లిథియం

వికీపీడియా నుండి
(Lithium నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
లిథియం
3Li
హైడ్రోజన్ (diatomic nonmetal)
హీలియం (noble gas)
లిథియం (alkali metal)
బెరీలియం (alkaline earth metal)
బోరాన్ (metalloid)
కార్బన్ (polyatomic nonmetal)
నైట్రోజన్ (diatomic nonmetal)
ఆక్సిజన్ (diatomic nonmetal)
ఫ్లోరిన్ (diatomic nonmetal)
నియాన్ (noble gas)
సోడియం (alkali metal)
మెగ్నీషియం (alkaline earth metal)
అల్యూమినియం (poor metal)
సిలికాన్ (metalloid)
పాస్పరస్ (polyatomic nonmetal)
సల్ఫర్ (polyatomic nonmetal)
క్లోరిన్ (diatomic nonmetal)
ఆర్గాన్ (noble gas)
పొటాషియం (alkali metal)
కాల్షియం (alkaline earth metal)
Scandium (transition metal)
Titanium (transition metal)
Vanadium (transition metal)
Chromium (transition metal)
Manganese (transition metal)
Iron (transition metal)
Cobalt (transition metal)
Nickel (transition metal)
Copper (transition metal)
Zinc (transition metal)
Gallium (poor metal)
Germanium (metalloid)
Arsenic (metalloid)
Selenium (polyatomic nonmetal)
Bromine (diatomic nonmetal)
Krypton (noble gas)
Rubidium (alkali metal)
Strontium (alkaline earth metal)
Yttrium (transition metal)
Zirconium (transition metal)
Niobium (transition metal)
Molybdenum (transition metal)
Technetium (transition metal)
Ruthenium (transition metal)
Rhodium (transition metal)
Palladium (transition metal)
Silver (transition metal)
Cadmium (transition metal)
Indium (poor metal)
Tin (poor metal)
Antimony (metalloid)
Tellurium (metalloid)
Iodine (diatomic nonmetal)
Xenon (noble gas)
Caesium (alkali metal)
Barium (alkaline earth metal)
Lanthanum (lanthanoid)
Cerium (lanthanoid)
Praseodymium (lanthanoid)
Neodymium (lanthanoid)
Promethium (lanthanoid)
Samarium (lanthanoid)
Europium (lanthanoid)
Gadolinium (lanthanoid)
Terbium (lanthanoid)
Dysprosium (lanthanoid)
Holmium (lanthanoid)
Erbium (lanthanoid)
Thulium (lanthanoid)
Ytterbium (lanthanoid)
Lutetium (lanthanoid)
Hafnium (transition metal)
Tantalum (transition metal)
Tungsten (transition metal)
Rhenium (transition metal)
Osmium (transition metal)
Iridium (transition metal)
Platinum (transition metal)
Gold (transition metal)
Mercury (transition metal)
Thallium (poor metal)
Lead (poor metal)
Bismuth (poor metal)
Polonium (poor metal)
Astatine (metalloid)
Radon (noble gas)
Francium (alkali metal)
Radium (alkaline earth metal)
Actinium (actinoid)
Thorium (actinoid)
Protactinium (actinoid)
Uranium (actinoid)
Neptunium (actinoid)
Plutonium (actinoid)
Americium (actinoid)
Curium (actinoid)
Berkelium (actinoid)
Californium (actinoid)
Einsteinium (actinoid)
Fermium (actinoid)
Mendelevium (actinoid)
Nobelium (actinoid)
Lawrencium (actinoid)
Rutherfordium (transition metal)
Dubnium (transition metal)
Seaborgium (transition metal)
Bohrium (transition metal)
Hassium (transition metal)
Meitnerium (unknown chemical properties)
Darmstadtium (unknown chemical properties)
Roentgenium (unknown chemical properties)
Copernicium (transition metal)
Ununtrium (unknown chemical properties)
Flerovium (unknown chemical properties)
Ununpentium (unknown chemical properties)
Livermorium (unknown chemical properties)
Ununseptium (unknown chemical properties)
Ununoctium (unknown chemical properties)
H

Li

Na
హీలియంలిథియంబెరీలియం
ఆవర్తన పట్టిక లో లిథియం స్థానం
రూపం
silvery-white (shown floating in oil)


