వెండి
| వెండి | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Appearance | lustrous white metal | ||||||||||||||
| Standard atomic weight Ar°(Ag) | |||||||||||||||
| వెండి in the periodic table | |||||||||||||||
| Group | group 11 | ||||||||||||||
| Period | period 5 | ||||||||||||||
| Block | |||||||||||||||
| Electrons per shell | 2, 8, 18, 18, 1 | ||||||||||||||
| Physical properties | |||||||||||||||
| Phase at STP | solid | ||||||||||||||
| Melting point | 1234.93 K (961.78 °C, 1763.2 °F) | ||||||||||||||
| Boiling point | 2435 K (2162 °C, 3924 °F) | ||||||||||||||
| Density (near r.t.) | 10.49 g/cm3 | ||||||||||||||
| when liquid (at m.p.) | 9.320 g/cm3 | ||||||||||||||
| Heat of fusion | 11.28 kJ/mol | ||||||||||||||
| Heat of vaporization | 250.58 kJ/mol | ||||||||||||||
| Molar heat capacity | 25.350 J/(mol·K) | ||||||||||||||
Vapor pressure
| |||||||||||||||
| Atomic properties | |||||||||||||||
| Oxidation states | −2, −1, 0,[3] +1, +2, +3 (an amphoteric oxide) | ||||||||||||||
| Electronegativity | Pauling scale: 1.93 | ||||||||||||||
| Atomic radius | empirical: 144 pm | ||||||||||||||
| Covalent radius | 145±5 pm | ||||||||||||||
| Van der Waals radius | 172 pm | ||||||||||||||
| Other properties | |||||||||||||||
| Natural occurrence | primordial | ||||||||||||||
| Crystal structure | face-centered cubic (fcc) | ||||||||||||||
| Speed of sound thin rod | 2680 m/s (at r.t.) | ||||||||||||||
| Thermal expansion | 18.9 µm/(m⋅K) (at 25 °C) | ||||||||||||||
| Thermal conductivity | 429 W/(m⋅K) | ||||||||||||||
| Thermal diffusivity | 174 mm2/s (at 300 K) | ||||||||||||||
| Electrical resistivity | 15.87 n Ω⋅m (at 20 °C) | ||||||||||||||
| Magnetic ordering | diamagnetic[4] | ||||||||||||||
| Young's modulus | 83 GPa | ||||||||||||||
| Shear modulus | 30 GPa | ||||||||||||||
| Bulk modulus | 100 GPa | ||||||||||||||
| Poisson ratio | 0.37 | ||||||||||||||
| Mohs hardness | 2.5 | ||||||||||||||
| Vickers hardness | 251 MPa | ||||||||||||||
| Brinell hardness | 206 MPa | ||||||||||||||
| CAS Number | 7440-22-4 | ||||||||||||||
| History | |||||||||||||||
| Discovery | before 5000 BC | ||||||||||||||
| Symbol | "Ag": from Latin argentum | ||||||||||||||
| Isotopes of వెండి | |||||||||||||||
| Template:infobox వెండి isotopes does not exist | |||||||||||||||
వెండి లేదా రజతం ఒక తెల్లని లోహము, రసాయన మూలకము. దీని సంకేతం Ag (ప్రాచీన గ్రీకు: ἀργήεντος - argēentos - argēeis), దీని పరమాణు సంఖ్య 47. ఇది ఒక మెత్తని, తెల్లని మెరిసే పరివర్తన మూలకము (Transition metal). దీనికి విద్యుత్, ఉష్ణ ప్రవాహ సామర్థ్యం చాలా ఎక్కువ. ఇది ప్రకృతిలో స్వేచ్ఛగాను, ఇతర మూలకాలతో అర్జెంటైట్ (Argentite) మొదలైన ఖనిజాలుగా లభిస్తుంది.
