. మీరు దాన్ని శుద్ధి చేయవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 11:08, 2 డిసెంబర్ 2012 (UTC)
శుద్ధి చేయుటకు అనుమతినిచ్చినందుకు ధన్యవాదాలు.(106.206.62.86 11:16, 2 డిసెంబర్ 2012 (UTC))