Spectral lines of lithium
సాధారణ ధర్మములు
మూలకం పేరు, రసాయన సంకేతం, పరమాణు సంఖ్య లిథియం, Li, 3
ఉచ్ఛారణ /ˈlɪθiəm/ LI-thee-əm
మూలక వర్గం క్షార లోహాలు
గ్రూపు, పీరియడ్, బ్లాకు group 1 (alkali metals), 2, s
ప్రామాణిక పరమాణు భారం 6.94(1)
ఎలక్ట్రాన్ విన్యాసం [He] 2s1
2, 1
చరిత్ర
ఆవిష్కరణ Johan August Arfwedson (1817)
మొదటి ఐసోలేషన్ William Thomas Brande (1821)
భౌతిక ధర్మములు
పదార్థ స్థితి solid
సాంద్రత (near r.t.) 0.534 g·cm−3
ద్రవీభవన స్థానం వద్ద ద్రవరూప సాంద్రత 0.512 g·cm−3
ద్రవీభవన స్థానం 453.65 K, 180.50 °C, 356.90 °F
మరుగు స్థానం 1615 K, 1342 °C, 2448 °F
క్రిటికల్ స్థానం (extrapolated)
3220 K, 67 MPa
సంలీనం యొక్క ఉష్ణం 3.00 kJ·mol−1
బాష్పీభవనోష్ణం 147.1 kJ·mol−1
మోలార్ హీట్ కెపాసిటీ 24.860 J·mol−1·K−1
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 797 885 995 1144 1337 1610
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు +1
(strongly basic oxide)
ఋణవిద్యుదాత్మకత 0.98 (Pauling scale)
అయనీకరణ శక్మములు 1st: 520.2 kJ·mol−1
2nd: 7298.1 kJ·mol−1
3rd: 11815.0 kJ·mol−1
పరమాణు వ్యాసార్థం 152 pm
సమయోజనీయ వ్యాసార్థం 128±7 pm
వాండర్ వాల్ వ్యాసార్థం 182 pm
వివిధ విషయాలు
స్ఫటిక నిర్మాణము body-centered cubic
లిథియం has a body-centered cubic crystal structure
అయస్కాంత పదార్థ రకం paramagnetic
విద్యున్నిరోధకత్వం మరియు వాహకత్వం (20 °C) 92.8 nΩ·m
ఉష్ణ వాహకత్వం 84.8 W·m−1·K−1
ఉష్ణ వ్యాకోచం (25 °C) 46 µm·m−1·K−1
ధ్వని వేగం (సన్నని కడ్డీ) (20 °C) 6000 m·s−1
యంగ్ గుణకం 4.9 GPa
షీర్ మాడ్యూల్ 4.2 GPa
బల్క్ మాడ్యూల్స్ 11 GPa
Mohs ధృఢత 0.6
సి.ఎ.యస్ రిజిస్ట్రీ సంఖ్య 7439-93-2
అతి స్థిరమైన ఐసోటోపులు
ప్రధానవ్యాసం: లిథియం యొక్క ఐసోటోపులు
iso NA అర్థజీవితకాలం DM DE (MeV) DP
6Li 7.5% Li, 3 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
7Li 92.5% Li, 4 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
6Li content may be as low as 3.75% in
natural samples. 7Li would therefore
have a content of up to 96.25%.
· సూచికలు

లిథియం (ఆంగ్లం: Lithium) ఒక క్షారమూలకం. ఇది ఒక లోహ మూలకం. మూలకాల ఆవర్తన పట్టికలో మొదటి సమూహం లేదా సముదాయానికి (group1) కు చెందిన మూలకం. సాధారణ పరిస్థితిలో ఘన రూపంలో ఉండూను. ఆవర్తనకాలం (period) రెండు, మరియు బ్లాకు S చెందినది. ఈ మూలకం యొక్క పేరు గ్రీకు పదమైన లిథోస్ (Lithos) నుండి వచ్చింది. లిథోస్ అనగా రాయి అని అర్థం .మూలకంలోని ఎలక్ట్రానుల సంఖ్య మూడు (3) [1].