స్థూల సమీక్ష
[మార్చు]వెండి ప్రాచీన కాలం నుండి విలువైన లోహంగా ప్రసిద్ధిచెందినది. ఇది ఆభరణాలు, నాణేలు, వంటపాత్రలుగా ఉపయోగంలో ఉన్నాయి. ఈనాడు వెండిని విద్యుత్ పరికరాలలో, అద్దాలు, రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తున్నారు. వెండి సమ్మేళనాలు ముఖ్యంగా సిల్వర్ నైట్రేట్ (Silver nitrate) ఫోటోగ్రఫీ ఫిల్మ్ తయారీలో విస్తృతంగా ఉపయోగంలో ఉంది.[5]
రసాయన శాస్త్రవేత్తలు వెండిని పరివర్తన లోహంగా గుర్తించారు. పరివర్తన మూలకాలు లేదా లోహాలు మూలకాల ఆవర్తన పట్టికలో గ్రూప్ 2, 13 మధ్యలో ఉన్న లోహములకాలు. 40 కి పైగా మూలకాలు లోహాలు. ఇవన్నీ పైన పేర్కొన్నపరివర్తన మూలకాలు/ లోహలకు చెందినవే. వెండిని విలువైన లోహంగా గుర్తింపు పొందిన మూలకం. సాధారణంగా విలువైన లోహాలు భూమిలో సంవృద్ధిగా లభించవు. విలువైన రకానికి చెందిన మూలకాలు ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ రసాయనికంగా అంతగా చురుకైన చర్యాశీలతను ప్రదర్శించవు. ఆవర్తన పట్టికలో వెండికి సమీపంలో ఉన్నములాకాల అరడజను వరకు విలువైన మూలకాలే. అవి బంగారం, ప్లాటినం, పల్లాడియం, రోడియం, ఇండియం లు.[6]
తొలి గుర్తింపు –నామకరణం
[మార్చు]సా.శ.పూ. 5000 సంవత్సరాల నాటికే మానవుడు వెండిని కనుగొనినట్లుగా ఆధారాలున్నాయి. చాలా అరుదుగా వెండి రూపంలో లభిస్తుంది. మిగిలినది ముడిఖనిజంగా లభ్యము అవుతుంది. మానవుడు వెండిని తొలుతగా బంగారం, రాగి లోహాల గుర్తింపు తరువాత కనుగొన్నట్లుగా తెలుస్తున్నది. ఆరెండు లోహాలు ప్రకృతిలో తరచుగా లోహాలుగా లభించడంతో మొదటగా వాటినిగురించి తెలుసుకోవడం సులభమైనది. అంతేకాక ఆరెండు లోహాల విశిష్టమైన, నిర్దుష్టంగా కనిపించే రంగులు కారణమై ఉండవచ్చును. పురాతన వస్తు పరిశోధకులు, ఈజిప్టు త్రవ్వకాలలో సా.శ.పూ. 3500 నాటికి చెందిన ఆభరణాలను కనుగొన్నారు.
సా.శ.పూ. 3000 నాటికి సీసం, వెండిని వేరుచేయడం మానవుడు తెలుసుకొన్నాడు. సిల్వరు (silver ) అనేపదం ఆంగ్లో-సక్సోను పదమైన siolfur (అనగా silver) నుండి ఏర్పడినది.[7]
సంస్కృతి
[మార్చు]ఇతర జాతుల సంస్కృతులలో కుడా వెండియొక్క ప్రస్తావన ఉంది. ఇండియాలో సా.శ.పూ 900 సం.నాటికి వాడుకలో ఉంది. యూరోపియన్‌లు మొదటిసారిగా అమెరికా వెళ్ళే సమయానికి అప్పటికే అక్కడ వెండి వాడకంలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. క్రైస్తవ మతగ్రంథం బైబిల్‌లో పలుమార్లు వెండిని గురించిన ప్రస్తావన ఉంది. వెండిని వస్తువుల అమ్మకం, కొనుగోలు సమయంలో మారకంగా వినియోగించడం జరిగింది. వెండితో దేవాలయాలను, ప్రదేశాలను, ప్రముఖమైన భవనాలను అలంకరిస్తారు. హిందూదేవతల విగ్రహాలను వెండితో చేసి పూజిస్తారు. దేవతా అర్చనా పాత్రలను కూడా వెండితో చేస్తారు. బైబిల్‌లో కొన్ని విభాగాలలో వెండిని తయారు చేసే పద్ధతులను కుడా వర్ణించారు. ఈ లోహంనకు Silver అనేపేరు 12 వ శతాబ్దిలో వచ్చినట్లు తెలుస్తున్నది. ఇది పాత ఆంగ్ల పదం. ఇక దిని సంకేత అక్షరమును లాటిన్ పదం ‘Argentum’ నుండి తీసుకోవటం జరిగింది. argos అనగా మెరయుచున్న లేదా తెల్లని అని అర్థం.
- వెండికొండ లేదా రజతాచలం అనగా శివుని నివాసమైన కైలాసం.
- రజతోత్సవం: ఏదైనా సంస్థ ఏర్పడి ఇరవై అయిదు సంవత్సరాలు నిండిన సందర్భంగా చేసుకొనే ఉత్సవం.
