Jump to content

మాదాసికురువ

వికీపీడియా నుండి
(మదాసికురువ నుండి దారిమార్పు చెందింది)

మాదాసికురువ, మదారికురువ ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితా లో 31వ ఉపకులం. [1] [2]

జీవన విధానం

[మార్చు]

గొరవయ్యలు

పూర్వం నుండి వీరు బిక్షాటన చేస్తారు వీరి ధైవం గట్టు మాలమల్లేశ్వరుడు ,, మైలారలింగేశ్వరుడు వీరికి గొరవ ( ఘణాచార్యుల ) గురువు సమ్మతి తో మెడలో గవ్వల హారం ధరింపజేస్తారు ఘణాచార్యులు వారు తరువాత వీరు బిక్షాటన కొనసాగించవచ్చు గవ్వలు ఉన్నవారు మాత్రమే బిక్షాటన చేయాలి ఇతరులు చేయడానికి గురువు సమ్మతి లేదు (గొరవయ్య) బిక్షాటన లో సమీప గ్రామాలు తిరుగుతూ ధన, ధాన్య, వస్త్ర తదితర వస్తువులు స్వీకరించి దాతలకు బండారు(బుక్కపిండి)తో వారికి తిలకం దిద్ది దాతల కుటుంబం ఆయు ఆరోగ్యం సిరి సంపదలు పొందవలేనని దేవుని ప్రార్థించి ఆశ్వీరదించి శివ నామ స్మర్ణం చేయుచూ, అక్కడి నుండి నిష్క్మరించి. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి తిరిగి బిక్షాటన చేయుచుండే వారు. వీరు కంబలి వస్రం (గొంగళి) ఎలుగుబంటి తోలు తో తయారు చేసిన టోపిని తలపై దరించి, (గొరవయ్య) పిల్లనగ్రోవి,డమరుకం, చేరో చేతిలో ఉండగా లయ బద్దమైన గానంతో నృత్యం చేస్తూ శైవ మత ప్రచారకులు, వీరు సామూహిక నాట్యం చేయు నప్పుడు నాట్య క్షేత్రము మధ్యలో త్రిశూ‌లం ఉంచి చుట్టు నృత్యం చేస్తు దాతలు *( కేవలం కుల సమూహాం లో మాత్రమే )* మేప్పు పొంది ధన ధాన్య వస్త్రా తదితర వస్తువులు బిక్షరూపంలో లేక బహుమతి రూపములో పొందుతారు. ఇట్టి వీరికి స్థిరాస్తులు,స్థిర నివాసము ఉంటాయి వీరి కులస్తుల శుభ, కార్యములు నిర్వర్తించి, వారి నుండి తగు పారితోసికం పొందెటివారు, వీరిని స్తానిక ప్రజలు సర్వ సాధారనంగా కురువ పిలుస్తారు. ప్రభుత్వం మాత్రం గజిట్ లో మాత్రం మదాసికురువ అని పూర్తి కులం పేరుతో గుర్తించింది