చరిత్ర[మార్చు]

మొదటిగా 1790 లో Jozé Bonifácio de Andralda e Silva అనే బ్రెజిల్ దేశీయుడు లిథియం యొక్క ముడి ఖనిజం పేటలైట్ (petalite, LiAlSi4O10) ను స్విడిస్ యొక్క యుటో అనే దీవిలో గుర్తించాడు. మండించినప్పుడు ఇది క్రిమ్సన్ రంగుతో మండటం గుర్తించాడు. 1817 లో స్టాక్ హోమ దేశియుడు అయిన జోహన్ ఆగస్టు అర్ఫ్వేడ్సన్ (Johann August Arfvedson) అంతవరకు గుర్తించని కొత్త మూలకంగా గుర్తించి దానికి లిథియం అని పేరు నిర్ణయించాడు[2]. ఇది కొత్త క్షార లోహామని, సోడియం కన్నతేలికగా ఉన్నదని గుర్తించాడు. అయితే సోడియాన్ని వేరు చేసినట్లు, విద్యుత్ విశ్లేషణ ద్వారా లిథియాన్ని వేరు చెయ్యలేక పోయాడు.1821లో విలియం బ్రాండ్ చాలా స్వల్వ మోతాదులో లిథియంని వేరు చెయ్యగలిగాడు. చివరకు 1855లో జర్మనీ రసాయన శాస్త్రవేత్త రాబర్ట్ బున్సెన్ మరియు బ్రిటిషు శాస్త్రవేత్త ఆగస్టస్ మేథిస్సెన్‌తో కలిసి పెద్ద పరిమాణంలో లిథియాన్ని విద్యుత్తు విశ్లేషణ పద్ధతిలో లిథియాన్ని ముడిఖనిజం నుండి వేరుచెయ్యగలిగారు.

ఆది పుట్టుక[మార్చు]

విశ్వంలో బిగ్ బ్యాంగు (మహా విస్పోటనం) జరిగినప్పుడు ఏర్పడిన మొదటి మూడు మూలకాలలో మూడో మూలకం లిథియం. మిగతా రెండు హీలియం, హైడ్రోజన్ .కాని విశ్వంలో బెరీలియం మరియు బోరాన్ మరియు లిథియంల ఉనికి తక్కువ. కారణం లిథియం తక్కువ ఉష్ణోగ్రత వద్దనే నశించు లక్షణ కలిగి వుండుట.లిథియం విశ్వంలో చల్లగా ఉండే బ్రౌన్ మరుగుజ్జు నక్షత్రాలలో, ఆరెంజి నక్షత్రాలలో ఉన్నది

భౌతిక ధర్మాలు[మార్చు]

ఘనస్థితిలో లభ్యమగు మూలకాలలో ఎక్కువ విశిష్టోష్ణం కలిగిన మూలకం లిథియం. ఆయనీకరణ శక్తి: 5.392 eV. లిథియం మెత్తటి వెండిలా రంగుఉన్న లోహం. ఇది క్షారలోహముల సముదాయానికి చెందినది. అతితక్కువ బరువున్న తెలికపాటి లోహం. మిగతా క్షార లోహలవలె లిథియం రసాయనికంగా అత్యంత చురుకైన చర్యాశీలత కలిగిన, మండే స్వభావము ఉన్న లోహం. అందువలన దీనిని ఏదైనా ఒక హైడ్రోకార్బను ద్రవంలో, సాధారణంగా పెట్రోలియం జెల్లిలో వుంచి భద్రపరచేదరు. లిథియం ఒంటరి వేలన్సీ ఎలాక్త్రానును కలిగిఉన్నది. ఈ కారణంచే ఇది ఉత్తమవిద్యుత్తు మరియు ఉష్ణవాహకం. లిథియం చాలా మెత్తటి లోహం, దీనిని కత్తితో ముక్కలుగా కత్తరించ వచ్చును . లిథియం వెండి లాంటి రంగులో ఉన్నను ఆక్సీకరణ వలన గ్రే రంగులోకి పరావర్తనం చెందును.లోహాలన్నింటికన్న తక్కువ బాష్పిభవన ఉష్ణోగ్రత (1800C) కలిగినను, మిగిలిన క్షారమూలకాల కన్న బాష్పిభవన ఉష్ణోగ్రత ఎక్కువ.