భౌతిక లక్షణాలు
[మార్చు]వెండిని అతి పలుచని రేకులుగా, తీగెలుగా అతి సులుగుగా సాగాగొట్ట వచ్చును. వెండి ఒక రసాయనిక లోహ మూలకం.[7]
| భౌతిక గుణము | విలువ |
| సంకేత అక్షరము | Ag |
| ఎలక్ట్రానుల విన్యాసం | [Kr] 4d^10 5s^1 |
| ద్రవీభవన ఉష్ణోగ్రత | 961.8 °C |
| పరమాణు సంఖ్య | 47 |
| మరుగు ఉష్ణోగ్రత | 2,162 °C |
| మొదటిగా గుర్తించినది | 5000 BC |
| పరమాణు ద్రవ్య రాశి | 107.8682 u |
| వెండి యొక్క సాంద్రత | 10.4 9 gms /cm3 |
| భౌతిక స్థితి | ఘనస్థితి 298K వద్ద |
| మొలారు ఘనపరిమాణం | 10.27 cm3 |
| ఉష్ణవాహకతత్వవిలువ | 430 W m‑1 K‑1 |
రసాయనిక లక్షణాలు
[మార్చు]వెండి రసాయనికంగా చురుకైన లోహం కాదు. ఇది గాలిలోని ఆమ్లజనితో చర్య నొందదు. చాలా నెమ్మదిగా గాలి సమక్షములో గంధకంతో చర్య వలన నల్లని సిల్వరు సల్ఫైడు (AgS) అనే సమ్మేళనం ఏర్పడుతుంది. నీరు, ఆమ్లాలతో, పలుసమ్మేళనాలతో వెండి క్రియా/చర్యారహితంగా ఉంటుంది. నత్రజని, ఉదజని తోకూడా చర్యారహితంగా ఉండును. ఇది దహింప బడదు. వెండి నత్రికామ్లం, వేడి గాఢ సల్ప్యూరిక్ ఆమ్లంలో త్వరగా కరుగుతుంది. వెండి ద్రవస్థితిలో తనభారానికి 22 రెట్లు భారమున్న ఆక్సిజన్ ను తనలో కరగించు కుంటుంది. ఘనీభవించునప్పుడు గ్రహించిన ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. అలాగే ఆక్షీకరణ చేయు ఆమ్లాలలో కుడా కరుగుతుంది. అలాగే సైనైడ్ కలిగిన ద్రవాలలో కుడా వెండి కరుగుతుంది. సైనైడులో వెండిని కరగించి నప్పుడు డైసైనో అర్జెన్ టేట్[Ag (CN)2]−, అనే అయానులు ఏర్పడును.
వెండి ఒజోను, హైడ్రోజను సల్ఫైడు, సల్ఫరుకలిగిన గాలితో ఎక్కువ సేపు సంపర్కంలో ఉండిన మెరుపు కోల్పోతుంది.
ఐసోటోపులు
[మార్చు]పరమాణువు లోని ప్రోటాను, న్యుట్రానుల మొత్తం సంఖ్యను ఆ మూలకం యొక్క భారసంఖ్య అంటారు. పరమాణువులోని ప్రోటాను సంఖ్య మూలకాన్ని నిర్ణయిస్తుంది. ప్రతిమూలకంలో ప్రోటానుల సంఖ్య స్థిరంగా ఉంటాయి. అయితే ప్రోటానుల సంఖ్య స్థిరంగా వుండి, న్యుట్రానుల సంఖ్య మారినచో ఆ నిర్మాణాన్ని ఐసోటోపుల అంటారు. Ag 107, Ag109 అనేవి వెండి యొక్క సహజసిద్ధమైన ఐసోటోపులు.[6]
వెండి యొక్క సమ్మేళన పదార్థాలు
[మార్చు]వెండిని కొన్ని ఇతర ములకాలతో కలిపనచో ఏర్పడు సమ్మేళన పదార్థాలు;[8] ఫ్లోరైడులు:
- సిల్వరు ఫ్లోరైడు: AgF
- సిల్వరు డై ఫ్లోరైడు: AgF2
- డైసిల్వరు ఫ్లోరైడు: Ag2F
- క్లోరైడులు
- సిల్వరు క్లోరైడు: AgCl
- బ్రోమైడులు
- సిల్వరు బ్రోమైడు: AgBr
- అయోడైడులు
- సిల్వరు అయోడైడు:AgI
- ఆక్సైడులు
- సిల్వరు ఆక్సైడు:AgO
- డై సిల్వరు ఆక్సైడు:Ag2O
- సల్ఫైడులు
- డైసిల్వరు సల్ఫైడు: Ag2S
ఆరోగ్యం పై ప్రభావం
[మార్చు]వెండి కొంచెం విష ప్రభావం కలిగిన మూలకం. వెండి లేదా వెండి యొక్క సమ్మేళన పదార్థాలు చర్మంపై నీలి మచ్చలను కల్గించే ఆవకాశం ఉంది. వెండి ధూళిని (dust) పీల్చినచో శ్వాస పరమైన అనారోగ్యం ఏర్పడే ప్రమాదం ఉంది.