దాసరయ్యలు & దాసప్పలు

వీరు అనాగరికులు ఆర్థిక, సామాజిక,విధ్య,సాంఘికంగా వెనుకబడిఉండటం వలన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వీరిని జాతీయ షెడ్యూల్ కులాల జాబితాలో పొందపరచడం జరిగింది వీరిని దాసప్పలు, దాసరయ్యలు అని పిలుస్తారు వీరు హరినామ సంకర్తీనలు చేయడం శ్రీ హారిని కీర్తించడం చేస్తారు వైష్ణవం ప్రచారం చేస్తారు ,అశుభ కార్యాలకు వీరు తమ సాంప్రదాయం ప్రకారం అశుభ కార్యక్రమంలో పూడ్చిన సమాధిపై పూజలు చేస్తూ సమాధిపై చనిపోయిన వారి కోసం పెట్టిన ఎడ సమాధిపై కూర్చొని ఆహారాన్ని బుజిస్తాలు గోవింద నామస్మరణ చేస్తారు వీరి ఆశుభ కార్యాలు ఓళ్ళు గొగుర్పోటుకు గురిచేస్తాయి భయానకంగా కూడా ఉంటాయి మిగతా రోజులలో (ధీపం వెలిగించుకొని) పట్టుకొని కంచు ప్లేటును కొడుతూ హరినామ కీర్తన చేస్తూ బిక్షాటన చేస్తారు వీరికి కొన్ని ఊళ్ళు పూర్వం నుండే కేటాయించబడి ఉంటాయి ఆ ఊరిలో మాత్రమే వీరు వీరి కార్యక్రమాలు చేసుకోవలసి ఉంటుంది బిక్షాటన చేసే సమయంలో ధనం‌‌ దాన్యం,వారు ఇచ్చిన వస్త్రాలు స్వీకరించడం వాటితో జీవనం గడపడం వీరు వ్రుత్తి వీరిని అంటరానివాళ్ళు గా భారతప్రభుత్వం 1950లో కేంద్ర షెడ్యూల్ కులాల జాబితాలో గుర్తించింది 1956 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తిస్తు గజిట్ విడుదల చేసింది


గొర్ర్రెల మేకల కాపరులు

ఈ జాతిలో మేజర్ గా ఉన్న వారు గొర్రెల మేకలకాపరులు

భారతదేశం లో అత్యంత ప్రాచిన జాతి మదారికురువ/మదాసికురువ లు సామాజికంగా , సాంఘీకంగా , విధ్యపరంగా , ఆర్థికంగా ఈజాతి వెనుకబడి ఉండడవలన వీరిని గుర్తించి బాబసాహెబ్ అంభేడ్కర్ గారు షెడ్యూల్ కులాల జాబితాలో ఉంచడం జరిగింది వీరి వ్రుత్తి గొర్రెల మేకల కాపరులని వీరు ఊరికి బయట(అడవులలో) భార్య పిల్లల కోసం సుఖ సంతోషాలను వదిలి ఎక్కువ కాలం అడవిలో గొర్రెలను మేకలను వాటికి మేత మేపుతూ ఎండనక గాలనక చలికి వర్షంకి లెక్క చేయక చేత సద్ది (బోజనం) చిక్కెంతో చేతిలో కర్ర తో అప్పుడే ఈనిన గొర్రె పిల్లను ( ప్రసవం తరువాత ఎలా ఉంటుందో అర్థంచేసుకొండి ) భుజాన మేక లేక గొర్రె పిల్లను వేసుకొని కుక్కను వెంటబెట్టుకొని వాటిని ఇతర క్రూరమ్రుగాల ( పులి , తోడేలు , హీనా , అడవి మ్రుగాలు , పాములు , తేల్లు విషపురుగుల ) నుండి తన ప్రాణాలను లెక్క చేయక వాటిని సంరక్షించుకుంటు కుటుంబ అవసరాల నిమిత్తం వాటిని అమ్మడం సమాజానికి ఆరోగ్య వంతంగా ఉండడంలో నాణ్యమైన మాంసాన్ని ప్రపంచానికి ఇవ్వడం ఆడబ్బుతో కుటుంభం ను పోషించడం ఇలా సంచార జీవనం లో ఓక ప్రాంతం నుండి ఓక ప్రాంతంకు గొర్రెల మేతలకోసం వలస వెళుతుంటారు వలస వెళ్లిన దగ్గర దోపిడి దొంగల నుండి తనని తాను రక్షించుకొనుటకు తన దగ్గర చిన్న కత్తి ని రక్షణకోసం ఉంచుకుంటాడు ఇన్ని సమస్యల సుడిగుండం లో వీరి జీవనస్థితిగతులు ఉండడం ఇలాంటి కష్టాలను అంబేద్కర్ గారు అర్థం చేసుకొని వీరి సమస్యలను చూసి చలించి వీరి జాతి పడుతున్న కష్టాలను అడవిలో ఎదురవుతున్న సవాళ్ళను ద్రుష్టి లో ఉంచుకొని అన్ని జాతులతో పాటు వీరిని అభివృద్ధి పథం లో ఉంచేందుకు రిజర్వేషన్ ఇవ్వాలని సంకల్పించి SC రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది


