Jump to content

చిందోళ్ళు

వికీపీడియా నుండి
(చిందులు నుండి దారిమార్పు చెందింది)
ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భాగంగా 2019 ఆగస్టు 31న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన జానపద జాతర సాంస్కృతిక కార్యక్రమంలో చిందు యక్షగాన కళాకారుల ప్రదర్శన

సిందోళ్ళు , చిందోళ్ళు ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా లో 59 వ కులం.వశిష్టుడి తల్లి ఊర్వశి, భార్య అరుంధతి (మాదిగ).జాంబవంతునికి రక్త సంబంధికురాలు. అరుంధతికి, వశిష్టుడికి పుట్టిన ప్రథమ సంతానమే శక్తి. ఈ శక్తి సంతానమైన చిందులు యాచకులుగా జీవిస్తున్నారు. ప్రత్యేక భాష, సంస్కృతి, ఆచారాలు కలిగి ఉన్న చిందులు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు.వీరు దక్కలి, మాస్టి, గంగిరెద్దుల, దాసరి, బుడిగ జంగాలు, బాలసంతు,గోత్రాల, పూసవేర్ల తదితర కులాలలోకి చెదిరిపోయి కొన్ని కులాలు ఎస్సీలుగా, మరికొన్ని కులాలు బీసీలుగా ఉన్నారు. ఏ మాత్రం నాగరికతలేక ఈ జాతులు అభివృద్ధికి నోచుకోలేదు.కులానికో వృత్తి, సంస్కృతి కూడా ఉన్నది. యాచకవృత్తి ఆచరించడం వల్ల సమాజంలో వీరికి గుర్తింపు గౌరవం లేవు. జాంబవంతుడు తొలుత జంతు చర్మంతో దుస్తులు, చెప్పులు చేశాడు. ఇనుమును కరిగించడం కోసం తోలుతిత్తిని కనుగొన్నాడు.తోలుతో డప్పు తయారు చేశాడు.ఆయన కనుగొన్న ఉత్పత్తి పరికరాలు సమాజానికి ఎలా ఉపయోగపడ్డాయో తెలియచేశారు చిందు కళాకారులు.తోలుతో మద్దెల, కంచులతో తాళం, హార్మోనియం సంగీత పరికరాల తయారీతో చిందు అనే సాంస్కతిక కళారూపానికి మెరుగులు దిద్దారు. వైష్ణవుల, శైవుల పాలనలో నర్తకులుగా జీవిస్తూ చిందు కళాకారులు దేవతలను, చక్రవర్తులను, రాజుల చరిత్రలను తమ ఆట, పాట, మాటలతో యక్షగాన ప్రదర్శనలతో ప్రచారంచేశారు. గోత్రము గంగాధరి, మునివంశం, బొట్టు పంగనామాలు (వైష్ణవనామం) వంటివే కాకుండా శరీరానికి జంజరము కూడా ధరిస్తారు. మరణానంతరం భూమిలో పాతిపెట్టే ఆచారం ఉంది. నేటి చిందులు మాదిగలపై ఆధారపడి వారికి యాచకులై జీవిస్తున్నారు.మాదిగ సమూహంలోనే ఉంటారు.మాదిగలతో కంచం పొత్తు ఉన్నా,మంచం పొత్తు(పెండ్లి సం బంధాలు) ఉండదు.చిందులకు యక్షగాన కళారూపాలను ప్రదర్శించడం,ఊరూరా భిక్షాటన చేయడం తప్ప భూమి లాంటి ఆస్తిపాస్తులు లేవు. పైచదువులు చదివినవారు ఉద్యోగులు పెద్దగా లేరు.

మూలాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]