తిత్తి
Jump to navigation
Jump to search
Cyst | |
---|---|
H&E stained micrograph of a mediastinal bronchogenic cyst | |
ప్రత్యేకత | Pathology, general surgery |
తిత్తి (Cyst) అనగా ఒక రకమైన ద్రవ పదార్ధాలతో నిండిన సంచి. ఇవి వివిధ అవయవాలలో తయారుకావచ్చు.[1] కొన్ని పుట్టిన దగ్గరనుండి ఉండవచ్చు. నిజమైన తిత్తుల లోపలివైపు వివిధ రకాల ఉపకళా కణజాలాలతో కప్పబడి ఉంటాయి. కృత్రిమమైన తిత్తుల లోపలివైపు ఏ విధమైన పొర ఉండదు.
సాధారణంగా తిత్తులను శస్త్రచికిత్స ద్వారా తొలగించవలసి వుంటుంది.
తిత్తులలో రకాలు
[మార్చు]- వక్షోజాలలో తిత్తులు సాధారణంగా క్షీరనాళాల నుండి ఏర్పడతాయి.[2]
- ప్రోటోజోవా వంటి క్రిముల మూలంగా కొన్ని తిత్తులు తయారౌతాయి. ఉదా: హైడాటిడ్, సిస్టిసెర్కోసిస్.[3]
- డెర్మాయిడ్ లేదా ఎపిడెర్మాయిడ్ తిత్తులు
- అండాశయములోని తిత్తులు కొన్ని కాన్సర్ కు సంబంధించినవి కూడా ఉంటాయి.
- కాలేయము, మూత్రపిండాలు మొదలైన చాలా అవయవాలలో కూడా కొన్ని తిత్తులు ఏర్పడవచ్చును.
మూలాలు
[మార్చు]- ↑ "Cysts: Causes, types, and treatments". www.medicalnewstoday.com (in ఇంగ్లీష్). 2020-06-11. Retrieved 2021-04-11.
- ↑ "Breast cysts - Symptoms and causes". Mayo Clinic (in ఇంగ్లీష్). Retrieved 2021-04-11.
- ↑ Kumar, M. J.; Toe, K.; Banerjee, R. D. (2003-02-01). "Hydatid cyst of liver". Postgraduate Medical Journal (in ఇంగ్లీష్). 79 (928): 113–114. doi:10.1136/pmj.79.928.113. ISSN 0032-5473. PMID 12612332.