క్షార లోహము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


విస్తృత ఆవర్తన పట్టికలో మొదటి గ్రూపులో అమర్చబడి ఉన్న హైడ్రోజన్ (H), లిథియమ్ (Li), సోడియమ్ (Na), పొటాషియమ్ (K), రుబీడియమ్ (Rb), సీసియమ్ (Cs) ఫ్రాన్షియమ్ (Fr) లను క్షార లోహాలు (Alkali metals) అంటారు. ఈ గ్రూపులో హైడ్రోజన్ మినహా మిగతా మూలకాల ఆక్సైడ్ లు నీటిలో కరిగి బలమైన క్షారాలని ఇస్తాయి. హైడ్రోజన్ నామమాత్రంగా ఈ గ్రూపులోని మూలకమైనా, క్షారలోహాల కంటే భిన్నమైన స్వభావం కలది. చాలా అరుదుగా మాత్రమే ఇది మిగిలిన గ్రూపు సభ్యులతో పోలి ఉంటుంది.

క్షారలోహాలు అత్యంత చురుకుగా రసాయన చర్యలకు గురవుతాయి అందువల్ల ప్రకృతిలో సహజ సిద్ధంగా మూలక స్థితిలో చాలా అరుదుగా కనిపిస్తాయి. అందు కారణము చేత ప్రయోగశాలలో వీటిని ఖనిజ నూనెలో భద్రపరుస్తారు. క్షారలోహాలు అతి తక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రతలు, సాంద్రత కలిగి ఉంటాయి. పొటాషియం, రుబీడియం మూలాకాలు, అత్యంత నిడివికల రేడియోధార్మిక ఐసోటోపులు ఉండటం వళ్ళ, కొద్దిపాటి హానికరము కాని రేడియోధార్మికతను ప్రదర్శిస్తాయి.