లిథియం యొక్క భౌతిక/రసాయనిక లక్షణాల పట్టిక [3]

భౌతిక లక్షణం విలువ
సంకేత పదం Li
పరమాణు సంఖ్య 3
పరమాణు భారం 6.941 amu
సాంద్రత 0.53 g/cm3
ద్రవీభవన స్థానం 180.54 °C
బాష్పిభవన ఉష్ణోగ్రత 1342.0 °C
ఎలక్ట్రాను సంఖ్య 3
న్యూ ట్రానుల సంఖ్య 4
వర్గీకరణ క్షారలోహం
రంగు వెండి వన్నె

రసాయనిక ధర్మాలు[మార్చు]

లిథియం నీటితో చర్యలో పాల్గొంటుంది, కాని సోడియం లా తీవ్రంగా చర్య చెందదు. మిగతా క్షార లోహలవలె లిథియం రసాయనికంగా అత్యంత చురుకైన చర్యాశీలత కలిగినది. మండే స్వభావము ఉన్న లోహం[4]. అందువలన దీనిని ఏదైనా ఒక హైడ్రోకార్బను ద్రవంలో, సాధారణంగా పెట్రోలియం జెల్లిలో వుంచి భద్రపరచేదరు. అమ్మోనియం ద్రవణంలో కరగడం వలన నీలిరంగు ద్రవం ఏర్పడుతుంది[5].తేమ కలిగిన లిథియం చురుకుగా చర్యలో పాల్గొని లిథియం హైడ్రోక్సైడ్ (LiOH and LiOH•H2O), లిథియం నైట్రైడ్ (Li3N) మరియు లిథియం కార్బోనేట్ (Li2CO3, లను ఏర్పరచును .ఇందులో లిథియం కార్బోనేట్ అనేది లిథియం హైడ్రోక్సైడ్ మరియు కార్బన్ డైఆక్సైడ్‌లమలి చర్య ఫలితంగా ఏర్పడుతుంది. అత్యధిక ఉష్ణోగ్రత వద్ద హైడ్రోజన్‌తో చర్యచెంది లిథియంహైడ్రైడ్ ఏర్పరచును.

లిథియం పెరాక్సైడ్ (Li2O2) సమక్షలో కార్బన్‌డై ఆక్సైడ్‌తో చర్య వలన లిథియం కార్బోనేట్ మరియు ఆక్సిజన్ ఏర్పడును.

2 Li2O2 + 2 CO2 → 2 Li2CO3 + O2.

లిథియం ద్రవ ములకాలకన్న తక్కువ సాంద్రత కలిగి ఉన్న లోహ మూలకం.సోడియం, పొటాషియం లతరువాట నీటిలో తేలె మూలకం లిథియం మాత్రమే

లిథియం సమ్మేళనాలు[మార్చు]

లిథియాన్ని అల్యూమినియం మరియు మెగ్నీషియం లతో సమ్మేళనం కావించి మిశ్రమ లోహాలను తయారు చేయుదురు. ఈ మిశ్రమ ధాతువు తేలికగా మరియు బలిష్టంగా ఉండును.మెగ్నీషియం-లిథియంల మిశ్రమ లోహాన్ని కవచాల (Armour ) పలకలను చేయుటకు వాడెదరు. అలాగే అల్యూమినియం–లిథియం మిశ్రమ లోహాన్ని విమానాల తయారీలో, సైకిళ్ళ ఫ్రేమ్‌ల తయారీలో మరియు అత్యంత వేగంతో ప్రయానించు రైళ్ళ తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు.

ఐసోటోపు(isotope)[మార్చు]

స్వాభావికంగా లిథియం రెండు ఐసోటోపు రూపాలలో లభిస్తుంది. అవి 6Li మరియు 7Li . వీటిలో 7Li ఎక్కువ ప్రమాణంలో ప్రకృతిలో దొరుకుతుంది. అతితక్కువ భారమున్న హీలియం, ఎక్కువ భారమున్నబెరీలియం మూలకాల పరమాణు కేంద్రీయ బంధశక్తితో పోల్చిన ఈ రెండు ఐసోటోప్‌లు తక్కువ కేంద్రీయ బంధశక్తిని కలిగి ఉన్నాయి. ఇందులో 7Li అనేది విశ్వంలో మహావిస్పొటనం జరిగినప్పుడు, కేంద్రకాల జననసమయంలో ఏర్పడినది. 7Li కార్బన తారలలో జనిస్తుంది. కొత్తగా తారలు పుట్టునప్పుడు కొద్దిమొత్తంలో లిథియంఉత్పత్తి జరుగు తుంది. కాని వెంటనే నశిస్తుంది.