గుడికట్ట & పూజాారులు

గుడికట్టు అంటే గుడి దగ్గర అందరు ( ఆ గుడికి సంభందించిన వారు ) కలసి కూర్చొని ఓక నిర్ణయం తీసుకుంటే అదే గుడికట్టు అంటారు దానికి అందరు నియమబద్దులై ఉండాలి లేదంటే తప్పును కట్టించుకోవడం లేదా కులం నుండి వెలివేయడం జరుగుతుంది

పూర్వం నుండి అంటరానితనం ఉండడం వలనే వారి గుడికి బ్రహ్మణులు పూజలు చేయడానికిరారు ఈ గుడికి వీరి కులస్థులు తప్పితే వేరేవారు రారు వీరు వేరే గుడికి వెళ్ళరు ఈ భీరప్ప స్వామి కి పూజలు చేయడానికి వారి గుడికట్టులో ఉండే ఏవరో ఓక్కరి సంతానం లో పెద్ద కుమారుడు కాని లేక చివరి సంతానం కూడా అర్హులే వీరి ఆచార వ్యవహారాలు బిన్నంగా ఉంటాయి, తిక్కగా ఉంటాయి అందుకే వీరిని తిక్క కురువలు అని వెర్రికురువలు అని కురువలకు వేపకాయంత వెర్రి ఉంటుందని హేళన చేస్తుంటారు మిగతా కులాల వారు వీరికి పూర్వం పెద్దలనుండి సంక్రమించిన దేవుడు భీరప్ప స్వామి ఈ భీరప్పస్వాములకు ఏ ఊరిలో ఊంటే ఆపేరు తో పిలవడం పరిపాటి ఉదాహరణకు ఇటుకలపల్లిలో ఉంటే ఇటుకలపల్లయ్య అని గుంతకల్లులో ఉంటే గుంతకల్లప్ప అని పొట్టిపాడు లో ఉంటే పొట్టిపాళెప్ప అని పిలవబడుతూ ఉంటారు ఈ భీరప్ప స్వామిని రెండు రకాల ఆకారాలలో కొలుస్తారు కిరిదండి స్వాములు‌,ఓంటి గుర్రం స్వాములు ఇది చాలా పెద్దది సబ్జెక్టు పూర్తీ సమాచారం తెలియాల్సి ఉంది

గురువులయ్య


70 లేదా 80 గుడికట్ల పూజారులకు పెద్దలుగా గురువులయ్య ఉంటారు వీరు సాంప్రదాయ బద్దంగా పూజారులను చేయడం వీరి వ్రుత్తి ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది


ఘణాచాార్యలు

వీరిలో తాంళంఘణాచార్యులు మద్దెల ఘణాచార్యులు అని రెండు రకాలు వీరు వ్రుత్తి మనకి పూర్వం మన పెళ్ళిల్లకు బ్రహ్మణులు వచ్చేవారు కాదు వీరు, పూజారులు కలిపి సాంప్రదాయబద్దంగా పెళ్ళి జరిపిస్తారు, గొరవయ్యలకు గొరవయ్యను చేయడం సాంప్రదాయ బద్దంగా మెడలో గవ్వలు కట్టడం వీరి వ్రుత్తి ఇంకా పూర్తీ సమాచారం తెలియాల్సి ఉంది

ఇది పూర్తిగా కుల పెద్దలు తెలిపిన సమాచారం మేరకు మాత్రమే ఇంకా కులంలో చాలా విషయాలు అఃతరంగా దాగి ఉన్నాయి

మూలాలు

[మార్చు]
  1. "బి.సి.టైమ్స్. ఆర్గ్ లో కులం ఉనికి" (PDF). Archived from the original (PDF) on 2015-07-01. Retrieved 2015-05-20.
  2. "THE CONSTITUTION (SCHEDULED CASTES) ORDER, 1950 (C.O.19)". Archived from the original on 2009-06-19. Retrieved 2015-05-20.

ఇతర లింకులు

[మార్చు]