ధర్మపురి శ్రీనివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మపురి శ్రీనివాస్

ఎం.పి. రాజ్యసభ
పదవీ కాలం
జూన్ 22,2016 – జూన్ 22,2022
ముందు వి.హనుమంతరావు, భారత జాతీయ కాంగ్రెస్

వ్యక్తిగత వివరాలు

జననం (1948-09-27) 27 September 1948 (age 74)
వేల్పూరు, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
సంతానం సంజయ్, అరవింద్
నివాసం నిజామాబాద్
మతం హిందూ
2007 సెప్టెంబరు 20న న్యూఢిల్లీలో.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు డి.శ్రీనివాస్, దగ్గుపాటి పురందేశ్వరి

ధర్మపురి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. నిజామాబాదు (పట్టణ) శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీనుండి నుండి ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున రాజ్యసభ ఎం.పిగా ఉన్నాడు.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

1948, సెప్టెంబరు 27న నిజామాబాద్ జిల్లాలో జన్మించాడు. నిజాం కళాశాల నుండి డిగ్రీ పూర్తిచేశాడు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

1989లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున నిజామాబాదు (పట్టణ) శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.సత్యనారాయణ పై గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందాడు. 1998లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా నియమించబడ్డాడు.[2]

1999లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ ను ఓడించి రెండవసారి శాసనసభ కు గెలుపొందాడు. అదే సమయంలో కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడిగా పనిచేశాడు. 2004లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రెండవసారి నియమించబడ్డాడు. 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సతీష్ పవార్ ను ఓడించి మూడవసారి శాసనసభకు ఎన్నికై వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేశాడు.

2009 ఎన్నికలలో నిజామాబాదు నుంచే పోటీచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి యెండెల లక్ష్మీనారాయణ చేతిలో పరాజయం పొందాడు. తెలంగాణా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించిన లక్ష్మీనారాయణ రాజీనామా చేయగా 2010లో జరిగిన ఉప ఎన్నికలలో డి.శ్రీనివాస్ మరోసారి లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపోయాడు.[3]

2014లో నిజామాబాదు (గ్రామీణ) శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి, తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓడిపోయాడు.

2004, 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2015, జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[1][4]

ఇతని కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాదు లోక్‌ సభ నియోజక వర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనాడు[5].

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "D Srinivas Resigns From Party, to Join TRS Party". Telangana State. Hyderabad, India. Archived from the original on 2016-04-23. Retrieved 2017-03-12. {{cite news}}: Cite has empty unknown parameter: |5= (help)
  2. Das, Ashok (3 డిసెంబరు 2010). "Andhra Cong faces fresh crisis". Hindustan Times. Archived from the original on 20 October 2012. Retrieved 4 December 2010.
  3. Sakshi (3 November 2018). "నిజామాబాద్‌ నియోజకవర్గా ఎన్నికల రివ్యూ". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  4. "D. Srinivas Resigns". TNP LIVE. Hyderabad, India. 2 July 2015.
  5. "My father has nothing to do with my joining BJP: D Aravind". The Hindu (in Indian English). Special Correspondent. 29 June 2018. ISSN 0971-751X. Retrieved 1 February 2019.{{cite news}}: CS1 maint: others (link)