లభ్యత[మార్చు]

లిథియం మిగతా క్షారలోహలవలె నీటితో చురుకుగా చర్య జరుపు లక్షణం వలన, లిథియం ప్రకృతిలో విడిగా కాకుండా ఇతర పదార్థాలతో కలసి సమ్మేళనంగా లభిస్తుంది. భూమి ఉపరితలంలో .0007% (65ppm) మాత్రమే విడిగా లభించుచున్నది[3].ప్రస్తుతం లిథియం క్లోరైడ్‌ను విద్యుత్తు విశ్లేషణ చెయ్యడం ద్వారా లిథియాన్ని భారీగా ఉత్పత్తి చేస్తున్నారు.భూమి పొరలో లభ్యం:2.0×101మి.గ్రాం/కిలో;సముద్రంలో లభ్యత:1.8×10−1మి.గ్రాం/లీ.లిథియం రసాయనికంగా ఎక్కువ ప్రభావశీలి కావటం వలన ప్రకృతిలో విడిగా కాకుండా ఇతర పదార్థాలతో సమ్మేళనంగా లభించును. Pegmatitic ఖనిజాల్లో లభిస్తుంది. ఇది నీటిలో అయానుగా కరుగుగుణం కలిగి ఉండటంవలన సముద్రజాలలో లిథియం ఆనవాళ్ళు కన్పిస్తాయి. లిథియం లోహంయొక్క ఆనవాళ్ళు అనేక జీవుల దేహవ్యవస్థలో గుర్తించవచ్చును .

ఉత్పత్తి[మార్చు]

లిథియాన్ని లిథియం క్లోరైడ్ మరియు పొటాషియం క్లోరైడ్ ల మిశ్రమాన్ని విద్యుత్తువిశ్లేషణ పద్ధతికి గురికావించి వేరుచెయ్యుదురు.

ఉత్పత్తి దేశాలు[మార్చు]

ప్రపంచంలో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చిలీ, చైనా, పోర్చుగీసు, మరియు జింబాబ్వే లలో లిథియం అధికంగా ఉత్పత్తి అగుచున్నది.

20 11 నాటికి ప్రపంచములో ఉత్పత్తి అయిన లిథియంమరియు నిల్వల వివరాలు.

దేశము ఉత్పత్తి లభించు వనరులు దేశము ఉత్పత్తి లభించు వనరులు
అర్జెంటినా 3,20 0 8 50,000 చీలె 12,60 0 7, 500,000
ఆస్ట్రేలియా 9260 970,000 చైనా 5,200 3,500,000
బ్రెజిల్ 12 0 64,000 పోర్చుగల్ 820 10,000
కెనడా 480 180,000 జింబాబ్వే 470 23,000

ఉపయోగాలు[మార్చు]