వనరులు-లభ్యత
[మార్చు]భూమి పొరలలో వెండి 0.1 ppm పరిమాణంలో ఉంది. సముద్ర జలాల్లో కుడా వెండి ఉంది. సముద్ర జలంలో వెండి లభించు పరిమాణం 0.01 ppm. భూమిలో వెండి ఇతర లోహ ఖనిజాలతో కలిసి లభిస్తుంది. ఎక్కువగా అర్జెంటైట్ (AgS) గా దొరకుతుంది. అలాగే Ag Cl,3Ag2As2s3, Ag 2 S○ Sb 2 S3గా లభిస్తుంది. ప్రపంచంలో భారీగా వెండి మెక్సికో, పెరు, సంయుక్త రాష్ట్రాలు, కెనడా, పోలాండు, చిలి, ఆస్ట్రేలియాలలో ఉత్పత్తి చేయబడుచున్నది. పెద్ద మొత్తంలో వెండిని ఉత్పత్తి చెయ్యు రాష్ట్రాలు అమెరికాలో నినెవడా, ఇడహో, ఆరిజోనాలు. అమెరికా ఉత్పత్తిలో 2 /3 వంతు ఈ మూడు రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అగుచున్నది.
వెండి వినియోగం
[మార్చు]అమెరికాలో ఉత్పత్తి అయ్యిన వెండిలో 10% వరకు నాణేలు, ఆభరణాల తయారీలో వాడుతారు. ఆభరణాల తయారీలో బంగారంలో వెండిని మిశ్రమ ధాతువుగా వాడుతారు. బంగారంలో కలపడం వలన వెండికి దృఢత్వం పెరుగుతుంది. ఫోటోగ్రాప్ ఫిల్ముల మీద పూతగా వెండి యొక్క సమ్మేళనాలను వాడుతారు.
సిల్వరు అయోడైడును కృత్తిమ వర్షం కురిపించేందుకు ఉపయోగిస్తారు.[7]
వెండిని ప్రింటెడ్ ఎలక్ట్రికల్ సర్కూట్ బోర్డులను తయారుచేయుటకు ఉపయోగిస్తారు.[9]
ఉత్తమ గుణమట్టానికి చెందిన దర్పణాలను తయారుచేయుటకు వెండిని ఉపయోగిస్తారు.[10]
మూలాలు
[మార్చు]- ↑ "Standard Atomic Weights: Silver". CIAAW. 1985.
- ↑ Prohaska, Thomas; Irrgeher, Johanna; Benefield, Jacqueline; et al. (2022-05-04). "Standard atomic weights of the elements 2021 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry (in ఇంగ్లీష్). doi:10.1515/pac-2019-0603. ISSN 1365-3075.
- ↑ Ag(0) has been observed in carbonyl complexes in low-temperature matrices: see McIntosh, D.; Ozin, G. A. (1976). "Synthesis using metal vapors. Silver carbonyls. Matrix infrared, ultraviolet-visible, and electron spin resonance spectra, structures, and bonding of silver tricarbonyl, silver dicarbonyl, silver monocarbonyl, and disilver hexacarbonyl". J. Am. Chem. Soc. 98 (11): 3167–75. doi:10.1021/ja00427a018.
- ↑ Magnetic susceptibility of the elements and inorganic compounds in Lide, D. R., ed. (2005). CRC Handbook of Chemistry and Physics (86th ed.). Boca Raton (FL): CRC Press. ISBN 0-8493-0486-5.
- ↑ "Chemical properties of silver". lenntech.com. Retrieved 2015-03-13.
- ↑ 6.0 6.1 "SILVER". chemistryexplained.com. Retrieved 2013-03-13.
- ↑ 7.0 7.1 7.2 "Silver: the essentials". webelements.com. Retrieved 2015-03-03.
- ↑ "Silver: compounds information". webelements.com. Retrieved 2015-03-13.
- ↑ "Properties, uses, and occurrence". britannica.com. Retrieved 2015-03-13.
- ↑ "Silver Element Facts". chemicool.com. Retrieved 2015-03-13.