లిథియం మరియు దాని సమ్మేళన పదార్థాలకు పారిశ్రామికంగా పలువిధాల ప్రయోజనాలు ఉన్నాయి. లిథియం వలన పెక్కు ప్రయోజనాలు ఉన్నాయి. ఘనస్థితిలో లభ్యమగు మూలకాలలో ఎక్కువ విశిష్టోష్ణం కలిగిన మూలకం లిథియం. అందువలన లిథియాన్ని ఉష్ణవాహకంగా వినియోగించడం ఎక్కువ. లిథియాన్ని ప్రత్యేకమైన ఎక్కువ ఉష్ణోగ్రతను భరించగల అద్దాలు, పింగాణి వస్తువులను తయారు చేయుటకు వాడెదరు[6]. మౌంట్ పాలోమార్‌లోని దుర్భిణిలోని దర్పణమును లిథియం వాడి తయారుచేసారు. లిథియం హైడ్రోక్సైడ్ (LiOH) ను విమానంలో ఏర్పడు కార్బను డై ఆక్సైడ్‌ (CO2 బొగ్గుపులుసు వాయువు ) ను తొలగించుటకు ఉపయోగించెదరు. లిథియం క్లోరైడ్ నీటిని పిల్చుకొనే స్వభావం ఉన్న కారణం వలన, దీనిని శీతలీకరణ యంత్రాలలో, పరిశ్రమలలో గాలిని పోడి పరచుటకై వాడెదరు (లిథియం బ్రోమైడ్ రూపంలో వాడెదరు). లిథియం స్టియరేట్‌ను అధిక ఉష్ణోగ్రత వద్ద పనిచేయు యంత్రాల కందెనల తయారీలో ఉపయోగిస్తారు[7]. లిథియం హైడ్రైడ్‌ను ఇంధనంగా వాడెదరు. లిథియాన్ని ప్రముఖంగా రిచార్జింగు అయ్యే సెల్‌ ఫోనులు, లాప్‌టాపులు, డిజిటల్ కెమరాలలో ఉపయోగించు బ్యాటరీలను తయారు చెయ్యుటకు ఉపయోగిస్తారు. అలాగే రీచార్జి చెయ్యబడని బ్యాటరీలలో కుడా లిథియాన్ని వినియోగిస్తారు. ఉదాహరణకు హృదయంకు అమర్చే పేస్‌ మేకరు (pace maker), కదిలే బొమ్మలు, ఆటవస్తువులు మరియు గడియారం లలో వాడె బ్యాటరీల తయారీలో కుడా లిథియాన్ని వాడెదరు .

లిథియాన్ని అద్దాలు, పింగాణి పరిశ్రమలో 37.0%, బ్యాటరిలలో 20.0%, కందెనల తయారిలో 11.0%, అల్యూమినియం మిశ్రమలోహ తయారిలో7.0%, వైద్యరంగంలో2.0%, థెర్మోప్లాస్టికు రంగంలో 3.0%, శీతళీకరణ యంత్రాలలో 5.0%, ఇతర రంగాలలో 10%ను ఉపయోగిస్తారు[6]

వైద్యరంగంలో లిథియం వినియోగం[మార్చు]

లిథియం కార్బోనేట్‌ను మానసికంగా కృంగినస్థితిలో ఉన్నమానసిక రోగులకు మందుగా ఉపయోగిస్తారు. బైపొలారు డిసార్డరు మరియు మానసిక రుగ్మతల నివారణలో వాడుచున్నారు[8].అలాగే తలనొప్పి, మూర్చ, మధుమేహం, కాలేయ వ్యాధి, మూత్రపిండాలు, కీళ్ళనొప్పులు, చర్మవ్యాధులు వంటి వాటి నివారణ మందులలోవాడెదరు.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Lithium". rsc.org. http://www.rsc.org/periodic-table/element/3/lithium. Retrieved 2015-03-19. 
  2. "The Element Lithium". education.jlab.org. http://education.jlab.org/itselemental/ele003.html. Retrieved 2015-03-19. 
  3. 3.0 3.1 "Chemical properties of lithium". lenntech.com. http://www.lenntech.com/periodic/elements/li.htm. Retrieved 2015-03-19. 
  4. Fire Protection Guide to Hazardous Materials. 13 ed. Quincy, MA: National Fire Protection Association, 2002., p. 49-91
  5. O'Neil, M.J. (ed.). The Merck Index - An Encyclopedia of Chemicals, Drugs, and Biologicals. 13th Edition, Whitehouse Station, NJ: Merck and Co., Inc., 2001., p. 990
  6. 6.0 6.1 "Main Uses of Lithium". rodinialithium.com. http://rodinialithium.com/lithium/lithium_uses. Retrieved 2015-03-19. 
  7. "Lithium:uses". rodinialithium.com. http://www.webelements.com/lithium/uses.html. Retrieved 2015-03-19. 
  8. "Lithium for Bipolar Disorder". webmd.com. http://www.webmd.com/bipolar-disorder/bipolar-disorder-lithium. Retrieved 2015-03-19. 
"https://te.wikipedia.org/w/index.php?title=లిథియం&oldid=2005766" నుండి వెలికితీశారు